View

విన్నర్ మూవీ రివ్య్వూ

Friday,February24th,2017, 05:05 AM

చిత్రం - విన్నర్
నటీనటులు - సాయిధరమ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్, జగపతిబాబు, అనూప్ సింగ్, ముఖేష్ రుషి, వెన్నెల కిషోర్, అలీ, సోనియా అగర్వాల్, రఘుబాబు, ఫృధ్వీ తదితరులు
సంగీతం - ఎస్.ఎస్.తమన్
సినిమాటోగ్రఫీ - ఛోటా.కె.నాయుడు
ఎడిటింగ్ - ప్రవీణ్ పూడి
కథ - వెలిగొండ శ్రీనివాస్
మాటలు - అబ్బూరి రవి
బ్యానర్ - లక్ష్మీ న‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్‌
సమర్పణ - బేబి భవ్య
నిర్మాతలు - నల్లమలుపు బుజ్జి, ఠాగూర్ మధు
స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - గోపీచంద్ మలినేని


మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఇప్పటివరకూ రేయ్, పిల్లా నువ్వులేని జీవితం, తిక్క, సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ చిత్రాలు చేసాడు. ఈ ఐదు సినిమాల్లో రేయ్, తిక్క మినహా మిగతా మూడు సినిమాలు హిట్ అయ్యాయి. మెగా హీరోల పంధాలోనే కమర్షియల్ సినిమాలు చేస్తూ మాస్ హీరోగా ఎదగడానికి కృషి చేస్తున్నాడు సాయిధరమ్ తేజ్. కమర్షియల్ చిత్రాలను బాగా హ్యాండిల్ చేయగలడనే పేరు తెచ్చుకున్న గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ నటించిన చిత్రం 'విన్నర్'. ఈ రోజు (24.2..2017) ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదలయ్యింది. 30కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఆ అంచనాలకు తగ్గట్టు ఈ సినిమా ఉందా తెలుసుకుందాం.


కథ
మహేందర్ రెడ్డి (జగపతిబాబు) వందల కోట్లకు వారసుడు. దేశంలోనే బెస్ట్ జాకీ. తను ప్రేమించిన అమ్మాయిని తండ్రి (ముఖేష్ రుషి) అంగీకరించకపోవడంతో ఆస్థిని వదులుకుని ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని సెటిల్ అవుతాడు మహేందర్ రెడ్డి. కొడుకు సిద్ధార్ధ్ పుట్టిన తర్వాత భార్య చనిపోవడంతో కొడుకును ప్రేమగా పెంచుకుంటూ ప్రాణమంతా కొడుకుపైనే పెట్టుకుని బ్రతుకుతుంటాడు మహేందర్ రెడ్డి. ఓ వైపు మహేందర్ రెడ్డి తండ్రి బిజినెస్ భారీ నష్టాల్లో కూరుకుపోతుంది. ఆ బిజినెస్ కాపాడటం ఒక్క మహేందర్ రెడ్డి వల్లే అవుతుందని, కాబట్టి కొడుకును తిరిగి తెచ్చుకోవడం తప్ప వేరే గత్యంతరంలేదని పార్టనర్స్ తేల్చి చెప్పడంతో మహేందర్ రెడ్డిని తిరిగి తన వద్దకు తీసుకువస్తాడు ముఖేష్ రుషి. అయితే సిద్ధార్ధ్ ని తండ్రికి దూరం చేస్తాడు. బిజినెస్, రేసుల వల్ల తన తండ్రి తనకు దూరమయ్యాడన్న కోపం.. తాత ముఖేష రుషి కావాలనే తనను తండ్రికి దూరం చేస్తున్నాడని తెలుసుకోలేని చిన్నారి సిద్ధార్ధ్ తండ్రిపై కోపం పెంచుకుని ఇంటి నుంచి వెళ్లిపోతాడు. కట్ చేస్తే...


కొడుకు ఇంటి నుంచి దూరమై 20 యేళ్లు గడిచినా, ఖచ్చితంగా కొడుకు తిరిగి వస్తాడనే నమ్మకంతో మహేందర్ రెడ్డి హోమాలు, సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తుంటాడు. పెరిగి పెద్దవాడైన సిద్ధార్ధ్ ఓ పేపర్ కి క్రియేటివ్ హెడ్ గా వర్క్ చేస్తుంటాడు. తొలి చూపులోనే సితార (రకుల్ ప్రీత్ సింగ్) ప్రేమలో పడిపోతాడు సిద్ధార్ధ్. అతని ప్రేమను సితార తిరస్కరిస్తుంది. కానీ ఓ సందర్భంలో సిద్ధార్ధ్ తో కూతురు ప్రేమలో పడిందనే అపోహతో సితార తండ్రి రాజీవ్ రెడ్డి (సురేష్) తన ఫ్రెండ్ కొడుకు (ఠాగూర్ అనూప్ సింగ్) తో పెళ్లి ఫిక్స్ చేస్తాడు. ఆ పెళ్లి కొడుకు తన తండ్రిని మోసం చేస్తూ, తన స్థానంలో తన ఇంట్లోకి వచ్చాడని తెలుసుకున్న సిద్ధార్ధ్ షాక్ అవుతాడు. అసలు ఆ మోసానికి కారణమేంటీ... తాత వల్లే తను తండ్రికి దూరమయ్యాయని సిద్దార్ధ్ తెలుసుకుంటాడా... తన ఇంట్లో ఉన్న కుర్రాడు తన కొడుకు కాదని మహేందర్ రెడ్డి తెలుసుకుంటాడా.. రేసులంటేనే ఇష్టంలేని సిద్ధార్ధ్ ఏకంగా హార్స్ రేసులో పాల్గొనడానికి ఎందుకు అంగీకరిస్తాడు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.


