View

శ్రీమంతుడు మూవీ రివ్య్వూ

Friday,August07th,2015, 06:49 AM

చిత్రం - శ్రీమంతుడు
బ్యానర్ - మైత్రి మూవీ మేకర్స్, యం.బి ఎంటర్ టైన్ మెంట్ ప్రై.లిమిటెడ్
నటీనటులు - మహేష్ బాబు, శృతిహాసన్, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, రాహుల్ రవీంద్రన్, సుకన్య, తులసి, సన, సురేఖావాణి, ముకేష్ రుషి, శివాజీరాజా, కాదంబరి కిరణ్, సుబ్బరాజు, సంపత్ రాజ్, హరీష్, ఏడిద శ్రీరాం తదితరులు
సినిమాటోగ్రఫీ - ఆర్.మది
సంగీతం - దేవిశ్రీ ప్రసాద్
ఎడిటింగ్ - కోటగిరి వెంకటేశ్వరరావు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - చంద్రశేఖర్ రావిపాటి
నిర్మాతలు - నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ (సి.వి.ఎం)
రచన, దర్శకత్వం - కొరటాల శివ

 

''గత రెండు చిత్రాలు నిరాశపరిచాయి.. అందుకే ఈ చిత్రం నాకు క్రూషియల్''... 'శ్రీమంతుడు' ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు మహేష్ బాబు అన్న మాటలివి. దాన్నిబట్టి ఈ చిత్రం విజయం పట్ల మహేష్ బాబు ఎంత పట్టుదలగా ఉన్నాడో ఊహించవచ్చు. మామూలుగా ప్రతి చిత్రాన్ని కేర్ తీసుకుని చేసినా, రెండు చిత్రాలు ఆశించని ఫలితం ఇవ్వలేదు కాబట్టి, మహేష్ మరింత శ్రద్ధ పెట్టి ఈ సినిమా చేశాడు. రచయితగా భేష్ అనిపించుకుని, 'మిర్చి'తో తనలో మంచి మాస్ డైరెక్టర్ ఉన్న విషయాన్ని నిరూపించుకున్న కొరటాల శివ దర్శకత్వం వహించిన చిత్రం కావడం, మహేష్ లుక్, పాటలు బాగుండటం ఈ చిత్రంపై భారీ అంచనాలు పెంచింది. వై. నవీన్, వై. రవిశంకర్, సి.వి. మోహన్ నిర్మించిన ఈ చిత్రానికి మహేష్ బాబు ఓ నిర్మాత. మహేష్ 'ఎంబి ఎంటర్ టైన్ మెంట్స్' బేనర్లో వస్తున్న ఈ తొలి చిత్రం నిర్మాతగా, హీరోగా ఈ సూపర్ స్టార్ కి ఎలాంటి అనుభూతిని మిగులుస్తుందో చూద్దాం...

 

à°•à°¥
రవికాంత్ (జగపతిబాబు) పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. వేల కోట్లకు అధిపతి. అతని వారసుడు హర్షవర్ధన్ (మహేష్ బాబు). తన వేలకోట్ల వ్యాపారాన్ని కొడుకు హర్ష చూసుకోవాలని రవికాంత్ భావిస్తుంటాడు. కానీ హర్ష ఆలోచనలు మాత్రం తండ్రి ఆలోచనలకు పూర్తి భిన్నంగా ఉంటాయి. బిజినెస్ చేసి కోట్లు గడించడం మాత్రమే జీవితం కాదు... తాము ఎదగడమంటే తమ చుట్టూ ఉన్నవాళ్లు కూడా ఎదగాలనే ఆలోచనలు కలవాడు హర్ష.


చారుశీల (శృతిహాసన్) హైదరాబాద్ లో హాస్టల్లో ఉంటూ రూరల్ డెవలప్ మెంట్ కోర్సు చేస్తుంటుంది. ఆమెను తొలి చూపులోనే ప్రేమించిన హర్ష, తను కూడా రూరల్ డెవలప్ మెంట్ కోర్సులో జాయిన్ అవుతాడు. తన ఆలోచనలు, చారుశీల ఆలోచనలు ఒకే రకంగా ఉండటంతో ఆమెపై తనకున్న ప్రేమను వ్యక్తపరుస్తాడు హర్ష. రవికాంత్ కొడుకు హర్ష అని తెలుసుకున్న చారుశీల అతని ప్రేమను నిరాకరిస్తుంది. పైగా సొంత ఊరు వదిలేసి వచ్చిన బిజినెస్ మ్యాన్ రవికాంత్ కొడుకు ఆలోచనలకు, సొంత ఊరు కోసం ఏదైనా చేయాలనే తనకు, తన ఫ్యామిలీకి హర్షలాంటివాడు సరిపడడని చెప్పేస్తుంది. చారుశీల ద్వారా తన సొంత ఊరు ఉత్తరాంధ్రకు చెందిన దేవరకోట అని తెలుసుకున్న హర్ష అక్కడకు బయలుదేరతాడు.


