View

తుంటరి మూవీ రివ్య్వూ

Friday,March11th,2016, 08:43 AM

చిత్రం - తుంటరి
బ్యానర్ - శ్రీ కీర్తి ఫిలిమ్స్
నటీనటులు - నారా రోహిత్, లతా హెగ్డే, కబీర్ దూహన్ సింగ్, వెన్నెల కిశోర్, షకలక శంకర్, సుదర్శన్, అలీ తదితరులు
సంగీతం - సాయికార్తీక్
సినిమాటోగ్రఫీ - ఎం.ఆర్.పళనికుమార్
ఎడిటింగ్ - తమ్మిరాజు
నిర్మాతలు - అశోక్ బాబా, నాగార్జున
కథ - ఎ.ఆర్.మురుగదాస్
దర్శకత్వం - కుమార్ నాగేంధ్ర

 

బాణం, సోలో, ప్రతినిధి, రౌడీఫెలో అంటూ ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా వైవిధ్యభరితమైన చిత్రాలు చేస్తూ ముందుకుసాగుతున్నాడు నారా రోహిత్. నటుడిగా మంచి పేరు తెచ్చుకుంటున్న రోహిత్ తొలిసారిగా 'తుంటరి' టైటిల్ తో ఓ మాస్ కమర్షియల్ చిత్రం చేసాడు. ఇది తమిళ్ చిత్రం 'మాన్ కరాటే' కి రీమేక్. తొలి చిత్రం 'గుండెల్లో గోదారి' తోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్న డైరెక్టర్ కుమార్ నాగేంద్ర దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. నాగార్జున, అశోక్ బాబా సంయుక్తంగా శ్రీ కీర్తి ఫిలిమ్స్ పతాకంపై రూపొందిన 'తుంటరి' ఈ రోజు (11.3.2016) విడుదలయ్యింది. ఈ సినిమా నారా రోహిత్ ని కమర్షియల్ హీరోల జాబితాలోకి చేర్చుతుందా.. ఈ సినిమాతో కుమార్ నాగేంద్ర సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ జాబితాలో చేరతాడా తెలుసుకుందాం.

 

à°•à°¥
కిశోర్, ఆనంద్, సుదర్శన్, కల్కి, పూజిత మంచి ఫ్రెండ్స్. సత్యం సాఫ్ట్ వేర్ సంస్ధలో ఉద్యోగం చేస్తున్న ఈ ఐదుగురు అనంతగిరి ఫారెస్ట్ కి పిక్నిక్ కి వెళతారు. అక్కడ ఈ ఐదుగురు ఓ సాధువును కలుస్తారు. అప్పుడు భవిష్యత్తు గురించి ఓ విషయం తెలుస్తుంది. నాలుగు నెలల తర్వాత జరగబోయే బాక్సింగ్ మ్యాచ్ లో రాజు (నారా రోహిత్) అనే వ్యక్తి గెలుస్తాడని సాధువు ద్వారా తెలుసుకుంటారు. ఆ రాజు ఆనందరావుగారి అబ్బాయి అని కూడా తెలుసుకుంటారు. దాంతో బాక్సింగ్ మ్యాచ్ విన్నర్ కి వచ్చే ఐదు కోట్ల ప్రైజ్ మనీ కోసం ఆ రాజును వెతికి పట్టుకోవాలని డిసైడ్ అవుతారు. కట్ చేస్తే...


చిన్నప్పట్నుంచి చదువు లేకుండా, పెద్దయిన తర్వాత పనిపాటా లేకుండా గాలికి తిరిగే లోకల్ రాజును కిశోర్ బ్యాచ్ పట్టుకుంటుంది. ఇతనే బాక్సింగ్ లో గెలవబోయే కుర్రాడని భావించిన కిశోర్ బ్యాచ్ అతనికి నెల నెల జీతం ఇచ్చి, బాక్సింగ్ కి ప్రాక్టీస్ కోసం డబ్బు కూడా ఖర్చుపెడతారు. అయితే రాజు బాక్సింగ్ ప్రాక్టీస్ చేయకుండా సిరి (లతా హెగ్డే) తో ప్రేమలో పడతాడు. ఆమె వెనకాల పడుతూ ఆమె ప్రేమను గెల్చుకుంటాడు. కట్ చేస్తే..

 


ఆ సమయంలోనే టాప్ బాక్సర్ పేరు కూడా రాజు (కబీర్ దూహన్ సింగ్) అని కిశోర్ బ్యాచ్ కి తెలిసి షాక్ అవుతుంది. అతని తండ్రి పేరు కూడా ఆనందరావు అని తెలియడంతో బాక్సింగ్ టోర్నమెంట్ లో గెలవబోయే రాజు ఎవరనే సందేహం కిశోర్ బ్యాచ్ కి కలుగుతుంది. మరి ఫైనల్ గా బాక్సింగ్ లో గెలిచిన రాజు ఎవరు? సాధువు ద్వారా కిశోర్ బ్యాచ్ తెలుసుకున్న భవిష్యత్తు నిజమేనా? సిరి, రాజు ప్రేమ సక్సెస్ అవుతుందా తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.


