filmybuzz
filmybuzz

View

మ‌హిళ‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన 'మా'.. చలపతిరావుగారు తొలిసారి నోరు జారారు!

Tuesday,May23rd,2017, 08:31 AM

ఇటీవ‌ల ఓ ఆడియో వేడుక‌లో సీనియ‌ర్ న‌టుడు చ‌ల‌పతిరావు మ‌హిళ‌ల‌ను కించ ప‌రిచి మాట్లాడిన మాట‌లు ఎంత‌టి దుమారం రేపాయో తేలిసిందే. అనంత‌రం ఆయ‌న మ‌హిల‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు కూడా తెలిపారు. `మా` (మూవీ ఆర్టిస్ట్ అసో సియేష‌న్ సంఘం) కూడా మంగ‌ళ‌వారం సాయంత్రం మీడియా సమ‌క్షంలో ఆయ‌న త‌రుపున క్ష‌మాపణ‌లు తెలియజేసింది.


ఈ సంద‌ర్భంగా `మా` అధ్యక్షులు శివాజీ రాజా మాట్లాడుతూ - చ‌ల‌ప‌తిరావు గారు గ‌తంలో ఎప్పుడు ఇలాంటి వ్యాఖ్య‌లు ఎక్క‌డా చేయ‌లేదు. షూటింగ్ స్పాట్ లో అంద‌రితో స‌ర‌ద‌గా ఉంటారు. నలుగురికి మంచి వ్యాఖ్య‌లే చెబుతారు. కానీ తొలిసారి ఆయ‌న నోరు జారారు. త‌ర్వాత ఆయ‌న నాతో మాట్లాడి చాలా బాధ‌ప‌డ్డారు. మ‌హిళ‌లు గురించి ఆయ‌న అలా మాట్లాడ‌టం త‌ప్పు అని `మా` కూడా ఖండిస్తుంది. క్ష‌మించిమ‌ని చాలా బాధ‌తో అడిగారు. ఇక‌పై ఆర్టిస్టుల త‌రుపు నుంచి ఇలాంటి ఇబ్బందిక‌ర‌మైన వ్యాఖ్య‌లు రావ‌ని మాటిస్తున్నాం. ఇలాంటివి మ‌ళ్లీ పున‌రావృతం అయితే త‌క్ష‌ణం వారిపై చ‌ర్య‌లు తీసుకుంటాం. మూవీ ఆర్టిస్ట్ మెంబర్ షిప్ ను తొల‌గిస్తాం. మ‌హిళా సంఘాల‌కు కూడా చల‌ప‌తి రావుగారు క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. ఈ ప్రెస్ మీట్ కూడా వచ్చి స‌భాముఖంగా క్ష‌మాప‌ణ‌లు చెబుత‌న‌న్నారు. కానీ మేము కాద‌న‌డంతో రాలేదు` అని అన్నారు.


`మా` జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ న‌రేష్ మాట్లాడుతూ - చ‌ల‌ప‌తిరావు గారి వ్యాఖ్య‌ల‌పై `మా`,  సినిమా ఇండ‌స్ర్టీ నుంచి ముక్త‌కంఠంతో ఖండిస్తున్నాం. సినీ ప‌రిశ్ర‌మ‌లో కూడా మ‌హిళ‌లున్నారు. అంతా క‌లిసి ప‌నిచేస్తాం. అయితే ఒక స‌భ‌లో స‌భా మ‌ర్యాద, స‌మ‌న్యాయం పాటించ‌డం చాలా అవ‌స‌రం. ఏ కార్య‌క్ర‌మైనా జోకుల‌తో నే ప్రారంభం అవుతుంది. అయితే కొంత మంది న‌టులు హాస్యానికి- ఇలాంటి వ్యాఖ్య‌ల‌కు మ‌ధ్య చిన్న మంచు పొర ఉంటుంది దాన్ని గ్ర‌హించ‌క అదుపు త‌ప్పి ఏవో మాట్లాడుతున్నారు. అవి సోష‌ల్ మీడియాలో దుమారం అవ్వ‌డం జ‌రుగుతుంది. ఇది `మా` కు కూడా ఓ గుణ‌పాఠం. ఎవ‌రి వ్య‌క్తి గ‌త విష‌యాలు వాళ్ల‌కు ఉంటాయి. కానీ స‌భ‌లో ఉన్నప్పుడు మాత్రం బాధ్య‌త‌గా మాట్లాడాల్సి ఉంటుంది. ఇలాంటి ఇబ్బందిక‌ర వ్యాఖ్య‌లు చోటు చేసుకోకుండా చూడ‌టం `మా` బాధ్య‌త కూడా. అందుకే మహిళ‌లంద‌రికీ మా త‌రుపున‌, చ‌ల‌ప‌తిరావు గారు త‌రుపున క్ష‌మాప‌ణ‌లు తెలుపుతున్నాం. చ‌ల‌ప‌తిరావు గారు ఇప్పుడు షాక్ లో ఉన్నారు. క్ష‌మించండ‌ని చానెల్స్ కు వెళ్లి మాట్లాడుతున్నారు. సీనియ‌ర్ న‌టుడిగా, ఇన్నేళ్ల పాటు ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన వ్య‌క్తి కాబ‌ట్టి క్ష‌మించండ‌ని కోరుతున్నాం. రానున్న రోజుల్లో జ‌న‌ర‌ల్ బాడీలో కూడా ఓ రిజ‌ల్యుష‌న్ తీసుకొస్తాం. ఆర్టిస్టులు ఎవరైనా ఇబ్బందిక‌ర వ్యాఖ్య‌లు చేస్తే వారిపై చర్య‌లు తీసుకుంటాం. చ‌ల‌ప‌తిరావు గారిపై కేసులు బ‌నాయించిన వారిని వెంట‌నే కేసు వెన‌క్కి తీసుకోవాల్సిందిగా ప్రార్ధిస్తున్నాం. గ‌తంలో ఇలాంటి ప‌రిస్థితులు చోటుచేసుకోవ‌డం అవి `మా` ద‌గ్గ‌ర‌కు రావ‌డం.. వెంట‌నే వాళ్ల‌ను హెచ్చ‌రించ‌డం కూడా జ‌రిగింది. మ‌ళ్లీ ఇలా జ‌ర‌గ‌డం బాధాక‌రం అని అన్నారు.


ఈ స‌మావేశంలో జాయింట్ సెక్ర‌ట‌రీ ఏడిద శ్రీరామ్, ఈసీ మెంబ‌ర్ సురేష్ కొండేటి పాల్గొన్నారు.

 Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసి ..

Read More !

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ..

Read More !

Gossips

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Moodu Puvvulu AAru Kaayalu Teaser

#U Movie Theatrical Trailer

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

Read More !