View

రాజా ది గ్రేట్ టైటిల్ ట్రాక్ కి సూపర్ రెస్పాన్స్.. దీపావళికి విడుదల!

Tuesday,September19th,2017, 05:47 AM

హీరో క్యారెక్టరైజేషన్‌కు త‌న‌దైన బాడీ లాంగ్వేజ్‌, డైలాగ్ డెలివ‌రీతో వేరియేష‌న్ చూపించే క‌థానాయ‌కుడు మాస్ మ‌హారాజా రవితేజ‌. ఈయ‌న క‌థ‌నాయ‌కుడుగా ప‌టాస్‌, సుప్రీమ్ చిత్రాల ఫేమ్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం రాజా ది గ్రేట్‌. హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బేన‌ర్‌పై శిరీష్ నిర్మాత‌గా ఈ చిత్రం నిర్మిత‌మ‌వుతుంది. చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుని శ‌ర‌వేగంగా నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. సాయికార్తీక్ సంగీత సారథ్యం వ‌హించిన ఈ సినిమా టైటిల్ ట్రాక్ ఇటీవ‌ల విడుద‌లైంది. కాస‌ర్ల శ్యామ్ ఈ పాట‌కు సాహిత్యాన్ని అందించారు.


రాజా రాజా ది గ్రేటు రా... నువ్వు త‌ళ త‌ళ టు థౌంజెండ్ నోటు రా - అంటూ సాగే ప‌ల్ల‌వి ఎన‌ర్జిటిక్‌గా ఉండ‌టంతో పాటు హీరో క్యారక్ట‌రైజేష‌న్‌ను ఎలివేట్ చేసేలా ఉండ‌టం బాగా ప్ల‌స్ అయ్యింది. మంచి ఊపున్న ఈ పాట‌కు ప్రేక్ష‌కుల నుండి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. అల్రెడీ విడుద‌లైన పోస్ట‌ర్స్‌, టీజ‌ర్‌తో పాటు టైటిల్ ట్రాక్‌కు వ‌స్తోన్న రెస్పాన్స్‌తో సినిమాపై మంచి అంచ‌నాలు క్రియేట్ అయ్యాయి. త్వ‌ర‌లోనే ఆడియో విడుద‌ల చేసి అక్టోబ‌ర్ లో దీపావళి కానుకగా సినిమాను విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.


ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ - సినిమా అవుట్‌పుట్ ఎక్స్‌ట్రార్డిన‌రీగా వ‌చ్చింది. మాస్ మాహారాజా ర‌వితేజ‌గారి ఎన‌ర్జీ గురించి నేను ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇందులో ఆయ‌న డబుల్ ఎన‌ర్జీతో క‌న‌ప‌డ‌తాడు. ఇప్ప‌టి వ‌ర‌కు క‌న‌పించ‌ని స‌రికొత్త క్యారెక్ట‌ర్‌లో ర‌వితేజ క‌నిపించ‌బోతున్నారు. సాయికార్తీక్ మ్యూజిక్ సూప‌ర్బ్‌గా కుదిరింది. టైటిల్ ట్రాక్ సాంపిల్ మాత్ర‌మే. మిగ‌తా ట్యూన్స్ అన్నీ చ‌క్క‌గా కుదిరాయి. త్వ‌ర‌లోనే పాట‌లు విడుద‌ల‌వుతాయి. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అవుటండ్ అవుట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా సినిమా అంద‌రినీ అల‌రించ‌డం ఖాయం అన్నారు.


ర‌వితేజ‌, మెహ‌రీన్‌, ప్ర‌కాష్ రాజ్‌, రాధికా శ‌ర‌త్‌కుమార్‌, శ్రీనివాస‌రెడ్డి త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి రచనా సహకారం: S.కృష్ణ, సంగీతంః సాయికార్తీక్‌, సినిమాటోగ్ర‌ఫీః మోహ‌న‌కృష్ణ‌, ఎడిటింగ్ః తమ్మిరాజు, ఆర్ట్ః ఎ.ఎస్‌.ప్ర‌కాష్‌, ఫైట్స్ః వెంక‌ట్‌, స‌హ‌ నిర్మాతః హ‌ర్షిత్ రెడ్డి, నిర్మాతః శిరీష్‌, కధ-మాటలు-స్క్రీన్ప్లే-దర్శకత్వం: అనిల్ రావిపూడి.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. రీ ఎంట్రీకి ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నాడు. 'శ్రీమంతుడు' చిత్రం త ..

Read More !

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ్యాప్ తీసుకోకుండానే 151వ సినిమా చేయడా ..

Read More !

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కైనా సంతోషంగానే ఉంటుంది. కానీ ఆ అవకాశం ..

Read More !

Gossips

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

500, 1000 నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటన బయటికి రాగానే టాలీవుడ్ కి చెందిన ఓ స ..

నందమూరి హీరో కళ్యాణ్ రామ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో ఓ మల ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం వస్తే.. ఎగిరి గంతేసి ..

'జనతాగ్యారేజ్' చిత్రం తర్వాత ఎన్టీఆర్ చేయబోయే తదుపరి సినిమా ఏంటీ.. ఎవరి దర్ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Aadi Starrer Nuvve Theatrical Trailer

Devadasi Motion Poster

Pratikshanam 1min Trailer

Mahesh babu, A.R.Murugadoss SPYDER New Teaser

Read More !