View

వంగవీటి మూవీ రివ్య్వూ

Friday,December23rd,2016, 03:41 AM

చిత్రం - వంగవీటి
బ్యానర్ - రామదూత క్రియేషన్స్
నటీనటులు - సందీప్ కుమార్, వంశీ నక్కంటి, వంశీ చాగంటి, నైనా, గంగూలి, కౌటిల్యా, శ్రీతేజ్ తదితరులు
సినిమాటో్గ్రఫీ - రాహుల్ శ్రీవాత్సవ్, కె.దిలీప్ వర్మ, సూర్య చౌదరి
ఎడిటింగ్ - సిద్దార్ధ్ తాతోళ్లు
సంగీతం - రవిశంకర్
రచయితలు - చైతన్య ప్రసాద్, రాధాకృష్ణ
సాహిత్యం - సిరాశ్రీ, చైతన్యప్రసాద్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - విస్సు
ప్రొడ్యూసర్ - దాసరి కిరణ్ కుమార్
దర్శకత్వం - రాంగోపాల్ వర్మ


కల్పిత కథలకంటే, నిజ సంఘటలను, జీవిత చరిత్రలను తెరకెక్కించడానికి ఏ డైరెక్టర్ కైనా దమ్ముండాలి. దమ్ముతో పాటు ఎన్నుకునే స్టోరీ లైన్ పైన అవగాహన ఉండాలి. వర్కవుట్ చేసిన సబ్జెక్ట్ ని కమర్షియల్ తెరకెక్కించి నిర్మాతకు నాలుగు డబ్బులు మిగిలేలా చేయాలి. ఇదంతా చాలా రిస్క్ తో కూడిన పని. అయినా సరే ఈ రిస్క్ ని ఇష్టంగా చేస్తాడు డైరెక్టర్ రాంగోపాల్ వర్మ. రాయలసీమ ఫ్యాక్షన్, రాజకీయాలను ఆధారంగా చేసుకుని 'రక్తచరిత్ర' చిత్రాన్ని తెరకెక్కించాడు. రెండు పార్ట్ లుగా తీసిన ఈ సినిమాలకి మంచి ఆదరణ లభించింది. తాజాగా 'వంగవీటి' టైటిల్ తో మరో సినిమా చేసాడు. ఈ సినిమా విజయవాడ నేపధ్యం ఉన్న వంగవీటి మోహన్ రంగ జీవితానికి సంబంధించినది. దాంతో ఈ సినిమాని ఆరంభించినప్పట్నుంచి విపరీతమైన క్రేజ్ నెలకొంది. మరి రాంగోపాల్ వర్మ ఏ మేరకు వంగవీటి మోహన్ రంగా జీవితాన్ని తెరపై ఆవిష్కరించగలిగాడు... ఈ సినిమా అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఉంటుందా తెలుసుకుందాం.


కథ
వెంకటరత్నం ఎర్ర పార్టీకి చెందిన వ్యక్తి. విజయవాడ సిటీని తన గుప్పెట్లో పెట్టుకుని, పేదలకు అండగా ఉంటూ, తనకు అడ్డం వచ్చిన వారిని తొక్కేస్తూ లీడర్ గా ఎదుగుతాడు. అదే సిటీకి చెందిన రాధ ఓ బ్యాచ్ ని వెంటేసుకుని చిన్న చిన్న సెటిల్ మెంట్లు చేస్తుంటాడు. ఇతగాడి ధైర్యం, పట్టుదల నచ్చి చేరదీస్తాడు వెంకటరత్నం. కండబలం, అంగబలంతో రాధ అంచలంచెలుగా ఎదుగుతుంటాడు. ఇలా ముందుకుదూసుకెళ్లడం తమకే ముప్పు తెచ్చి పెడుతుందని ఓ వర్గం వెంకటరత్నంని హెచ్చరిస్తుంది. దాంతో రాధను పిలిచి అవమానించి, వార్నింగ్ ఇస్తాడు వెంకటరత్నం. ఆ అవమానాన్ని రాధ బ్యాచ్ తట్టుకోలేకపోతుంది. వెంకటరత్నంని చంపేయాలని డిసైడ్ అయ్యి, ప్లాన్ చేసి చంపేస్తారు.


