View

తను నేను మూవీ రివ్య్వూ

Thursday,November26th,2015, 09:30 AM

చిత్రం - తను నేను
సమర్పణ - డి.సురేష్ బాబు
బ్యానర్స్ - సన్ షైన్ సినిమా, వయాకామ్ 18 పిక్చర్స్
నటీనటులు - సంతోష్ శోభన్, అవికా గోర్, అల్లరి రవిబాబు, సత్యకృష్ణ, కిరీటి దమ్మరాజు, ఆర్.కె.మామ, రాజశ్రీనాయుడు, సంజయ్ కిషోర్ తదితరులు
సంగీతం - సన్నీ ఎం.ఆర్
సినిమాటోగ్రఫీ - సురేష్ సారంగం
ఎడిటింగ్ - మార్తాండ్.కె.వెంకటేష్
నిర్మాత, దర్శకత్వం - రామ్మోహన్ .పి
అష్టా చెమ్మా, గోల్కొండ హై స్కూల్ చిత్రాల ద్వారా టేస్ట్ ఫుల్ ప్రొడ్యూసర్ అనిపించుకున్నారు పి. రామ్మోహన్. 'ఉయ్యాల జంపాల' చిత్రానికి ఓ నిర్మాతగా, రచయితగా వ్యవహరించి తనలో మంచి రచయిత ఉన్న విషయాన్ని కూడా నిరూపించుకున్నారాయన. ఈ మూడు చిత్రాలతో ఓ డిగ్నిఫైడ్ ప్రొడ్యూసర్ అనిపించుకున్న రామ్మోహన్ తొలి ప్రయత్నంగా దర్శకత్వం వహించిన చిత్రం 'తను-నేను'. 'బాబి' దర్శకుడు శోభన్ తనయుడు సంతోష్ శోభన్ ని హీరోగా పరిచయం చేస్తూ, ఈ చిత్రం చేశారాయన. ఖచ్చితంగా డీసెంట్ గా ఉండే నీట్ మూవీనే చేసి ఉంటారనే అంచనాలు నెలకొన్నాయి. మరి.. 'తను-నేను' ఎలా ఉంటారు?... చూద్దాం.


à°•à°¥
కిరణ్ (సంతోష్ శోభన్) ఈస్ట్ వెస్ట్ మనీ ట్రాన్స్ ఫర్ కాల్ సెంటర్ లో జాబ్ చేస్తుంటాడు. నానమ్మ చనిపోవడంతో ఒంటరిగా లైఫ్ లీడ్ చేస్తుంటాడు. ఈ కుర్రాడికి సొంత వాళ్లను వదిలేసి అమెరికా వెళ్లి సెటిల్ అయిన కుటుంబాలన్నా, మనుషులన్నా చాలా అసహ్యం. ఎంత అసహ్యం అంటే ఫారిన్ కస్టమర్ దగ్గర చాలా చీత్కారంగా మాట్లాడేటంతటి అసహ్యం నింపుకుని ఉంటాడు. దానివల్ల తన జాబ్ పోతుందని తెలిసినా అసలు వెనుకాడడు. కిరణ్ కి నరేష్ అని బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు. నరేష్ ద్వారా సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్న కీర్తి (అవికా గోర్) పరిచయం అవుతుంది. ఆమెను తొలి పరిచయంలోనే ప్రేమిస్తాడు. కీర్తి కూడా కిరణ్ ని ప్రేమిస్తుంది. నానమ్మ చనిపోయిందని, తనకు తల్లిదండ్రులు లేరని కిరణ్ చెప్పడతో కీర్తి అతనికి ఇంకా దగ్గరవుతుంది. కట్ చేస్తే...


కీర్తి తండ్రి సర్వేశ్వరరావు బండ్రెడ్డి (రవిబాబు) తన కూతురిని అమెరికాకి పంపించాలనే టార్గెట్ తో ఉంటాడు. తన కొడుకు ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్లిపోయాడు కాబట్టి, తన కూతురు మాత్రం యు.యస్ లో జాబ్ చేసి తన చుట్టాల ముందు తలెత్తుకునేలా చేస్తుందనే నమ్మకంతో ఉంటాడు. తండ్రి కోరికను తీర్చాలనే ఆశయంతో కీర్తి ఉంటుంది.


కీర్తి అమెరికా వెళ్లాలనే ఆశయం తెలుసుకున్న కిరణ్ ఆమె మనసు మార్చి అమెరికా వెళ్లకుండా చేయాలనుకుంటాడు. మరోవైపు కీర్తి అంటే ఇష్టపడే శ్రీకాంత్ డైరెక్ట్ గా కీర్తి తండ్రి దగ్గర తనకి అమెరికాలో జాబ్ అని కీర్తిని పెళ్లి చేసుకుంటానని చెబుతాడు. కీర్తిని కిరణ్ కి దూరం చేయమని కీర్తిని ఇచ్చి పెళ్లి చేస్తానని శ్రీకాంత్ కి మాటిస్తాడు కీర్తి తండ్రి. కట్ చేస్తే.. కిరణ్ కి తల్లిదండ్రులు ఉన్నారని, వారు అమెరికాలో ఉన్నారని కీర్తికి తెలుస్తుంది.


