filmybuzz
filmybuzz

View

రాజా ది గ్రేట్ తో మంచి ప్రయత్నం చేసాం - రవితేజ

Saturday,October07th,2017, 08:29 AM

హీరో క్యారెక్టరైజేషన్‌కు త‌న‌దైన బాడీ లాంగ్వేజ్‌, డైలాగ్ డెలివ‌రీతో వేరియేష‌న్ చూపించే క‌థానాయ‌కుడు మాస్ మ‌హారాజా రవితేజ‌. ఈయ‌న క‌థ‌నాయ‌కుడుగా ప‌టాస్‌, సుప్రీమ్ చిత్రాల ఫేమ్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `రాజా ది గ్రేట్‌`. హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బేన‌ర్‌పై శిరీష్ నిర్మాత‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా దీపావళికి విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా ట్రైలర్‌ను శుక్రవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా...


మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ - ''దిల్‌రాజుతో 13 ఏళ్ల తర్వాత చేసిన సినిమా ఇది. గ్యాప్‌ వస్తే వచ్చింది కానీ, ఇది చాలా మంచి సినిమా. డైరెక్టర్‌ అనిల్‌ చాలా పాజిటివ్‌ పర్సనే కాదు, చాలా క్లారిటీ ఉన్న దర్శకుడు. ఈ సినిమాతో అనిల్‌కు హ్యాట్రిక్‌ కొట్టాలని అనుకుంటున్నాను. అలాగే మెహరీన్‌కు కూడా ఈ సినిమాతో హ్యాట్రిక్‌ మూవీ అయిపోతుంది. సాయికార్తీక్‌, మోహన్‌కృష్ణగారితో నేను ఫస్ట్‌ టైమ్‌ కలిసి వర్క్‌ చేస్తున్నాను. ఈ సినిమాతో ఇద్దరూ నెక్స్‌ట్‌ లెవల్‌కు వెళ్లాలి. రాజేంద్రప్రసాద్‌, రాధిక వంటి సీనియర్స్‌తో పనిచేయడం చాలా బాగా అనిపించింది. పోసాని, శ్రీనివాస్‌రెడ్డి ఇలా అందరితో పనిచేయడం ఆనందంగా ఉంది. మంచి ప్రయత్నం చేశాం. మా ప్రయత్నాన్ని అందరూ సక్సెస్‌ చేయాలని కోరుకుంటున్నాను. సినిమా పెద్ద హిట్‌ కావలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను'' అన్నారు.


హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు మాట్లాడతూ - ''భద్ర తర్వాత..అంటే 13 ఏళ్ల తర్వాత రవితో నేను చేసిన సినిమా ఇది. వెయిట్‌ చేసినా ఓ కరెక్ట్‌ సినిమాతో ప్రేక్షకుల ముందకు వస్తున్నాం. ఆ వేంకటేశ్వరుని స్వామి దయ వల్ల ఈ ఏడాది ఇప్పటికే నాలుగు సక్సెస్‌లను అందుకున్నాను. దీంతో ఐదో సక్సెస్‌ను అనిల్‌ అందించనున్నాడు. దీపావళి రోజు ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాం. సాధారణంగా తెలుగులో సంక్రాంతి, దసరాలకే పెద్ద సినిమాలు వస్తుంటాయి. ఇకపై తెలుగులో దీపావళికి కూడా పెద్ద సినిమాలు వచ్చేలా చేసిన రాజా ది గ్రేట్‌ సినిమాతో మేం చేసిన ప్రయత్నం సక్సెస్‌ అవుతుందని భావిస్తున్నాం. అనిల్‌ అల్రెడి పటాస్‌, సుప్రీమ్‌ చిత్రాలతో సూపర్‌హిట్‌లను సాధించాడు. ఆ రెండు చిత్రాలను మించి ఈ సినిమా అనిల్‌కు ది బెస్ట్‌ ఫిలిం అవుతుంది. అనిల్‌ ఈ కథను తయారు చేసుకోవడానికి చాలా కష్టపడ్డాడు. కథ వినగానే నేను ఎగ్జయిట్‌ అయ్యాను. రవితేజగారు కూడా నాకు ఫోన్‌ చేసి కథ చాలా బావుందని అన్నారు. మూడు రోజుల క్రితమే సినిమా చూశాను. డైరెక్టర్‌ అనిల్‌ నాకు ఇచ్చిన నెరేషన్‌ కంటే బాగా డైరెక్ట్‌ చేసి చూపించాడు. డైరెక్టర్‌ కంటే ఎక్కువగా రవితేజ ది బెస్ట్‌ పెర్‌ఫార్మెన్స్‌ చేశాడు. సినిమా చూసిన నేనే ఎగ్జయిట్‌ అయ్యాను. రేపు ప్రేక్షకులకు ఇదొక మ్యాజిక్‌. సాయికార్తీక్‌ ఇప్పటి వరకు చేసిన ఆల్బమ్స్‌లో ది బెస్ట్‌ 'రాజా ది గ్రేట్‌' అయ్యింది. అలాగే రెండు వరుస సక్సెస్‌లు సాధించిన మెహరీన్‌ ఈసినిమాతో హ్యాట్రిక్‌ హిట్‌ సాధిస్తుంది. '' అన్నారు.