అప్పట్నుంచి వెంకటరత్నం వర్గం హవా తగ్గిపోయి, విజయవాడను శాసించే వ్యక్తిగా రాధ ఎదుగుతాడు. స్టూడెంట్స్ యూనియన్, లారీ అసోసియేషన్... ఇలా ప్రతి ఒక్క యూనియన్ ని తన కనుసైగల్లో మెలిగేలా చేసుకుంటాడు. సరిగ్గా ఆ సమయంలో విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనే అన్నదమ్ములైన గాంధీ, నెహ్రూ కాలేజీ గొడవల్లో పార్టీ ప్రమేయాన్ని ఆపాలని కోరుతూ రాధను కలుస్తారు. గాంధీ, నెహ్రు విధివిధానాలు నచ్చడం, ఈ ఇద్దరికీ రాధ నచ్చడంతో ఒక తాటిపైన నడవడం మొదలుపెడతారు. రాధ, గాంధీ, నెహ్రు కలిసి విజయవాడను అన్ని విధాలుగా శాసిస్తారు.


రాధ ఎదుగుదలను ఓర్చుకోలేని ఎర్ర పార్టీ ఓ పధకం ప్రకారం రాధను హత్య చేస్తారు. దాంతో తప్పని పరిస్థితుల్లో రాధ తమ్ముడు మోహన్ రంగా రంగంలోకి దిగుతాడు. అన్న రాధ బాధ్యతలను నెత్తిన వేసుకుంటాడు. రంగాకి కూడా నెహ్రు, గాంధీ అండగా ఉంటారు. కానీ ఓ విషయంలో నెహ్రు, గాంధీని విభేదించిన రంగా ఏకంగా గాంధీని చంపించేంతవరకూ వెళతాడు. నెహ్రు, గాంధీ చిన్న సోదరుడు మురళి తన అన్న గాంధీ హత్యను భరించలేకపోతాడు. ఎలాగైనా రంగ వర్గాన్ని మట్టుబెట్టాలని నిర్ణయించుకుంటాడు. మురళీ దూకుడు తట్టుకోలేని రంగా తన వర్గంతో మురళి హత్యకు ప్లాన్ చేస్తాడు. కాపు కాసి మురళీని హత్య చేస్తారు. జాతీయ పార్టీ అండదండలతో రంగా ఓ లీడర్ గా ఎదుగుతుంటాడు. అన్నయ్య గాంధీ, తమ్ముడు మురళీ హత్యలతో నెహ్రు కూడా అప్ సెట్ అయిపోతాడు. ఆచితూచి అడుగులు వేస్తుంటాడు. అప్పటివరకూ జాతీయ పార్టీల హవా కొనసాగుతున్న విజయవాడలో ఓ ప్రాంతీయ పార్టీ హవా మొదలవుతుంది. ఆ ప్రాంతీయ పార్టీ అండదండలు నెహ్రుకి దక్కుతాయి. నెహ్రు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుస్తాడు. దాంతో నెహ్రుకి రాజకీయ అండదండలు దక్కుతాయి. విజయవాడలో పెరిగిపోతున్న రౌడీయిజాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని నిర్ణమించుకుంటుంది అధికారపార్టీ. ప్రజా సమస్యల కోసం ఇంటిముందు నిరాహారదీక్ష చేస్తున్న రంగాను, నల్ల బట్టల్లో వచ్చిన దుండగులు నిరాహారదీక్ష వేదికపైకి బాంబులు విసిరి, గొడ్డళ్లతో రంగాని నరికి చంపేస్తారు. రంగా హత్యతో విజయవాడ అట్టుడికిపోతుంది. అయితే రంగా మరణం వెనుక కుట్ర ఎవరిది అనేది మాత్రం ఓ ప్రశ్నలాగే మిగిలిపోయింది. రాంగోపాల్ వర్మ కూడా ఊహలకే వదిలేసాడు.


