View

Maga Maharaju Movie Review

Friday,February27th,2015, 07:22 AM

చిత్రం - మగమహారాజు
బ్యానర్ - విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ
నటీనటులు - విశాల్, హన్సిక మోత్వాని, ప్రభు, సతీష్, నందిత, రమ్యకృష్ణ, ఐశ్వర్య, మధురిమ, సంతానం తదితరులు
సంగీతం - హిప్ హాప్ తమిళ
సినిమాటోగ్రఫీ - గోపి అమర్ నాధ్
ఎడిటింగ్ - ఎన్.బి.శ్రీకాంత్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - వడ్డి రామానుజం
నిర్మాత - ఖుష్భూ సుందర్, విశాల్, సుందర్.సి
దర్శకత్వం - సుందర్.సి
విడుదల తేదీ - ఫిబ్రవరి 27, 2015

పందెం కోడి, పొగరు తదితర అనువాద చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకుల్లో మంచి స్థానం సంపాదించుకున్నాడు విశాల్. రెగ్యులర్ కమర్షియల్ పాత్రలు చేయడంతో పాటు 'వాడు వీడు' వంటి చాలెంజింగ్ రోల్స్ కూడా చేసి, తనలో మంచి నటుడు ఉన్న విషయాన్ని నిరూపించుకున్నాడు. తమిళంలో అతను నటించిన 'ఆంబలై' చిత్రం 'మగ మహారాజు' పేరుతో నేడు తెరకొచ్చింది. తమిళంలో ఈ చిత్రం ఘనవిజయం సాధించిందనే వార్త వినిపించింది. మరి.. ఈ చిత్రం ఎలా ఉంది? తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుందా? ఆ విషయంలోకే వెళదాం...

à°•à°¥
కృష్ణ (విశాల్) రఫ్ అండ్ టఫ్ కుర్రాడు. తొలి చూపులోనే హన్సికను ప్రేమించడం మొదలుపెడతాడు కృష్ణ. తన భర్తకు వేరే అమ్మాయితో సంబంధం ఉందని తెలుసుకున్న కృష్ణ తల్లి తన భర్త నుంచి విడిగా ఉంటుంది. తనతో పాటు తన పెద్ద కొడుకు కృష్ణని తీసుకు వచ్చేస్తుంది. చిన్న కొడుకును మాత్రం తన భర్త దగ్గరే ఉంచుతుంది. ఓ సిట్యువేషన్ లో తన తండ్రి, తమ్ముడు, తన సవతి తల్లి కొడుకు అందరూ ఉన్న విషయం కృష్ణకి తెలుస్తుంది. తన కుటుంబం మొత్తాన్ని ఒకటిగా కలపడానికి కృష్ణ ప్రయత్నాలు మొదలుపెడతాడు. ఆ ప్రయత్నంలో విజయం సాధిస్తాడా? తను తొలి చూపులోనే ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా అనేదే ఈ సినిమా సెకండాఫ్.

నటీనటుల పెర్ ఫామెన్స్
విశాల్ రఫ్ అండ్ టఫ్ కుర్రాడు పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయాడు. కొన్ని ఎమోషనల్ సీన్స్ లో కూడా బాగా నటించాడు. నటుడిగా తన సత్తాను మరోసారి చాటుకున్నాడు. హన్సిక క్యూట్ గా ఉంది. కొన్ని సీన్స్ లో హాట్ గా కూడా ఉంది. సంతానం నవ్వులు పూయించాడు. రమ్యకృష్ణ అద్భుతంగా నటించింది. ఐశ్వర్య ఫర్వాలేదనిపించుకుంది. ప్రభు, మిగతా నటీనటులు తమ పాత్రల్లో ఒదిగిపోయారు.

సాంకేతిక వర్గం
పక్కా కమర్షియల్ స్టోరీ లైన్ ని సెలెక్ట్ చేసుకున్నారు డైరెక్టర్ సుందర్.సి. రొటీన్ కమర్షియల్ కథలను ఎలా తీస్తారో ఈ చిత్రాన్ని అలా తీశాడు. కొత్తదనం ఏమీ లేదు. డైలాగ్స్ బాగున్నాయి. పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్లస్ అయ్యాయి. ముఖ్యంగా మూడు పాటలు వినడానికే కాదు, విజువల్ గా కూడా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ కనువిందుగా ఉంది. కథకు సరిపడా బడ్జెట్ ని ప్రొవైడ్ చేయడం వల్ల ఎక్కడా కాంప్రమైజ్ అయినట్టు అనిపించదు.

ఫిల్మీబజ్ విశ్లేషణ
ఈ చిత్రం ఫస్టాప్ లో క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్, కామెడీ, రొమాన్స్, కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ తో సోసోగా సాగుతుంది. ఇంటర్వెల్ పాయింట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతుంది. కానీ, తదుపరి సన్నివేశాలు అంత ఆసక్తికరంగా అనిపించవు. సెకండాఫ్ లోని కొన్ని ఫ్యామిలీ సెంటిమెంట్ సీన్స్ ప్రేక్షకులను ఎమోషన్ కి గురి చేస్తాయి. అది మినహా చెప్పుకోదగ్గ అంశాలు ఏవీ ఉండవు.
డబ్బింగ్ సినిమా కాబట్టి... కాస్ట్యూమ్స్, కొన్ని సీన్స్ తమిళ నేటివిటీకి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తాయి. విశాల్ తన ప్రతి సినిమాని తమిళ్ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరించాలని కోరుకుంటున్నాడు కాబట్టి, ఇలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకుంటే తెలుగు మార్కెట్ ని ఇంకా పెంచుకునే అవకాశం ఉంటుంది. విశాల్ పాత్రను కమెడియన్ సంతానం పాత్ర డామినేట్ చేసే విధంగా ఉంది. అది ఓ మైనస్. ఇలాంటి కథలు బోల్డన్ని వచ్చాయి.

ఫైనల్ గా చెప్పాలంటే.. అరవ గోలతో సాగే ఈ రొటీన్ మాస్ మసాలా సినిమా తెలుగువాళ్లకి ఎక్కడం కష్టమే.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !