filmybuzz
filmybuzz

View

గ్రాండ్ గా 'అంధగాడు' ఫ్రీ రిలీజ్ వేడుక.. జూన్ 2న విడుదల!

Monday,May29th,2017, 03:12 AM

ఎకె ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రాజ్‌తరుణ్, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న చిత్రం అంధగాడు. ఈ చిత్రం ద్వారా రచయిత వెలిగొండ శ్రీనివాస్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకొని జూన్ 2 న విడుదల కు సిద్ధంగా ఉండటం తో ఈ చిత్ర యూనిట్ ఆదివారం రామానాయుడు స్టూడియో లో గుమ్మడి కాయ వేడుకను మరియు ప్రీ రిలీజ్ వేడుకను ఒకే సారి ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ నేపథ్యం లోనే 'అంధగాడు' చిత్ర లో నటించిన నటులకు మరియు సినిమా కు పనిచేసిన టెక్నిషియన్స్ కు మొమెంటోస్ ప్రధానం చేశారు.

 

అనంతరం మొదటగా సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర మాట్లాడుతూ - నేను చేసిన ప్రతి చిత్ర పాలకు ప్రేక్షకులు సూపర్ రెస్పాన్స్ ఇస్తున్నందుకు వారికి నా కృతజ్ఞతలు. ఇక చిత్ర విషయానికి వస్తే ఇటీవలే విడుదలయిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. లిరిక్స్ అందించిన భాస్కరభట్ల, రామజోగయ్య శాస్త్రి గారికి, పాడిన సింగర్స్ కు ఈ సందర్బంగా నా కృతజ్ఞతలను తెలియచేస్తున్నా, దర్శకుడు వెలిగొండ తో వర్క్ చేయడం ఎంతో ఉత్సహాన్ని ఇచ్చింది నాకు తదుపరి చిత్రం కూడా ఇదే బ్యానర్ లో తన తోనే చేయాలని కోరుకుంటున్నా, అలానే రాజ్ తరుణ్ తో ఇది నా రెండవ సినిమా ఈ 'అంధగాడు' చిత్రం కూడా విజయం సాధించాలని ఆశిస్తున్నా అన్నారు. 


లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ - సీనియర్ ఎన్ టి ఆర్ గారి జయంతి రోజున ఈ చిత్ర వేడుకను జరుపుకోవడం ఆనందంగా ఉంది, అంధగాడు చిత్రం లాంటి వినూత్న తరహా చిత్రాలన్నీ విజయం సాధించాయి, ఈ చిత్రానికి సంగీతం హైలెట్ గా నిలుస్తుంది, హిట్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం కూడా మరో గొప్ప విజయం సాధిస్తుందని అన్నారు.


దర్శకుడు వెలిగొండ శ్రీనివాస్ మాట్లాడుతూ - 18 సంవత్సరాల క్రితం రైటర్ గా నాపేరు నేను పేపర్ లో, టీవీ లో చూసుకున్నప్పుడు ఎంత ఎక్సయిట్ అయ్యానో ఇపుడు కూడా అంతే ఫీల్ అవుతున్నా, ఈ సినిమా కు దర్శకుడిగా మారడానికి కారణం మాత్రం హీరో రాజ్ తరునే అని చెప్పగలను, రాజా రవీంద్ర నా స్నేహితుడు అయినా నాకు సొంత బ్రదర్ లాంటి వాడు, ఇక ఈ సినిమా లో నటుడు రాజేంద్ర ప్రసాద్ గారు లేకపోతే ఈ సినిమానే లేదని చెప్పొచ్చు, నేను ఈ సినిమా కంప్లీట్ చేయడానికి తోడ్పడిన నా టీమ్ మరియు కెమెరా మెన్ లు నాకు ఒక కన్ను లాంటి వారు, నేను బ్రతికి ఉన్నన్ని రోజులు ఇలాంటి మంచి సినిమా లనే చేస్తానని ఈ సందర్భంగా తెలియచేస్తున్నా అన్నారు. ఎకె ఎంటర్టైన్మెంట్ నాకు సొంత బ్యానర్ లాంటిది, ఈ చిత్రం లో మెయిన్ విలన్ గా అవకాశం ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు నా కృతజ్ఞతలు, అదేవిధంగా ఒక ముఖ్య విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను అదేమిటంటే ఒక్క రోజు ముందుగానే అనగా జూన్ 1 న అర్ధరాత్రి 2 గంటలకు రెండు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో మరియు పట్టణాలలో ప్రీమియర్లను నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. హైదరాబాద్, వైజాగ్, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, తిరుపతి వంటి నగరాల్లో ప్రీమియర్ షోలను నిర్వహిస్తారు. ఈ ప్రీమియర్ షో లు చాలా ప్రాంతాలలో ఏకకాలంలో ఒకేసారి నిర్వ్హయించాలని నిర్ణయించామని తెలిపారు నటుడు రాజా రవీంద్ర.


ఇక హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ - ఈ బ్యానర్, ఈ కెమెరా మెన్, హీరోయిన్ హెబ్బా, ఎడిటర్ ఇలా వీరందరితో నాకు మూడవ సినిమా అందుకే నాకు చాల స్పెషల్ మూవీ ఇది. శేఖర్ చంద్ర తో రెండవ సినిమా, ఎకె ఎంటర్టైన్మెంట్ నాకు సొంత బ్యానర్ అని గుండెమీద చెయ్యివేసుకొని చెప్పగలను ఏ నిర్మాత అయినా మనకెంత వస్తుందని ఆలోచిస్తారు కానీ ఈ నిర్మాతలు మాత్రం ఎంత బాగా సినిమా చేయగలము అని ఆలోచించే వ్యక్తులు వీరు. ఇక రాజేంద్ర ప్రసాద్ గారితో కలసి నటించడం సంతోషం గా ఉంది, దర్శకుడు వెలిగొండ చాలా బ్రిలియంట్ గా హేండిల్ చేసాడు ఈ సినిమాను కనుక తప్పకుండా విజయం సాధిస్తుంది అని తెలిపారు.

 

చివరిగా నటుడు డా. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ - సుంకర వాళ్ళు మేము చిన్నప్పుడు మా వూళ్ళో మా పక్కింటివాళ్లే నట తరువాత ఎప్పుడో వారు చెబితే తెలిసింది కనుక ఎకె ఎంటర్టైన్మెంట్ నా సొంత బ్యానర్ అని చెప్పగలను, ఒక రైటర్ దర్శకుడిగా మారితే ఆ సినిమా ఒక అద్భుతమే అవుతుంది, ఈ మధ్య కాలం లో నేను చేసిన సినిమాలల్లో ఇంత మంచి కథ నేను ఎప్పుడు వినలేదు, నటించలేదు, రాజ్ తరుణ్ అంటే నాకు ప్రత్యేకమైన ఇష్టం ఉంది, హిట్ కాంబినేషన్ అయిన రాజ్ మరియు హెబ్బా కలసి మూడు సినిమా లు కాదు ముప్పై సినిమాలు చేయాలని ఆశీర్వదిస్తున్నా, అలానే అద్భుతమైన కథ తో వస్తున్న ఈ చిత్రాన్ని ప్రతిఒక్కరూ అందరిస్తారని కోరుకుంటున్నా అని అన్నారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసి ..

Read More !

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ..

Read More !

Gossips

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Moodu Puvvulu AAru Kaayalu Teaser

#U Movie Theatrical Trailer

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

Read More !