View

రక్షకభటుడు ట్రైలర్ లాంఛ్ విశేషాలు

Tuesday,March28th,2017, 10:17 PM

రక్ష ఓ సస్పెన్స్‌ హర్రర్‌... జక్కన్న మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌... కేవలం రెండు చిత్రాలతోనే దర్శకుడుగా తన సత్తాని ప్రూవ్‌ చేసుకుని ఆల్‌ కైండ్‌ ఆఫ్‌ మూవీస్‌ చేయగల దర్శకుడుగా పేరు తెచ్చుకున్న వంశీకృష్ణ ఆకెళ్ల ప్రస్తుతం 'రక్షకభటుడు' వంటి డిఫరెంట్‌ టైటిల్‌తో ఫాంటసీ ధ్రిల్లర్‌ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రిచాప‌నై, బ్ర‌హ్మానందం, బాహుబ‌లి ప్ర‌భాక‌ర్‌, బ్ర‌హ్మాజీ, సుప్రీత్‌(కాట్రాజు). అదుర్స్ ర‌ఘు, ధ‌న‌రాజ్‌ ప్రధాన పాత్రల్లో సుఖీభవ మూవీస్‌ పతాకంపై ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ఎ. గురురాజ్‌ నిర్మిస్తున్న స్టైలిష్‌ ఫాంటసీ చిత్రం 'రక్షక భటుడు` ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఏప్రిల్ 7న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. మంగళవారం (28.3.2017) ఈ చిత్రం ట్రైలర్ ని హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో విడుదల చేసారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో...


నిర్మాత ఎ.గురురాజ్ మాట్లాడుతూ - ''నటుడిగా చిత్ర పరిశ్రమలో స్థిరపడాలనే నా కోరిక నెరవేరలేదు. నిర్మాతగా రీ ఎంట్రీ ఇచ్చాను. నిర్మాతగా సక్సెస్ అవుతాననే నమ్మకం ఉంది. ద‌ర్శ‌కుడు వంశీకృష్ణ‌గారు క‌థే హీరోగా ర‌క్ష‌క‌భ‌టుడు చిత్రాన్ని అద్భుతంగా తెర‌కెక్కించారు. మ‌ల్హ‌ర్‌భ‌ట్ జోషిగారు ప్ర‌తి సీన్‌ను ఎంతో అందంగా చూపించారు. అలాగే డ్రాగ‌న్ ప్ర‌కాష్‌గారు ఎక్స‌లెంట్ ఫైట్స్ కంపోజ్ చేశారు. రిచా ప‌న‌య్ లేడీ టైగ‌ర్‌లా సినిమాను అనుకున్న స‌మ‌యంలో పూర్తి చేయ‌డానికి స‌పోర్ట్ చేసింది. అర‌కు లోయ నేప‌థ్యంలో రూపొందించిన ఈ సినిమాలో దేవుడు ఓ దెయ్యాన్ని కాపాడుతాడు..అదేంటో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ర‌క్ష‌క‌భటుడు సినిమాను ఏప్రిల్ 7న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం'' అన్నారు


ద‌ర్శ‌కుడు వంశీకృష్ణ ఆకెళ్ళ మాట్లాడుతూ - ''అండర్‌ ప్రొడక్షన్‌లోనే ఈ చిత్రంపై సర్వత్రా పాజిటివ్‌ బజ్‌ ఏర్పడింది. ఫస్ట్‌ పోస్టర్‌, టీజర్‌కి ట్రెమెండ‌స్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ఏప్రిల్ 7న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. సాధార‌ణంగా పోలీస్‌ను 'రక్షక భటుడు` అంటుంటాం. ఈ చిత్రంలో ఎవర్ని ఎవరు ప్రొటెక్ట్‌ చేస్తారు? ఎందుకు ప్రొటెక్ట్‌ చేయాలన్నదే మా కాన్సెప్ట్‌. ఆ ప్రొటెక్ట్‌ చేసే ఎనర్జీయే 'రక్షక భటుడు'. కాబట్టి సినిమాకి ఆ టైటిల్‌ పెట్టాం. నా ర‌క్ష‌, జ‌క్క‌న్న చిత్రాలకంటే ఈ సినిమా బెస్ట్ మూవీ అవుతుంద‌ని చెప్ప‌గ‌ల‌ను. నిర్మాత గురురాజ్ గారు కుటుంబ పెద్ద‌లా సినిమా బాగుండాల‌ని కోరుకున్నారు. ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వ‌చ్చి సినిమా పెద్ద విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నాను'' అని చెప్పారు


