filmybuzz
filmybuzz

View

చిరు, పవన్ కళ్యాణ్ కి నక్ష‌త్రం లోని పాత్ర గురించి చెప్పిన సాయిధరమ్ తేజ్!

Thursday,July06th,2017, 06:10 AM

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్సకత్వంలో శ్రీ చక్ర మీడియా సారధ్యంలో బుట్ట బొమ్మ క్రియేషన్స్ ప‌తాకంపై ప్రొడ్యూసర్ కె.శ్రీనివాసులు “విన్ విన్ విన్ క్రియేషన్స్”పతాకంపై నిర్మాతలు వేణుగోపాల్, సజ్జు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం నక్ష‌త్రం. ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం బుధ‌వారం హైద‌రాబాద్‌లో జరిగింది. భీమ్స్‌, హ‌రిగౌర‌, భ‌ర‌త్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.


ఆడియో సీడీల‌ను సాయిధ‌ర‌మ్ తేజ్‌, సందీప్ కిష‌న్ విడుద‌ల చేసి తొలి సీడీని రెజీనా, ప్ర‌గ్యా జైశ్వాల్‌కు అందించారు.


ఈ కార్య‌క్ర‌మంలో సాయిధ‌ర‌మ్‌తేజ్‌, సందీప్‌కిష‌న్‌, కృష్ణ‌వంశీ, శ్రేయా శ‌ర‌న్‌, ప్ర‌గ్యాజైశ్వాల్‌, రెజీనా, కె.వి.వి.స‌త్యనారాయ‌ణ‌, సుధీర్‌, విజ‌య్‌కుమార్‌, సునీల్ నారంగ్‌, తనీష్‌, మాన‌స్‌, ర‌వి, మ‌ల్టీడైమ‌న్ష‌న్ వాసు, ర‌వ‌ణం స్వామి త‌దిత‌రులు పాల్గొన్నారు.


మంచి క్యారెక్ట‌ర్ ఇచ్చినందుకు కృష్ణ‌వంశీగారికి థాంక్స్‌
సాయిధ‌ర‌మ్ తేజ్ మాట్లాడుతూ - గోవిందుడు అంద‌రివాడేలే సినిమా షూటింగ్ స‌మ‌యంలో రాంచ‌ర‌ణ్ అన్న‌ను క‌ల‌వ‌డానికి వెళ్లిన‌ప్పుడు కృష్ణ‌వంశీగారికి క‌లిసి మీ సినిమాలో ఏదైనా చిన్న క్యారెక్ట‌ర్ ఉన్నా చెప్పండి సార్ చేస్తాన‌ని అన్నాను. అలా వ‌చ్చిన అవ‌కాశ‌మే అలెగ్జాండ‌ర్ క్యారెక్ట‌ర్‌. కృష్ణ‌వంశీగారికి నా మ‌న‌స్ఫూర్తిగా థాంక్స్‌. ఓ స్టూడెంట్ కాలేజ్‌కు వెళ్ళిన‌ట్లే వెళ్ళి నేర్చుకున్నాను. ఈ క్యారెక్ట‌ర్ వ‌చ్చిన త‌ర్వాత చిరంజీవిగారికి, ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌గారికి చెప్పిన‌ప్పుడు చాలా విష‌యాలు నేర్చుకుంటావురా అన్నారు. సందీప్‌కిష‌న్‌, తనీష్‌, మాన‌స్ అంద‌రూ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. నిర్మాత‌లు శ్రీనివాస్‌, వేణుగోపాల్‌, స‌జ్జ‌గారికి థాంక్స్‌. భీమ్స్‌, హ‌రిగౌర‌, భ‌ర‌త్‌గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు.