నటీనటుల పెర్ ఫామెన్స్
రాధ, రంగా పాత్రలు ఈ సినిమాకి కీలకం. ఈ పాత్రలను సందీప్ కుమార్ చేసాడు. సరిగ్గా రాధ, రంగాను పోలిన విధంగా సందీప్ ఉండటం, వారిలానే సందీప్ బాడీ లాంగ్వేజ్ మెయింటెన్ చేయడం ఆడియన్స్ ని థ్రిల్ కు గురి చేస్తుంది. ఆవేశపరుడైన రౌడీ, ఆలోచన ఉన్న రాజకీయనాయకుడు షేడ్స్ ఉన్న రంగా, రాధ పాత్రల్లో ఒదిగిపోయాడు సందీప్ కుమార్. రంగా భార్య రత్నకుమారి పాత్రను నైనా గంగూలీ చేసింది. పెళ్లికి ముందు అల్లరి పిల్లగా, పెళ్లయిన తర్వాత హుందాగా, భర్తకు ప్రాణభయం ఉందని తెలియగానే ఓ భార్యగా భయపడటంలాంటి షేడ్స్ ఉన్న పాత్ర రత్నకుమారిది. ఈ పాత్రను నైనా గంగూలీ బాగా చేసింది. నెహ్రు, గాంధీ, మురళీ పాత్రలను చేసిన నటీనటులు కూడా బాగా నటించారు. మురళీ పాత్ర చేసిన వంశీ చాగంటికి ప్లస్ మార్కులు పడతాయి. మిగతా నటీనటులందరూ తమ పాత్రల పరిధిమేరకు నటించారు.


సాంకేతిక వర్గం
యదార్థ ఘటనల ఆధారంగా సినిమాలు తీయడం రాంగోపాల్ వర్మకి వెన్నతో పెట్టిన విద్య. ఈ సినిమాతో మరోసారి ఆ విషయాన్ని నిరూపించాడు. మోహనరంగా జీవితం గురించి తెలిసిన వారి దగ్గర సేకరించిన విషయాలు, తను విజయవాడ రౌడీయిజంను, రాజకీయాలను గమనించిన అవగాహనతో ఈ సినిమాని తెరకెక్కించాడు రాంగోపాల్ వర్మ. ఇందుకోసం రాంగోపాల్ వర్మ తీసుకున్న కేర్, కథపై అతను వర్కవుట్ చేసిన విధానం స్ఫష్టంగా తెరపై కనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ, సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్స్. నిర్మాణపు విలువలు సూపర్బ్.


ఫిల్మీబజ్ విశ్లేషణ
వర్మ మార్క్ సినిమా ఇది. విజయవాడ రౌడీయిజం, రాజకీయాల గురించి తెలిసిన ప్రతి ఒక్కరికీ ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. ఇలాంటి సినిమాలు చేయడం చాలా రిస్క్, ఎంతో బ్యాలెన్స్ గా చేయాలి. లేకపోతే చల్లారిపోయిన పగలు, ప్రతీకారాలను ఇప్పుడు రెచ్చగొట్టినట్టు అవుతుంది. ఏ కత్తికైనా పదునెక్కువే. రంగా, రాధ, గాంధీ, నెహ్రు, మురళీ ఈ పాతల్రకు పాజిటివ్ యాంగిల్ ఉండటంతో పాటు నెగటివ్ యాంగిల్ కూడా ఉంది. ఏ వర్గాన్ని తక్కువ చేసి చూపించినా, ఎక్కువ చేసి చూపించినా అనవసరపు గొడవలకు దారితీసినట్టే. ఆయా వర్గాల మనోభావాలను దెబ్బతీసినట్టు అవుతుంది. కాబట్టి ఈ విషయాలను పూర్తిగా అవగాహన చేసుకుని ఈ సినిమాని తెరకెక్కించారు రాంగోపాల్ వర్మ. సినిమాలో ఎక్కడా ఇంటి పేరు వాడలేదు. కులం పేరు వాడలేదు. కేవలం పేర్లును మాత్రమే వాడుకుని, వ్యక్తుల మధ్య జరిగిన ఓ రక్తపాతంగానే ఈ సినిమాని ప్రొజెక్ట్ చేసారు వర్మ. చుట్టు పక్కల వారు చెప్పిన మాటలను వినడం వల్ల రెండు కుటుంబాలు ఎలాంటి మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని కళ్లకు కట్టినట్టు చూపించారు. రంగా, రాధ జీవితం గురించి, అప్పట్లో బెజవాడ నేపధ్యంలో జరిగిన ఘటనల గురించి తెలిసినవారికి కొన్ని విషయాలు సరిగ్గా చెప్పలేకపోయారనే ఫీలింగ్ కలుగుతుంది. పూర్తిగా ఈ విషయాలు తెలియనివారికి ఓ యాక్షన్ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. నిజ జీవితాలతో తెరకెక్కిన సినిమా కాబట్టి ఈ సినిమాని చూడటానికి ఆడియన్స్ ఆసక్తి కనబరుస్తారు. ఆ రకంగా ఈ సినిమాకి మంచి వసూళ్లు ఉంటాయి. కాబట్టి కమర్షియల్ గా కూడా ఈ సినిమా వర్కవుట్ అవుతుంది.


