filmybuzz

View

కల్పన 3 ఆడియో లాంఛ్ విశేషాలు

Tuesday,May09th,2017, 07:34 AM

సాయివెంక‌ట్ స‌మ‌ర్ప‌ణ‌లో భీమ‌వ‌రం టాకీస్ బ్యాన‌ర్‌పై ఉపేంద్ర‌, ప్రియ‌మ‌ణి, తుల‌సి తారాగ‌ణంగా రూపొందుతోన్న చిత్రం క‌ల్ప‌న‌-3. ఉద‌య్‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని తుమ్మ‌ల‌ప‌ల్లి రామ‌స‌త్య‌నారాయ‌ణ విడుద‌ల చేస్తున్నారు. అర్జున్ జ‌న్య సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం సోమ‌వారం హైద‌రాబాద్‌లో జరిగింది. ఈ కార్య‌క్ర‌మానికి త‌మిళ‌నాడు మాజీ గ‌వ‌ర్న‌ర్ కొనెజోటి రోశ‌య్య ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఆడియో సీడీల‌ను కొనెజేటి రోశయ్య విడుద‌ల చేశారు.


చిత్ర స‌మ‌ర్ప‌కుడు సాయివెంక‌ట్ మాట్లాడుతూ - క‌ల్ప‌న‌-3 సూప‌ర్‌డూప‌ర్ హిట్ అయ్యింది. సినిమా చాలా ఉత్కంఠ‌భ‌రితంగా ఉంటుంది. మా కాంబినేష‌న్‌లో వ‌చ్చిన పిశాచి2 ఈ మ‌ధ్య కాలంలో పెద్ద స‌క్సెస్ అయిన సంగ‌తి తెలిసిందే. పిశాచి 2 100 థియేట‌ర్స్‌లో విడుద‌ల చేశామంటే అందుకు కార‌ణం రామ‌స‌త్య‌నారాయ‌ణ‌గారే. ఈ సినిమా కూడా మా కాంబినేష‌న్‌లో పెద్ద హిట్ అవుతుంద‌ని భావిస్తున్నాను అన్నారు.


తుమ్మ‌ల‌ప‌ల్లి రామ‌స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ - ప‌ది మంది స‌పోర్ట్ ఉంటే ఎవ‌రైనా పైకి వ‌స్తార‌నే దానికి నేనే ఉదాహ‌ర‌ణ‌. నేను తీసిన దెయ్యం సినిమాల‌న్నీ మంచి విజయాల‌నే సాధించాయి. ఈ చిత్రాన్ని త‌మిళంలో రాఘ‌వ లారెన్స్ చేశాడు. క‌న్న‌డంలో ఉపేంద్ర చేశాడు. క‌న్న‌డంలో కోట్లు వ‌సూలు చేసిన ఈ సినిమాను తెలుగులో మే 19న‌ విడుద‌ల చేస్తున్నాను అన్నారు.


కె.రోశయ్య మాట్లాడుతూ - నేను స‌గ‌టు ప్రేక్ష‌కుడిని సినిమాలోని లోటు పాట్లు గురించి నాకు పెద్ద‌గా తెలియ‌వు. రామ‌స‌త్య‌నారాయ‌ణ విడుద‌ల చేస్తున్న ఈ సినిమా తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంద‌ని భావిస్తున్నాను. త‌మ్మ‌ల‌ప‌ల్లి రామ‌స‌త్య‌నారాయ‌ణ మ‌రిన్ని మంచి సినిమాలు చేయాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.


సి.క‌ళ్యాణ్ మాట్లాడుతూ - రామ‌స‌త్య‌నారాయ‌ణ వంద సినిమాల‌కు నిర్మాత‌గా మార‌నున్నాడు. త‌న‌ను నేనే కంట్రోల్ చేశాను. లేకుంటే ఇప్ప‌టికే రెండు వంద‌ల సినిమాల‌కు ద‌గ్గ‌ర‌గా వ‌చ్చేసేవాడేమో. నేను ఇంకా 66 సినిమాలే చేస్తున్నాను. నేను కూడా హ‌ర్ర‌ర్ సినిమాల‌తో మంచి విజ‌యాల‌ను సాధించాను. రామ‌స‌త్య‌నారాయ‌ణ కూడా ఈ సినిమాతో మంచి హిట్ కొడ‌తాడు అన్నారు.


మల్కాపురం శివ‌కుమార్ మాట్లాడుతూ - రామ‌స‌త్యనారాయ‌ణ భీమ‌వ‌రం టాకీస్ ఓ ఫ్యాక్టరీలా ప‌నిచేస్తుంది. ఈ సినిమాతో మంచి విజ‌యాన్ని అందుకుంటాడు అన్నాడు.


ఈ కార్య‌క్ర‌మంలో కె.వి.వి.స‌త్య‌నారాయ‌ణ‌, కె.ఎల్‌.దామోద‌ర్ ప్ర‌సాద్‌, శివ‌కృష్ణ త‌దిత‌రులు పాల్గొన్నారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోననే ఆసక్తి అందరిలో ఉంది. ప్రిన్స్ మహే ..

Read More !

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుంటో ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. స ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

Gossips

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Read More !