filmybuzz
filmybuzz

View

డైరెక్టర్ మారుతి చేతుల మీదుగా రిలీజ్ అయిన ర‌క్ష‌క‌భటుడు సాంగ్!

Tuesday,April25th,2017, 01:07 AM

సుఖీభవ మూవీస్‌ పతాకంపై ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ఎ. గురురాజ్‌ నిర్మాత‌గా రూపొందుతోన్న ఫాంట‌సీ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ ర‌క్ష‌క‌భటుడు. రిచాపనై, బ్ర‌హ్మానందం, బాహుబ‌లి ప్ర‌భాక‌ర్‌, బ్ర‌హ్మాజీ, సుప్రీత్‌(కాట్రాజు). అదుర్స్ ర‌ఘు, ధ‌న‌రాజ్‌ ప్రధాన పాత్రల్లో న‌టిస్తున్నారు. ర‌క్ష‌, జ‌క్క‌న వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల త‌ర్వాత వంశీకృష్ణ ఆకెళ్ళ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలోని ఓ పాటను ప్రసాద్ ల్యాబ్ లో డైరెక్టర్ మారుతి చేతుల మీదుగా విడుదలయ్యింది.


ఈ సందర్భంగా మారుతి మాట్లాడుతూ - ''జక్కన్న లాంటి సక్సెస్ ఫుల్ చిత్రం తర్వాత స్టార్ హీరోస్ తో సినిమా చేయకుండా, కథను నమ్మి వంశీ కృష్ణ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఆంజనేయ స్వామి గెటప్ చూసిన తర్వాత క్యూరియాసిటీ బాగా పెరిగింది. ఈ చిత్ర నిర్మాత చాలా హ్యాపీగా ఉన్నారు. దాంతోనేఈ సినిమా ఎంత బాగా వచ్చిందో అర్ధం చేసుకోవచ్చు. ఈ చిత్రంలో ఒకే ఒక్క పాట ఉంది. ఆ పాటను విడుదల చేయడం సంతోషంగా ఉంది. శేఖర్ చంద్ర అందించిన ఈ ట్యూన్ అందరికీ నచ్చుతుంది. విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాని అన్ని వర్గాల ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందని నమ్ముతున్నాను'' అని అన్నారు.


నిర్మాత గురురాజ్ మాట్లాడుతూ - ''వంశీ ఆకెళ్ల అందించిన కథ నచ్చి ఈ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాను. ఆయన కథను ఎంత అద్భుతంగా చెప్పారో, అంతే అద్భతంగా సినిమాని తెరకెక్కించారు. కథే ఈ సినిమాకు ప్రాణం. ఆంజనేయ స్వామి పాత్ర సినిమాలో చాలా కీలకం. సర్ ప్రైజింగ్ స్టార్ ఇందులో నటించాడు. వారు ఎవరు అనేది సినిమా రిలీజ్ అయ్యాకే చూడాలి. అరకు లోయలోని ఓ పోలీస్ స్టేషన్లో జరిగే కామెడీ ఎంటర్ టైనర్ ఇది'' అని తెలిపారు.


డైరెక్టర్ వంశీ ఆకెళ్ల మాట్లాడుతూ - ''ఈ సినిమా చాలా బాగా వచ్చింది. నిర్మాతగారు కథను నమ్మి ఈ సినిమాని నిర్మించారు. ఆయన నమ్మకం వమ్మవ్వదు. సాధార‌ణంగా దెయ్యాల‌కు దేవుడంటే భ‌య‌మ‌ని మ‌నం చ‌దువుతుంటాం..సినిమాల్లో చూస్తుంటాం. కానీ ఓ దెయ్యానికి దేవుడు స‌హాయం చేయ‌డం గురించి తెలుసా..అది తెలుసుకోవాలంటే `ర‌క్ష‌కభ‌టుడు` సినిమా చూడాల్సిందే. అస‌లు ఆంజ‌నేయ‌స్వామికి, ర‌క్ష‌క‌భ‌టుడు అనే టైటిల్‌కు ఉన్న రిలేష‌న్ ఏంటి? అనేదాన్ని ఆస‌క్తిక‌రంగా రూపొందించాం. ఎమోష‌న్స్‌, కామెడి, థ్రిల్లింగ్, స‌స్పెన్స్ ఇలా అన్నీ ఎలిమెంట్స్ సినిమాలో ఉంటాయి. ఫ‌స్ట్ సీన్ నుండి క్లైమాక్స్ వ‌ర‌కు సినిమా ఎంట‌ర్‌టైనింగ్‌గా సాగుతుంది. చివ‌రి ప‌దిహేను నిమిషాలు హృద్యయంగా తెర‌కెక్కించాం. శేఖ‌ర్ చంద్ర మ్యూజిక్‌, మ‌ల్హ‌ర్‌భ‌ట్ జోషి సినిమాటోగ్ర‌ఫీ, డ్రాగ‌న్ ప్ర‌కాష్ యాక్ష‌న్, బ్ర‌హ్మానందం హిలేరియ‌స్ కామెడి, ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల ప‌నితీరు ఆడియెన్స్ ఎంగేజ్ చేస్తుంది. ఈ సినిమా అందరికి మంచి పేరు తెస్తుందని నమ్ముతున్నాను. ఈ సినిమాలో ఒకే ఒక పాట ఉంది. ఒక్క పాట ఉండటానికి కారణం, ఆంజనేయస్వామి ఎవరు నటించారనే విషయం సినిమా రిలీజ్ రోజున తెలుస్తుంది'' అని చెప్పారు.


హీరోయిన్ రిచా పనయ్ మాట్లాడుతూ - ''ఈ చిత్రంలో చాలా మంచి క్యారెక్టర్ చేసాను. ఆడియన్స్ నుంచి నా పాత్రకు మంచి స్పందన లభిస్తుందనే నమ్మకంతో ఉన్నాను'' అన్నారు.


మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర మాట్లాడుతూ - ''నేను లవ్ స్టోరీస్ చేశాను. హార్రర్ సినిమాలు చేశాను. కానీ ఇది ఏ జోనర్ సినిమానో చెప్పలేం. ఇది డిఫరెంట్ సినిమా. డివోషనల్ టచ్ ఉంది. ఈ తరహా పాట చేయడం చాలా కష్టం. కానీ చాలా బాగా వచ్చింది. సినిమా సూపర్ హిట్ అవుతుంది. ఎందుకంటే కామెడీ బాగా వర్కవుట్ అయ్యింది'' అన్నారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసి ..

Read More !

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ..

Read More !

Gossips

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Moodu Puvvulu AAru Kaayalu Teaser

#U Movie Theatrical Trailer

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

Read More !