filmybuzz

View

3 పదాల ట్వీట్ తో 'దర్శకుడు' ని ఎన్టీఆర్ సూపర్ హిట్ చేసాడు - సుకుమార్

Monday,May22nd,2017, 07:59 AM

నా హృదయానికి బాగా దగ్గరైన వ్యక్తి సుకుమార్. ఆయన్ని బయటి వ్యక్తిగా నేనేప్పుడు చూడలేదు. సుకుమార్ రైటింగ్స్‌కు సంబంధించిన వేడుకకు రావడం ఓ బాధ్యతగా, ప్రేమగానే భావిస్తాను అని అన్నారు ప్రముఖ హీరో ఎన్టీఆర్. సుకుమార్ రైటింగ్స్ పతాకంపై ప్రముఖ దర్శకుడు సుకుమార్, బీఎన్‌సీఎస్‌పీ విజయ్‌కుమార్, థామస్‌రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తిలతో కలిసి నిర్మిస్తున్న చిత్రం దర్శకుడు. అశోక్, ఈషా జంటగా నటిస్తున్నారు. హరిప్రసాద్ జక్కా దర్శకత్వం వహిస్తున్నారు.


ఈ చిత్ర టీజర్‌ను ఆదివారం హైదరాబాద్‌లో హీరో ఎన్టీఆర్ విడుదల చేశారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ - దర్శకుడి ప్రేమకథను తెరపై చూపించడమనే యూనిక్ కాన్సెప్ట్‌తో హరిప్రసాద్ సినిమాను తెరకెక్కించడం ఆనందంగా ఉంది. కథకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే దర్శకుల్లో సుకుమార్ ఒకరు. సుకుమార్ రైటింగ్స్ ద్వారా కొత్త కథలను, ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులను చిత్రసీమకు పరిచయం చేయడం సుకుమార్ గొప్పతనానికి నిదర్శనంగా చెప్పవచ్చు దర్శకుడు చిత్ర టీజర్ బాగుంది. సినిమా విజయవంతం కావాలి అన్నారు.


సుకుమార్ మాట్లాడుతూ - కుమారి 21ఎఫ్ అనే చిన్న సినిమాను మూదు పదాల ట్వీట్‌తో సూపర్‌హిట్ చేశారు ఎన్టీఆర్. అలాంటి సహృదయత చాలా తక్కువ మందికి ఉంటుంది నాన్నకు ప్రేమతో నుంచి మా అనుబంధం కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయడానికి ఎలాంటి సంశయాలు లేకుండా అతడి దగ్గరకు వెళ్లగానే ఎన్టీఆర్ స్వయంగా నేను వస్తున్నాను అని అన్నారు. ఆయన ప్రేమకు పాత్రుడినైనందుకు అదృష్టంగా భావిస్తున్నాను. కొందరితో మాట్లాడితే ఆత్మలతో సంభాషించినట్లు ఉంటుంది. వారిలోని కోపం, నవ్వు సులభంగా తెలిసిపోతాయి. అలాగే తారక్ నవ్వు వెనుక సముద్రమంతా ప్రేమ ఉంటుంది. అతడి కోపం వెనుక చిన్నపాటి ఆవేశం ఉంటుంది. నా బ్యానర్‌లో ప్రతిసినిమాకు అతడు రావడం ఆనవాయితీగా మారాలని కోరుకుంటున్నాను(నవ్వుతూ). కుమారి 21ఎఫ్ తర్వాత చాలా కథలు విన్నాను. కానీ ఏది నచ్చలేదు. హరిప్రసాద్ చెప్పిన కథ మాత్రం నన్ను బాగా ఆకట్టుకుంది. వన్ నేనొక్కడినే మూల కథ అతడితే. నేను దానిని డెవలప్ చేశానంతే. అతడి తెలివితేటలపై నమ్మకంతో ఒక్కరోజు కూడా నేను సెట్స్‌కు వెళ్లలేదు. సినిమా చాలా బాగా వచ్చింది. తపనకు, ప్రేమకు మధ్యకు నలిగిపోయే ఓ దర్శకుడి ప్రేమకథ ఇది. స్వార్థపరుడైన దర్శకుడు ప్రేమలో పడితే ఏం జరుగుతుందనేది ఆసక్తిని పంచుతుంది అని అన్నారు.


కథానుగుణంగా ఓ దర్శకుడు సెట్స్‌లో ఎలా ఉంటాడో, బయటి అతడి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోవడం అవసరమైందని, దాంతో నాకు తెలిసిన దర్శకుడు సుకుమార్ బాడీలాంగ్వేజ్‌ను దృష్టిలోపెట్టుకొని హీరో పాత్రను తీర్చిదిద్దానని  డైరెక్టర్ హరిప్రసాద్ చెప్పారు.


కుమారి 21ఎఫ్‌కు మించి ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధిస్తుందనే నమ్మకముందని నిర్మాత విజయ్‌కుమార్ తెలిపారు.


సుకుమార్‌తో కలిసి సినిమా చేయాలనే తన కల దర్శకుడు చిత్రంతో నెరవేరిందని సంగీత దర్శకుడు సాయికార్తీక్ చెప్పారు.


ఈ చిత్రంలో నమ్రత అనే అమ్మాయిగా అభినయానికి ఆస్కారమున్న పాత్రను పోషించానని హీరోయిన్ ఈషా చెప్పింది.


ఈ కార్యక్రమంలో బి.ఎన్.సి.ఎస్. పి. విజయ్‌కుమార్, థామస్‌రెడ్డి ఆదూరి, రవిచంద్ర, అనుమోలు ప్రవీణ్, ఇషా, పూజిత, బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, చెర్రీ, రామ్‌మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పూజిత, నోయల్, నవీన్, సుదర్శన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: అనుమోలు ప్రవీణ్‌కుమార్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రమేష్ కోలా.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Read More !