filmybuzz

View

లక్ష్మీ నరసింహా ఎంటర్ టైన్మెంట్స్.. క్రేజీ హీరోలు, డైరెక్టర్స్ తో భారీ చిత్రాలు!

Saturday,July22nd,2017, 01:46 AM

వీడుతేడా చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది "లక్ష్మీ నరసింహా ఎంటర్ టైన్మెంట్స్". నిఖిల్ హీరోగా నటించిన ఈ సినిమాతో నటుడు చిన్ని కృష్ణ దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత సుధీర్ వర్మను దర్శకుడిగా పరిచయం చేస్తూ నిఖిల్ హీరోగా నిర్మించిన స్వామి రారా ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో "లక్ష్మీ నరసింహా ఎంటర్ టైన్మెంట్స్" బ్యానర్ కు, నిర్మాతగా చక్రి చిగురు పాటికి మంచి పేరొచ్చింది. ఆ తర్వాత సుధీర్ బాబు హీరోగా ఎ.ఎన్.బోస్ దర్శకుడిగా మోసగాళ్లకు మోసగాడు చిత్రాన్ని నిర్మించారు. ఇలా వరుసగా మూడు చిత్రాలకు ముగ్గురు కొత్త దర్శకుల్ని తెలుగు తెరకు పరిచయం చేసింది "లక్ష్మీ నరసింహా ఎంటర్ టైన్మెంట్స్". కొత్త టాలెంట్ ను ప్రోత్సహించడంలో తాము రెడీగా ఉంటామని ఈ మూడు సినిమాలతో ప్రూవ్ చేసుకున్నారు.


ఇక ఇప్పుడు…. సూపర్ ఫాంలో దూసుకెళ్తున్న సందీప్ కిషన్ హీరోగా కేరాఫ్ సూర్య పేరుతో ద్వి భాషా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళంలో స్టార్ డైరెక్టర్ గా.. ఎమోషనల్ స్టోరీస్ ని అద్భుతంగా తీయగలడన్న పేరున్న సుశీంద్రన్ ఈ చిత్రానికి దర్శకుడు కావడం విశేషం. అందాల భామ మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీంతో పాటు… శ్రీరస్తు శుభమస్తుతో సూపర్ హిట్ అందుకున్న అల్లు వారి వారసుడు అల్లు శిరీష్ హీరోగా, ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రంతో ఇంటెల్లిజెంట్ సూపర్ హిట్ చిత్రం అందించిన వి.ఐ.ఆనంద్ దర్శకుడిగా "లక్ష్మీ నరసింహా ఎంటర్ టైన్మెంట్స్" బ్యానర్లో 5వ చిత్రంగా చక్రి చిగురుపాటి నిర్మిస్తున్నారు. ఇందులో గ్లామర్ డాల్స్ సురభి, సీరత్ కపూర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇటీవలే ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఈ రెండు చిత్రాలపై నిర్మాత చక్రి చిగురుపాటి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఘన విజయం సాధించే రెండు చిత్రాల్ని బ్యాక్ టూ బ్యాక్ నిర్మిస్తున్నందుకు గర్వంగా ఉందంటున్నారు నిర్మాత చక్రి.


ఇదిలా ఉంటే… త్వరలోనే టాలీవుడ్ టాప్ క్రెజీ హీరోలతో, స్టార్ డైరెక్టర్స్ తో సినిమాలు నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం తదితర హీరోలతో, దర్శకులతో కథా చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే వీటికి సంబంధించిన వివరాలు తెలియజేస్తామని నిర్మాత చెబుతున్నారు.


ఈ సందర్భంగా "లక్ష్మీ నరసింహా ఎంటర్ టైన్మెంట్స్" అధినేత చక్రి చిగురుపాటి మాట్లాడుతూ…. వీడు తేడా, స్వామి రారా, మోసగాళ్లకు మోసగాడు వంటి విభిన్న చిత్రాలతో "లక్ష్మీ నరసింహా ఎంటర్ టైన్మెంట్స్" బ్యానర్ కు మంచి పేరు తీసుకొచ్చిన ప్రేక్షకులకు చాలా థాంక్స్. ఇదే ప్రోత్సాహంతో సందీప్ కిషన్ హీరోగా మెహ్రీన్ హీరోయిన్ గా సుశీంద్రన్ దర్శకత్వంలో కెరాఫ్ సూర్య అనే ద్విభాషా చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఈ చిత్ర షూటింగ్ చాలా బాగా జరుగుతుంది. దీంతో పాటు వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో అల్లు శిరీష్ హీరోగా సురభి, సీరత్ కపూర్ హీరోయిన్స్ గా మరో చిత్రం నిర్మాణ దశలో ఉంది. ఈ రెండు సినిమాలు మా బ్యానర్ వాల్యూను మరింత పెంచుతాయనే ధీమాగా ఉన్నాం. త్వరలోనే మా బ్యానర్లో మరిన్ని మంచి చిత్రాలు రాబోతున్నాయి. దీనికి సంబంధించి ప్రస్తుతం క్రేజీ హీరోలు, దర్శకులతో కథా చర్చలు జరుపుతున్నాం. మరి కొద్ది రోజుల్లోనే ఆ చిత్రాలకు సంబంధించిన వివరాల్ని అధికారికంగా తెలియజేస్తాం. ఇప్పటివరకు మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించి "లక్ష్మీ నరసింహా ఎంటర్ టైన్మెంట్స్" బ్యానర్ కు తగిన గుర్తింపును తెచ్చిన ప్రేక్షకులకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అని అన్నారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుంటో ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. స ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

Gossips

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Read More !