filmybuzz
filmybuzz

View

సొంత బ్యానర్ లో నాగశౌర్య సినిమా.. ఏప్రిల్ 10న ప్రారంభం!

Wednesday,March29th,2017, 10:02 PM

"ఊహ‌లు గుస‌గుస‌లాడే", "దిక్కులు చూడ‌కు రామ‌య్య‌", "ల‌క్ష్మిరావే మా ఇంటికి", "క‌ళ్యాణ‌వైభోగం"," జ్యోఅచ్చుతానంద‌" లాంటి విభిన్న క‌థాంశాల‌తో విజ‌యాలు సాధించిన నాగ‌శౌర్య హీరొగా, క‌న్న‌డ‌ లో "కిరిక్ పార్టి" అనే చిత్రంలో త‌న క్యూట్ ఫెర్‌ఫార్మెన్స్ తో అంద‌రి మ‌న‌సులు దొచుకున్న ర‌ష్మిక మండ‌న్న‌ హీరోయిన్ గా తెలుగుకి ప‌రిచ‌యం చేస్తూ, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ వ‌ద్ద ద‌ర్శ‌క‌త్వ శాఖ లో ప‌నిచేసిన వెంకి కుడుముల ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ, ఐరా క్రియోష‌న్స్ బ్యాన‌ర్ పై నిర్మాత‌లు ఉషా మూల్పూరి, శంక‌ర ప్ర‌సాద్ మూల్పూరి లు సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ గా కాలేజి బ్యాక్ డ్రాప్ లో జ‌రిగే ఈ చిత్రం ఏప్రిల్ 10న ప‌లువురు రామానాయుడు స్టూడియోస్ లో ఘ‌నంగా పూజాకార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మవుతుంది. తెలుగు ప్రేక్ష‌కులంద‌రికి ఉగాది శుభాకాంక్ష‌లు తెలుపుతు ఈ చిత్ర వివరాలు నిర్మాత‌లు తెలియ‌జేసారు.


ఈ సంద‌ర్బంగా నిర్మాత‌ల్లో ఒక‌రైన శంక‌ర ప్ర‌సాద్‌ మూల్పూరి మాట్లాడుతూ - "మా అబ్బాయి నాగ‌శౌర్య ని తో చిత్రాన్ని నిర్మించాల‌ని ఎప్ప‌టినుంచో అనుకుంటున్నాము. త్రివిక్ర‌మ్ గారి అసోసియేట్ వెంకి కుడుముల చెప్పిన క‌థ మాకు న‌చ్చి మా బ్యాన‌ర్ లోనే చేయ్యాల‌ని నిర్ణ‌యించుకున్నాము. వెంకి మాకు చాలాకాలం నుండి సుప‌రిచితుడు కావ‌టం అత‌ని టాలెంట్ ని మేము నమ్మి ఈచిత్రాన్ని నిర్మిస్తున్నాము. అలాగే క‌థ‌కి స‌రిపోయేలా హీరోయిన్ ని ఎంచుకోవాలనుకుంటున్న స‌మ‌యంలో క‌న్న‌డ‌లో అతిపెద్ద విజ‌యాన్ని సాధించిన కిరిక్ పార్టి ఫేం రష్మిక మండ‌న్న‌ ఎంచుకున్నాము. అప్ప‌టికే ద‌క్షిణాది సూప‌ర్‌స్టార్స్ ఆమె డేట్స్ కొసం ఎంక్వ‌రీలు స్టార్ట‌య్యాయి. మా సొంత బ్యాన‌ర్ లో నాగ‌శౌర్య ని పెట్టి చిత్రాన్ని నిర్మిస్తున్నాము అంటే అది మంచి విజ‌యాన్ని సాధించాలి నాగ‌శౌర్య‌కి కెరీర్ మ‌రో మెట్టు ఎక్కెలా వుండాలి అలాగే మా బ్యాన‌ర్ కి ఇది మంచి శుభారంభం కావాలి అనేది మ‌న‌సులో గ‌ట్టి సంక‌ల్పం పెట్టుకుని చేస్తున్నాము. ఏవిష‌యంలో కూడా కాంప్ర‌మైజ్ కాకుండా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తాం. కాలెజి బ్యాక్ డ్రాప్ లో వెరీ గుడ్ ల‌వ్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కిస్తున్నాము. ఏప్రిల్ 10 న ప‌లువురు ఈ చిత్రం రామానాయుడు స్టూడియోస్ పూజాకార్యక్రమాలతో ప్రారంభం కానుంది. మ‌రిన్ని వివరాలు ఆ రోజు తెలియ‌జేస్తాం"అని అన్నారు


ద‌ర్శ‌కుడు వెంకి కుడుముల మాట్లాడుతూ - " నాకు ఇంత మంచి అవ‌కాశాన్ని ఇచ్చిన హీరో నాగ‌శౌర్య గారికి , నిర్మాత‌లు ఉషా ముల్పూరి, శంక‌ర‌ప్ర‌సాద్ ముల్పూరి గారికి ధ‌న్య‌వాదాలు. నాగ‌శౌర్య కి జంట‌గా ర‌ష్మిక మండ‌న్న‌ న‌టిస్తుంది. హీరో నాగ‌శౌర్య లుక్ అండ్ క్యార‌క్ట‌రైజేష‌న్ కొత్త‌గా వుంటుంది. ప్రేక్ష‌కులు నాగ‌శౌర్య ని కొత్త‌గా చూస్తారు. ఫ్యామిలి అంతా వ‌చ్చి చ‌క్క‌గా న‌వ్వుకునే మంచి కామెడి ఈ చిత్రంలో వుంటుంది. ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 10 న రామానాయుడు స్టూడియోస్ లో పూజాకార్య‌క్ర‌మాల‌తో ప్రారంభం కానుంది. 


ఈ చిత్రానికి సంగీతం- సాగ‌ర్ మ‌హ‌తి,
సినిమాటొగ్ర‌ఫి- సాయి శ్రీరామ్‌.
నిర్మాత‌లు- ఉషా ముల్పూరి, శంక‌ర ప్ర‌సాద్ ముల్పూరి
ద‌ర్శ‌క‌త్వం- వెంకి కుడుముల‌Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసి ..

Read More !

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ..

Read More !

Gossips

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Moodu Puvvulu AAru Kaayalu Teaser

#U Movie Theatrical Trailer

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

Read More !