ఆ ఊరిలో చారుశీల తండ్రి నారాయణరావు (రాజేంద్రప్రసాద్) ఊరి కోసం పాటుపడుతుంటాడు. ఉరి నుంచి వలస వెళ్లిపోతున్న వారిని ఆపడానికి నానా తంటాలు పడుతుంటాడు. అదే ఊరికి చెందిన వెంకటరత్నం (ముఖేష్ రుషి) రాజకీయనాయకుడిగా ఎదిగి ఢిల్లీ లో కూర్చుని చక్రం తిప్పుతుంటాడు. అతని తమ్ముడు శశి (సంపత్ రాజ్) దేవరకోటలోనే ఉండి ఆ ఊరిని తన గుప్పెట్లో పెట్టుకుని తనకు అడ్డం వచ్చిన వాళ్లను చంపుకుంటూ ఆదిఫత్యాన్ని కొనసాగిస్తుంటాడు. ఆ ఊరికి వచ్చిన హర్ష ఊరును దత్తత తీసుకుంటాడు. ఊరినే కాదు... అక్కడ చెడును కూడా ఏరిపారేయడానికి నడుం బిగిస్తాడు. తన కొడుకు దేవరకోట వెళ్లాడని తెలుసుకున్న రవికాంత్ షాక్ అవుతాడు. ఆ ఊరికి రవికాంత్ కి ఉన్న సంబంధం ఏంటీ? రవికాంత్ కొడుకు అని తెలియగానే హర్ష ప్రేమను చారుశీల ఎందుకు నిరాకరిస్తుంది? ఊరును దత్తత తీసుకున్న హర్ష ఊరిని గుప్పెట్లో పెట్టుకున్న వెంకటరత్నం, శశిలను ఎలా ఎదుర్కొన్నాడు? రవికాంత్ కొడుకు హర్ష అని తెలుసుకున్న నారాయణరావు, ఆ ఊరి ప్రజలు ఎలా ఫీలయ్యారు? తన ఆలోచనలకు దూరం అనుకున్న హర్ష తన ఆలోచనలకు చాలా దగ్గరగా ఉన్నాడని తెలుసుకున్న తర్వాత అతని ప్రేమను చారుశీల అంగీకరించిందా? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

 

నటీనటుల పర్ఫార్మెన్స్
హర్ష పాత్రను మహేష్ బాబు సునాయాసంగా చేశాడు. గత చిత్రాల్లోకన్నా ఈ చిత్రంలో చాలా స్టయిలిష్ గా కనిపించడంతో పాటు ఇంకా హ్యాండ్ సమ్ గా కనిపించాడు. ఎమోషనల్ సీన్స్ లో మహేష్ పర్ఫార్మెన్స్ టచింగ్ గా ఉంది. ఈ పాత్రకు మహేష్ తప్ప ఎవరూ సూట్ కారన్నంత బ్రహ్మాండంగా చేశాడు. నో డౌట్ తెలుగు పరిశ్రమ గర్వించదగ్గ నటుడు. చారుశీల పాత్రను శ్రుతీహాసన్ చాలా చక్కగా చేసింది. ఈ మధ్యకాలంలో తను చేసిన పాత్రల్లో ఇది చాలా మంచి పాత్ర. రవికాంత్ పాత్రలో జగపతిబాబు సూపర్బ్. ఈ పాత్రను జగపతిబాబు తప్ప వేరే ఎవరు చేసినా బాగుండేది కాదేమో అన్నంతగా ఒదిగిపోయారు. నారాయణమూర్తి పాత్రలో రాజేంద్రప్రసాద్ నటన బాగుంది. ముఖేష్ రిషి, సంపత్ రాజ్, సుకన్య, తులసి, రాహుల్ రవీంద్రన్, సుబ్బరాజు, వెన్నెల కిశోర్, అలీ, సురేఖావాణి, శివాజీరాజా, ఏడిద శ్రీరాం... ఇలా చిత్రంలో ఉన్న నటీనటులందరూ కథను అద్భుతంగా పండించారు. చివరికి ఒకటీ, రెండు సన్నివేశాల్లో కనిపించిన నటీనటుల దగ్గర్నుంచి కూడా కొరటాల శివ మంచి నటన రాబట్టుకున్నాడు.

