filmybuzz

View

కృష్ణారావ్ సూపర్ మార్కెట్ ప్రారంభం.. గౌతంరాజు తనయుడు హీరోగా!

Monday,October16th,2017, 10:38 AM

ప్ర‌ముఖ క‌మెడియ‌న్ గౌతంరాజు త‌న‌యుడు కృష్ణ హీరోగా బిజేఆర్ స‌మ‌ర్ప‌ణ‌లో బిజిఆర్ ఫిలిం అండ్ టీవీ స్టూడియోస్ నిర్మిస్తోన్న చిత్రం కృష్ణారావ్ సూప‌ర్ మార్కెట్‌. శ్రీనాథ్ పుల‌కురం ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఎల్సా ఘోష్ హీరోయిన్ గా న‌టిస్తోంది. ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్య‌క్ర‌మం ఈ రోజు అన్న‌పూర్ణ స్టూడియోలో ఘ‌నంగా జ‌రిగింది.


ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిలుగా విచ్చేసిన సీనియ‌ర్ న‌టుడు న‌రేష్ తొలి స‌న్నివేశానికి క్లాప్ నివ్వ‌గా త‌నికెళ్ల భ‌ర‌ణి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ ఫ‌స్ట్ షాట్ కి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.


అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో త‌ణి కెళ్ల భ‌ర‌ణి మాట్లాడుతూ - ద‌ర్శ‌కుడు ఒక రోజు వ‌చ్చి క‌థ వినిపించాడు. స‌స్పెన్స్ తో కూడిన ల‌వ్ స్టోరీ . ప్ర‌జంట్ ట్రెండ్ కు త‌గిన విధంగా క‌థ‌ను తీర్చిదిద్దాడు ద‌ర్శ‌కుడు. సూప‌ర్ మార్కెట్ నేప‌థ్యంలో ఉంటుంది. గౌతంరాజు త‌న‌యుడు కృష్ణ‌కు ఈ చిత్రం మంచి పేరు తేవాల‌ని టీమ్ అంద‌రికీ నా మంచి జ‌ర‌గాల‌ని కోరుకుంటున్నా అన్నారు.


సీనియ‌ర్ న‌టుడు న‌రేష్ మాట్లాడుతూ - ఈ సినిమా పాయింట్ విన్నాను. చాలా కొత్త‌గా ఉంది. ప్ర‌స్తుతం స‌బ్జెక్ట్ కొత్త‌గా ఉంటే సినిమాలు ఆడుతున్నాయి. ఆ కోవ‌లో ఈ స‌బ్జెక్ట్ బేస్డ్ ఫిలిం కాబ‌ట్టి క‌చ్చితంగా స‌క్సెస్ అవుతుంది. గౌతంరాజు నాకు చాలా కాలంగా ప‌రిచ‌యం. నాన్న‌గారు సూప‌ర్ స్టార్ కృష్ణ‌గారికి పెద్ద ఫ్యాన్ త‌ను. అందుకే త‌న త‌న‌యుడికి కృష్ణ అని పేరు పెట్టాడు. ఈ సినిమా ద్వారా కృష్ణ‌కు మంచి భ‌విష్య‌త్ ఏర్ప‌డాల‌ని ఆశిస్తున్నా. గౌతంరాజు అనుభవ‌, సినిమా ప‌ట్ల అవ‌గాహ‌న ఈ సినిమాకు చాలా ఉప‌యోగ‌ప‌డుతుంది అన్నారు.


న‌టుడు కృష్ణ భ‌గ‌వాన్ మాట్లాడుతూ - గౌతంరాజు నాకు మంచి మిత్రుడు. వార‌బ్బాయి హీరోగా ప‌రిచ‌యం కావ‌డం చాలా సంతోషం. క‌థ విన్నాను. చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. సినిమా సూప‌ర్ హిట్ అవుతుంద‌నడంలో ఎటువంటి సందేహం లేదు.


న‌టుడు చిట్టిబాబు మాట్లాడుతూ - గౌతంరాజు నా త‌మ్ముడిలాంటి వాడు. క‌మెడియ‌న్ కొడుకు హీరో అవుతున్నాడంటే ప్ర‌తి క‌మెడియ‌న్ సంతోష‌ ప‌డ‌తాడు. సూప‌ర్ మార్కెట్ ఎలాగైతే అన్ని వ‌స్తువులు ల‌భిస్తాయో ఈ సినిమాలో కూడా అన్ని అంశాలుంటాయ‌న్నారు.


హీరో కృష్ణ మాట్లాడుతూ - ద‌ర్శ‌కుడు శ్రీనాథ్ కొత్త క‌థ‌తో వ‌చ్చి క‌లిశాడు. చాలా మంది పెద్ద‌వాళ్లు క‌థ విని చాలా బాగుంద‌న‌డంతో ముందుకు వెళ్తున్నాం. ల‌వ్ , స‌స్పెన్స్ , ఎంట‌ర్ టైన్ మెంట్ ఇలా ఆడియ‌న్స్ కు కావాల్సిన అన్ని అంశాలుంటాయి. నా పాత్ర పేరు అర్జున్. షావ‌లి గారు మంచి పాట‌లు కంపోజ్ చేస్తున్నారు. సీనియ‌ర్ టెక్నీషియ‌న్స్ సినిమాకు ప‌ని చేస్తున్నారు అన్నారు.


హీరోయిన్ ఎల్సా ఘోష్ మాట్లాడుతూ - నా ఫ‌స్ట్ తెలుగు సినిమా ఇది. సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్ గా న‌టిస్తున్నా అన్నారు.


బోలే షావ‌లి మాట్లాడుతూ - మ్యూజిక్ కి స్కోపున్న స‌బ్జెక్ట్ కావ‌డంతో మంచి పాట‌లు కుదురుతున్నాయ‌న్నారు.


ద‌ర్శ‌కుడు శ్రీనాథ్ పుల‌కురం మాట్లాడుతూ - నేను సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్ గా చాలా కాలం వ‌ర్క్ చేశాను.ఆ త‌ర్వాత డిఎఫ్ టెక్ చేసి కొన్ని సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌ని చేశాను. ఆ అనుభ‌వంతో ఈ సినిమాకు డైర‌క్ష‌న్ చేస్తున్నాను. హీరో కృష్ణ ఈ సినిమా కోసం వ‌న్ ఇయ‌ర్ గా మార్ష‌ల్ ఆర్ట్స్ , కిక్ బాక్సింగ్ నేర్చుకుంటున్నాడు. త‌న‌లో పాష‌న్ నాకు బాగా న‌చ్చింది. సూప‌ర్ మార్కెట్ బ్యాక్ డ్రాప్ లో సాగే ల‌వ్ అండ్ స‌స్పెన్స్ ఎంట‌ర్ టైనర్ చిత్ర‌మిది అన్నారు.


ప్ర‌ముఖ క‌మెడియ‌న్ గౌతంరాజు మాట్లాడుతూ - ఎన్నో స్ట్ర‌గుల్స్ అనుభ‌వించి సినీ ప‌రిశ్ర‌మ‌లో నిల‌దొక్కుకున్నాను. అంద‌రితో క‌ల‌సిమెల‌సి ఉంటూ నా వృత్తి ప‌రంగా నేను చాలా సంతోషంగా ఉన్నా. ఆక‌లి విలువ తెలుసు కాబ‌ట్టి ఆక‌లిగా ఉన్న వాడికి అన్నం పెట్టడం నా అల‌వాటు. బహుశా నా త‌ల్లిదండ్రుల నుంచి నాకు ఈ అల‌వాటు అల‌వ‌డింద‌నుకుంటా. టాలెంట్ ఉండి క‌ష్ట‌ప‌డే త‌త్వం ఉన్న‌వారికి హెల్ప్ చేయ‌డం నాకు చాలా ఇష్టం. అలా చాలా కాలంగా ఒక మంచి క‌థ‌తో శ్రీనాథ్ నా ద‌గ్గ‌ర‌కు సినిమా చేద్దామంటూ చాలా సార్లు తిరిగాడు. క‌థ బాగా న‌చ్చి ధైర్యం చేసి నా పేరు మీద బిజిఆర్ ఫిల్మ్ అండ్ టివి స్టూడియోస్ బేన‌ర్ స్థాపించి కె.భువ‌న్ రెడ్డి స‌హకారంతో ఈ సినిమాను రూపొందిస్తున్నా. తుఫాన్ లేకుంటే ఈ నెల 21న కంటిన్యూ షెడ్యూల్ 45 రోజుల పాటు అవుట్ డోర్ లో ఉంటుంది. మా అబ్బాయిని బ్లెస్ చేయ‌డానికి వ‌చ్చిన ప్ర‌ముఖులంద‌రికీ ధ‌న్య‌వాదాలు తెలుపుకుంటూ న‌న్ను ఆద‌రించిన‌ట్టుగానే మా అబ్బాయిని కూడా ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నా అన్నారు.


కృష్ణ‌, ఎల్సా ఘోష్ జంట‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో త‌ణికెళ్ల భ‌ర‌ణి, జీవా, గౌతంరాజు, ర‌వి ప్ర‌కాష్‌, సంజు, స్వ‌రూప్ చందు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. సంగీతంః బోలే షావ‌లి, కెమెరాఃఎ విజ‌య్ కుమార్‌, ఎడిట‌ర్ః మార్తాండ్ కె.వెంక‌టేష్‌, ఆర్ట్ డైర‌క్ట‌ర్ః ఎమ్మెస్ వాసు, ఫైట్ మాస్ట‌ర్ః స‌తీష్‌, ప్రాజెక్ట్ కో ఆర్డినేట‌ర్ః క‌.భువ‌న్ రెడ్డి, పీఆర్వోః ర‌మేష్ చందు, నిర్మాతః బిజిఆర్ ఫిల్మ్ అండ్ టివి స్టూడియోష్ , ద‌ర్శ‌క‌త్వంః శ్రీనాథ్ పుల‌కురం.​Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసి ..

Read More !

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ..

Read More !

Gossips

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Moodu Puvvulu AAru Kaayalu Teaser

#U Movie Theatrical Trailer

super sketch teaser release video

Read More !