View

పోలీసు వ్య‌వ‌స్థ ఎంత గొప్ప‌దో చెప్పే చిత్రం రాధ - శర్వానంద్

Sunday,May07th,2017, 12:20 AM

రన్ రాజా రన్, మళ్ళీ మళ్ళీ ఇదిరాని రోజు, ఎక్స్‌ప్రెస్‌రాజా, శ‌త‌మానం భ‌వ‌తి వంటి వ‌రుస సూప‌ర్‌డూప‌ర్ హిట్ చిత్రాల‌తో దూసుకుపోతోన్న యువ స్టార్ హీరో శర్వానంద్ హీరోగా ప్ర‌ముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్ర‌సాద్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ చంద్ర‌మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో భోగ‌వ‌ల్లి బాపినీడు నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం రాధ‌. ఈ సినిమాను మే 12న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా విజ‌య‌వాడ‌ సిద్ధార్థ్ కాలేజ్ లో ప్రీ రిలీజ్ వేడుక జ‌రిగింది.


ఈ కార్య‌క్ర‌మంలోశ‌ర్వానంద్‌, లావ‌ణ్య త్రిపాఠి, డా.ర‌మేష్‌, డా.రామ్మోహ‌న్‌రావు, త‌ణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ‌, క్రాంతిమాధ‌వ్‌, మేర్లపాక గాంధీ, మ్యూజిక్ డైరెక్ట‌ర్ ర‌ధ‌న్‌, డైరెక్ట‌ర్ చంద్ర‌మోహ‌న్‌, కేశినేని నాని, దిల్‌రాజు, బివిఎస్ఎన్ ప్ర‌సాద్‌, బాపినీడు, అలంకార్ ప్ర‌సాద్‌, సుద్శ‌ర‌న్ త‌దిత‌రులు పాల్గొన్నారు.


థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను కేశినేని నాని విడుద‌ల చేసారు.


క్రాంతి మాధ‌వ్ మాట్లాడుతూ - వ‌రుస విజ‌యాలు సాధిస్తున్న శ‌ర్వానంద్‌కు ఈ చిత్రం ఇంకా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను. మ‌రో కొత్త బిగినింగ్ కావాల‌ని కోరుతున్నాను. డెబ్యూ డైరెక్ట‌ర్ చంద్ర‌మోహ‌న్‌గారికి, బివిఎస్ఎన్‌ప్ర‌సాద్‌, బాపినీడుకి అభినంద‌న‌లు అన్నారు.


మేర్లపాక గాంధీ మాట్లాడుతూ - శ‌ర్వానంద్ ఏ క్యారెక్ట‌ర్ చేసినా జెన్యూన్‌గా చేస్తాడు. ఎంట‌ర్‌టైనింగ్‌గా ఆడియెన్స్‌ను మెప్పిస్తారు. ఈ రాధ సినిమా కూడా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను. చంద్ర‌మోహ‌న్ సినిమాను డైరెక్ట్ చేసిన విధానం గురించి నాకు శ‌ర్వానంద్ అన్న చెప్పారు. ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు థాంక్స్‌ అన్నారు.


ర‌ధ‌న్ మాట్లాడుతూ - శ‌ర్వానంద్‌తో వ‌ర్క్ చేయ‌డం హ్యాపీగా అనిపించింది. అలాగే లావ‌ణ్య‌, డైరెక్ట‌ర్ చంద్ర‌మోహ‌న్‌గారు, నిర్మాత బివిఎస్ఎన్‌కు, బాపినీడుకి థాంక్స్‌. ఈ సినిమా పేరే మా అమ్మగారి పేరు. అందువ‌ల్ల నాకు ఈ సినిమా అంటే ఇష్టం అన్నారు.


చంద్రమోహ‌న్ మాట్లాడుతూ - ఒక కృష్ణుడు పోలీస్ అయితే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూస్తాం. అప్ప‌ట్లో కృష్ణుడు చ‌క్రం తిప్పితే, ఈ కృష్ణుడు లాఠీ తిప్పుతాడు. నా కుటుంబానికి, నా గురువు క‌రుణాక‌ర‌ణ్‌గారికి ధ‌న్య‌వాదాలు. నిర్మాత‌లు బివిఎస్ఎన్‌, బాపినీడు ప్రారంభం నుండి ఎంత‌గానో స‌పోర్ట్ చేశారు. త‌ప్ప‌కుండా సినిమా అంద‌రినీ ఎంట‌ర్‌టైన్ చేసేలా ఉంటుంది అన్నారు.


