View

హైదరాబాద్ లో స్పైడీ హల్ చల్.. జూలై 7న గ్రాండ్ రిలీజ్!

Wednesday,June28th,2017, 10:15 AM

స్పైడర్ మ్యాన్ అంటే తెలియని సినీ ప్రేమికుడు ఉండడు. ముఖ్యంగా చిన్న‌పిల్ల‌ల‌కి హీరో అంటే స్పైడ‌ర్‌మ్యాన్ మాత్ర‌మే గుర్తుంటాడు. మెరుపు వేగంతో దూసుకుపోతూ, చాలా సింపుల్ గా పవర్ ఫుల్ విలన్స్ ఆట కట్టించే ఈ సూపర్ హీరోకి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. స్పైడర్ మ్యాన్ సిరీస్ నుంచి సినిమా వచ్చిన ప్రతిసారీ వరల్డ్ మూవీ లవర్స్ గ్రూప్ లో ఓ పండగ వాతవరణం నెలకొటోంది. ఇండియాలో కూడా స్పైడీకి కోట్ల కొద్దీ ఫ్యాన్స్ ఉన్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మళయాలీ భాషల్లో స్పైడర్ మ్యాన్ సినిమాలు అనువాదం అయ్యి ఘ‌న‌విజ‌యాలు సాధిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవలే స్పైడర్ మ్యాన్ సిరీస్ లో మరో కొత్త సినిమా తెరకెక్కింది. స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్ అనే టైటిల్ తో రాబోతున్న ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా స్పైడీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగులో కూడా ఈ సినిమా జులై 7నే విడుదల కాబోతుంది.


ఈ చిత్ర ప్రచారంలో భాగంగా హైదరాబాద్ లో స్పైడీ సందడి చేశాడు. హైదరాబాద్ లో జరిగిన ప్రమోషన్ కార్యక్రమంలో ఉత్సాహంగా... స్పైడీతో ఫొటోలు, సెల్ఫీలు దిగి సందడి చేశారు. స్పైడీ చేసిన స్టంట్లు, విన్యాసాలు... ఆశ్యర్యపరిచాయి. స్పైడీతో ఫోజులు పెట్టి మరీ ఫొటోలు దిగడం విశేషం. చిన్న పిల్లల దగ్గరి నుంచి అన్ని వయసుల వారు స్పైడీతో ఫొటోలు దిగి స్పైడర్ మ్యాన్ అంటే తమకు ఎంతిష్టమో చాటి చెప్పారు. దేవనార్ బ్లైండ్ స్కూల్లో జరిగిన మరో క్యార్యక్రమంలో స్పైడీ చేసిన సందడి అంతా ఇంతా కాదు. తమకు స్పైడర్ మ్యాన్ అంటే ఎంతో ఇష్టమని... అతనితో కలిసి ఆడుకోవడం చాలా హ్యాపీగా ఉందని దేవనార్ విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని పలు న్యూస్ ఛానెల్స్ ఆఫీసుల్లోనూ... స్పైడీ సందడి చేయడం విశేషం. ఆయా సంస్థల ప్రతినిధులు, జర్నలిస్టులు స్పైడీతో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు. స్పైడర్ మ్యాన్ ను స్క్రీన్ మీద చూడటమే కానీ... ఇలా ప్రత్యక్షంగా చూస్తామనుకోలేదని పలువురు చెప్పడం విశేషం.


ఇక ఇప్పటికే విడుదలైన స్పైడర్ మ్యాన్ ట్రైలర్ కు సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ వచ్చేసింది. మార్వెల్ కామిక్స్, కొలంబియా పిక్చర్స్ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ సినిమాను సోనీ పిక్చర్స్ వారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.


జూలై 7న ఈ సినిమా ని తెలుగు రాష్ట్రాల్లో డైరెక్టు తెలుగు సినిమాలానే భారీ స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా సోనీ సంస్థ ప్రతినిథులు ప్రకటించారు. అలానే ఈ సినిమాలో స్పైడర్ మ్యాన్ చేసే విన్యాసాలుతో పాటు ఐరన్ మ్యాన్ చేసే యాక్షన్ స్టంట్లు కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయని సోనీ వారు చెబుతున్నారు. ఇక ఈ చిత్రంలో స్పైడర్ మ్యాన్ పాత్రలో కొత్త హీరో థామస్ స్టాన్లే హాలాండ్ నటిస్తున్నాడు, ప్రతినాయకునిగా అకాడమీ అవార్డ్ విన్నర్, బర్డ్ మ్యాన్ ఫేమ్ మిచెల్ కీటన్ నటిస్తున్నాడు, అలానే ఈ సినిమాకి సరికొత్త క్రేజ్ తీసుకొచ్చిన ఐరన్ మ్యాన్ పాత్రలో రాబర్డ్ డౌనీ జూనీయర్ నటిస్తున్నట్లుగా సోనీ సభ్యులు తెలిపారు



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. రీ ఎంట్రీకి ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నాడు. 'శ్రీమంతుడు' చిత్రం త ..

Read More !

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ్యాప్ తీసుకోకుండానే 151వ సినిమా చేయడా ..

Read More !

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కైనా సంతోషంగానే ఉంటుంది. కానీ ఆ అవకాశం ..

Read More !

Gossips

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

500, 1000 నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటన బయటికి రాగానే టాలీవుడ్ కి చెందిన ఓ స ..

నందమూరి హీరో కళ్యాణ్ రామ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో ఓ మల ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం వస్తే.. ఎగిరి గంతేసి ..

'జనతాగ్యారేజ్' చిత్రం తర్వాత ఎన్టీఆర్ చేయబోయే తదుపరి సినిమా ఏంటీ.. ఎవరి దర్ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Aadi Starrer Nuvve Theatrical Trailer

Devadasi Motion Poster

Pratikshanam 1min Trailer

Mahesh babu, A.R.Murugadoss SPYDER New Teaser

Read More !