న‌ట కిరిటీ డా.రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ - ''తెలుగులో గొప్ప నిర్మాత అయిన రామానాయుడుగారి తర్వాత ఆ స్థాయిలో పట్టుతో, ప్రేమతో సినిమాలు చేసే సినిమాలు చేసే నిర్మాతగా ఎవరుంటారనే దానిపై నేను చాలా ఆలోచించాను. అలాంటి సమయంలో మాకు దిల్‌రాజు వంటి నిర్మాతను ఇచ్చిన సినీ కళామాతల్లికి థాంక్స్‌. నా 40 ఏళ్ల సినీ అనుభవంలో ఓ గుడ్డివాడి మీద ఇంత పెద్ద కమర్షియల్‌ సినిమా రావడం ఇదే ప్రథమం. బాహుశా ప్రపంచలోనే మొదటి సినిమా అని కూడా అనుకుంటున్నాను. అనిల్‌ ఇప్పుడు హ్యాట్రిక్‌ హిట్‌ సాధించడానికి రెడీగా ఉన్నాడు..తనకి నా అభినందనలు. నాన్నకు ప్రేమతో, శ్రీమంతుడు తరహాలో నా లైఫ్‌లో రాజా ది గ్రేట్‌ మరచిపోలేని సినిమా అవుతుందని అనుకుంటున్నాను. సాయికార్తీక్‌ అద్భుతమైన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అందించాడు. దీపావళి ధమాకా అంతా సినిమాలో కనపడుతుంది'' అన్నారు.


మెహరీన్‌ మాట్లాడుతూ - ''మాస్‌ మహారాజా రవితేజగారికి నేను పెద్ద ఫ్యాన్‌ని. ఆయనలోని ఎనర్జీనీ ఏ హీరోలో చూడలేదు. బ్యూటీఫుల్‌ జర్నీ. సినిమా కంటెంట్‌పై కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ఇంత మంచి సినిమాలో అవకాశం ఇచ్చిన అనిల్‌రావిపూడిగారికి, దిల్‌రాజుగారికి థాంక్స్‌'' అన్నారు.


అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ - ''విజువల్లీ ఛాలెంజ్‌డ్‌ అయిన హీరో క్యారెక్టర్‌ మీదనే సినిమా నడుస్తుంది. ఈ కథతో సినిమా తీయాలంటే ముందు కథను నమ్మాలి. మమ్మల్ని ముందుకు నడించాలి. అలా మమ్మల్ని నమ్మిన దిల్‌రాజుగారికి, శిరీష్‌గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. కొత్త ప్రతయ్నం చేస్తున్నాం, కొత్త కథ చెబుతున్నామని తొలి రోజు నుండి అనుకుంటూనే ఉన్నాను. మెసేజ్‌ ఓరియెంటెడ్‌ డైలాగ్స్‌, ఫ్యామిలీ ఎమోషన్స్‌ ఇలా అన్నీ ఎలిమెంట్స్‌ సినిమాలో ఉంటాయి. అన్నీ వర్గాల ప్రేక్షకులకు నచ్చే ఎమోషన్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ సినిమాలో ఉంటుంది. ఈ దీపావళికి సినిమా అందరినీ సర్‌ప్రైజ్‌ చేస్తుందనే నమ్మకం ఉంది. రవితేజగారు, క్యారెక్టర్‌ను నమ్మడం కంటే, ఈ క్యారెక్టర్‌ను ఈ డైరెక్టర్‌ కన్విన్సింగ్‌గా తీయగలడని నమ్మిన వ్యక్తి రవితేజగారు. ఆయనకు నేను కేవలం 20 నిమిషాలు మాత్రమే కథ చెప్పాను. వెంటనే ఆయన సినిమా చేస్తానని చెప్పారు. రవితేజగారు గుడ్డిగా నన్ను నమ్మారు. ఆయన నమ్మకమే ఈ సినిమాలో నేను పెట్టిన ఎఫర్ట్స్‌. ఆయనే నాకు బలాన్నిచ్చారు. దిల్‌రాజుగారు పాజిటివ్‌గా మమ్మల్ని గైడ్‌ చేస్తూ వచ్చారు. రాజేంద్రప్రసాద్‌గారి క్యారెక్టర్‌ ఫస్టాఫ్‌లో అద్భుతంగా కుదిరింది. అలాగే పోసాని, మెహరీన్‌, శ్రీనివాస్‌రెడ్డి, సాయికార్తీక్‌ సహా టీం ఎంతో సపోర్ట్‌ చేసింది. దిల్‌రాజుగారి, రవితేజగారి నమ్మకమే ఈ సినిమా. సినిమాలో చాలా సర్‌ప్రైజ్‌లున్నాయి'' అన్నారు.


ఈ కార్యక్రమంలో ఇంకా పోసాని కృష్ణమురళి, సాయికార్తీక్‌, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


రవితేజ, మెహరీన్‌, ప్రకాష్‌ రాజ్‌, రాధికా శరత్‌కుమార్‌, శ్రీనివాసరెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణః దిల్‌రాజు, సంగీతంః సాయికార్తీక్‌, సినిమాటోగ్రఫీః మోహనక ష్ణ, ఎడిటింగ్‌ః తిమ్మరాజు, ఆర్ట్‌ః ఎ.ఎస్‌.ప్రకాష్‌, ఫైట్స్‌ః వెంకట్‌, సహ నిర్మాతః హర్షిత్‌ రెడ్డి, నిర్మాతః శిరీష్‌, దర్శకత్వంః అనిల్‌ రావిపూడి.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసి ..

Read More !

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ..

Read More !

Gossips

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Moodu Puvvulu AAru Kaayalu Teaser

#U Movie Theatrical Trailer

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

Read More !