త‌ణుకు ఎమ్మెల్యే మాట్లాడుతూ - మంచి టైటిల్, శ‌ర్వానంద్‌కు త‌ప్ప‌కుండా పెద్ద హిట్ అవుతుంది. ప్ర‌భాస్ , రాజ‌మౌళితో ఛ‌త్ర‌ప‌తి, ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌తో అత్తారింటికి దారేది చిత్రాల‌ను నిర్మించిన ఎస్‌విసిసి నిర్మాణ సంస్థ‌లో ఇప్పుడు రాధ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. రాధ మూవీ రాధ‌కృష్ణ లీల‌ల‌తో, ఎంట‌ర్‌టైనింగ్‌తో అంద‌రినీ అల‌రిస్తుంద‌ని కోరుకంటూ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్‌ అన్నారు.


దిల్‌రాజు మాట్లాడుతూ - ర‌ధ‌న్‌ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం చిత్రాల‌కు సంగీతం అందించాడు. ఇప్పుడు రాధ చిత్రానికి కూడా మంచి మ్యూజిక్ అందించాడు. బివిఎస్ఎన్‌ప్ర‌సాద్‌గారి త‌న‌యుడు బాపినీడు పూర్తి నిర్మాత‌గా బాధ్య‌త‌లు తీసుకుని సినిమాను నిర్మించాడు. లావ‌ణ్య త్రిపాఠి గ్లామ‌ర్‌గా క‌న‌ప‌డుతుంది. ఇక శ‌ర్వానంద్ గురించి చెప్పాలంటే, 12 ఏళ్ళ‌ క్రితం అవ‌కాశం కోసం నా ఆఫీసుకు పోటోల‌తో వ‌స్తే నేనే తేజ‌గారి ఆఫీసుకి తీసుకెళ్ళాను. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా గ‌త మూడేళ్ళ నుండి మ‌ళ్ళీ మ‌ళ్ళీ ఇది రానిరోజు, ఎక్స్‌ప్రెస్‌రాజా, శ‌త‌మానం భ‌వ‌తి సినిమాల‌తో వ‌రుస హిట్‌లు అందుకున్నాడు. రాధ‌తో ఐద‌వ హిట్ కొట్టి ఇదే ఏడాది సెకండ్ హ్యాట్రిక్ అందుకోవాల‌ని కోరుకుంటున్నాను.


కేశినేని నాని మాట్లాడుతూ -  విజ‌య‌వాడ తెలుగు సినిమాకు పుట్టినిల్లు. ఎన్టీఆర్‌గారైనా, ఏఎన్నార్ అయినా ఎవ‌రైనా ఇక్క‌డి నుండి వెళ్ళి ఇండ‌స్ట్రీలో రాణించిన‌వారే. ఇప్పుడు తెలుగు సినిమా అంత‌ర్జాతీయ స్థాయికి వెళ్ళింది. ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ప‌దేళ్ళుగా వ‌రుస విజయాలు సాధిస్తున్న హీరో శ‌ర్వానంద్ ఎంత‌టి హార్డ్ వ‌ర్క్ చేసేవాడో దిల్‌రాజుగారు చెప్పారు. సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేని కుటుంబం నుండి వ‌చ్చి హీరోగా త‌న‌కంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న హీరో శ‌ర్వానంద్‌కు ఈ సంద‌ర్భంగా కంగ్రాట్స్ చెబుతున్నాను. నిర్మాత బివిఎస్ఎన్ ప్ర‌సాద్‌, హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠి, బాపినీడు స‌హా యూనిట్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్‌ అన్నారు.


బివిఎస్ఎన్ ప్ర‌సాద్ మాట్లాడుతూ - మే 12న రాధ సినిమా ప్రేక్ష‌కుల ముంద‌కు రానుంది. మా అబ్బాయి బాపినీడు నిర్మాత‌గా పూర్తి స్థాయిలో చేసిన సినిమా త‌ప్ప‌కుండా ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.