నటీనటుల పర్ ఫామెన్స్
సాయిధరమ్ తేజ్ తన గత సినిమాల్లోలానే జోష్ గా నటించాడు. హార్స్ రేస్ లాంటి బ్యాక్ డ్రాప్ తో సినిమా చేయాలంటే బాడీ లాంగ్వేజ్, హార్స్ రైడింగ్ తెలిసుండటం చాలా అవసరం. ఆ పరంగా సాయిధరమ్ తేజ్ బాడీ బిల్డప్ చేసుకున్నాడు. హార్స్ రైడ్ చేసాడు. రకుల్ ప్రీత్ సింగ్ స్పోర్ట్స్ గర్ల్ గా నటించింది. చక్కటి పిజిక్ తో బాగుంది. తండ్రిగా జగపతిబాబు, తాతగా ముఖేష్ రుషి తమ పాత్రలకు న్యాయం చేసారు. సింగం సుజాతగా ఫృధ్వీ, పద్మగా వెన్నెల కిషోర్, హార్స్ మెన్ బాబుగా అలీ కొన్ని సీన్స్ లో నవ్వించారు. మిగతా నటీనటులందరూ తమ పాత్రల పరిధిమేరకు నటించారు. అనసూయ ఐటమ్ పాట చేసింది. అనసూయకు ఈ ఐటమ్ పాట పెద్ద ప్లస్ అయ్యే అవకాశంలేదు.


సాంకేతిక వర్గం
వెలిగొండ శ్రీనివాస్ ఇచ్చిన స్టోరీ లైన్ బాగుంది. కానీ ఆ స్టోరీకి గ్రిప్పింగ్ స్ర్కీన్ ప్లే ఇవ్వలేకపోయాడు డైరెక్టర్ గోపీచంద్ మలినేని. లవ్, సెంటిమెంట్, యాక్షన్ సన్నివేశాలకు స్కోప్ ఉన్నప్పటికీ డైరెక్టర్ గోపీచంద్ మలినేని వాటిపై ఎక్కువ దృష్టి పెట్టలేదు. బలమైన సీన్స్ సమకూర్చుకోలేకపోవడం ఈ సినిమాకి మైనస్. డైలాగ్స్ బాగున్నాయి. అక్కడక్కడ పంచ్ లు పేలాయి. పాటలు ఫర్వాలేదు. రీ-రికార్డింగ్ బాగుంది. నిర్మాణపు విలువలు బాగున్నాయి.


ఫిల్మీబజ్ విశ్లేషణ
హార్స్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ కొత్తగా ఉంది. కానీ ఆ బ్యాక్ డ్రాప్ కి సరిపడా బలమైన సీన్స్ పడకపోవడం నిరాశ కలిగిస్తుంది. సాయిధరమ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ మధ్య సాగే లవ్ సీన్స్ కూడా పేలవంగా ఉంటాయి. తండ్రి జగపతిబాబు, కొడుకు సాయిధరమ్ తేజ్ మధ్య సెంటిమెంట్స్ సీన్స్ మరింత బలంగా ఉంటే ఆడియన్స్ కి ఈ స్టోరీ లైన్ బాగా కనెక్ట్ అయ్యుండేది. ఫస్టాప్ అంతా ఫాస్ట్ గా సాగిసోతుంది. సెకండాఫ్ లో పెద్దగా ట్విస్ట్ లు లేకపోవడం, ఆసక్తికరమైన సీన్స్ లేకపోవడంతో క్లయిమ్యాక్స్ కోసం ఎదురుచూస్తారు. క్లయిమ్యాక్స్ చిన్నపాటి డ్రామాతో ముగుస్తుంది.


ఫైనల్ గా చెప్పాలంటే...
రొటీన్ కమర్షియల్ సినిమా. అంతకుమించి ఈ సినిమాలో ఏమీలేదు. ముఖ్యంగా కొత్తదనం కోరుకునేవారికి ఈ సినిమా నిరాశ మిగులుస్తుంది. రోటీన్ కమర్షియల్ సినిమాలను ఆస్వాదించే ఆడియన్స్ కి మాత్రం ఈ 'విన్నర్' కనెక్ట్ అవుతాడు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !