View

గల్ఫ్ లోగోను ఆవిష్కరించిన సుకుమార్.. అవేర్ నెస్ క్రియేట్ చేసే చిత్రం!

Friday,March31st,2017, 05:37 AM

పలు విజయవంతమైన చిత్రాలను రూపొందించిన దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి తాజాగా 'గల్ఫ్' అనే చిత్రాన్నితెరకెక్కిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా లోగో ను ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...


సుకుమార్: సునీల్ కుమార్ రెడ్డి గారు నాకు 'ఒక రొమాంటిక్ క్రైమ్ కథ' ద్వారా పరిచయం. ఆ తర్వాత అయన దర్శకత్వంలోనే తెరకెక్కిన 'గంగపుత్రులు' ​సినిమాను ​చూడడం జరిగింది. నేను ఒక రొమాంటిక్ క్రైమ్ కథ ను చూసి షాక్ అయ్యాను. ఆ సినిమా నాకు చాలా కొత్తగా అనిపించింది. ​ఇదే విషయం నేను గతంలో ఒక ఇంటర్వ్యూ లో కూడా చెప్పడం జరిగింది. తెలుగు లో అసలు ఇలాంటి సినిమా ఒకటి తీసి హిట్ చేయొచ్చు అనేది చాలా కొత్త విషయం. తెలుగు లో వచ్చే అతి తక్కువ కొత్త కథల్లో ఆ సినిమా ఒకటి. అప్పటినుండి సునీల్ గారిమీద నాకు అభిమానంపెరిగింది. అయన రూపొందించే అన్నీ సినిమాలు చూడకపోయినా.. అయన ఏ సినిమా తీస్తున్నారు అనేది మాత్రం​ ఖచ్చితంగా ఫాలో​ అవుతాను. ఒక రొమాంటిక్ క్రైమ్ కథ సినిమాను హిందీలో తీస్తున్నారా లేదా అని ఆయనను అడిగాను​.. ​ ఒకవేళ ఆయన కనుక హిందీలో తెరకెక్కించకపోతే నేను ఆ సినిమాను రీమేక్ చేయాలని అనుకున్నాను. ఆయనలో నాకు నచ్చిన విషయం ఏంటంటే.. మేమందరం ఒక ఫ్లో లో..ఒరవడిలో కొట్టుకుపోతున్నాం. అయన అలా కాదు. సినిమాను ఎంజాయ్ చేసే వ్యక్తి. ఒక పాయింట్ తీసుకుని.. దాని మీద పూర్తిగా రీసెర్చ్ చేసి, క్షుణ్ణంగా అర్థం చేసుకొని ఆ తర్వాతే అయన సినిమాను తెరకెక్కిస్తారు. అదే రియల్ ఫిలిం మేకింగ్. అదే నిజమైన సంతృప్తినిచ్ఛే ప్రాసెస్. అదేవిధంగా సునీల్ గారు ఇపుడు గల్ఫ్ లో ఉన్న పాతిక లక్షల మంది తెలుగువారు.. వారి జీవితాలపై రీసెర్చ్ చేసి 'గల్ఫ్' అనే సినిమాను రూపొందించారు. అందుకోసం గల్ఫ్ దేశాలకు వారిని కలిసి.. వాళ్ళు అక్కడ ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు..వారు అలాంటి పరిస్థితుల్లో ఉంటూ తమ కుటుంబ సభ్యులకు డబ్బు పంపిస్తూ ఉంటారు. ఇక్కడ వాళ్ళ కుటుంబాలు ఎలా ఉన్నాయి? ఇవన్నీ ఆయన అధ్యయనం చేయడం జరిగింది. అంతే కాదు.. మా ఊర్లో 40% మంది ఉపాథి కోసం గల్ఫ్ బాట పట్టారు. వాళ్ళు తమ కుటుంబాలకు డబ్బు పంపడం.. కుటుంబాలకు అండగా నిలవడం ఇవన్నీ నేను దగ్గరనుండి చూశాను. మా ఇంటి చుట్టూ ఇలాంటివి 5 కుటుంబాలు ఉన్నాయి. సునీల్ గారు ఈవిధమైన కాన్సెప్ట్ తో చాలా మంచి సినిమా తీయడం జరిగింది. ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గల్ఫ్ లో ఉండేవారి జీవితాలపై ఈ సినిమాను తీశారు కాబట్టి వారందరూ ఈ సినిమాను ప్రమోట్ చేయాలని కూడా కోరుతున్నాను. పులగం చిన్నారాయణ గారు నాకు చిరకాలమిత్రులు. అయన జర్నలిస్ట్ గా పనిచేస్తూ పుస్తకాలు రాస్తుంటారు. పుస్తకాలు రాసే వ్యక్తికి మాటలు రాయడం పెద్ద విషయం కాదు. నేను అదే విషయం ఆయనకు చాలా సార్లు చెప్పాను. ఇప్పుడు అయన ఈ సినిమాకు మాటల రచయిత. ఆయన ఉన్నత స్థానానికి ఎదగాలి .


'గల్ఫ్' దర్శకుడు​ సునీల్ కుమార్ రెడ్డి : ఈ రోజు మా 'గల్ఫ్' సినిమా లోగో ను ఆవిష్కరించిన మిత్రుడు, శ్రేయోభిలాషి సుకుమార్ గారికి ధన్యవాదాలు. 'గల్ఫ్' షూటింగ్ పూర్తయింది. గల్ఫ్ జీవితానికి సంబంధించిన కంప్లీట్ రీసెర్చ్ బేస్డ్ సినిమా ఇది. ఒక అందమైన ఎంటర్టైనింగ్ లవ్ స్టోరీతో పాటు దాని చుట్టూ ఉండే సోషల్ ఇష్యూస్.. వాటికి వినోదాన్ని మేళవించి ఒక అవేర్ నెస్ క్రియేట్ చేసే ప్రయత్నం ఇది. అతి త్వరలో మీముందుకు రాబోతోంది.


'గల్ఫ్' నిర్మాత రవీంద్ర బాబు : ఈ రోజు మా శ్రావ్య ఫిలిమ్స్ బ్యానర్ పై తెరకెక్కిన గల్ఫ్ సినిమా లోగో ను ఆవిష్కరించిన డైరెక్టర్ సుకుమార్ గారికి కృతఙ్ఞతలు. దర్శకుడు సునీల్ గారితో శ్రావ్య ఫిలిమ్స్ బ్యానర్​ కు​ ఇది 14 వ సినిమా. గల్ఫ్ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. ప్రస్తుతం ​పోస్ట్​ ప్రొడక్షన్ లో ఉంది. సినిమా అవుట్ ఫుట్ చాలా బాగుంది. గల్ఫ్ సినిమాను చూసి అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను.


'గల్ఫ్' ​​​మాటల రచయిత ​పులగం చిన్నారాయణ: సునీల్ కుమార్ రెడ్డి గారితో ఈ సినిమా ప్రయాణం ఒక విచిత్రమైన అనుభవం. అయన ఒక డైరెక్టర్ గా.. నేనొక డైలాగ్ రైటర్ అన్నట్టుగా కాకుండా ఇద్దరు జర్నలిస్టులు చేసిన ఒక సిన్సియర్ ప్రయత్నం ఈ 'గల్ఫ్' సినిమా. ఆంధ్ర, తెలంగాణ ల నుండి గల్ఫ్ కు వలస వెళ్లిన యువతీ యువకుల జీవితాల్లోని చీకటిని, తడిని, ప్రేమని.. చాలా స్వచ్ఛంగా నగ్నంగా ఆవిష్కరించే సినిమా ఇది. గల్ఫ్ ఖఛ్చితంగా అందరినీ ఆకట్టుకునే సినిమా అవుతుంది. ఇది ఆర్ట్ ఫిలిం లాంటిది కాదు..హార్ట్ ఫిలిం. ఇలాంటి మంచి అవకాశాన్ని కల్పించిన సునీల్ కుమార్ రెడ్డిగారికి కృతఙ్ఞతలు. ​



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. రీ ఎంట్రీకి ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నాడు. 'శ్రీమంతుడు' చిత్రం త ..

Read More !

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ్యాప్ తీసుకోకుండానే 151వ సినిమా చేయడా ..

Read More !

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కైనా సంతోషంగానే ఉంటుంది. కానీ ఆ అవకాశం ..

Read More !

Gossips

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

500, 1000 నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటన బయటికి రాగానే టాలీవుడ్ కి చెందిన ఓ స ..

నందమూరి హీరో కళ్యాణ్ రామ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో ఓ మల ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం వస్తే.. ఎగిరి గంతేసి ..

'జనతాగ్యారేజ్' చిత్రం తర్వాత ఎన్టీఆర్ చేయబోయే తదుపరి సినిమా ఏంటీ.. ఎవరి దర్ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Aadi Starrer Nuvve Theatrical Trailer

Devadasi Motion Poster

Pratikshanam 1min Trailer

Mahesh babu, A.R.Murugadoss SPYDER New Teaser

Read More !