లావ‌ణ్య త్రిపాఠి మాట్లాడుతూ - రాధ సినిమాలో డిఫ‌రెంట్ రోల్ చేశాను. చంద్ర‌మోహ‌న్‌గారు చాలా జాగ్ర‌త్త‌గా సినిమాను డైరెక్ట్ చేశారు. శ‌ర్వానంద్ స్వీటెస్ట్ హీరో. త‌న‌తో మ‌రిన్ని సినిమాలు చేయాల‌నుకుంటున్నాను. మంచి సినిమాను ఇచ్చిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు థాంక్స్‌ అన్నారు.


శ‌ర్వానంద్ మాట్లాడుతూ - నేను పుట్టింది విజ‌య‌వాడ‌లోనే. నానిగారు చెప్పినన‌ట్టు మా తాత‌గారు బొమ్మినేని సుబ్బారావుగారు సిద్ధార్థ్ ఎడ్యుకేష‌న్ అకాడ‌మీలు స్టార్ట్ చేశారు. ఇప్పుడు అదే కాలేజ్‌లో నేను మాట్లాడ‌టం ఆనందంగా ఉంది. పోలీసుల‌కు ట్రిబ్యూట్ మూవీయే రాధ‌. ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటూ, కృష్ణుడిలా ఉంటూ మెసేజ్ అంటూ, క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటూ ఫ్యామిలీ అంతా వ‌చ్చి ఎంజాయ్ చేసే చిత్ర‌మ‌వుతుంది. ఫ్యామిలీలంద‌రూ కూర్చొని న‌వ్వుకునే సినిమా ఇది. దుష్ట శిక్ష‌ణ శిష్ట ర‌క్ష‌ణ చేయ‌డానికి అప్పుడు కృష్ణుడు పుట్టాడు. ఇప్పుడు పోలీసోడు పుట్టాడు. పోలీసు వ్య‌వ‌స్థ ఎంత గొప్ప‌దో తెలుసు. మ‌నం ఏ ఆప‌ద‌లో వున్న మ‌న‌ల్ని కాపాడేది పోలీసులే. వారు లేకుంటే మ‌నం లేం. మ‌న‌ల్ని ర‌క్షిస్తున్నారు. ఆ పాయింట్ న‌చ్చే సినిమా చేయ‌డానికి అంగీక‌రించాను. ప్ర‌సాద్‌గారు చాలా కూల్ ప్రొడ్యూస‌ర్‌. చాలా మంచి హిట్ సినిమా ఇవ్వ‌బోతున్నారు. బాపినీడు క‌థ నుండి నాతో ట్రావెల్ అవుతున్నాడు. చాలా మంచి సినిమా ఇస్తున్నాడు. ర‌ధ‌న్ మంచి మ్యూజిక్‌తో చంపేస్తున్నాడు. సినిమాటోగ్రాఫ‌ర్ కార్తీక్ సినిమాకు బ్యాక్‌బోన్‌లా మంచి అవుట్‌పుట్ ఇచ్చాడు. డైరెక్ట‌ర్ చంద్ర‌మోహ‌న్ బిగ్ లీగ్ డైరెక్ట‌ర్ లిస్టులో ఉంటాడు. చాలా ఎంట‌ర్‌టైనింగ్‌గా సినిమా క‌థ‌ను రాయ‌డ‌మే కాకుండా చ‌క్క‌గా తీశాడు. మే 12న విడుద‌ల‌వుతున్నరాధ‌ సినిమా ఎంట‌ర్‌టైనింగ్ మూవీగా అంద‌రికీ న‌చ్చుతుంది. అంద‌రికీ థాంక్స్‌ అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. రీ ఎంట్రీకి ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నాడు. 'శ్రీమంతుడు' చిత్రం త ..

Read More !

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ్యాప్ తీసుకోకుండానే 151వ సినిమా చేయడా ..

Read More !

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కైనా సంతోషంగానే ఉంటుంది. కానీ ఆ అవకాశం ..

Read More !

Gossips

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

500, 1000 నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటన బయటికి రాగానే టాలీవుడ్ కి చెందిన ఓ స ..

నందమూరి హీరో కళ్యాణ్ రామ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో ఓ మల ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం వస్తే.. ఎగిరి గంతేసి ..

'జనతాగ్యారేజ్' చిత్రం తర్వాత ఎన్టీఆర్ చేయబోయే తదుపరి సినిమా ఏంటీ.. ఎవరి దర్ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Aadi Starrer Nuvve Theatrical Trailer

Devadasi Motion Poster

Pratikshanam 1min Trailer

Mahesh babu, A.R.Murugadoss SPYDER New Teaser

Read More !