View

మిస్టర్ మూవీ రివ్య్వూ

Friday,April14th,2017, 05:43 AM

చిత్రం - మిస్టర్
బ్యానర్ - ల‌క్ష్మి న‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్‌
నటీనటులు - వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, హెబ్బాపటేల్, ప్రిన్స్, నాజర్, ఆనంద్, మురళీశర్మ, నాగినీడు, హరీష్ ఉత్తమన్, నికితన్ ధీర్, పృథ్వీ, శ్రీనివాసరెడ్డి, సత్యంరాజేష్, తనికెళ్లభరణి, చంద్రమోహన్, సత్యకృఫ్ణ, సురేఖావాణి, తేజస్విని తదితరులు
కథ - గోపీమోహన్
డైలాగ్స్ - శ్రీధర్ సీపాన
సంగీతం - మిక్కి.జె.మేయర్
సినిమాటోగ్రఫీ - కె.వి.గుహన్
ఎడిటింగ్ - యం.ఆర్.వర్మ
నిర్మాతలు - నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మధు
స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - శ్రీను వైట్ల


ఆగడు, బ్రూస్ లీ చిత్రాలు ఫ్లాప్ అయిన నేపధ్యంలో డైరెక్టర్ శ్రీను వైట్లకు దొరికిన అవకాశం 'మిస్టర్'. ఈ సినిమాతో మళ్లీ తన కెరియర్ ని గాడిలో పెట్టుకోవాల్సిన బాధ్యత శ్రీను వైట్ల పై ఉంది. అలాగే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎంతో నమ్మకంతో ఈ సినిమా చేసాడు. కాబట్టి వరుణ్ తేజ్ కెరియర్ కి ఈ సినిమా ప్లస్ అయ్యేలా ఉండాలి. వరుస ఫ్లాప్ లతో, వివాదాలతో, పర్సనల్ ప్రాబ్లమ్స్ తో సతమతమవుతున్న సమయంలో శ్రీను వైట్లకు నిర్మాతలు నల్లమలుపు బుజ్జి, ఠాగూర్ మధు 'మిస్టర్' సినిమా చేసే అవకాశం ఇచ్చారు. సో... వారిని నిరాశపరచకుండా ఈ సినిమా ద్వారా లాభాలు చవి చూసేలా చేయాల్సిన అవసరం శ్రీను వైట్లకి ఉంది. మరి తనపై ఉన్న ఇన్ని బాధ్యతలను సక్రమంగా నెరవేర్చి, 'మిస్టర్' తో శ్రీను వైట్ల హిట్ కొడతాడా... తెలుసుకుందాం.


కథ
చై అలియాస్ పిచ్చయ్య నాయుడు (వరుణ్ తేజ్) తన పేరెంట్స్ తో కలిసి స్పెయిన్ లో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంటాడు. ఓ ఐదు రోజుల ట్రిప్ నిమిత్తం స్పెయిన్ వచ్చిన మీరా (హెబ్బా పటేల్) ని ఎయిర్ పోర్ట్ లో కలుసుకుంటాడు చై. అయితే తను పికప్ చేసుకోవాల్సిన ప్రియకు బదులు మీరాని పికప్ చేసుకున్నానని చై తెలుసుకునేలోపే ఆమెతో ప్రేమలో పడిపోతాడు. చై తో మీరా కూడా చాలా క్లోజ్ గా మెలుగుతుంది. చై ప్రేమ ఫలించాలని అతని తల్లిదండ్రులు కూడా కోరుకుంటారు. కానీ మీరా అప్పటికే ఓ వ్యక్తిని ప్రేమిస్తుందని తెలుసుకుని చై, అతని కుటుంబం షాక్ అవుతారు. ట్రిప్ పూర్తి చేసుకుని ఇండియా వెళ్లిపోయిన మీరా ఓ ఫైన్ మార్నింగ్ చై కి ఫోన్ చేసి, తను ప్రేమ సఫలమయ్యేలా లేదని చెబుతుంది. కట్ చేస్తే...

 

మీరా ప్రేమను గెలిపించాలనే ఆలోచనతో ఇండియా బయలుదేరి వెళతాడు చై. అక్కడ చంద్రముఖి (లావణ్య త్రిపాఠి) తో పరిచయం అవుతుంది. అనుకోని సంఘటన వల్ల చంద్రముఖితో చై కి నిశ్చతార్ధం జరుగుతుంది. మరోవైపు తను ప్రేమించిన వ్యక్తి కంటే అందరికీ సహాయపడాలనే మనస్తత్వం కలిగిన చై ని పెళ్లి చేసుకుంటే ఏ అమ్మాయి అయినా సుఖపడుతుందని తెలుసుకున్న మీరా ఫైనల్ గా చై ని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతుంది. మీరా, చంద్రముఖి ఇద్దరూ ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తాడు చై. ఇద్దరూ చై అంటే ఇష్టపడతారు. మరి చై నిర్ణయం ఏంటీ... తను ఫస్ట్ ప్రేమించిన మీరాని పెళ్లి చేసుకుంటాడా... అనుకోకుండా కలిసిన చంద్రముఖితో ఎంగేజ్ మెంట్ అయ్యింది కాబట్టి, ఆమెను పెళ్లి చేసుకుంటాడా తెలుసుకోవాలంటే సినిమా చూడాల్పిందే.


