View

3గురు యువకుల్లో లావణ్య ఎవరిని పెళ్లి చేసుకుంటుంది!

Monday,July10th,2017, 07:09 AM

రాజ్యలక్ష్మి క్రియేషన్స్ పతాకంపై డా॥వడ్డేపల్లి కృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం లావణ్య విత్ లవ్‌బాయ్స్. పావని, కిరణ్, యోధ, సాంబ ప్రధాన పాత్రల్లో నటించారు. నర్సింలు పటేల్‌చెట్టి, సి.రాజ్యలక్ష్మి ఈ చిత్రాన్ని నిర్మించారు.


యశోకృష్ణ బాణీలను అందించిన ఈ చిత్ర గీతాలు సోమవారం హైదరాబాద్‌లో విడుదలయ్యాయి.


బిగ్‌సీడీని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.రమణాచారి, రచయిత పరుచూరి గోపాలకృష్ణ విడుదలచేశారు. ఆడియోసీడీలను కె.రమణాచారి ఆవిష్కరించారు. తొలి ప్రతిని పరుచూరి గోపాలకృష్ణ స్వీకరించారు. ట్రైలర్‌ను రమణాచారి విడుదలచేశారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ - ఆదుర్తి సుబ్బారావు తేనే మనసులు సినిమాతో కొత్తవారిని పరిచయం చేయకపోతే కృష్ణ చిత్రసీమకు పరిచయమయ్యేవారు కాదు. దాసరి కొత్త నటులు వద్దనుకుంటే మోహన్‌బాబులాంటి ఎందరో ప్రతిభావంతులు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టకపోయేవారు. తేజ, శేఖర్‌కమ్ములతో పాటు పలువురు దర్శకులు కొత్త తరాన్ని చిత్రసీమలోకి తీసుకువచ్చారు. ఆ ఒరవడిలో వడ్డేపల్లి కృష్ణ చక్కటి కథాంశంతో నూతన తారలతో చేసిన మంచి చిత్రమిది. కథాబలమున్న యువతరంలో ఉత్తేజాన్ని రేకెత్తించే, వారిలో ప్రోత్సహాన్ని నింపే కథాంశాలు తప్పకుండా విజయాన్ని సాధిస్తాయి. లలిత గీతాలపై పరిశోధన చేసి డాక్టరేట్‌ను పొందిన వడ్డేపల్లి కృష్ణ సంకల్పం, ధైర్యమే ఈ సినిమా రూపుదిద్దుకోవడానికి కారణమైంది. మంచి సినిమాలు తీసే దర్శకులు మరింత మంది చిత్రసీమలోకి రావాలి అని అన్నారు.


వడ్డేపల్లి కృష్ణ తపన, తాపత్రయం, ప్రతిభతో పాటు తనన తాను ఆవిష్కరించుకోవాలనే ఆలోచనతో చేసిన సినిమా ఇదని, పరుచూరి గోపాలకృష్ణ అన్నారు.


వడ్డేపల్లి కృష్ణ మాట్లాడుతూ - పావనితో పాటు నటీనటులంతా పోటీపడి నటించారు. వరూధినిని ఉహించుకుంటూ కలల లోకంలో విహరించే ముగ్గురు యువకులు లావణ్య అనే అమ్మాయితో ప్రేమలో పడతారు. ఆ ముగ్గురిలో లావణ్య ఎవరిని పెళ్లిచేసుకుంటుందనేది ఆసక్తికరంగా ఉంటుంది. పతాక ఘట్టాలు ఉత్కంఠను పంచుతాయి. దర్శకుడిగా నా ద్వితీయ ప్రయత్నం ప్రతి ఒక్కరి హృదయాల్ని హత్తుకుంటుందనే నమ్మకముంది. మనసుకు వయసుతో సంబంధం ఉండదు. పాతికేళ్లు వెనక్కి వెళ్లి ఈ సినిమా చేశాను. పెళ్లిచూపులు తరహాలో ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధిస్తుందనే నమ్మకముంది అని తెలిపారు.


భక్తి, పేరడీ, డ్యూయెట్‌తో పాటు అన్ని తరహా గీతాలకు స్వరాలను సమకూర్చే అవకాశం దొరికిందని, సంగీత దర్శకుడిగా తనకు మంచి పేరును తెచ్చిపెట్టే చిత్రమిదని యశోకృష్ణ చెప్పారు.


మిత్రుడిలోని సృజనాత్మకతను ప్రోత్సహిస్తూ నిర్మాత ఈ సినిమా తీయడానికి ముందుకు రావడం అభినందనీయమని, ఇలాంటి చిన్న నిర్మాతల్ని ప్రోత్సహిస్తే భవిష్యత్తులో మ్రరిన్ని మంచి చిత్రాలు వస్తాయని, వందలాది మందికి ఉపాధి దొరుకుతుందని నిర్మాత మల్కాపురం శివకుమార్ పేర్కొన్నారు.


ఈ కార్యక్రమంలో తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం చైర్మన్ లక్ష్మణ్, అగ్రోస్ ఇండస్ట్రీస్ అధ్యక్షుడు కిషన్‌రావు, నిర్మాతలు, రాజ్యలక్ష్మి, నర్సింలు పటేల్‌చెట్టి, కిరణ్, సాంబ, ప్రేమలత, తోట.వి.రమణ తదితరులు పాల్గొన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. రీ ఎంట్రీకి ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నాడు. 'శ్రీమంతుడు' చిత్రం త ..

Read More !

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ్యాప్ తీసుకోకుండానే 151వ సినిమా చేయడా ..

Read More !

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కైనా సంతోషంగానే ఉంటుంది. కానీ ఆ అవకాశం ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా విడుదలై భారీ వసూళ్లను సాధించిన విష ..

Read More !

Gossips

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

500, 1000 నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటన బయటికి రాగానే టాలీవుడ్ కి చెందిన ఓ స ..

నందమూరి హీరో కళ్యాణ్ రామ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో ఓ మల ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం వస్తే.. ఎగిరి గంతేసి ..

'జనతాగ్యారేజ్' చిత్రం తర్వాత ఎన్టీఆర్ చేయబోయే తదుపరి సినిమా ఏంటీ.. ఎవరి దర్ ..

సరైనోడు' చిత్రంలో వైరా ధనుష్ గా విలన్ పాత్ర పోషించిన డైరెక్టర్ పినిశెట్టి ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Aadi Starrer Nuvve Theatrical Trailer

Devadasi Motion Poster

Pratikshanam 1min Trailer

Mahesh babu, A.R.Murugadoss SPYDER New Teaser

Read More !