filmybuzz

View

శ్రీరస్తు శుభమస్తు మూవీ రివ్య్వూ

Friday,August05th,2016, 12:28 PM

చిత్రం - శ్రీరస్తు శుభమస్తు
బ్యానర్ - గీతా ఆర్ట్స్
నటీనటులు - అల్లు శిరీష్, లావణ్య త్రిపాఠి, ప్రకాష్ రాజ్, సుమలత, సుబ్బరాజు, ప్రగతి, అలీ, తనికెళ్ల భరణి, రావ్ రమేష్, రవిప్రకాష్, రణధీర్, సుబ్బరాజు, హంసానందిని, సుమిత్ర తదితరులు
సంగీతం - యస్. యస్.తమన్
సినిమాటోగ్రఫీ - మనికంతన్
ఎడిటింగ్ - మార్తాడ్ కె.వెంకటేష్
నిర్మాత - అల్లు అరవింద్
దర్శకత్వం - పరశురామ్


అల్లు శిరీష్‌, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా, ఫ్యామిలీ లోని చ‌క్క‌టి ఎమెష‌న్స్ ని వెండితెర‌పై క‌థలుగా తెర‌కెక్కించి విజ‌యాలు సాదిస్తున్న ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్‌(బుజ్జి) ద‌ర్శ‌కుడిగా, స్టార్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ నిర్మాత‌గా, గీతాఆర్ట్స్ బ్యాన‌ర్ లో రూపొందిన‌ చిత్రం 'శ్రీరస్తు శుభ‌మ‌స్తు'. ఈ చిత్రం ఈ రోజు (8.5.2016) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అల్లు శిరీష్ ని హీరోగా నిలబెట్టడానికి అల్లు అరవింద్ చాలా కృషి చేస్తున్నారు. అల్లు శిరీష్ కూడా హీరోగా నిలదొక్కుకోవడానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. మరి వీరి కోరిక నెరవేరే విధంగా ఈ సినిమా ఉందా... తెలుసుకుందాం.


కథ
అల్లు శిరీష్ (సిరి) పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కొడుకు. ధనవంతుల పిల్లలకు తమ కూతుళ్లను కట్టబెట్టాలనే ఆలోచనలతో మిడిల్ క్లాస్ తల్లిదండ్రులు ఉంటారనే అభిప్రాయంతో ఉంటాడు సిరి తండ్రి (ప్రకాష్ రాజు). బిజినెస్ ట్రిప్ నిమిత్తం కాశ్మీర్ వెళ్లిన సిరి, బిటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అనన్య (లావణ్య త్రిపాఠి)ను కలుసుకుంటాడు. ఆమెతో ప్రేమలో పడతాడు. అనన్యకు తన ప్రేమను వ్యక్తపరిచే ముందు తన తండ్రికి తన ప్రేమ విషయం చెబుతాడు సిరి. మిడిల్ క్లాస్ వాళ్లు ధనవంతుల పిల్లలను పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వడానికి రెడీగా ఉంటారు అనే మైండ్ సెట్ తో ఉండే సిరి తండ్రి సిరి ప్రేమను రిజక్ట్ చేస్తాడు. దాంతో తండ్రి, కొడుకుల మధ్య ఆర్గుమెంట్ జరుగుతుంది. ఆ ఆర్గుమెంట్ లో తండ్రితోనే ఛాలెంజ్ చేస్తాడు సిరి.


తను పెద్ద బిజినెస్ మ్యాన్ కొడుకుననే విషయాన్ని చెప్పకుండానే అనన్య మనసును గెల్చుకుంటానని ఛాలెంజ్ చేస్తాడు సిరి. ఈలోపు అనన్య తండ్రి తన ఫ్రెండ్ కొడుకుతో అనన్య పెళ్లి నిశ్చయిస్తాడు. మరి అనన్య మనసును సిరి గెల్చుకుంటాడా.. తండ్రితో సిరి చేసిన ఛాలెంజ్ లో గెలుపెవరిది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.