నటీనటుల పెర్ ఫామెన్స్
హ్యాపీ గోయింగ్ గై, ప్రేమించిన అమ్మాయిని వదులుకోవాల్సి రావడం, అనుకోకుండా కలిసిన అమ్మాయి వల్ల ఎదురైన సంఘటనలతో ఆమెతో ఎంగేజ్ మెంట్ జరగడం... ఇలా వేరియేషన్ ఉన్న చై పాత్రను ఈ సినిమాలో చేసాడు వరుణ్ తేజ్. గత సినిమాల కంటే యాక్టింగ్ లో ఇంఫ్రూవ్ అయినప్పటికీ, మెగా హీరో ట్యాగ్ ఉంది కాబట్టి ఇది సరిపోదు. ఇంకా కావాలి. డ్యాన్స్ పరంగా ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. చంద్రముఖి పాత్రను లావణ్య త్రిపాఠి బాగా చేసింది. ఆమెలో మంచి నటి ఉందని మరోసారి నిరూపితమయ్యింది. హెబాపటేల్ క్యారెక్టర్ బాగుంది. అయితే నటన పరంగా ఇంకా మెరుగవ్వాల్సి ఉంది. నాజర్, ఆనంద్, మురళీశర్మ, నాగినీడు తదితరులు తమ పాత్రల పరిధిమేరకు నటించారు. పృధ్వీ, శ్రీనివాసరెడ్డి, రఘుబాబు పాత్రలు కొంతమేర ఆడియన్స్ కి నవ్వులు పంచాయి. మిగతా నటీనటులందరూ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.


సాంకేతిక వర్గం
మిక్కి.జె.మేయర్ అందించిన పాటలు అంత ఇంప్రసివ్ గా లేవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫర్వాలేదు. ఎడిటింగ్ ఇంకా క్రిస్పీగా ఉండాలి. చాలా అన్ వాంటెడ్ సీన్స్ ఉన్నాయి. వాటిని కట్ చూస్తే సెకండాఫ్ కాస్త బెటర్ అయ్యుండేది. ఈ సినిమాకి ప్లస్ పాయింట్ సినిమాటోగ్రఫీ. ఫారిన్ లొకేషన్స్ ని అందంగా తన కెమెరా లో బంధించారు కె.వి.గుహన్. చక్కటి లైటింగ్ తో ప్రతి సీన్ విజువల్ గా చాలా బాగుంది. నిర్మాణపు విలువలు సూపర్బ్. ఇక డైరెక్టర్ శ్రీను వైట్ల విషయానికొస్తే.. చాలా వీక్ స్ర్కిఫ్ట్ తో ఈ సినిమా చేసాడు, ఫస్టాప్ బాగుంది. సెకండాఫ్ చాలా విసిగించింది. కన్వీన్సింగ్ గా చెప్పలేని సీన్స్ తో, ట్విస్ట్ లు ఇస్తున్నామనుకుని పసలేని సీన్స్ తో ఈ సినిమాని తెరకెక్కించారు శ్రీను వైట్ల.


ఫిల్మీబజ్ విశ్లేషణ
ఫస్టాఫ్ హీరో, హీరోయిన్ మధ్య సాగే సీన్స్ బాగున్నాయి. 'ఊపిరి' సినిమా పేరడీ సీన్స్, హీరో ఫ్యామిలీ సీన్స్ తో ఫస్టాప్ బాగుందనిపిస్తుంది. కానీ సెకండాఫ్ కి వచ్చేసరికి సినిమా ట్రాక్ తప్పింది. లావణ్య త్రిపాఠి కుటుంబానికి సంబంధించిన డ్రామా ఏ మాత్రం ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా లేదు సరికదా.. ఆ ఎపిసోడ్ ఆడియన్స్ సహనాన్ని పరీక్షిస్తుంది. ఏ మాత్రం న్యాచురల్ గా అనిపించదు. వేరే కథలోకి వెళ్లనట్టు అనిపిస్తుంది. ఎక్కువ మంది ఆర్టిస్ట్ లు, విలన్ బ్యాచ్ లు చేసే హంగామా అతికినట్టుగా ఉండదు. ఇక సురేఖావాణి హాస్పటల్ ఎపిసోడ్ మరో వింత. కథకు లింక్ లేని సీన్స్ తో ఈ ఎపిసోడ్ సాగుతుంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీని కన్ ఫ్యూజన్ సీన్స్, వీక్ స్ర్కీన్ ప్లే తో సినిమాని తెరకెక్కించి శ్రీను వైట్ల మరోసారి ఫెయిల్ అయ్యాడు. కొన్ని డైలాగ్స్ పేలినప్పటికీ, ఓవరాల్ గా ఫర్వాలేదనిపిస్తాయి. లవ్ స్టోరీ, లేదా ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్, రివేంజ్ డ్రామా.. ఏదో ఒకటి ఫిక్స్ అయ్యి సినిమా చేయాలి. ఇవన్ని కలిపి కమర్షియల్ ఫార్మెట్ లో సినిమా చేయాలన్న శ్రీను వైట్ల ప్రయత్రం పూర్తిగా విఫలమయ్యంది,


ఫైనల్ గా చెప్పాలంటే... ఈ మిస్టర్ ఆడియన్స్ సహనాన్ని పరీక్షించాడు...!


ఫిల్మీబజ్ డాట్ కామ్ రేటింగ్ - 2.25/5



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !