View

'త్రిపుర' మూవీ రివ్య్వూ

Friday,November06th,2015, 10:12 AM

చిత్రం - త్రిపుర
బ్యానర్ - క్రేజీ మీడియా
సమర్పణ - జె.రామాంజనేయులు
నటీనటులు - నవీన్ చంద్ర, స్వాతి, రావు రమేష్, రజిత, సప్తగిరి, జయప్రకాష్ రెడ్డి, షకలక శంకర్ తదితరులు
మాటలు - రాజా
సంగీతం - కమ్రాన్
సినిమాటోగ్రఫీ - రవికుమార్ సానా
ఎడిటింగ్ - ఉపేంద్ర
ఎగ్జిక్యూటివ్ నిర్మాత - శివ మల్లాల
నిర్మాతలు - ఎ.చినబాబు, ఎం.రాజశేఖర్
స్ర్కీన్ ప్లే - కోన వెంకట్, శ్రీనివాస్ వెలిగొండ
కథ, దర్శకత్వం - రాజకిరణ్


స్వామి రారా, కార్తికేయ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటిస్తూ, కథలు, పాత్రలు ఎంపిక చేసుకునే విషయంలో స్వాతి తన టాలెంట్ ని నిరూపించుకుంది. తన తాజా చిత్రం 'త్రిపుర'పై అంచాలను పెరగడానికి అదో కారణమైతే 'గీతాంజలి' వంటి హిట్ మూవీ తర్వాత రాజ్ కిరణ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం కావడం మరో కారణంగా నిలిచింది. ఆరంభం నుంచి విడుదల వరకూ టాలీవుడ్ లో 'త్రిపుర' హాట్ టాపిక్ గా నిలిచింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం...


à°•à°¥
త్రిపుర (స్వాతి) ఓ పల్లెటూరి అమ్మాయి. తను కలలు కనే కలలు నిజమవుతుంటాయి. దాంతో ఊరిలోని వారందరూ త్రిపురను అడిగి తమ భవిష్యత్తును తెలుసుకోవడానికి ఆసక్తి కనబరుస్తారు. ఇది తన కూతురు భవిష్యత్తుకు మంచిది కాదని, ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకురారని త్రిపుర తండ్రి శివన్నారాయణ భయపడుతుంటారు. దాంతో హైదరాబాద్ లోని ప్రసాద్ హాస్పటల్లో త్రిపురకు ట్రీట్మెంట్ ఇప్పించడానికి తీసుకువస్తాడు శ్రీమన్నారాయణ. ఆ హాస్పటల్లో డాక్టర్ గా వర్క్ చేస్తున్న నవీన్ (నవీన్ చంద్ర) దగ్గర త్రిపురకు ట్రీట్ మెంట్ ఆరంభమవుతుంది. ట్రీట్ మెంట్ జరిగేటప్పుడు ఇద్దరూ ప్రేమలో పడటం పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోవడం జరుగుతుంది.


నవీన్ కి ఓ ఫామ్ హౌస్ ఉంటుంది. ఆ ఫామ్ హౌస్ లో కొన్నాళ్ల పాటు ఉండి, ఆ పామ్ హౌస్ ని అమ్మేయాలని డిసైడ్ అవుతారు నవీన్, త్రిపుర. పెళ్లికి ముందు వచ్చిన త్రిపుర కలలు నిజమైనట్టుగానే, పెళ్లి తర్వాత వచ్చిన కల కూడా నిజమవుతుంది. పామ్ హౌస్ అమ్మడానికి ట్రై చేస్తున్న బ్రోకర్ తాతారావు చనిపోతాడని కల కంటుంది త్రిపుర. అది నిజమవుతుంది. ఆ తర్వాత కలలో నవీన్ ని ఎవరో పొడిచేసినట్టుగా కల కంటుంది త్రిపుర. దాంతో త్రిపుర చాలా భయపడుతుంటుంది.


మరోవైపు నవీన్ తో కలిసి వర్క్ చేసిన డాక్టర్ ఈషా కనిపించకుండా పోవడంతో పోలీసులు ఇన్వెస్ట్ గేట్ చేస్తుంటారు. ఈషా, నవీన్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కావడంతో పోలీస్ ఇన్వెస్ట్ గేషన్ లో నవీన్ పైన కూడా అనుమానం వస్తుంది. నవీన్ ఫ్రెండ్ సి.ఐ తిలక్ ఫ్రెండ్ అని కూడా చూడకుండా నవీన్ పైన అనుమానపడతాడు. ఈషా కనబడకుండా పోవడానికి నవీన్ కి సంబంధం ఉందనే కోణంలో దర్యాప్తు చేస్తుంటాడు. ఈష, నవీన్ క్లోజ్ గా ఉండేవారిని తెలుసుకున్న త్రిపురకి కూడా నవీన్ పై సందేహం కలుగుతుంది. అతనే ఈషను ఏదో చేసాడని భావిస్తుంది.


అసలు ఈష ఏమయ్యింది.. నిజంగానే ఈషను నవీన్ చంపేసాడా.. త్రిపురకు నవీన్ ని ఎవరో పొడిచేసినట్టు కల వస్తుంది. ఆ కల నిజమవుతుందా... ఈష చనిపోవడానికి అసలు కారణం ఏంటీ? కారకులు ఎవరనేదే ఈ చిత్ర కథ.


నటీనటుల పర్ఫార్మెన్స్
ఈ చిత్రం దాదాపు స్వాతి పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఇప్పటివరకూ చేసిన చిత్రాల్లో అల్లరి పిల్లలా కనిపించిన స్వాతి ఈ చిత్రంలో హౌస్ వైఫ్ పాత్రలో కనిపిస్తుంది. అసలు సిసలమైన గృహిణులు ఎలా ఉంటారో అచ్చంగా అలానే ఒదిగిపోయింది. తండ్రి దగ్గర తిట్లు తిని, బుంగ మూతి పెట్టే సన్నివేశాల్లోనూ, తనకు వచ్చిన కల నిజమవుతుందని భయపడే సీన్స్ లో స్వాతి నటన బాగుంది. ముఖ్యంగా క్లయిమ్యాక్స్ లో దెయ్యం ఆవహించే సీన్స్ బాగా చేసింది. డాక్టర్ గా హుందాగా, హజ్బెండ్ గా రొమాంటిక్ సన్నివేశాల్లో నవీన చంద్ర నటన బాగుంది. ఫుల్ లెంగ్త్ రోల్ లో సప్తగిరి చేసిన సందడి మామూలుగా లేదు. బాగా నవ్వించాడు. జయప్రకాశ్ రెడ్డి, షకలక శంకర్ల కామెడీ కూడా బాగుంది. ఇంకా రావు రమేశ్, రజిత, శివన్నారాయణ, ప్రీతి నిగమ్ తమతమ పాత్రల్లో ఒదిగిపోయారు.


సాంకేతిక వర్గం
కథ బాగుంది. హారర్ నేపథ్యానికి కామెడీ మిక్స్ చేసి దర్శకుడు రాజకిరణ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.. ఫస్టాఫ్ సరదాగా సాగిపోతుంది. సెకండాఫ్ లో అసలు ట్విస్ట్ మొదలవుతుంది. దాంతో ఉత్కంఠగా సాగుతుంది. కోన వెంకట్ స్ర్కీన్ ప్లే కి ఆ క్రెడిట్ దక్కుతుంది. రాజకిరణ్ టేకింగ్ బాగుంది. అయితే, సెకండాఫ్ ఆరంభమైన 10, 15 నిముషాలు కామెడీ సీన్స్ తోనే కథ నడిపించడంతో ట్రాక్ తప్పిన ఫీలింగ్ కలుగుతుంది. మళ్లీ కథలోకి ఎంట్రయిన తర్వాత ప్రేక్షకులు కథలో లీనమవుతారు. సెకండాఫ్ ఆరంభంలో కామెడీ సీన్స్ లెంగ్త్ తగ్గిస్తే, ఇంకా ఫాస్ట్ గా, ఆసక్తిగా సినిమా సాగినట్టు అనిపిస్తుంది. కమ్రాన్ స్వరపరచిన పాటలు ఓకే అనే విధంగా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. కథకు ఎంత అవుతుందో అంతే ఖర్చు పెట్టడంవల్ల సినిమా తీసినవాళ్లు, కొన్నవాళ్లు 'సేఫ్' అనే చెప్పాలి. నిర్మాతలు చినబాబు అరిగెల, రాజశేఖర్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత శివ మల్లాల పర్ ఫెక్ట్ ప్లానింగ్ స్పష్టం గా కనిపిస్తోంది.


ఫిల్మీబజ్ విశ్లేషణ
ఒక డిఫరెంట్ స్టోరీ లైన్ తో సాగే సినిమా ఇది. హారర్ అంటే సీన్ సీన్ కీ భయపెట్టకపోవడం ఓ ప్లస్ పాయింట్. కామెడీ వేలో తీసుకెళ్లారు. అది రిలీఫ్ గా అనిపించినా, కొంత కామెడీ తగ్గి ఉంటే సినిమా ఇంకా వేగంగా ఉండి ఉండేది. అలాగే, క్లయిమ్యాక్స్ లో స్వాతి నటన బాగుంది కాబట్టి, ఇంకో రెండు, మూడు సీన్స్ తన మీద ఉండి ఉంటే బాగుండేదనిపిస్తుంది. అది మినహా 'త్రిపుర'లో చెప్పుకోదగ్గ మైనస్సులు లేవు. కుటుంబ సమేతంగా అందరూ ఎంజాయ్ చేయదగ్గ లైటర్ వీన్ హారర్ మూవీ ఇది.


ఫైనల్ గా చెప్పాలంటే.. 'త్రిపుర' తీసివేయదగ్గ సినిమా కాదు. తీసిన వాళ్లు, కొన్నవాళ్లను సేఫ్ చేసి, చూసే వాళ్లకు ఎంజాయ్ మెంట్ నిచ్చే చిత్రం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !