filmybuzz

View

ఓ పిల్లా నీ వ‌ల్లా విజయోత్సవ వేడుక విశేషాలు

Saturday,May27th,2017, 10:58 AM

కిషోర్ స్వీయ‌ద‌ర్శ‌క‌త్వంలో బిగ్‌విగ్‌ మూవీ ఎంట‌ర్‌టైన్మెంట్స్ సంస్థ‌ నిర్మిస్తున్న‌ చిత్రం `ఓ పిల్లా నీ వ‌ల్లా`. కృష్ణ‌చైత‌న్య‌, రాజేష్ రాథోడ్‌, మోనికా సింగ్, షాలు చారసియా న‌టీన‌టులు. ఈ సినిమా మోష‌న్ పోస్ట‌ర్ లాంచ్ ద‌శ నుంచి అద్భుత‌మైన స్పంద‌న అందుకుంది. పూరి జ‌గ‌న్నాథ్‌, శ‌ర్వానంద్ లాంటి క్రేజీ సెల‌బ్రిటీల ఆశీస్సులు ఈ సినిమాకి పెద్ద ప్ల‌స్ అయ్యాయి. ఇటీవ‌ల‌ రిలీజైన ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో ఆద‌ర‌ణ అంతే బావుంది. అన్ని ఏరియాల నుంచి చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చింది. ఈ సీజ‌న్‌లో చ‌క్క‌ని విజువ‌ల్ ట్రీట్ ఈ చిత్రం అంటూ ప్రేక్ష‌కులనుంచి ప్ర‌శంస‌లు అందుతున్నాయి. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో జ‌రిగిన విజ‌యోత్స‌వ వేడుక‌లో..


ద‌ర్శ‌క‌ నిర్మాత కిషోర్ మాట్లాడుతూ - ఓ పిల్లా నీ వ‌ల్లా.. చ‌క్క‌ని వినోదాత్మ‌క చిత్రమ‌ని తొలి నుంచి చెప్పాం. ల‌వ్‌, కామెడీ, యాక్ష‌న్ హైలైట్‌గా అన్ని వ‌ర్గాల్ని మెప్పించే అంశాలతో తెర‌కెక్కిన ఈ చిత్రం ఇటీవ‌ల రిలీజై విజ‌యవంతంగా ర‌న్ అవుతోంది. న‌వ‌త‌రం న‌టీన‌టుల పెర్ఫామెన్స్‌కి చ‌క్క‌ని గుర్తింపు ద‌క్కింది. ఈ చిత్రానికి అన్ని వ‌ర్గాల నుంచి స్పంద‌న బావుంది. థియేట‌ర్ల‌లో చ‌క్క‌ని ఆద‌ర‌ణ పొందుతోంది. క్లాస్- మాస్ అనే తేడా లేకుండా అన్ని వ‌ర్గాల మెప్పు పొందడం సంతోషాన్నిస్తోంది. ఈ స‌క్సెస్‌తో మ‌రిన్ని చిత్రాల్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించాల‌న్న ఉత్సాహం వ‌చ్చింది. ఇంత‌టి చ‌క్క‌ని విజ‌యాన్ని అందించిన ప్రేక్ష‌కుల‌కు ధ‌న్య‌వాదాలు అని తెలిపారు.


హీరో కృష్ణ చైత‌న్య మాట్లాడుతూ - ఓ మంచి కాన్సెప్టు ఉన్న చిత్రంలో అవ‌కాశం క‌ల్పించినందుకు నా ద‌ర్శ‌క‌నిర్మాత‌కు కృత‌జ్ఞ‌త‌లు. కిషోర్ గారు మ‌రిన్ని మంచి సినిమాలు తీయాల‌ని ఆకాంక్షిస్తున్నాను. ప్రేక్ష‌కాభిమానుల‌కు ధ‌న్య‌వాదాలు అన్నారు.


మ‌రో క‌థానాయ‌కుడు రాజేష్ రాధోడ్ మాట్లాడుతూ - ఓ పిల్లా నీవ‌ల్లా టైటిల్‌కి త‌గ్గ‌ట్టే చ‌క్క‌ని ప్రేమ‌క‌థా చిత్రం. ఆద్యంతం వినోదాత్మ‌కంగా సాగే స్టోరిని అంతే అందంగా ద‌ర్శ‌కులు తెర‌కెక్కించారు. ఈ సినిమాలో అవ‌కాశం ఇచ్చినంద‌కు వారికి ధ‌న్య‌వాదాలు అన్నారు.


క‌థానాయిక‌లు మాట్లాడుతూ - ఓ మంచి చిత్రంలో భాగం అయినందుకు సంతోషంగా ఉంది. సక్సెస్ ఇచ్చిన ప్రేక్ష‌కుల‌కు ధ‌న్య‌వాదాలు. కిషోర్‌గారు మ‌రిన్ని మంచి సినిమాలు తీయాలి అన్నారు.


కృష్ణ‌చైత‌న్య‌, రాజేష్ రాథోడ్‌, మోనికా సింగ్, షాలు చారసియా, సూర్య శ్రీనివాస్ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి సాహిత్యంః కృష్ణ మ‌దినేని, క‌రుణాక‌ర్ అడిగ‌ర్ల‌, కోరియోగ్ర‌ఫీ :జీతెంద్ర యాక్ష‌న్: మార్ష‌ల్ ర‌మ‌ణ‌, సినిమాటోగ్ర‌ఫీ- షోయబ్ అహ్మ‌ద్ కె.ఎం, ఎడిట‌ర్ః అనిల్ కింతాడ సహా నిర్మాత : మౌర్యా సంగీతంః మ‌ధు పొన్నాస్‌, నిర్మాతః కిషోర్‌, క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వంః కిషోర్‌Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Read More !