filmybuzz
filmybuzz

View

ఓ నవ్వులో ఇంతుందా... అంటున్న గంటా తనయుడు.. జయదేవ్ 4వ పాట రిలీజ్:

Thursday,May25th,2017, 05:05 AM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవి హీరోగా శ్రీ లక్ష్మీవెంకటేశ్వర ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై డీసెంట్‌ డైరెక్టర్‌ జయంత్‌ సి.పరాన్జీ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత కె.అశోక్‌కుమార్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం 'జయదేవ్‌'. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. ఇప్పటికే రిలీజైన మూడు పాటలకి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ఈ చిత్రంలోని 4వ పాటని మే 24న దర్శకుడు జయంత్‌ సి. పరాన్జీ రేడియో సిటీలో రిలీజ్‌ చేశారు. 'ఓ నవ్వులో ఇంతుందా.. ఇంతుందా..' అనే ఫ్యామిలీ పాటని అనంతశ్రీరామ్‌ రాయగా, సాహితి చాగంటి పాడారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూన్‌ ఫస్ట్‌వీక్‌లో వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రం రిలీజ్‌ కానుంది.


దర్శకుడు జయంత్‌ సి. పరాన్జీ మాట్లాడుతూ - ''ఓ నవ్వులో ఇంతుందా.. ఇంతుందా.. నేనెప్పుడూ ఊహించని వింతుందా..'' అనే ఫ్యామిలీ మెలోడీ పాటని లాంచ్‌ చేశాం. హీరో, పిల్లలు, అక్క బావలతో కలిసి పాడే పాట ఇది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ లవ్‌లీ ట్యూన్స్‌ కంపోజ్‌ చేశాడు. అనంతశ్రీరామ్‌ ఎక్స్‌ట్రార్డినరీ లిరిక్స్‌ రాశారు. 'జయదేవ్‌'ల అన్నీ పాటల కంటే ఈ పాట సెపరేట్‌. హీరో సస్పెండ్‌ అయి ఫ్రస్టేషన్‌లో వున్నప్పుడు సెకండ్‌ హాఫ్‌లో ఈ పాట వస్తుంది. విజువల్‌గా కూడా అద్భుతంగా ఈ పాటని పిక్చరైజేషన్‌ చేశాం. కెమెరామెన్‌ జవహార్‌ రెడ్డి, గంటా రవిని మా ఇంటికి తీసుకొచ్చాడు. ఆ సందర్భంలో సినిమాలు చేయాలన్న ఇంట్రెస్ట్‌ వుంది.. అని చెప్పాడు. నాకు కూడా అతన్ని చూడగానే తనలో హీరో మెటీరియల్‌ వుంది అన్పించింది. హీరోగా లాంచ్‌ చేస్తే తప్పకుండా సక్సెస్‌ అవుతాడు అన్న ఫీలింగ్‌ కలిగింది. ఆ తర్వాత తెల్సింది మినిష్టర్‌ గంటా శ్రీనివాసరావుగారి అబ్బాయి అని. ఇదొక సిన్సియర్‌ పోలీసాఫీసర్‌ కథ. తమిళంలో సూపర్‌హిట్‌ అయిన 'సేతుపతి' చిత్రాన్ని తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా ఎన్నో మార్పులు చేసి ఈ చిత్రాన్ని రూపొందించాం. పరుచూరి బ్రదర్స్‌గారు మరోసారి తమ పెన్‌ పవర్‌ చూపించారు. 'జయదేవ్‌' పవర్‌ఫుల్‌ క్యారెక్టర్‌లో రవి అమేజింగ్‌ పెర్‌ఫార్మెన్స్‌ చేశాడు. మాళవికని హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్‌ చేశాం. 'ప్రేమించుకుందాం..రా' చిత్రం మే 9కి 20 ఏళ్లు కంప్లీట్‌ అయ్యింది. 3 పాటలు మహేష్‌ అనే మ్యూజిక్‌ డైరెక్టర్‌ చేశాడు. అతనికి హెల్త్‌ ప్రాబ్లెమ్‌ అవడంతో మిగితా మూడు పాటల్ని మణిశర్మ కంపోజ్‌ చేశాడు. నేను చేసిన 12 చిత్రాల్లో 9 చిత్రాలకి మణిశర్మ మ్యూజిక్‌ ఇచ్చాడు. అప్పట్నుంచీ మణిశర్మతో నా జర్నీ కొనసాగుతుంది. అన్ని చిత్రాలకి ఔట్‌ స్టాండింగ్‌ మ్యూజిక్‌ ఇచ్చాడు మణి. 'జయదేవ్‌'కి కూడా బిగ్గెస్ట్‌ మ్యూజికల్‌ ఆల్బమ్‌ ఇచ్చాడు. ఈ చిత్రంలో 3 మెలోడీ సాంగ్స్‌, మాస్‌ మసాలా సాంగ్‌ అద్భుతంగా చేశాడు. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో 1987లో అశోక్‌కుమార్‌ నిర్మించిన 'ధృవనక్షత్రం' సినిమాకి నేను క్లాప్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేశాను. అశోక్‌కుమార్‌గారు నిర్మాతగా 'ప్రేమంటే ఇదేరా', 'ఈశ్వర్‌' చిత్రాలకి దర్శకత్వం వహించాను. 'ఈశ్వర్‌'తో ప్రభాస్‌ని ఇంట్రడ్యూస్‌ చేశాం. ప్రభాస్‌లాగా గంటా రవి కూడా మంచి హైట్‌, పర్సనాలిటీ వుంది. 'జయదేవ్‌'తో గంటా రవి హీరోగా పరిచయం చేస్తున్నాం. డెఫినెట్‌గా గంటా రవి కమర్షియల్‌ హీరోగా పేరు తెచ్చుకుంటాడు'' అన్నారు.


గాయని సాహితి చాగంటి మాట్లాడుతూ - ''ఈ చిత్రంలో రెండు పాటలు పాడాను. ఫస్ట్‌టైమ్‌ సోలో పాట ఈ చిత్రంలో పాడాను. ఈ ఆల్బమ్‌లో 'ఓ నవ్వులో ఇంతుందా..' నాకిష్టమైన పాట. ఈ అవకాశాన్ని ఇచ్చిన మణిశర్మగారికి, దర్శకులు జయంత్‌గారికి నా థాంక్స్‌'' అన్నారు.


గంటా రవి, మాళవిక జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో వినోద్‌కుమార్‌, పరుచూరి వెంకటేశ్వరరావు, పోసాని, వెన్నెల కిషోర్‌, హరితేజ, శ్రావణ్‌, సుప్రీత్‌, కోమటి జయరామ్‌, రాజేశ్వరి, శివారెడ్డి, కాదంబరి కిరణ్‌, బిత్తిరి సత్తి, కరుణ, మీనా, జ్యోతి, రవిప్రకాష్‌, అరవింద్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.


ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, సినిమాటోగ్రఫీ: జవహర్‌రెడ్డి, మూల కథ: అరుణ్‌కుమార్‌, రచన: పరుచూరి బ్రదర్స్‌, ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, ఫైట్స్‌: వెంకట్‌, ఆర్ట్‌: కృష్ణమాయ, స్టిల్స్‌ నారాయణ, కో-డైరెక్టర్‌: ప్రభాకర్‌ నాగ్‌, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: పి.రామమోహన్‌రావు, నిర్మాత: కె.అశోక్‌కుమార్‌, దర్శకత్వం: జయంత్‌ సి. పరాన్జీ.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసి ..

Read More !

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ..

Read More !

Gossips

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Moodu Puvvulu AAru Kaayalu Teaser

#U Movie Theatrical Trailer

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

Read More !