'మా' అధ్యక్షుడు శివాజీ రాజా మాట్లాడుతూ - ''ర‌క్ష‌కభ‌టుడు సినిమాకు ఆ ఆంజ‌నేయ స్వామి ర‌క్ష ఎప్పుడూ ఉంటుంది. గురురాజ్ న‌టుడుగా సినిమా రంగంలోకి వ‌చ్చాడు. కానీ ఇప్పుడు నిర్మాత‌గా రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి నిర్మాత‌గా గురురాజ్ హీరోలా నిల‌బ‌డాల‌ని కోరుకుంటున్నాను'' అన్నారు


కె.ఎల్‌.గ్రూప్ ఛైర్మ‌న్ నాగేశ్వ‌ర‌రెడ్డి మాట్లాడుతూ - ''క‌థ విన‌గానే అందులో పాయింట్ నాకు బాగా న‌చ్చింది. సినిమా పెద్ద హిట్ అవుతుంద‌ని ఆనాడే ఉహించాను. ట్రైల‌ర్ చూస్తుంటే, నా న‌మ్మ‌కం నిజ‌మవుతుంద‌నిపిస్తోంది'' అని చెప్పారు.


శేఖ‌ర్ చంద్ర మాట్లాడుతూ - ''క‌థ విన‌గానే చాలా ఎగ్జ‌యిట్ అయి సినిమా చేశాను. ప‌ర్ థ్రిల్ల‌ర్ స‌బ్జెక్ట్ ఇది. అందరికీ ఈ సినిమా నచ్చుతుంది'' అన్నారు


మ‌ల్హ‌ర్ భ‌ట్ జోషి మాట్లాడుతూ - ''సినిమా అవుట్ పుట్ చాలా బాగా వ‌చ్చింది. అవ‌కాశం ఇచ్చిన వంశీకృష్ణ‌, గురురాజ్‌గారికి థాంక్స్‌'' అన్నారు


రిచా ప‌న‌య్ మాట్లాడుతూ - ''ఈ సినిమాలో న‌టించ‌డం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. గురురాజ్‌గారు, వంశీకృష్ణ‌గారు ఇచ్చిన ఇన్‌స్పిరేష‌న్‌తోనే సినిమాను అనుకున్న విధంగా పూర్తి చేయ‌గ‌లిగాం'' అన్నారు


ఈ కార్య‌క్ర‌మంలో రాంజ‌గ‌న్‌, అదుర్స్ ర‌ఘు, కృష్ణేశ్వ‌ర్‌, ధ‌న‌రాజ్‌, జ్యోతి, ఎడిట‌ర్ అమ‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.


రిచాప‌నై, బ్ర‌హ్మానందం, బాహుబ‌లి ప్ర‌భాక‌ర్‌, బ్ర‌హ్మాజీ, సుప్రీత్‌(కాట్రాజు). అదుర్స్ ర‌ఘు, ధ‌న‌రాజ్‌, నందు, చిత్రం శ్రీను,స‌త్తెన్న‌, జ్యోతి, కృష్ణేశ్వర్‌రావు, మ‌ధు ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీః మ‌ల్హ‌ర్ భ‌ట్ జోషి, ఆర్ట్ః రాజీవ్‌నాయ‌ర్‌, ఎడిటింగ్ః అమ‌ర్ రెడ్డి, ఫైట్స్ః డ్రాగ‌న్ ప్ర‌కాష్‌, ప్రొడ్యూస‌ర్ః ఎ.గురురాజ్‌, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వంః వంశీకృష్ణ ఆకెళ్ల‌



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. రీ ఎంట్రీకి ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నాడు. 'శ్రీమంతుడు' చిత్రం త ..

Read More !

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ్యాప్ తీసుకోకుండానే 151వ సినిమా చేయడా ..

Read More !

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కైనా సంతోషంగానే ఉంటుంది. కానీ ఆ అవకాశం ..

Read More !

Gossips

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

500, 1000 నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటన బయటికి రాగానే టాలీవుడ్ కి చెందిన ఓ స ..

నందమూరి హీరో కళ్యాణ్ రామ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో ఓ మల ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం వస్తే.. ఎగిరి గంతేసి ..

'జనతాగ్యారేజ్' చిత్రం తర్వాత ఎన్టీఆర్ చేయబోయే తదుపరి సినిమా ఏంటీ.. ఎవరి దర్ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Aadi Starrer Nuvve Theatrical Trailer

Devadasi Motion Poster

Pratikshanam 1min Trailer

Mahesh babu, A.R.Murugadoss SPYDER New Teaser

Read More !