నటీనటులు
డీసెంట్ బాడీ లాంగ్వేజ్ తో డిఫరెంట్ పాత్రలు చేస్తున్న నారా రోహిత్ తొలిసారి లోకల్ రాజు అనే మాస్ పాత్రను చేసాడు. మాస్ క్యారెక్టర్ చేయడం ఆషామాషీ కాదు. బాడీ లాంగ్వేజ్ నుంచి డైలాగ్ డెలివరీ వరకూ అన్ని పర్ ఫెక్ట్ గా కుదరాలి. ఆ పరంగా నారా రోహిత్ బేష్ అనిపించుకున్నాడు. కామెడీ టైమింగ్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, డ్రెస్సింగ్ స్టైల్.. ఇలా ప్రతి విషయంలోనూ నారా రోహిత్ చాలా జాగ్రత్త పడ్డాడు. రాజు పాత్రకు వంద శాతం న్యాయం చేసాడు. బాక్సర్ గా కూడా బాగున్నాడు. కొంచెం బరువు తగ్గితే లవ్ సీన్స్ లో కూడా శభాష్ అనిపించుకోగలుగుతాడు. ఇక ఎమోషనల్ సీన్స్ లో తన గత చిత్రాల్లోలానే అద్భుతంగా నటించాడు. లతా హెగ్డే తన పాత్ర పరిధిమేరకు నటించింది. క్లయిమ్యాక్స్ సీన్ లో అద్భుతంగా నటించి తనలోని నటిని ఆవిష్కరించింది. వెన్నెల కిశోర్, ఆనంద్, సుదర్శన్, కల్కి, పూజితలు తమ పాత్రల పరిధిమేరకు నటించారు. విలన్ పాత్రకు కబీర్ పక్కాగా సరిపోయాడు. షకలక శంకర్ కామెడీ కితకితలు పెడుతుంది. అలీ బాక్సింగ్ రిఫరీగా తన పాత్రకు న్యాయం చేసాడు.


సాంకేతిక వర్గం
ఇది తమిళ్ చిత్రం 'మాన్ కరాటే'' కి రీమేక్. అయినప్పటికీ తమిళ్ చిత్రం చూస్తున్నామనే ఫీలింగ్ తెలుగు ఆడియన్స్ కి అసలు రాదు. డైరెక్టర్ కుమార్ నాగేంద్ర ఆ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. స్పోర్ట్స్ నేపధ్యం అంటేనే యూనివర్శిల్ సబ్జెక్ట్. కాబట్టి నేటివిటి ప్రాబ్లమ్ లేదు. హీరో క్యారెక్టరైజేషన్ ని డైరెక్టర్ కుమార్ నాగేంద్ర చక్కగా తీర్చిదిద్దాడు. బహుశా నారా రోహిత్ ఈ సినిమా చేయడానికి ముఖ్య కారణం ఇదే అయ్యుంటుంది. ఒరిజినల్ వెర్షన్ కంటే నిడివి తగ్గించడం వల్ల సినిమా ఎక్కడా బోర్ కొట్టదు. రోహిత్ లోని కామెడీ యాంగిల్ ని చక్కగా ప్రజెంట్ చేసాడు. ఓవరాల్ గా డైరెక్టర్ గా కుమార్ నాగేంద్రకి ఇది ప్లస్ సినిమా. సాయికార్తీక్ పాటలు బాగున్నాయి. రీ-రికార్డింగ్ బాగా కుదిరింది. పళనీ కుమార్ ఫోటోగ్రఫీ, మధు ఎడిటింగ్ బాగున్నాయి. కథకు సరిపడా బడ్జెట్ సమకూర్చారు నిర్మాతలు.


ఫిల్మీబజ్ విశ్లేషణ
ముందు ఈ సినిమా స్టోరీ లైన్ బాగుంది. స్ర్కీన్ ప్లే కూడా బాగా కుదరడం ఈ సినిమాకి ప్లస్. నారా రోహిత్ యాక్టింగ్, కామెడీ టైమింగ్, డ్యాన్స్ లు ప్రేకకులను ఆకట్టుకుంటాయి. దాంతో అన్ని వర్గాల ప్రేకకులు సినిమాని ఎంజాయ్ చేస్తారు. డైలాగ్స్ పరంగా మరింత కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. వెయిట్ తగ్గి, ఇలాంటి పాత్రలు చేస్తే మాస్ హీరోలకు గట్టి పోటీ ఇవ్వగల సత్తా నారా రోహిత్ కి ఉంది. ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. నారా రోహిత్ లోని మాస్ యాంగిల్ ని బయటపెట్టే సినిమా.ఈ వీకెండ్ టైమ్ పాస్ కి చక్కటి సినిమా.


షైనల్ గా చెప్పాలంటే... బాక్సాపీస్ వద్ద ఈ 'తుంటరి' కాసుల వర్షం కురిపించడం ఖాయం.

 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !