filmybuzz
filmybuzz

View

దండుపాళ్యం 2 లో ఎక్స్ పెక్ట్ చెయ్యని ఎలిమెంట్ ఉంటుంది - శ్రీనివాసరాజు

Sunday,May28th,2017, 10:29 AM

బొమ్మాళి రవిశంకర్‌, పూజాగాంధీ, రఘు ముఖర్జీ, సంజన, మకరంద్‌ దేశ్‌పాండే, రవి కాలే, భాగ్యశ్రీ ముఖ్యపాత్రధారులుగా వెంకట్‌ మూవీస్‌ పతాకంపై టాలెంటెడ్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరాజు దర్శకత్వంలో ఫ్యాషనేట్‌ ప్రొడ్యూసర్‌ వెంకట్‌ నిర్మించిన చిత్రం 'దండుపాళ్యం'. ఈ చిత్రం కన్నడలో బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయి 30 కోట్లు కలెక్ట్‌ చేసి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. విమర్శకుల ప్రశంసలు అందుకొని ప్రేక్షకుల ఆదరణతో 150 రోజులు ప్రదర్శింపబడిన ఈ చిత్రం తెలుగులోనూ అద్భుతమైన కలెక్షన్స్‌తో శతదినోత్సవం జరుపుకుంది. ఇదే టీమ్‌తో 'దండుపాళ్యం' చిత్రానికి సీక్వెల్‌గా 'దండుపాళ్యం2' చిత్రాన్ని శ్రీనివాసరాజు దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందించారు నిర్మాత వెంకట్‌. ఈ చిత్రం ట్రైలర్‌ రిలీజ్‌ కార్యక్రమం మే 28న హైదరాబాద్‌లోని దసపల్లా హోట్‌లో చాలా గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమంలో హీరోయిన్‌ పూజా గాంధీ, దర్శకుడు శ్రీనివాసరాజు, నిర్మాత వెంకట్‌, కెమెరామెన్‌ వెంకట్‌ ప్రసాద్‌, నిర్మాత వెంకట్‌ స్నేహితుడు వాసు. నిర్మాత వెంకట్‌ స్నేహితుడు వాసు 'దండుపాళ్యం2' ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు.


చిత్ర నిర్మాత వెంకట్‌ మాట్లాడుతూ - ''రియలిస్టిక్‌ ఇన్సిడెంట్స్‌ని బేస్‌ చేసుకొని నిర్మించిన 'దండుపాళ్యం' చిత్రం కన్నడ, తెలుగు భాషల్లో సూపర్‌ డూపర్‌హిట్‌గా నిలిచింది. కమర్షియల్‌గా సక్సెస్‌ అయిన ఆ చిత్రం నాకెంతో పేరు తెచ్చిపెట్టింది. ఆ చిత్రానికి సీక్వెల్‌గా 'దండుపాళ్యం2' చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో నిర్మించాం. కన్నడలో రిలీజ్‌ అయిన ట్రైలర్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఇప్పుడు తెలుగుకి సంబంధించిన ట్రైలర్‌ని రిలీజ్‌ చేశాం. 'దండుపాళ్యం' చిత్రానికి 5 రెట్లు మించి 'దండుపాళ్యం2' చిత్రం వుంటుంది. ఈ చిత్రంలో నటీనటులు అందరూ ఎక్స్‌ట్రార్డినరీగా పెర్‌ఫార్మ్‌ చేశారు. అలాగే టెక్నీషియన్స్‌ కూడా ఎంతో హార్డ్‌ వర్క్‌ చేసారు. ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించాం. మా దర్శకుడు శ్రీనివాసరాజు ఈ చిత్రాన్ని చాలా అద్భుతంగా తెరకెక్కించారు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు అన్నీ పూర్తయ్యాయి. జూన్‌లో సినిమాని రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నాం. 'దండుపాళ్యం' చిత్రాన్ని ఆదరించినట్టుగానే 'దండుపాళ్యం2' చిత్రాన్ని కూడా ఆదరించి పెద్ద సక్సెస్‌ చెయ్యాలని ప్రేక్షకుల్ని కోరుకుంటున్నాను'' అన్నారు.


కెమెరామెన్‌ వెంకటప్రసాద్‌ మాట్లాడుతూ - ''ప్రేమకథ, బాబీ, పౌర్ణమి, 100 పర్సెంట్‌ లవ్‌, లయన్‌ చిత్రాలకు కెమెరామెన్‌గా వర్క్‌ చేశాను. శ్రీనివాసరాజు కథ చెప్పగానే చాలా ఇన్‌స్పైర్‌ అయ్యాను. ఈ సినిమా మిస్‌ అవ్వకూడదనే ఫీలింగ్‌ కలిగింది. యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. చాలా నేచురల్‌ లొకేషన్స్‌లో షూట్‌ చేశాం. ఆర్టిస్టులంతా అద్భుతంగా నటించారు. పార్ట్‌ 1 కంటే పార్ట్‌ 2 చాలా కొత్తగా వుంటుంది'' అన్నారు.


హీరోయిన్‌ పూజా గాంధీ మాట్లాడుతూ - ''నా ఫస్ట్‌ ఫిలిం మంగారుమలై. ఆ చిత్రం తర్వాత దండుపాళ్య చిత్రం చేస్తున్నాను అనగానే చాలా మంది ఆ సినిమా ఎందుకు చేస్తున్నావని అడిగారు. నటిగా గుర్తుండిపోయే పాత్రలు చేయడం నాకు ఇష్టం. హీరోయిన్‌ అంటే రొటీన్‌ పాత్రలు కాకుండా కొత్త డైమెన్షన్‌ వున్న పాత్రలు చేస్తేనే మనకంటూ ఒక గుర్తింపు వుంటుంది. ఈ కథ నాకు బాగా నచ్చింది. అందుకే ఈ సినిమా చేశాను. ట్రైలర్‌ చూసి మా అమ్మ భయపడిపోయి బాగా ఏడ్చేసింది. తర్వాత సినిమా చూశాక చాలా హ్యాపీగా ఫీల్‌ అయింది. చాలా మంది దండుపాళ్య సినిమా చూసి ఎంతో అప్రిషియేట్‌ చేశారు. దండుపాళ్యం2 చిత్రంలో లక్ష్మీ పాత్ర చేయడం ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఇంత మంచి చిత్రంలో నటించినందుకు చాలా ప్రౌడ్‌గా ఫీల్‌ అవుతున్నాను. శ్రీనివాసరాజు పార్ట్‌ 2 కథ చెప్పగానే ఇమ్మీడియట్‌గా ఒప్పుకున్నాను. దండుపాళ్యం కంటే దండుపాళ్యం2 ఇంకా చాలా బాగుంటుంది. ఆయన టేకింగ్‌ ఫెంటాస్టిక్‌గా వుంది. స్టోరీలో చాలా డెప్త్‌ వుంది. రఫ్‌ లుక్‌తో న్యూ డైమెన్షన్‌లో నా క్యారెక్టర్‌ వుంటుంది. కెమెరామెన్‌ వెంకట్‌ ప్రతి ఫ్రేమ్‌ని బ్యూటిఫుల్‌గా చిత్రీకరించారు. శ్రీనివాసరాజు ఎంతో టాలెంట్‌ వున్న డైరెక్టర్‌. ఆయన ఇంకా ఎన్నో మంచి సినిమాలు చెయ్యాలని కోరుకుంటున్నాను'' అన్నారు.


దర్శకుడు శ్రీనివాసరాజు మాట్లాడుతూ - ''దండుపాళ్యం స్క్రిప్ట్‌ని ఫస్ట్‌ నా వైఫ్‌కి చెప్పాను. ఆమెకి సినిమా నాలెడ్జ్‌ ఎక్కువ. కథ విన్న తర్వాత ఈ సినిమా చెయ్యొద్దని చెప్పింది. అయినా నేను ఎంతో ధైర్యం చేసి ఈ చిత్రాన్ని తీశాను. ఎన్నో విమర్శలను ఎదుర్కొని సినిమా సంచలన విజయం సాధించింది. ఈ చిత్రంలోని ఆర్టిస్టులందరూ థియేటర్‌ బ్యాక్‌గ్రౌండ్‌ నుంచి వచ్చినవారే. ప్రతి ఒక్కరూ కథ నచ్చి వారి వారి పాత్రల్లో ఎంతో ఇన్‌వాల్వ్‌ అయి అద్భుతంగా నటించారు. ఈ సినిమా ఒక సర్‌ప్రైజ్‌ ఎలిమెంట్‌తో స్టార్ట్‌ అయి సర్‌ప్రైజ్‌ ఎలిమెంట్‌తో ఎండ్‌ అవుతుంది. సినిమా అంతా షాకింగ్‌గా, థ్రిల్‌గా వుంటుంది. వయొలెన్స్‌ లేకుండా హానెస్ట్‌ ఒక మంచి సినిమా చేశాను. నేను మహాభారతం, రామాయణం తియ్యలేదు. అలా అని సమాజానికి మంచి సందేశాన్నిచ్చే సినిమా కూడా తియ్యలేదు. సినిమాలు చూసి ఎవరూ బాగుపడరు, సినిమాలు చూసి ఎవరూ చెడిపోరు. సినిమాని సినిమాలా చూసి అందరూ ఎంజాయ్‌ చెయ్యాలని కోరుకుంటున్నాను. మంచి కథలు నమ్ముకొని చేస్తే గ్యారెంటీగా ఏ సినిమా అయిన సక్సెస్‌ అవుతుందని నా నమ్మకం. దండుపాళ్యం 2 తర్వాత దండుపాళ్యం 3 కూడా రిలీజ్‌ కాబోతోంది. దండుపాళ్యం2కి నాలుగైదు వారాలు గ్యాప్‌ ఇచ్చి పార్ట్‌ 3 ని రిలీజ్‌ చేస్తాం. ఈ సినిమా చేశాక ఎలాంటి సినిమా అయినా తియ్యగలననే కాన్ఫిడెన్స్‌ వచ్చింది'' అన్నారు.


బొమ్మాళి రవిశంకర్‌, పూజాగాంధి, రఘు ముఖర్జీ, సంజన, భాగ్యశ్రీ, మకరంద్‌ దేశ్‌పాండే, రవి కాలె, పెట్రోల్‌ ప్రసన్న, డానీ కుట్టప్ప, జయదేవ్‌, కరి సుబ్బు, కోటి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వెంకట్‌ ప్రసాద్‌, సంగీతం: అర్జున్‌ జన్య, కో-డైరెక్టర్‌: రమేష్‌ చెంబేటి, నిర్మాణం: వెంకట్‌ మూవీస్‌, నిర్మాత: వెంకట్‌, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: శ్రీనివాసరాజు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసి ..

Read More !

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ..

Read More !

Gossips

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Moodu Puvvulu AAru Kaayalu Teaser

#U Movie Theatrical Trailer

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

Read More !