అసలు తల్లిదండ్రులు లేరని కీర్తి దగ్గర కిరణ్ ఎందుకు అబద్ధం చెబుతాడు.. అతనికి అమెరికాలో స్థిరపడిన వారంటే ఎందుకంత కోపం... కీర్తి, కిరణ్ లను శ్రీకాంత్ విడదీస్తాడా... అబద్ధమాడిన కిరణ్ ని కీర్తి ఏం చేస్తుంది... తండ్రి ఆశయాన్ని నెరవేర్చడానికి కీర్తి అమెరికా వెళ్లిపోతుందా తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.


నటీనటుల పర్ఫార్మెన్స్
సంతోష్ శోభన్ యూత్ ఫుల్ గా చూడచక్కగా ఉన్నాడు. మంచి ఎత్తు, ఎత్తుకి తగ్గ బరువుతో చూడగానే ఆకర్షిస్తాడు. ఇక, యాక్టింగ్ కూడా బాగానే చేశాడు. డైలాగ్ డెలివరీ చాలా బాగుంది. నటనలో తడబాటు కనిపించలేదు. చాలా ఈజ్ గా చేశాడు. సంతోష్ సరసన అవికా గోర్ బాగానే ఉంది. అయితే, మరీ బొద్దుగా ఉండటం అంత ముద్దుగా లేదు. ముఖ్యంగా ఓ పాటలో చీరల్లో కనిపిస్తుంది. చీరల్లో బాగాలేదనే చెప్పాలి. సర్వేశ్వరావు పాత్రకు రవిబాబు వంద శాతం సూట్ అయిపోయారు. సీరియస్ గా కనిపించినా నవ్వించే ఆ పాత్రను బాగా చేశాడు. సత్యకృష్ణన్ పాత్ర కూడా బాగుంది. సంజయ్ కిషోర్, రాజశ్రీ నాయుడు తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. నరేశ్ పాత్ర చేసిన కుర్రాడు కూడా మంచి మార్కులు కొట్టేస్తాడు. ఇంకా సినిమాలో ఉన్న ఇతర పాత్రధారులందరూ మనసుల్లో నిలిచిపోతారు.


సాంకేతిక వర్గం
ఒక హీరో పరిచయ చిత్రానికి కావల్సిన కథతో రామ్మోహన్ ఈ సినిమా తీశారు. ఆ విధంగా దర్శకుడిగా ఆయన జడ్జిమెంట్ ని అభినందించవచ్చు. కథ చాలా సింపుల్. హీరోకి అమెరికా అంటే పడదు. ప్రేయసి అమెరికాలో సెటిల్ కావాలనుకుంటుంది. ఈ చిన్న పాయింట్ చుట్టూ కథ అల్లి డీసెంట్ గా తెరకెక్కించారు. సినిమా మొత్తం లైట్ గా సాగుతుంది. పాటలు ఆహ్లాదంగా సాగుతాయి. విన్నంతసేపూ బాగున్నట్లనిపిస్తాయి. చిత్రీకరణ బాగుంది. సురేష్ సారంగం కెమెరా పనితనం బాగుంది. ఒక కొత్త కుర్రాడి పరిచయ సినిమాకి ఎంత ఖర్చుపెట్టాలో అంత పెట్టి తీశారు. సినిమా క్వాలిటీగా ఉంది.


ఫిల్మీబజ్ విశ్లేషణ
కోట్లు సంపాదించాలంటే అమెరికానే వెళ్లక్కర్లేదు... ఇండియాలోనే బోల్డన్ని అవకాశాలు ఉన్నాయనీ, విదేశాలు వెళ్లి ప్రాక్టికల్ గా మారే బదులు ఇండియాలో మన ట్రెడిషన్ ని మర్చిపోకుండా ఎమోషన్స్ కి దూరం కాకుండా బతకడం మేలు అని సినిమాలో చెప్పారు. పాయింట్ బాగుంది. ఈ పాయింట్ ని సీరియస్ గా కాకుండా చాలా తేలికగా చెప్పారు. కొత్త హీరోతో అలా చెప్పించడమే కరెక్ట్. సినిమా మొత్తం నీట్ గా ఉంటుంది కాబట్టి, ఇబ్బందిపడకుండా చూడొచ్చు. అయితే, ఒక వ్యక్తి మరణాన్ని ఆశించి, హీరోతో సాయి కోటి రాయించడం కరెక్ట్ కాదనిపించింది. దానికి తగ్గట్టు ఆ వ్యక్తి చనిపోవడం కూడా హర్షించే విధంగా ఉండదు. ఆ సన్నివేశాన్ని జస్టిఫై చేసేలా వేరే సీన్ ఏదైనా పెట్టి ఉంటే బాగుండేది.


ఫైనల్ గా చెప్పాలంటే.. 'తను-నేను' గొప్ప సినిమా కాకపోవచ్చు. అలాగని తీసివేయదగ్గ సినిమా కూడా కాదు. తక్కువ ఖర్చుతో తీశారు కాబట్టి, ఎవర్నీ నష్టపరిచే సినిమా అయ్యే అవకాశం లేదు. నిర్మాతలు, బయ్యర్స్ నష్టపోకపోతే, సేఫ్ ప్రాజెక్ట్ క్రిందే లెక్క. ఆ రకంగా ఇది సేఫ్ ప్రాజెక్ట్. ఆ క్యాలిక్యులేషన్ తో సినిమాని తెరకెక్కించిన దర్శక, నిర్మత రామ్మోహన్ ని అభినందించవచ్చు. టైమ్ పాస్ కోసం ఓసారి 'తను-నేను'ని చూడొచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !