filmybuzz

View

మన ముగ్గురి లవ్ స్టోరీ వెబ్ సిరీస్ కర్టెన్ రైజర్ విశేషాలు

Tuesday,November07th,2017, 01:53 PM

ప్రముఖ ఆన్లైన్ సంస్థ "యప్ టీవీ" నిర్మిస్తున్న తాజా వెబ్ సిరీస్ "మన ముగ్గురి లవ్ స్టోరీ". నవదీప్, ఆదిత్, తేజస్వి మడివాడ, ఆర్జే హేమంత్, మౌనిమ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ రోమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ కు నందిని రెడ్డి స్క్రిప్ట్ రాయగా శశాంక్ ఏలేటి దర్శకత్వం వహించారు. యప్ టీవీ నిర్మాణంలో ఎర్లీ మాన్సూన్ టేల్స్ బ్యానర్ పై స్వప్నాదత్ నిర్మిస్తున్నారు. రేపట్నుంచి (నవంబర్ 8) యప్ టీవీ యాప్ లో ప్రసారంకానున్న ఈ వెబ్ సిరీస్ కర్టెన్ రైజర్ ఈవెంట్ ను ఇవాళ హైద్రాబాద్ లోని ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో నిర్వహించారు.


ఈ కార్యక్రమంలో "యప్ టీవి" యజమాని ఉదయ్, ఎర్లీ మాన్సూస్ టేల్స్ సంస్థ అధినేత స్వప్నాదత్, యప్ టీవి కంటెంట్ హెడ్ విజయ్, దర్శకురాలు నందిని రెడ్డి, మాటల రచయిత లక్ష్మీభూపాల్, దర్శకుడు శశాంక్ ఏలేటి, నటుడు ఆదిత్, ఆర్జే హేమంత్ తదితరులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా యప్ టీవీ అధినేత ఉదయ్ మాట్లాడుతూ... "డిజిటల్ టెక్నాలజీని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశ్యంతో ఈ రంగంలోకి వచ్చాను. "మన ముగ్గురి లవ్ స్టోరీ"వి రెండు ఎపిసోడ్స్ చూశాను.. చాలా హిలేరియస్ గా వచ్చాయి. 25 మందితో ఒక కంటెంట్ క్రియేషన్ టీం ను ఏర్పాటు చేశాం. సరికొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేయడానికి యప్ టీవి ఎప్పుడు ముందు ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ ను మేం ఎంజాయ్ చేసినట్లుగానే ఆడియన్స్ కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాం" అన్నారు.


కంటెంట్ హెడ్ విజయ్ మాట్లాడుతూ... "యప్ టీవీ"తో అసోసియేట్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ, మలయాళ భాషల్లోనూ డిజిటల్ కంటెంట్ ను క్రియేట్ చేసేందుకు సన్నద్ధమవుతున్నాం" అన్నారు.


స్వప్నాదత్ మాట్లాడుతూ... "మొదట్లో డిజిటల్ కంటెంట్ అంటే తక్కువగా చూసేవాళ్లం కానీ.. సినిమా భవిష్యత్ ఆన్లైన్ లోనే ఉంది. సరికొత్త కాన్సెప్ట్స్ మరియు టాలెంట్ ను ఎంకరేజ్ చేయడానికి ఈ ఆన్లైన్ సోర్స్ పనికొస్తుంది. ఉదయ్ ని చూసి నేనెప్పుడూ ఇన్స్పైర్ అవుతుంటాను. "మన ముగ్గురి లవ్ స్టోరీ" చాలా సింపుల్ లవ్ స్టోరీ.. ప్రేక్షకులకు మా సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నాం" అన్నారు.


నందిని రెడ్డి మాట్లాడుతూ... "షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లు నేను నెట్ ఫ్లిక్స్ లో చాలా ఎక్కువగా చూస్తుంటాను. కానీ.. నేను ట్రై చేయడానికి మాత్రం భయపడేదాన్ని ఎక్కడ చిన్నచూపు చూస్తారో అని. కానీ.. స్వప్నాదత్ అడగడంతో కాదనలేకపోయాను, ఆమె ప్లానింగ్ అండ్ పర్ఫెక్షన్ మీద ఉన్న నమ్మకంతోనే ఈ రంగంలోకి దిగాను. ఒక అమాయకమైన ఆడపిల్ల పాయింటాఫ్ వ్యూలో సాగే సింపుల్ లవ్ స్టోరీ ఇది. లక్ష్మీభూపాల్ సంభాషణలు మా వెబ్ సిరీస్ కి మెయిన్ హైలైట్" అన్నారు.


రచయిత లక్ష్మీభూపాల్ మాట్లాడుతూ... "టీవి, న్యూస్ పేపర్, సినిమా, రేడియో వంటి అన్నీ మాధ్యమాల్లోనూ పనిచేసిన నేను వర్క్ చేయకుండా వదిలేసిన ఏకైక జోనర్ "వెబ్ సిరీస్". అది మాత్రం ఎందుకు వదిలేయాలి అన్న ఆలోచనలో ఉన్నప్పుడు నందినిరెడ్డి ఈ అవకాశం ఇచ్చింది. చాలా డీసెంట్ గా వచ్చింది ఔట్ పుట్. ఇకపై మరిన్ని వెబ్ సిరీస్ లకు వర్క్ చేయాలనుంది" అన్నారు.


వెబ్ సిరీస్ డైరెక్టర్ శశాంక్ ఏలేటి మాట్లాడుతూ.. "నాకీ సదవకాశమిచ్చిన ఉదయ్ గారికి, స్వప్నాదత్ గారికి కృతజ్నతలు" అన్నారు.


ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిధులు "మన ముగ్గురి లవ్ స్టోరీ"లో భాగస్వాములు కావడం సంతోషంగా ఉందని, వెబ్ సిరీస్ సూపర్ హిట్ అవ్వడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసి ..

Read More !

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర్' సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరి ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత ..

Read More !

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోననే ఆసక్తి అందరిలో ఉంది. ప్రిన్స్ మహే ..

Read More !

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుంటో ..

Read More !

Gossips

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

#U Movie Theatrical Trailer

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Read More !