నటీనటుల పెర్ ఫామెన్స్
ఓ బిజినెస్ మ్యాన్ కొడుకుగా, తండ్రితో ఛాలెంజ్ చేసి తన ప్రేమను గెల్చుకోవడానికి ప్రయత్నించే కుర్రాడిగా అల్లు శిరీష్ బాగున్నాడు. శిరీష్ గత సినిమాలను పోలిస్తే, ఈ సినిమా కోసం శిరీష్ లుక్ వైజ్ చాలా కేర్ తీసుకున్న విషయం స్పష్టంగా కనబడుతోంది. కానీ ఎక్స్ ప్రెషన్ విషయంలో మాత్రం శిరీష్ ఇంకా మెరుగవ్వాల్సి ఉంది. లావణ్య త్రిపాఠిది నటనకు స్కోప్ ఉన్న పాత్ర. అనన్య పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. అందచందాలతో పాటు, లావణ్య నటనకు కూడా ఆడియన్స్ నుంచి ప్లస్ మార్కులు పడతాయి.


ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పడానికేం లేదు. ఎప్పటిలానే తన పాత్రను అద్భుతంగా చేసాడు. రావు రమేష్ పాత్ర బాగుంది. తను కూడా ఆ పాత్రలో ఒదిగిపోయాడు.


అలీ కామెడీ ప్రేక్షకులకు రిలీఫ్. కొన్ని పంచ్ డైలాగులు నవ్వులు పూయిస్తాయి. మిగతా నటీనటులందరూ తమ పాత్రల పరిధిమేరకు నటించారు.


సాంకేతిక వర్గం
రొటీన్ స్టోరీ లైన్ తో ఈ చిత్రం తెరకెక్కింది. స్ర్కీన్ ప్లే పరంగా డైరెక్టర్ మరింత కేర్ తీసుకుని ఉండాల్సింది. కొన్ని సీన్స్ విషయంలో పట్టు సడలినట్టు అనిపిస్తుంది. తమన్ అందించిన పాటలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. పాటల చిత్రీకరణ బాగుంది. సెకండాఫ్ లో డైలాగులు బాగున్నాయి. నిర్మాణపు విలువలు సూపర్. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు.


ప్లస్ పాయింట్స్ - అల్లు శిరీష్, లావణ్య త్రిపాఠి, సంగీతం
మైనస్ పాయింట్స్ - రొటీన్ స్టోరీ, స్ర్కీన్ ప్లే, ఎడిటింగ్


ఫిల్మీబజ్ విశ్లేషణ
శ్రీరస్తు శుభమస్తు స్టోరీ లైన్ టాలీవుడ్ లో రూపొందిన కొన్ని సినిమాలను గుర్తుకు తీసుకువస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్, యూత్ ని టార్గెట్ చేసుకుని చేసిన సినిమా ఇది. ఫస్టాప్ మాములుగా ఉంటుంది. సెకండాఫ్ లోని కొన్ని సీన్స్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతాయి. ప్రీ క్లయిమ్యాక్స్, క్లయిమ్యాక్స్ ఇంట్రస్టింగ్ గా ఉంటాయి. ఎంటర్ టైనింగ్ ఎలిమెంట్స్ బాగున్నాయి. రొటీన్ స్టోరీ, బ్యాడ్ స్ర్కీన్ ప్లే ఈ సినిమాకి చాలా మైనస్. సీనియర్ నటీనటులు చేసిన కొన్ని పాత్రలు వేస్ట్ అనిపిస్తాయి.


ఫైనల్ గా చెప్పాలంటే... రొటీన్, కమర్షియల్ సినిమాలను ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది. గత సినిమాలతో పోలిస్తే, అల్లు శిరీష్ కి ప్లస్ అయ్యే సినిమా.


ఫిల్మీబజ్ డాట్ కామ్ రేటింగ్ - 2.75/5Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Read More !