filmybuzz
filmybuzz

View

రాంచరణ్ మట్టిమనిషి - దర్శకుడు ఆడియో లాంఛ్ లో సుకుమార్

Monday,July17th,2017, 10:16 AM

సుకుమార్ రైటింగ్స్ పతాకంపై బీఎన్‌సీఎస్‌పీ విజయ్‌కుమార్, థామస్‌రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తితో కలిసి సుకుమార్ నిర్మిస్తున్న చిత్రం దర్శకుడు అశోక్, ఈషా, పూజిత జంటగా నటించారు. హరిప్రసాద్ జక్కా దర్శకుడు. సాయికార్తీక్ స్వరకర్త. శనివారం హైదరాబాద్ దర్శకుడు చిత్ర గీతావిష్కరణ జరిగింది.


ఈ కార్యక్రమానికి రామ్‌చరణ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆడియో సీడీని ఆయన విడుదల చేశారు. చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ని దర్శకులు సురేందర్‌రెడ్డి, వంశీపైడిపల్లి ఆవిష్కరించారు.


ఈ సందర్భంగా రామ్‌చరణ్ మాట్లాడుతూ - తెలుగు చిత్రసీమలో దర్శకులనగానే దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు గుర్తుకొస్తారు. వారిద్దరి ఆశీస్సులు ప్రతి దర్శకుడిపై వుంటాయి. నా అభిమాన దర్శకుడు సుకుమార్. అతి తక్కువ వ్యవథిలో ఆయన నా మనసులో చోటు సంపాదించుకున్నారు. నిర్మాత ఎలాంటి ఒత్తిళ్లను ఎదుర్కొంటాడో నాకు ప్రత్యక్షంగా తెలుసు. ఓ వైపు దర్శకుడి నిర్మాణ బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తూనే రంగస్థలం చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. సుకుమార్ తీసే కథ ఎలాంటిదైనా అందులో ప్రేమకు సంబంధించిన గాఢమైన అంశం వుంటుంది. బలమైన లవ్‌పాయింట్ లేకుండా ఆయన సినిమాలు తీయరు. ఈ మధ్యే పెళ్లిచూపులు అమీతుమీ చిత్రాల్ని కుటుంబంతో కలిసి చూసి బాగా ఎంజాయ్ చేశాను. ఈ చిత్ర నాయిక ఈషా అమీతుమీలో అద్భుతమైన నటనను కనబరచింది అన్నారు. పవన్‌కల్యాణ్ గురించి మాట్లాడాలని అభిమానులు రామ్‌చరణ్‌ను కోరగా ప్రేమ మాటల్లో కాదు మనసులో వుండాలి. మనం అమితంగా ప్రేమించే వ్యక్తుల గురించి రోజూ మాట్లాడుకోం. అందుకే అమ్మ గురించి రోజూ మాట్లాడుకోం. కుటుంబం పట్ల నా ప్రేమ మనసులో ఎక్కువగా వుంటుంది. మాటల్లో తక్కువుంటుంది అన్నారు.


సుకుమార్ మాట్లాడుతూ - రామ్‌చరణ్ ఎంతో ఉన్నతమైన కుటుంబంలో పుట్టినప్పటికీ ఆయన ప్రవర్తన మట్టి మనిషిలా వుంటుంది. ఎటువంటి భేషజాలు ప్రదర్శించకుండా అందరితో సామాన్యుడిలా మసలుకుంటారు. చిత్ర దర్శకుడు హరిప్రసాద్ నాకు అత్యంత ఆప్తుడు. ఇద్దరం కలిసి అధ్యాపకులుగా పనిచేశాం. నేను మానసికైస్థెర్యం కోల్పోయిన సందర్భాల్లో నాకు అండగా నిలిచాడు. ఈ చిత్ర కథ చెప్పగానే అతన్నే దర్శకత్వ బాధ్యతలు తీసుకోమని ప్రోత్సహించాను. తొలి చిత్రమైనా ఎంతో అనుభవజ్ఞుడిగా తెరకెక్కించారు. సాయికార్తీక్ వినసొంపైన బాణీలిచ్చాడు అన్నారు.


దర్శకుడిగా నా తొలిచిత్రమిది. సుకుమార్‌కు ఏదో సరదాగా కథ చెబితే...నన్నే డైరెక్ట్ చేయమన్నారు. సక్సెస్‌ఫుల్ దర్శకుల మొదటి సినిమాలన్నింటిని చూశాను. ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణుల అండతో వారు మంచి విజయాల్ని అందుకున్నారని అర్థమైంది. ఈ సినిమాకు కూడా సృజనశీలురైన సాంకేతిక నిపుణులు పనిచేశారు అని దర్శకుడు చెప్పారు.


సుకుమార్‌తో కలిసి సినిమాలు నిర్మిద్దామనుకున్నాను. అనుకోని కారణల వల్ల కుదరలేదు. మేమిద్దరం ఒకేసారి సినీ ప్రయాణాన్ని ప్రారంభించాం. అయినా నేను సుకుమార్‌ను స్ఫూర్తిగా తీసుకుంటాను అని సురేందర్‌రెడ్డి పేర్కొన్నారు.


తెలుగు చిత్రసీమలో సుకుమార్ అంటే అందరికి ప్రత్యేకమైన గౌరవమని వంశీపైడిపల్లి చెప్పారు. సృజనాత్మక ఆలోచనలతో సుకుమార్ ఎంతో మందికి మార్గదర్శిగా నిలిచారని, తాను దర్శకుడు కావడానికి ఆయనే స్ఫూర్తి అని వక్కంతం వంశీ చెప్పారు.


వన్‌సైడ్ లవ్ అనే కాన్సెప్ట్‌తో ఎంతోమంది జీవితాల్ని ప్రభావితం చేసిన గొప్ప దర్శకుడు సుకుమార్ అని తరుణ్‌భాస్కర్ ప్రశంసించారు.


చిత్ర హీరో అశోక్ మాట్లాడుతూ - హరిప్రసాద్‌కు దర్శకుడు కావాలని, నాకు హీరో కావాలని లేదు. మూడేళ్ల క్రిందటే నన్ను కథానాయకుడిగా పరిచయం చేయాలని హరిప్రసాద్ నిర్ణయించుకున్నాడు అన్నారు.


ఈ సినిమాలో తెలుగు అమ్మాయిలే కథానాయికలుగా నటించాలనే పట్టుదలతో మమ్మల్ని ఎంపిక చేశారు. వినూత్న కథా చిత్రంలో భాగమవ్వడం ఆనందంగా వుంది అని కథానాయికలు తెలిపారు.


ఈ కార్యక్రమంలో బీవీఎస్‌ఎన్‌ప్రసాద్, పీవీవీప్రసాద్, సతీష్ వేగేశ్న, దశరథ్, వాసువర్మ, కల్యాణ్‌కృష్ణ, అనిల్‌రావిపూడి, వక్కంతం వంశీ, తరుణ్‌భాస్కర్, నవీన్ ఎర్నేని, రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Aadi Starrer Nuvve Theatrical Trailer

Devadasi Motion Poster

Pratikshanam 1min Trailer

Read More !