నక్ష‌త్రం వంటి సినిమా చేయ‌డంతో నా క‌డుపు నిండిపోయింది
నిర్మాత శ్రీనివాస్ మాట్లాడుతూ - ఈ సినిమా చేయ‌డం ఎంతో ఎగ్జ‌యింట్‌గా ఉంది. వేణుగోపాల్‌గారిచ్చిన ధైర్యంతో సినిమా చేయ‌గ‌లిగాను. కృష్ణ‌వంశీగారు ఇచ్చిన స‌పోర్ట్‌తో సినిమాను ఇక్క‌డ వ‌ర‌కు తీసుకురాగ‌లిగాం. కృష్ణ‌వంశీగారికి నా పాదాభివంద‌నం. కృష్ణ‌వంశీగారు ఆడియెన్స్ డైరెక్ట‌ర్‌. ఆడియెన్స్‌కు న‌చ్చే సినిమాలే చేస్తుంటారు. బ‌య‌ట కృష్ణ‌వంశీగారితో సినిమా అన‌గానే ఆయ‌నొక పిచ్చి డైరెక్ట‌ర్ అన్న‌వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నేను సినిమా పిచ్చోణ్ణే. కాబ‌ట్టే ఇద్ద‌రి మ‌ధ్య ఏ స‌మ‌స్య‌లు రాలేదు. కృష్ణ‌వంశీగారిపై న‌మ్మ‌కంతో సినిమా మొద‌లు పెట్టాం.ముందు ఈ సినిమాలో సందీప్‌కిష‌న్‌, రెజీనా త‌ప్ప పెద్ద స్టార్ కాస్ట్ లేదు. కానీ ఈరోజు ఇంత పెద్ద స్టార్ కాస్ట్ ఉన్నందుకు కృష్ణ‌వంశీగారే కార‌ణం. మ‌హాభార‌తంలో అభిమన్యుడిలా ఈ సినిమా కోసం మాకు స‌పోర్ట్ చేశారు. ఏదో చిన్న సినిమా అనుకున్నాం. ఈరోజు సినిమా ఇంత పెద్ద‌దిగా మారడానికి కార‌ణం, కృష్ణ‌వంశీగారు, సాయిధ‌ర‌మ్‌తేజ్‌గారే కార‌ణం. ఇంత పెద్ద సినిమాను చేయ‌డంతో క‌డుపు నిండిపోయింది. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. న‌క్ష‌త్రంలో కృష్ణ‌వంశీగారు సాయిధ‌ర‌మ్ తేజ్‌, సందీప్‌కిష‌న్‌, రెజీనా, ప్ర‌గ్యా ఈ అంద‌రినీ కొత్త క్యారెక్ట‌ర్స్‌గా ప‌రిచ‌యం చేస్తున్నారు అన్నారు.


కృష్ణ‌వంశీతో మూవీ చేయాల‌నే క‌ల నేర‌వేరింది
సందీప్‌కిష‌న్ మాట్లాడుతూ - నేను హైద‌రాబాద్‌కు వ‌చ్చి తొమ్మిదేళ్ళు అయ్యింది. ఏడేళ్ల‌కు ముందు నేను కృష్ణ‌వంశీగారిని క‌ల‌వాల‌ని ఆయ‌న‌కు ట్విట్ట‌ర్లో మెసేజ్ పెట్టాను కానీ ఆయ‌న ఏం రిప్లై ఇవ్వలేదు. ఇప్పుడు సినిమా చేసే అవ‌కాశం ఇచ్చారు. నేను నా సినీ ప్ర‌యాణంలో మూడు రిలేష‌న్స్‌ను సంపాదించుకున్నాను. ఆ మూడు ఈ సినిమాలో క‌న‌ప‌డుతున్నాయి. అందులో సాయిధ‌ర‌మ్‌తేజ్ ఒక‌డు. నా బెస్ట్ ఫ్రెండ్. సెకండ్ బెస్ట్‌ఫ్రెండ్ రెజీనా. ఇప్పుడు కృష్ణ‌వంశీగారు. ఈ సినిమా కృష్ణ‌వంశీగారు ఎవ‌రితోనైనా చేసుండ‌వ‌చ్చు. ఆయ‌న ఎక్క‌డో నాపై న‌మ్మ‌కం ఉంచారు. ఈరోజు ఆ న‌మ్మ‌కానికి నేను న్యాయం చేశాన‌నే అనుకుంటున్నాను. నిర్మాత‌లు మ‌మ్మ‌ల్ని ఎంతో న‌మ్మారు. త‌నీష్ ఈ సినిమాలో ఇర‌గ‌దీశాడు. కృష్ణ‌వంశీగారితో సినిమా చేయాల‌నుకునే క‌ల మా యూనిట్‌లో చాలా మందికి తీరింది అన్నారు.


