filmybuzz

View

'అంధగాడు' ట్రైలర్ ని విడుదల చేసిన నిఖిల్.. టీజర్ కి సూపర్ రెస్పాన్స్!

Saturday,May20th,2017, 09:40 AM

ఏ టీవీ స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యాన‌ర్‌లో ఈడోర‌కం-ఆడోర‌కం, కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త వంటి సూప‌ర్‌హిట్ చిత్రాలు త‌ర్వాత రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ `అంధ‌గాడు`. కుమారి 21 ఎఫ్‌, ఈడోరకం-ఆడోర‌కం వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌తో హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న రాజ్‌త‌రుణ్‌, హెబ్బా ప‌టేల్ జంట‌గా న‌టిస్తున్నారు.స‌క్సెస్‌ఫుల్ రైట‌ర్ వెలిగొండ శ్రీనివాస్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈచిత్రాన్ని రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో. న‌ట‌కిరిటీ డా.రాజేంద్ర‌ప్రసాద్ ఈ చిత్రంలో కీల‌క‌పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం టీజ‌ర్ విడుద‌ల శ‌నివారం హైద‌రాబాద్‌లోజ‌రిగింది. నిఖిల్ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు.


నిఖిల్ మాట్లాడుతూ - టైటిల్ విన‌గానే నాకు చాలా స‌ర్‌ప్రైజింగ్‌గా అనిపించింది. `అంద‌గాడు` ఏంటి అని అనుకున్నాను. త‌ర్వాత అది `అంధ‌గాడు` అని తెలిసింది. క‌ళ్లు లేని వ్య‌క్తిగా రాజ్‌త‌రుణ్ చాలా బాగా చేయ‌గ‌ల‌డ‌ని అనిపించింది. ట్రైల‌ర్ చూశాను. చాలా బాగా ఉంది. టీజ‌ర్‌కు చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. అలాగే ట్రైల‌ర్‌కి కూడా వ‌స్తుంద‌ని భావిస్తున్నాను. ఈ సంస్థ నుంచి ఇలాంటి మంచి సినిమాలే వ‌స్తుంటాయి. మ‌రో హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్గా ఈ సినిమా రానుంది. ఎన్నో సూప‌ర్‌హిట్ సినిమాల‌కు క‌థ‌లు అందించిన వెలిగొండ శ్రీనివాస్ ఈ సినిమాకు ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం చాలా ఆనందంగా ఉంది. కెమెరా, సంగీతం... ఇలా అన్ని యాంగిల్స్ లోనూ సినిమా ప‌ర్ఫెక్ట్ గా ఉంటుంద‌ని భావిస్తున్నాను. డిఫ‌రెంట్ కాన్సెప్ట్ తో వ‌స్తున్న ఈ సినిమాలో ఎమోష‌న్ కూడా బావుంటుంద‌ని భావిస్తున్నాను అని చెప్పారు.


రాజ్ త‌రుణ్ మాట్లాడుతూ - వెలిగొండ‌గారు క‌థ చెబుతానంటే ఎలాంటి ఆర్ట్ చిత్రాన్ని చెబుతారోన‌ని భావించాను. కానీ ఆయ‌న క‌థ‌ను మొద‌లుపెట్టిన ఐదు నిమిషాలకు ఎంట‌ర్‌టైన్‌మెంట్ జోన‌ర్‌లో ఎంట‌ర్ అయ్యారు. అలా 15 నిమిషాల‌కు ఒక‌సారి ఒక్కో జోన‌ర్‌లోకి క‌థ‌ను తీసుకెళ్లారు. ఎలాంటి జోన‌ర్ సినిమా అన్న‌ది నేను ప‌ర్టిక్యుల‌ర్‌గా చెప్ప‌లేను. వెలిగొండ‌గారు క్లారిటీ ఉన్న ద‌ర్శ‌కుడు. ఆయ‌న‌కు ఏం కావాలో తెలుసు. న‌టీన‌టుల నుంచి ఎలాంటి ఔట్‌పుట్ రాబ‌ట్టుకోవాలో.. అలాంటి ఔట్‌పుట్‌ను రాబ‌ట్టుకున్నారు. డీఓపీ రాజ‌శేఖ‌ర్ గారు ప‌నిత‌నాన్ని అంద‌రూ మెచ్చుకుంటారు. ఆయ‌న‌తో ప‌నిచేయ‌డానికి చాలా ఎంజాయ్ చేశాను. రాజా ర‌వీంద్ర‌గారు ఈ సినిమాలో మెయిన్ విల‌న్ రోల్ చేశారు. ఈ క‌థ విన్న‌ప్పుడు అనిల్‌గారు ఎలా ఎగ్జ‌యిట్‌మెంట్‌తో ఉన్నారో... ఇప్పుడు పూర్త‌యిన‌ప్పుడు కూడా అలాగే ఎగ్జ‌యిట్‌మెంట్‌తోనే ఉన్నారు. శేఖ‌ర్‌చంద్ర స్వ‌రాల‌తో పాటు, బ్యాక్‌గ్రౌండ్‌స్కోర్ కూడా చాలా బాగా ఇచ్చారు. హెబ్బాతో ఇది నా మూడో సినిమా. ఇంకో 30 సినిమాలు చేయాల‌ని కోరుకుంటున్నాను అని అన్నారు.


