filmybuzz

View

రాజా ది గ్రేట్ కథ రవితేజకు రాసి పెట్టి ఉంది - దిల్ రాజు

Sunday,October15th,2017, 10:31 AM

హీరో క్యారెక్టరైజేషన్‌కు త‌న‌దైన బాడీ లాంగ్వేజ్‌, డైలాగ్ డెలివ‌రీతో వేరియేష‌న్ చూపించే క‌థానాయ‌కుడు మాస్ మ‌హారాజా రవితేజ‌. ఈయ‌న క‌థ‌నాయ‌కుడుగా ప‌టాస్‌, సుప్రీమ్ చిత్రాల ఫేమ్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `రాజా ది గ్రేట్‌`. హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బేన‌ర్‌పై శిరీష్ నిర్మాత‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా దీపావళి సంద‌ర్బంగా అక్టోబ‌ర్ 18న విడుద‌ల కానుంది. హైద‌రాబాద్‌లో ఆదివారం ప్రీ రిలీజ్ వేడుక జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో హీరో ర‌వితేజ‌, మెహ‌రీన్‌, దిల్‌రాజు, శిరీష్‌, అనిల్ రావిపూడి, డా.రాజేంద్ర‌ప్ర‌సాద్‌, సాయికార్తీక్, సినిమాటోగ్రాఫ‌ర్ మోహ‌న‌కృష్ణ‌, ఆర్ట్ డైరెక్ట‌ర్ ఎ.ఎస్‌.ప్ర‌కాష్‌. శ్రీనివాస‌రెడ్డి, ర‌ఘుబాబు, సంపూర్ణేష్ బాబు, హ‌రితేజ‌, చిత్రం శ్రీను త‌దిత‌రులు పాల్గొన్నారు.


నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు కారణం నా దర్శకులే.
మాస్ మ‌హారాజా రవితేజ మాట్లాడుతూ - ''సాయికార్తీక్‌తో పనిచేయడం ఇదే ప్రథమం. బ్రహ్మాండమైన సాంగ్స్‌ ఇచ్చాడు. అన్నీ ఎనర్జీ, కార్తీక్‌ ఎనర్జీ కలిసి సాంగ్స్‌ బాగా వచ్చాయి. అలాగే సినిమాటోగ్రాఫర్‌ అలాగే సినిమాటోగ్రాఫర్‌ మోహనకృష్ణగారితో కూడా ఈ సినిమా కోసం తొలిసారి వర్క్‌ చేశాను. ఎడిటర్‌ తమ్మిరాజు, ఫైట్‌మాస్టర్‌ వెంకట్‌ ఇలా అందరూ సినిమా కోసం బాగా కష్టపడ్డారు. ఇక నాతో పాటు చేసిన శ్రీనివాస్‌రెడ్డి, సత్యం రాజేష్‌, అలీ, రఘబాబు, చిత్రం శ్రీను, పోసాని ఇలా అందరూ గోల గోల చేసేశారు. ఎంజాయ్‌ చేస్తూ నటించాం. రాజేంద్రస్రాద్‌గారు, రాధికగారితో కలిసి పనిచేయడం వల్ల చాలా విషయాలు నేర్చుకున్నారు. నిర్మాతలు చాలా మంది ఉండొచ్చు. కానీ మేకర్స్‌ తక్కువ మంది ఉంటారు. దిల్‌రాజు..మంచి మేకర్‌. అతని సక్సెస్‌ చూస్తే, అతన జడ్జిమెంట్‌, టెస్ట్‌ కనపడతాయి. అలాగే శిరీష్‌తో మంచి రిలేషన్‌ ఏర్పడింది. మెహరీన్‌ అందంగా ఉంటుంది. తనకు మంచి భవిష్యత్‌ ఉంటుంది. నేను ఈ రోజు ఈస్థాయిలో ఉన్నానంటే అందుకు కారణం నా దర్శకులే. తనతో నేను ప్రేమలో పడ్డాను. కథ చెప్పిన విధానం, పద్ధతి నాకు నచ్చింది. తను చేసిన దాంట్లో నేను యాబై శాతం చేస్తే నాకు మంచి పేరొస్తుంది. తను ఈ సినిమాతో హ్యాట్రిక్‌ కొడతాడు. సినిమా బాగా వచ్చింది. కాబట్టి ప్రేక్షకులందరరూ దీపావళికి వచ్చి మాకు వినపడండి'' అన్నారు.


హీరోలు ముందుకొస్తేనే కొత్త క‌థ‌లు వ‌స్తాయి
చిత్ర స‌మ‌ర్ప‌కుడు దిల్‌రాజు మాట్లాడుతూ - '' సినిమాటోగ్రాఫర్‌ మోహనకృష్ణగారు, ఎడిటర్‌ తమ్మిరాజుగారు వంటి మంచి టెక్నిషియన్స్‌తో ఈ సినిమాకు పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఇక సాయికార్తీక్‌ మ్యూజిక్‌ గురించి చెప్పాలంటే..ఈ సినిమాతో తన కెరీర్‌లోనే వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ ఆల్బమ్‌ ఇచ్చారు. అలాగే మిగిలిన టెక్నిషియన్స్‌ అందరికీ థాంక్స్‌. ఇక రాజేంప్రసాద్‌గారు, ప్రకాష్‌ రాజ్‌గారు, రాధికగారు అందరికీ థాంక్స్‌. రవితేజతో నాకు ఇరవైయేళ్ల పరిచయం. ఆర్య సినిమా స్క్రిప్ట్‌ ముందు తనకే నెరేట్‌ చేశాం. 'కథ బావుంది..నాకు కరెక్ట్‌ కాదు, ఇంకేవరితోనైనా ట్రై చేయండ'ి అని అన్నాడు. చివరికి ఆ కథ బన్నికి వెళ్లింది. ఇక రాజాది గ్రేట్‌ సినిమా విషయానికి వస్తే..హీరో బ్లైండ్‌పర్సన్‌ అని చెబితే, అందరూ హీరోకు కళ్లు వస్తాయా? ఇంటర్వెల్‌ తర్వాత కళ్ళు వస్తాయా? అని అడిగారు. సినిమా మొత్తం హీరో బ్లైండ్‌గానే కనపడతాడని నేను చెప్పగానే..తెలుగు సినిమాలో హీరో మొత్తం బ్లైండ్‌ క్యారెక్టర్‌ చేస్తే వర్కవుట్‌ అవుతుందా? ఇలాంటి రక రకాల డౌట్స్‌ వచ్చాయి. ఈ కథ చాలా మంది హీరోల దగ్గరకు వెళ్లింది. రవితేజకు ఈ కథ రాసిపెట్టి ఉంది కాబట్టే ఆయన దగ్గరకు ఈ కథ వెళ్లింది. అనిల్‌ ఐడియా చెప్పినప్పటి నుండి ఓ కసితో స్క్రిప్ట్‌ రెడీ చేశాడు. 'ఏ సినిమా చేసినా ఓ కొత్త పాయింట్‌ ఆలోచించుకుని కథను తయారు చెయ్‌' అని నేను తనకు చెప్పాను. తను ఈ సినిమా పాయింట్‌ చెప్పగానే నాకు బాగా నచ్చింది. డెవలప్‌ చేయమని చెప్పాను. ఈ స్క్రిప్ట్‌ వినగానే రవితేజ కూడా ఫోన్‌ చేసి..'రాజు..అనిల్‌ ఇరగొట్టాడు. ఈ సినిమా నేను చేస్తున్నాను' అన్నారు. సినిమా మొత్తం చూశాక చాలా కాన్ఫిడెన్స్‌ వచ్చింది. ఈ సంవత్సరం మా సంస్థకు వరుస సక్సెస్‌లు వచ్చాయి. మొన్నటి వరకు నేను ఈ సినిమా విషయంలో ఓ టెన్షన్‌కు లోనయ్యాను. నిన్న కాపీ చూసిన తర్వాత ఐదో బాల్‌ కూడా సిక్సర్‌ కొట్టేశామని అనిల్‌తో చెప్పాను. ఈ సినిమా కోసం పనిచేసిన వారే సినిమా ఏరియాస్‌ కొనేసుకోవడం విశేషం. ఇడియట్‌ రవితేజ కెరీర్‌లో వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ పెర్ఫామెన్స్‌, బెస్ట్‌ ఫిలిం. తర్వాత విక్రమార్కుడు సినిమా బెస్ట్‌. తర్వాత ది బెస్ట్‌ ఫిలిం, బెస్ట్‌ ఫెర్ఫామెన్స్‌ మూవీ రాజా ది గ్రేట్‌. కమర్షియల్‌ సినిమాగా సినిమా తీస్తున్నప్పుడు అదేదైనా కొత్తగా రావాలంటే హీరోతోనే సాధ్యం. హీరో ముందుకొస్తే కొత్త కథలొస్తాయ్‌, కొత్త కాన్సెప్ట్‌లొస్తాయ్‌ అని రవి ప్రూవ్‌ చేశాడు'' అన్నారు.


సినిమా చూసి అంద‌రూ ర‌వితేజ ది గ్రేట్ అంటారు
డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ - ''సుప్రీమ్‌ తర్వాత తరువాత చేయబోయే ప్రాజెక్ట్‌ ఎలా ఉండాలని దిల్‌రాజుగారితో డిస్కస్‌ చేశాను. అప్పుడు ఏదైనా కొత్త పాయింట్‌తో సినిమా చేయమని ఆయన అన్నారు. తర్వాత రోజే ఆయనకు ఓ బ్లైండ్‌ క్యారెక్టర్‌తోనే సినిమా చేద్దామని అన్నాను. ఆయన కూడా పాయింట్‌ విని ఎగ్జయిట్‌ అయ్యారు. కథ రవితేజగారి వద్దకు వెళ్లిన తర్వాత ఆయన ఎనర్జీ లెవల్స్‌కు తగ్గట్లు ఆయన క్యారెక్టరైజేషన్‌ మారిపోయింది. ఆయన కారణంగానే 'రాజా ది గ్రేట్‌' నెక్స్‌ట్‌ లెవల్‌కు వెళ్లింది. ఈ సినిమా చూసిన తర్వాత రవితేజ ది గ్రేట్‌ అని ఆడియెన్స్‌ అంటారు. ఆయనిచ్చిన పెర్ఫామెన్స్‌, యాట్యిట్యూడ్‌, ఎనర్జీ లెవల్స్‌తో నేను మాటలు రాని వాడినయ్యాను. ఈ సినిమాను నేను ఇంత గొప్పగా చేయడానికి కారణం దిల్‌రాజు, శిరీష్‌గారే కారణం. అంత స్వేచ్ఛనిచ్చి నాతో వారు సినిమా చేయించారు. ప్రతి డైరెక్టర్‌కు ఓ సినిమా చేస్తున్నప్పుడు తన కెరీర్‌లో ఆ సినిమా గొప్ప సినిమా అవుతుందనే లక్షణాలు కనపడతాయి. ఈ సినిమాకు నాకు అలాంటి లక్షణాలు కనపడుతున్నాయి. సినిమాటోగ్రాఫర్‌ మోహనకృష్ణగారు, మ్యూజిక్‌ డైరెక్టర్‌ సాయికార్తీక్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌ ప్రకాష్‌గారు, ఫైట్స్‌ వెంకట్‌ సహా టెక్నికల్‌ టీంకంతా థాంక్స్‌. ప్రకాష్‌రాజ్‌గారు, రాధికగారు, రాజేంద్రప్రసాద్‌గారికి నా స్పెషల్‌ థాంక్స్‌. సెకండాఫ్‌లో ఓ సాంగ్‌ మూవీకే స్పెషల్‌గా నిలుస్తుంది. ఆ సాంగ్‌ను 16వ తేది రిలీజ్‌ చేస్తున్నాం. మెహరీన్‌కు ఈ సినిమా హ్యాట్రిక్‌ మూవీ అవుతుంది. సినిమా మెయిన్‌ పాయింట్‌ అంతా ఆ అమ్మాయి చుట్టూనే తిరుగుతుంది'' అన్నారు.


ర‌విజ‌తేజ లాంటి క‌మ‌ర్షియ‌ల్ హీరో ఇలాంటి పాత్ర చేయ‌డం అభినంద‌నీయం
డా.రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ - ''ఏ యాక్టర్‌కైనా డిఫరెంట్‌రోల్స్‌ చేయాలనే ఉంటుంది. ముఖ్యంగా అద్భుతమైన మాస్‌ ఫాలోయింగ్‌ ఉన్న కమర్షియల్‌ హీరో రవితేజ ఇలాటి డిఫరెంట్‌ రోల్‌ను చేయడం గొప్ప విషయం..అభినందనీయం. ఈ సినిమా తర్వాత రవితేజ గొప్ప నటుడు అని కచ్చితంగా అంటారు. అనిల్‌లాంటి దర్శకులు చక్కటి పాత్రల్ని స ష్టిస్తున్నారు'' అన్నారు.


రవితేజ, మెహరీన్‌, ప్రకాష్‌ రాజ్‌, రాధికా శరత్‌కుమార్‌, శ్రీనివాసరెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణః దిల్‌రాజు, సంగీతంః సాయికార్తీక్‌, సినిమాటోగ్రఫీః మోహనకృష్ణ, ఎడిటింగ్‌ః తిమ్మరాజు, ఆర్ట్‌ః ఎ.ఎస్‌.ప్రకాష్‌, ఫైట్స్‌ః వెంకట్‌, సహ నిర్మాతః హర్షిత్‌ రెడ్డి, నిర్మాతః శిరీష్‌, దర్శకత్వంః అనిల్‌ రావిపూడిAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. స ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

Gossips

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Read More !