సునీల్ నారంగ్ మాట్లాడుతూ - న‌క్ష‌త్రం సినిమాలో న‌టించిన న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్ అంద‌రికీ అభినంద‌న‌లు. సినిమా పెద్ద స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.


మ‌ల్టీడైమ‌న్ష‌న్ వాసు మాట్లాడుతూ - కృష్ణ‌వంశీగారి పేరులోనే క్రియేటివిటీ ఉంది. ఆయ‌న ఏ సినిమా తీసినా చాలా కొత్త‌గా తీస్తారు. ఇండ‌స్ట్రీలోని ప్రతి ఆర్టిస్టుకి కృష్ణ‌వంశీగారి ద‌ర్శ‌క‌త్వంలో ప‌నిచేయాల‌నే కోరిక ఉంటుంది. ఆయ‌నంత మంచి సినిమాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించారు. న‌టీన‌టుల్లో మంచి న‌ట‌న‌ను బ‌య‌ట‌కు తీస్తారు. అన్ని పాట‌లు అద్భుతంగా ఉన్నాయి. నిర్మాత‌లు వేణుగోపాల్‌, సజ్జు. ఈ ఏడాది క్రేజిగా ఎదురుచూస్తున్న సినిమాలో ఇదొక‌టి. టీంకు ఆల్ ది బెస్ట్‌ అన్నారు.


మాన‌స్ మాట్లాడుతూ - ఈ సినిమా సందీప్ అన్న కెరీర్‌లోనే పెద్ద హిట్ కావాలి. కృష్ణ‌వంశీగారు ఏ ఆర్టిస్టుతో చేసినా ఆ యాక్ట‌ర్ బిజీ అయిపోతారు. అందుకు నిదర్శ‌నం సందీప్ అన్న‌. నా ఫేవ‌రేట్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్‌గారితో వ‌ర్క్ చేయ‌డం గౌర‌వంగా భావిస్తున్నాను. చాలా సాధార‌ణంగా క‌న‌ప‌డ‌తారు. మంచి డేడికేష‌న్ ఉన్న హీరో. ఆయ‌న పెర్‌ఫార్మెన్స్‌కు నేను స్పెల్ బౌండ్ అయ్యాను.ఖ‌డ్గం త‌ర్వాత కృష్ణ‌వంశీగారు ఇలాంటి సినిమా చేయ‌డం చాలా బావుంది. త‌నీష్ ఫుల్ లెంగ్త్ విల‌న్‌గా అద్భుతంగా న‌టించారు. అంద‌రూ సినిమా చూసి ఎంజాయ్ చేస్తార‌ని భావిస్తున్నాం అన్నారు.


భ‌ర‌త్ మాట్లాడుతూ - న‌క్ష‌త్రం టీంకు ఆల్ ది బెస్ట్‌. సినిమా త‌ప్ప‌కుండా వంద‌రోజుల వేడుక‌ను జ‌రుపుకుంటుంది అన్నారు.


హ‌రి గౌర మాట్లాడుతూ - ఈ సినిమాలో ప‌నిచేసే అవ‌కాశం ఇచ్చినందుకు కృష్ణ‌వంశీగారికి థాంక్స్‌. ఇందులో బాలాజీగారి రాసిన సాహిత్యం నాకెంతో ఇష్టం అన్నారు.


శ్రియా శ‌ర‌న్ మాట్లాడుతూ - కృష్ణ‌వంశీగారితో ప‌నిచేయాల‌ని ప్ర‌తి హీరోయిన్ కోరుకుంటుంది. నేను కూడా అలాగే కోరుకుంటున్నాను. రాజు సుంద‌రంగారు ఈ సినిమాలో నేను చేసిన సాంగ్‌ను ఎంతో బాగా కంపోజ్ చేశారు. అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు థాంక్స్‌ అన్నారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసి ..

Read More !

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ..

Read More !

Gossips

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Moodu Puvvulu AAru Kaayalu Teaser

#U Movie Theatrical Trailer

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

Read More !