వెలిగొండ శ్రీనివాస్ మాట్లాడుతూ - పండుగ చేస్కో క‌థ‌ని ముందు రాజార‌వీంద్ర‌కు చెప్పాను. త‌న‌ద్వారా రామ్‌కు వ‌చ్చింది. అలాగే ఈ చిత్ర క‌థ‌ను ముందు రామ్‌కు చెప్పాను. త‌న‌ద్వారా రాజ్‌త‌రుణ్‌కి వ‌చ్చింది. ఈయ‌న‌కు న‌చ్చ‌డంతో ఈ సినిమా ప‌ట్టాల‌మీద‌కు ఎక్కింది. ఇన్ని ట్విస్ట్ లున్న క‌థ‌ను మీరే డైర‌క్ట్ చేయండ‌ని నిర్మాత‌లు అన్నారు. ముందు నాకు నేను డైర‌క్ట‌ర్ ఏంటా? అని చిన్న‌పాటి క‌న్‌ఫ్యూజ‌న్‌తో ఉన్నాను. కానీ మంచి టీమ్ కుద‌ర‌డం వ‌ల్ల చేయ‌గ‌లిగాను. నిర్మాత‌ల‌కు ధ‌న్య‌వాదాలు. శేఖ‌ర్‌చంద్రకి చాలా మంచి లైఫ్ ఉంది. ముందు నేను రాజా ర‌వీంద్ర‌గారిని విల‌న్ గా అనుకోలేదు. కానీ త‌ర్వాత ఆయ‌న చేశారు.మా సినిమా కోసం గ‌డ్డం కూడా పెంచారు. మా చిత్రం కోసం చాలా సినిమాల‌ను వ‌దులుకున్నారు అని అన్నారు.


శేఖ‌ర్ చంద్ర మాట్లాడుతూ - ఈ సినిమాకు ప‌నిచేయాల‌ని ముందే అనుకున్నాను. వెలిగొండ‌గారు క‌థ చెప్ప‌గానే చాలా న‌చ్చింది. దానికి త‌గ్గ‌ట్టు నిర్మాత‌లు కూడా ఫోన్ చేసి న‌న్ను సంప్ర‌దించారు. ఆల్రెడీ 3 పాట‌లు విడుద‌ల‌య్యాయి. త్వ‌ర‌లో మ‌రో సాంగ్ వ‌స్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగా కుదిరింది అని తెలిపారు.


రాజా ర‌వీంద్ర మాట్లాడుతూ - ఈ మ‌ధ్య‌కాలంలో ఇన్ని ట్విస్ట్ లున్న క‌థ‌ల‌ను నేను చేయ‌లేదు. అందుకే వెలిగొండ‌గారినే డైర‌క్ట్ చేయ‌మ‌ని చెప్పాను. నా పాత్ర కూడా చాలా బావుంటుంది. `అంధ‌గాడు`కి ముందు, తర్వాత అనేలా ఈ సినిమా ఉంటుంది. మంచి టీమ్ వ‌ర్క్ తో చేసిన సినిమా ఇది అని చెప్పారు.


రాజ్‌త‌రుణ్‌, హెబ్బాప‌టేల్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, ఆశిష్ విద్యార్థి, రాజా ర‌వీంద్ర‌, షాయాజీ షిండే, స‌త్య‌, ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర రావు త‌దిత‌రులు తారాగ‌ణంగా న‌టిస్తున్న ఈ చిత్రానికి కెమెరాః బి.రాజ‌శేఖ‌ర్‌, సంగీతంః శేఖ‌ర్ చంద్ర‌, ఆర్ట్ః కృష్ణ మాయ‌, చీఫ్ కోడైరెక్ట‌ర్ః సాయి దాసం, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః కిషోర్ గ‌రిక‌పాటి, స‌హ నిర్మాతః అజ‌య్ సుంక‌ర‌, నిర్మాతః రామ‌బ్ర‌హ్మం సుంక‌ర‌, క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు,దర్శ‌క‌త్వంః వెలిగొండ శ్రీనివాస్‌Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Read More !