ఫైనల్ గా చెప్పాలంటే... వర్మ మార్క్ రాజకీయం ఈ 'వంగవీటి'. రాంగోపాల్ వర్మని అభిమానించే వారిని ఈ సినిమా డిస్పాయింట్ చేయదు.


ఫిల్మీబజ్ రేటింగ్ - 3.25/5Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. రీ ఎంట్రీకి ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నాడు. 'శ్రీమంతుడు' చిత్రం త ..

Read More !

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ్యాప్ తీసుకోకుండానే 151వ సినిమా చేయడా ..

Read More !

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కైనా సంతోషంగానే ఉంటుంది. కానీ ఆ అవకాశం ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా విడుదలై భారీ వసూళ్లను సాధించిన విష ..

Read More !

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధరమ్ తేజ్, బోయపాటి శ్రీను సినిమాలు చేస్ ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గతంలో శిరీష్ భరద్వాజను ప్రేమించి, ..

రాంచరణ్ కి నోటి దురుసు ఎక్కువ అని తెలుగు సినిమా పరిశ్రమలో ఓ టాక్ ఉంది. ఆ వార ..

'రక్తచరిత్ర' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన రాధికా ఆప్టే తనలో మంచి నట ..

బాలీవుడ్ లో భారీ సినిమాలను నిర్మిస్తూ, పంపిణీ చేస్తున్న ఈరోస్ ఇంటర్నేషనల ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో 10రోజుల్లో 'జనతా గ్యారేజ్' షూటింగ్ తో బిజీ అవ్వబోతున ..

మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ సినిమా అంటే భారీ అంచనాలు ఉం ..

సీన్ ఉంది కదా అని ఓవర్ గా బిల్డప్ ఇస్తే సీన్ సితార్ అవుతుంది. విలన్ గా దూసుక ..

'బాహుబలి ది కంక్లూజన్' చిత్రం విడుదలైన వెంటనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో రాజమౌ ..

ప్రిన్స్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందితే బాగుంటుందని ..

మెగాబ్రదర్స్ మధ్య విభేదాలు ఉన్నాయా లేవా అనే విషయం గురించి కొంతకాలం క్రిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ సినిమా అంటే ..

యంగ్ రెబల్ స్టార్ ఫ్రభాస్ తో 'మిర్చి' లాంటి హిట్ చిత్రం చేసిన తర్వాత కొరటాల ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో వచ్చే యేడాది ఓ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ సినిమా అంటే ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్, హీరోయిన్ రెజీనా ఘాటుగా ప్రేమించుకుంటున్నార ..

ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ జాబితాలో కొరటాల శివ పేర ..

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ..

రాజకీయనేత పరిటాల రవి చనిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది. కానీ ఆయన్ను అభిమ ..

'బాహుబలి 2' పూర్తయిన వెంటనే రాజమౌళి మరో భారీ బడ్జెట్ చిత్రం 'గరుడ' ను ఆరంభించ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ సినిమా అంటే ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Is Prabhas decision right to do Baahubali- what his fans says? 

Prabhas, Rana Baahubali movie trailor

Charmme Kaur starrer Jyothi Lakshmi Song Making video 

Raviteja Starrer Power (Song 4) 10Sec Promo

Nitin Nash Movie Opening Held at Annapurna Studio.

Read More !