filmybuzz
filmybuzz

View

జూలై 2వ వారంలో 'గల్ఫ్' విడుదల.. తెలియని ఎన్నో ఆంశాలు తెలుస్తాయి!

Tuesday,June13th,2017, 02:24 AM

శ్రావ్య ఫిలిమ్స్ పతాకంపై పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో యక్కలి రవీంద్రబాబు, యమ్. రామ్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న గల్ఫ్ చిత్రం విడుదలకు సిద్దమైంది. ఎడారి దేశాలకు వలస వెళ్ళిన లక్షలాది మంది వారి జీవన స్థితి గతులను, గల్ఫ్ లో వారి భావోద్యోగాలను ఒక అందమైన ప్రేమ కథ నేపధ్యంలో చూసే ఈ ఎమోషనల్ ఎంటర్ టైనర్. జూలై రెండో వారంలో విడుదల చెయ్యనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.


దుబాయ్, రసల్ కైమా, కువైట్ లాంటి గల్ఫ్ దేశాలలో విస్తృతంగా షూటింగ్ జరుగుతున్న ఈ చిత్రానికి సంగీతం ప్రవీణ్ ఇమ్మడి అందించారు. మస్కట్, UAB, విడుదల చేసిన ఆడియో టీజర్లకు విశేషంగా ఆదరణ లభించిందని చిత్రానికి రీ రికార్డింగ్ కూడా చక్కగా కుదిరిందని, సిరాశ్రీ, కాసర్ల శ్యామ్, మాస్టార్జీ లు అందించిన సాహిత్యం, అంజనా సౌమ్య, ధనుంజయ్, కే. యం. రాధాక్రిష్ణన్, దీపు, గీత మాధురి, హైమత్, మోహన భోగరాజు ల స్వరాలు, ఆడియోకి మరింత వన్నె తెచ్చాయని, జూలై ఒకటవ తారీకున ఆడియో విడుదల చేయనున్నామని సంగీత దర్శకుడు ప్రవీణ్ ఇమ్మడి తెలియచేసారు.


సరిహద్దులు దాటిన ప్రేమ కథ అనే క్యాప్సన్ తో వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులని అలరిస్తుందని, ఇది తమ ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, క్రిమినల్ ప్రేమ కథల కన్నా పెద్ద కమర్షియల్ విజయాన్ని సొంత ఊరు, గంగపుత్రులకన్న ఎక్కువగా విమర్శకుల మన్ననలు పొందగలదని ఈ చిత్రాన్ని జూలై రెండో వారంలో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత యక్కలి రవీంద్రబాబు తెలియజేసారు.


మాటల రచయుత పులగం చిన్నారాయణ మాట్లాడుతూ - ''దాదాపుగా ప్రతి రోజు దిన పత్రికల్లో గల్ఫ్ కష్టాల గురించి, వెతలు గురించి ఎదో ఒక వార్త కనిపిస్తూనే ఉంటుంది. అందరికీ తెలిసినట్టే అనిపిస్తూ తెలియని అంశాలెన్నో గల్ఫ్ వెతల్లో కాన వస్తాయి. అసలు ఈ నేపధ్యంలో ఇంతవరకు తెలుగులో సినిమా రాకపోవడమే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సునీల్ కుమార్ రెడ్డి ఆ లోటు తీర్చేసారు. ఆయనలోని జర్నలిస్ట్ ఈ సినిమా తీయడానికి ఉసిగోల్పినట్టు అనిపిస్తుంది. ఆయన ఇంతకు ముందు తీసిన సినిమాలన్నీ ఒకెత్తు, ఇదొక ఎత్తు, ఈ సినిమాకు డైలాగ్స్ రాసే అవకాశం రావడం ఒక టర్నింగ్ పాయింట్ గా భావిస్తున్నాను” అని చెప్పారు.


చిత్ర దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ - ''గత రెండు సంవత్సరాలుగా ఈ ప్రాజెక్ట్ మీద తమ యూనిట్ పని చేసిందని, గల్ఫ్ దేశాలన్నీ పర్యటించి అక్కడ విజయాలు అందుకున్న వలస కూలీలను లేబర్ క్యాంపుల్లో ప్రత్యేక్షంగా కలిసి, దాదాపు 400 కి పైగా కేస్ స్టడీలు తీసుకుని తయారు చేసుకున్న కథ ఈ గల్ఫ్ అని, మనస్సుకు హత్తుకునే మాటలతో, అర్దవంతంగాను, వినోదాత్మంగాను వుండే విధంగా పులగం చిన్నారాయణ అందించిన సంభాషణలు చక్కటి బావోద్యోగాలు, మంచి నటన, కొత్త సన్ని వేశాలు. ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ అని, ఈ చిత్రం ప్రేక్షకులనందరినీ రంజింప చేస్తూనే ఆలోచింప చేస్తుందన్నారు.


చిత్ర ప్రచార భాద్యతలు నిర్వహిస్తున్న ఎగ్జిక్యుటివ్ ప్రొడ్యూసర్ బి. బాపిరాజు మాట్లాడుతూ - ''ఈ చిత్రానికి ఎక్కువగా ప్రచారం గల్ఫ్ ప్రవాస అవగాహన యాత్ర పేరుతో ఉభయ తెలుగు రాష్ట్రాలలో తమ యూనిట్, సామాజిక కార్యకర్తలతో, పోలీసు డిపార్టమెంట్ తో, ఇతర ప్రభుత్వ సంస్థలతో Safe Migration కాంపెయిన్ చేస్తున్నామన్నారు. ఇప్పటికే తొలి విడుత తెలంగాణలో సిరిసిల్ల, నిజామాబాద్, నిర్మల్ లో నిర్వహించామని త్వరలో అన్ని జిల్లాలలో కూడా ఈ పర్యటన జరుగుతుందని తెలిపారు.


చేతన్ మద్దినేని, డింపుల్, సంతోష్ పవన్, అనిల్ కళ్యాణ్, సూర్య ( పింగ్ పాంగ్), నల్ల వేణు, నాగినీడు, డిగ్గీ, పోసాని కృష్ణమురళి, జీవా, తనికెళ్ళ భరణి, తోటపల్లి మధు, భద్ర, బిత్తిలి సత్తి, ప్రభాస్ శ్రీను, శంఖరాభరణం రాజ్యలక్ష్మి, తీర్ద, సన, యఫ్ యం బాబాయ్, మహేష్ తదితరులు తారాగణం.


కెమెరా : యస్. వి. శివరాం, ఎడిటింగ్ : కళ్యాణ్ సామ్యుల్, సంగీతం : ప్రవీణ్ ఇమ్మడి, మాటలు : పులగం చిన్నారాయణ, సహ నిర్మాతలు : డాక్టర్ ఎల్ . ఎస్. రావు, విజయ్, రాజా, ఎగ్జిక్యుటివ్ ప్రొడ్యూసర్ : బి. బాపిరాజు, నిర్మాతలు : యక్కలి రవీంద్రబాబు, యమ్ . రామ్ కమార్ (USA), స్క్రీన్ ప్లే, దర్శకత్వం : పి . సునీల్ కుమార్ రెడ్డి



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Aadi Starrer Nuvve Theatrical Trailer

Devadasi Motion Poster

Pratikshanam 1min Trailer

Read More !