View

12 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకున్న వైశాఖం.. లేడీ డైరెక్టర్ జయ ఖాతాలో మరో హిట్!

Thursday,September07th,2017, 05:59 AM

చంటిగాడు, గుండమ్మగారి మనవడు, లవ్‌లీ వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను రూపొందించిన డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో హరీష్‌, అవంతిక జంటగా ఆర్‌.జె. సినిమాస్‌ పతాకంపై బి.ఎ.రాజు నిర్మించిన మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'వైశాఖం'. జూలై 21న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ 12 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుంది.


ఈ సందర్భంగా డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. మాట్లాడుతూ - యూనివర్సల్‌ పాయింట్‌తో తీసిన 'వైశాఖం' ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అయింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌కి సినిమాలోని సెంటిమెంట్‌ బాగా నచ్చింది. అందుకే విజయం సాధించింది. పాటలు, ఫోటోగ్రఫీ కూడా ఈ సినిమా విజయం సాధించడానికి దోహదపడ్డాయి. ఒక మంచి పాయింట్‌తో మంచి సినిమా తీశారని రిలీజ్‌ అయిన రోజు నుంచి అందరూ అభినందిస్తున్నారు. నాకు మంచి అప్రిషియేషన్‌ వచ్చిన సినిమా ఇది అన్నారు.


నిర్మాత బి.ఎ.రాజు మాట్లాడుతూ - వైశాఖం' చిత్రం అర్థ శతదినోత్సవం జరుపుకోవడానికి కారకులైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు స్పెషల్‌ థాంక్స్‌. మానవతా విలువల్ని మరోసారి గుర్తు చేశారంటూ సినిమా చూసిన వాళ్ళంతా మెచ్చుకోవడం చాలా ఆనందాన్ని కలిగించింది. 'వైశాఖం' చిత్రం నిర్మాతగా నాకు చాలా మంచి పేరు తెచ్చింది అన్నారు.


హీరో హరీష్‌ మాట్లాడుతూ - ఇంత మంచి సినిమాలో నేను హీరోగా నటించడం నా అదృష్టం. 'వైశాఖం' చిత్రానికి ఇంత పేరు వచ్చిందంటే ఆ క్రెడిట్‌ అంతా జయగారికే దక్కుతుంది అన్నారు.


హీరోయిన్‌ అవంతిక మాట్లాడుతూ - వైశాఖం'లో నేను చేసిన భానుమతి క్యారెక్టర్‌ అందరికీ గుర్తుండిపోతుంది. ఇంత మంచి సినిమాలో నాకు అవకాశం వచ్చిన డైరెక్టర్‌ జయగారికి, నిర్మాత బి.ఎ.రాజుగారికి థాంక్స్‌ అన్నారు.


సంగీత దర్శకుడు డి.జె.వసంత్‌ మాట్లాడుతూ - నేను చాలా సినిమాలకు మ్యూజిక్‌ చేసినా 'వైశాఖం' చిత్రం ద్వారా నాకు వచ్చిన గుర్తింపుని ఎప్పటికీ మర్చిపోలేను. టాప్‌ టెన్‌లో నంబర్‌ వన్‌ పొజిషన్‌లో నా పాటలు వుండాలన్న కోరిక ఈ సినిమాతో తీరింది అన్నారు.


సినిమాటోగ్రాఫర్‌ వాలిశెట్టి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ - వైశాఖం' చిత్రానికి నేను ఫోటోగ్రఫీకి ఆడియన్స్‌ నుంచి, ఇండస్ట్రీ నుంచి మంచి అప్రిషియేషన్‌ రావడం చాలా హ్యాపీగా వుంది. ఈ అవకాశం ఇచ్చిన జయగారికి, రాజుగారికి థాంక్స్‌ అన్నారు.


హరీష్‌, అవంతిక జంటగా నటించిన ఈ చిత్రంలో డైలాగ్‌ కింగ్‌ సాయికుమార్‌ ప్రత్యేక పాత్ర పోషించారు. ఈశ్వరీరావు, రమాప్రభ, పృథ్వీ, కాశీ విశ్వనాథ్‌, కృష్ణభగవాన్‌, శ్రీలక్ష్మీ, గుండు సుదర్శన్‌, అప్పారావు, శేషు, భద్రం, సొంపు, ఫణి, మాధవి, జెన్నీ తదితరులు ఇతర ముఖ్యపాత్రలో నటించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వాలిశెట్టి వెంకటసుబ్బారావు, సంగీతం: డి.జె.వసంత్‌, డాన్స్‌: వి.జె.శేఖర్‌, ఆర్ట్‌: మురళి కొండేటి, స్టిల్స్‌: శ్రీను, కో-డైరెక్టర్‌: అమరనేని నరేష్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: సుబ్బారావు, లైన్‌ ప్రొడ్యూసర్‌: బి.శివకుమార్‌, నిర్మాత: బి.ఎ.రాజు, రచన, దర్శకత్వం: జయ బి.​Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. రీ ఎంట్రీకి ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నాడు. 'శ్రీమంతుడు' చిత్రం త ..

Read More !

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ్యాప్ తీసుకోకుండానే 151వ సినిమా చేయడా ..

Read More !

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కైనా సంతోషంగానే ఉంటుంది. కానీ ఆ అవకాశం ..

Read More !

Gossips

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

500, 1000 నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటన బయటికి రాగానే టాలీవుడ్ కి చెందిన ఓ స ..

నందమూరి హీరో కళ్యాణ్ రామ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో ఓ మల ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం వస్తే.. ఎగిరి గంతేసి ..

'జనతాగ్యారేజ్' చిత్రం తర్వాత ఎన్టీఆర్ చేయబోయే తదుపరి సినిమా ఏంటీ.. ఎవరి దర్ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Aadi Starrer Nuvve Theatrical Trailer

Devadasi Motion Poster

Pratikshanam 1min Trailer

Mahesh babu, A.R.Murugadoss SPYDER New Teaser

Read More !