View

గులాల్ కి స్ఫూర్తి కేసీఆర్ జీవిత ప్రస్థానం

Wednesday,September06th,2017, 08:34 AM

ప్రపంచవ్యాప్తంగా జరిగిన అహింసాయుత పోరాటాల్లో తెలంగాణ సాధన ఉద్యమం అగ్ర భాగాన వుంటుంది. అరవై ఏళ్ల ఒక జాతి కలను తన పధ్నాలుగేళ్ల పోరాటం ద్వారా కేసీఆర్‌గారు విజయతీరాలకు చేర్చారు. ఆయన స్ఫూర్తిదాయక జీవిత ప్రస్థానానికి వెండితెర దృశ్యరూపమే గులాల్ చిత్రం అన్నారు బందూక్ లక్ష్మణ్. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం గులాల్. ది సింబల్ ఆఫ్ విక్టరీ ఉపశీర్షిక. సమన్వి క్రియేషన్స్ పతాకంపై లక్ష్మణ్ కొణతం నిర్మిస్తున్నారు. ఈ చిత్ర కాన్సెప్ట్ మరియు మోషన్ పోస్టర్ ఆవిష్కరణోత్సవం బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ దర్శకుడు, రచయిత విజయేంద్రప్రసాద్ కాన్సెప్ట్, మోషన్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ - నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ అలనాడు దాశరథి నిజామాబాద్ కారాగారం సాక్షిగా నినదించారు. తెలంగాణది గొప్ప పోరాటాల చరిత్ర. తెలంగాణ తల్లి రుణం తీర్చుకునే అవకాశం నాకూ రావాలని కోరుకుంటున్నాను. ఈ చిత్ర నిర్మాణానికి సంకల్పించిన ఇద్దరు లక్ష్మణులు (దర్శకనిర్మాతలు) ఆ కోదండరాముని దివ్యాశీస్సులతో చిత్రాన్ని దిగ్విజయంగా పూర్తిచేయాలని అభిలషిస్తున్నాను అన్నారు.


దర్శకుడు మాట్లాడుతూ - కేసీఆర్‌గారి జీవిత క్రమాన్ని ఈ సినిమాలో ఐదు భాగాలుగా ఆవిష్కరించబోతున్నాం. కారణజన్ముడి జననం, బాల్యం మొదలుకొని ఉద్యమ ప్రస్థానం, బంగారు తెలంగాణ సాధన దిశగా సాగుతున్న పాలన ప్రధానాంశాలుగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాలని సంకల్పించాం. త్వరలో కేసీఆర్‌గారికి ఈ చిత్ర ఇతివృత్తాన్ని వివరించి, ఆయన అనుమతి తీసుకోవాలనుకుంటున్నాను అన్నారు.


ఈ సినిమా కోసం అనేక మంది కవులు, మేధావులను కలుసుకున్నామని, అత్యుత్తమ సాంకేతిక విలువలతో చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత లక్ష్మణ్ కొణతం పేర్కొన్నారు.


బందూక్‌తో జాతీయస్థాయిలో పేరు సంపాదించుకున్న లక్ష్మణ్..ఈ సినిమాతో మరింత గుర్తింపును సంపాదించుకోవాలని నిర్మాత మల్కాపురం శివకుమార్ అన్నారు.


మిట్టపల్లి సురేందర్ మాట్లాడుతూ 2013సంవత్సరంలో వీ6 ఛానెల్ కోసం నా స్వీయరచనలో ఆలపించిన బతుకమ్మ గీతం గురించి విజయేంద్రప్రసాద్‌గారు ప్రత్యేకంగా ఫోన్ చేసి అభినందించారు. అమ్మతనాన్ని, తెలంగాణ తల్లి ఔన్నత్యాన్ని గొప్పగా వర్ణించానని మెచ్చుకున్నారు. ఆయన ప్రశంసల్ని చిరకాలం నా హృదయంలో పదిలపరచుకుంటాను అన్నారు.


ఈ సినిమాలో పాట రాసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని, కేసీఆర్ భావజాలాన్ని మరింతగా ప్రజలముందుకు తీసుకుపోయే చిత్రమిదని గీత రచయిత కందికొండ తెలిపారు.


ఈ సినిమా అనుకున్న లక్ష్యాన్ని చేరుకొని ప్రేక్షక జనరంజకంగా నిలవాలని వేడుకలో ప్రసంగించిన ఇతర వక్తలు అభిలషించారు.


ఈ కార్యక్రమంలో బాలీవుడ్ దర్శకుడు ఇ.నివాస్ (శూల్ ఫేమ్), రమేష్ సామల, సాగర్‌చంద్ర, యోగి, నిర్మాత వల్లూరిపల్లి రమేష్, యుగంధర్‌రావు (బందూక్ నిర్మాత), జీ స్టూడియో ప్రేమ్‌రాజ్‌జోషి, స్వామిగౌడ్, రామ్ తదితరులు పాల్గొన్నారు.


వేడుక ఆరంభంలో కేసీఆర్ ప్రస్థానాన్ని వివరిస్తూ సాండ్ ఆర్టిస్ట్ క్రాంతి చేసిన ప్రదర్శన ఆహుతుల్ని విశేషంగా ఆకట్టుకుంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. రీ ఎంట్రీకి ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నాడు. 'శ్రీమంతుడు' చిత్రం త ..

Read More !

Gossips

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

500, 1000 నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటన బయటికి రాగానే టాలీవుడ్ కి చెందిన ఓ స ..

నందమూరి హీరో కళ్యాణ్ రామ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో ఓ మల ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Aadi Starrer Nuvve Theatrical Trailer

Devadasi Motion Poster

Pratikshanam 1min Trailer

Read More !