 

సాంకేతిక వర్గం
ఈ చిత్రానికి మెయిన్ హైలైట్ కొరటాల శివ రాసుకున్న కథ. ఆ కథకు తగ్గట్టుగా డైలాగ్స్ కూడా అర్థవంతంగా ఉన్నాయి. చిన్న చిన్న పదాలతో సంభాషణలు తేలికగా సాగినా, టచింగ్ గా ఉంటాయి. ఈ కథను సరిగ్గా తీస్తే... సెన్సేషన్ హిట్ ఖాయం. ఏమాత్రం తడబడినా కామెడీ అయిపోతుంది. కానీ, శివ తడబడకుండా తీశాడు. లాజిక్ కి అందని సీన్స్ కనిపించవు. అతికించిన ఐటమ్ సాంగులు ఉండవు. ఇరికించిన కామెడీ ట్రాక్ ఉండదు. సినిమాలో ఏమేం ఉన్నాయో అవన్నీ కథలో భాగంగానే ఉంటాయి. ఇక, ఈ కథను ఒప్పుకోవడానికి ఓ కమర్షియల్ హీరోకి దమ్ముండాలి. ఆ విధంగా తనలో దమ్ముందని నిరూపించుకున్నాడు మహేష్ బాబు. ఏ హీరోకైనా కథ మీద నమ్మకం కుదరాలంటే దర్శకుడు కన్విన్సింగ్ గా చెప్పాలి. ఆ మేరకు శివ సక్సెస్ అయ్యారు. ఆ కథను అద్భుతంగా తెరకెక్కించి, హీరో నమ్మకాన్ని నిలబెట్టాడు. టెక్నీషియన్స్ లో ఇతరుల గురించి చెప్పాలంటే మది కెమెరా వర్క్ కనువిందు. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన పాటలు వీనుల విందు. కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటింగ్ షార్ప్ గా ఉంది. అనల్ అరసు ఫైట్స్ అరిపించాయ్. వాట్ నాట్... అన్నీ బాగా కుదిరిన సినిమా.

 

ఫిల్మీబజ్ విశ్లేషణ
కమర్షియల్ సినిమాలు తీస్తేనే ప్రేక్షకులు ఆదరిస్తారంటూ... ఆరు పాటలు, నాలుగు ఫైట్లు, కొన్ని కామెడీ సీన్స్,రొమాంటిక్ సీన్స్ చుట్టూ కథలను అల్లుకుంటున్నారు. వీటితో పాటు అదనంగా సీన్ సీన్ కి పంచ్ డైలాగ్ లతో ప్రేక్షకులను ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నారు. కానీ, వీటన్నిటితో పాటు సమాజాన్ని ఆలోచింపజేసే చిన్ని పాయింట్ ఏదైనా పెడితే... అప్పుడా సినిమాకి ఓ అర్థం, పరమార్ధం ఉంటుంది. 'శ్రీమంతుడు' ఈ కోవకు చెందిన చిత్రమే. పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్. అందులో సందేహమే లేదు. కానీ, విలువలున్న కమర్షియల్ మూవీ. అందుకు అభినందించాలి. ఈ మధ్య కాలంలో వచ్చిన కమర్షియల్ సినిమాలన్నింటికన్నా రెండు, మూడు మెట్లు పైన నిలబడే స్థాయి ఉన్న సినిమా. హ్యాట్సాఫ్ టు ది ప్రొడ్యూసర్స్ నవీన్, మోహన్, రవిశంకర్. నిర్మాతలుగా తొలి ప్రయత్నంలోనే ప్రయోజనాత్మక సినిమా తీశారు. ఇలాంటి సినిమా ద్వారా మహేష్ బాబు 'ఎంబి ఎంటర్ టైన్ మెంట్స్' బేనర్ ఆరంభం కావడం ఆ బేనర్ కో విలువ తెచ్చిపెట్టింది.
ఫైనల్ గా చెప్పాలంటే... ఓ కమర్షియల్ హీరో, కమర్షియల్ డైరెక్టర్ సమాజం గురించి ఆలోచిస్తే ఇలాంటి సినిమాలు వస్తాయి. ఆ రకంగా మహేష్, కొరటాల శివ ఓ మంచి ప్రయత్నం చేసారు. ఎంటర్ టైన్ మెంట్ తో పాటు మేసేజ్ కూడా ఇవ్వడం హర్షించదగ్గ విషయం.


ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రం ఇది. కమర్షియల్ సినిమాకి సరికొత్త దారి చూపించిన చిత్రం. సినిమా చూస్తే... కమ్మ కమ్మగా దిమ్మ తిరుగుద్ది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !