View

కాన్సెఫ్ట్ బేస్డ్ మూవీ ‘సీత.. రాముని కోసం’.. టీజర్ లాంఛ్ విశేషాలు!

Saturday,November25th,2017, 01:40 PM

కాన్సెప్ట్‌ బేస్డ్‌ మూవీస్‌తో సరికొత్త జోనర్‌లో రూపొందిన చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. అదే కోవలో మరొక్కసారి ప్రేక్షకుల ముందుకొస్తున్న చిత్రం 'సీత.. రామునికోసం'. అంతా నూతన నటీనటులతో తెరకెక్కిన ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ని నవంబర్‌24న హైదరాబాద్‌ప్రసాద్‌ల్యాబ్‌లో ఘనంగా రిలీజ్‌చేశారు. నూతన నటుడు శరత్‌హీరోగా కారుణ్య హీరోయిన్‌గా తస్మయ్‌చిన్మయ ప్రొడక్షన్స్‌, రోల్‌కెమెరా యాక్షన్‌పతాకాలపై ఇబాక్స్‌తెలుగు టి.వి. సమర్పణలో అనిల్‌గోపిరెడ్డి దర్శకుడిగా శిల్పా శ్రీరంగం, సరితా గోపిరెడ్డి, డాన్‌నందన్‌సంయుక్తంగా 'సీత... రామునికోసం' చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా టీజర్ ని వినూత్నంగా రిలీజ్ చేసారు. ఒకేసారి అటు అమెరికాలో ఇక్కడ హైదరాబాద్ లో రిలీజ్ చేసారు. అయినవాళ్లు ,ఆత్మీయులకన్నా సెలెబ్రిటీలు ఎవరు వుండరు అన్న కాన్సెప్ట్ తో అమెరికాలోని తెలుగు వాళ్ళ మధ్య ఈ సినిమా మేకింగ్ వీడియోని, టీజర్ ని లాంచ్ చేసారు. అమెరికాలోని న్యూ జెర్సీ లో చిత్ర నిర్మాతల్లో ఒకరైన డాన్ నందన్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. 


ప్రవాస తెలుగు ప్రముఖులు జయ్ తాళ్లూరి, ఉపేంద్ర చివుకుల, మహేందర్ నరాల, తదితరులు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఆత్మీయ వేడుకగా సాగిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారంతా ఈ సినిమా విజయవంతం కావాలని శుభాకాంక్షలు తెలియచేసారు. 


ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌మేకింగ్‌ని హీరో మదర్‌జ్యోతి రిలీజ్‌చేయగా, టీజర్‌ని స్వామి చిదాత్మానంద రిలీజ్‌చేశారు. ఈ కార్యక్రమంలో హీరో శరత్‌హీరోయిన్‌కారుణ్య, దర్శకుడు అనిల్‌గోపిరెడ్డి, నిర్మాతలు శిల్పా శ్రీరంగం, సరిత గోపిరెడ్డి, కెమెరామెన్‌జైపాల్‌రెడ్డి, ఎడిటర్‌సాయి తరాలి, మాటల రచయిత వేణు రాచర్ల, కళా దర్శకుడు మధు రెబ్బ, పాటల రచయిత వెంగి పాల్గొన్నారు. 


స్వామి చిదాత్మానంద మాట్లాడుతూ.. ''సీత.. రామునికోసం' టీజర్‌చాలా బాగుంది. అందరూ చాలా కష్టపడి చేశారు. వారి కష్టం అంతా టీజర్‌లో కన్పిస్తుంది. శరత్‌చిన్నప్పట్నుంచీ హీరో కావాలని కలలు కనేవాడు. ఈ చిత్రంతో అతని కల నెరవేరింది. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించి టీమ్‌అందరికీ మంచి పేరు తీసుకురావాలని ఆశీర్వదిస్తున్నాను'' అన్నారు. 


చిత్ర దర్శకుడు అనిల్‌గోపిరెడ్డి మాట్లాడుతూ.. ''వైకుంఠ పాళి', 'బిస్కెట్‌' చిత్రాల తర్వాత రెండు సంవత్సరాల పాటు ఈ స్క్రిప్ట్‌పై వర్క్‌చేశాను. ఫస్ట్‌ఐ ఫోన్‌లో టెస్ట్‌షూట్‌చేసిన తర్వాత రెడ్‌కెమెరాతో ఈ చిత్రాన్ని షూట్‌చేశాం. సినిమా చాలా బాగా వచ్చింది. డెఫినెట్‌గా ప్రేక్షకులు సినిమా చూసి థ్రిల్‌ఫీలవుతారు. హీరో శరత్‌నా ఫ్రెండ్‌, అలాగే నా బిజినెస్‌పార్టనర్‌. ఫస్ట్‌సినిమా అయినా ఎంతో ఎక్స్‌పీరియన్స్‌వున్న హీరోలా చాలా అద్భుతంగా నటించాడు. హీరోయిన్‌కారుణ్య క్యారెక్టర్‌లో ఇన్‌వాల్వ్‌అయి నటించింది. ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఒక ఆడది మగవాడ్ని మనస్ఫూర్తిగా ప్రేమించి, తాను చనిపోయాక కూడా ఆ ప్రేమను పొందడానికి ఎలా పరితపించింది? ఆ తర్వాత ఆమె ఏం చేసింది? అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించాం. ఈ చిత్రానికి మ్యూజిక్‌నేనే చేశాను. మొత్తం 5 పాటలున్నాయి. ఇలాంటి థ్రిల్లర్‌సినిమాలకు మ్యూజిక్‌, రీరికార్డింగ్‌చాలా ఇంపార్టెంట్‌. ముఖ్యంగా సెకండాఫ్‌అంతా ఒళ్ళు గగుర్పొడిచేవిధంగా వుంటుంది'' అన్నారు. 


హీరో శరత్‌మాట్లాడుతూ.. ''మా గురువు స్వామిజీ, మా అమ్మ చేతులమీదుగా ఫస్ట్‌లుక్‌, టీజర్‌, మేకింగ్‌వీడియోని లాంచ్‌చేయడం నాకు చాలా ఆనందంగా వుంది. ఇది నా ఫస్ట్‌సక్సెస్‌గా భావిస్తున్నాను. ఈ చిత్రంలో హీరోగా నటించే ఛాన్స్‌ఇచ్చిన దర్శకుడు అనిల్‌కి మనస్ఫూర్తిగా థాంక్స్‌. టీజర్‌చాలా అద్భుతంగా వుంది. సినిమా దానికంటే రెండింతలు వుంటుంది'' అన్నారు. 


హీరోయిన్‌ కారుణ్య మాట్లాడుతూ..  ''ఈ చిత్రంలో టైటిల్‌రోల్‌చేశాను. అనిల్‌గారు నా క్యారెక్టర్‌ని ఫెంటాస్టిక్‌గా డిజైన్‌చేశారు. ఇట్స్‌ఎ ఫ్యామిలీ ఎమోషనల్‌థ్రిల్లర్‌మూవీ. ఈ సినిమా మంచి సక్సెస్‌అయి మా అందరికీ మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను'' అన్నారు. 


పాటల రచయిత వెంగి మాట్లాడుతూ.. ''ఈ చిత్రంలో మూడు పాటలు రాశాను. సిట్చ్యుయేషన్‌కి తగ్గట్లుగా పాటలు వుంటాయి. ఈ అవకాశం ఇచ్చిన అనిల్‌గారికి థాంక్స్‌'' అన్నారు. 


మాటల రచయిత వేణు రాచర్ల మాట్లాడుతూ.. ''ఫ్యామిలీ ఎమోషనల్‌థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఆట్టుకునేవిధంగా వుంటుంది. మంచి సీన్స్‌, డైలాగ్స్‌చాలా బాగా కుదిరాయి. ఇలాంటి కాన్సెప్ట్‌బేస్డ్‌మూవీకి మాటలు రాసే అవకాశం దక్కినందుకు చాలా ఆనందంగా వుంది'' అన్నారు. Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Aadi Starrer Nuvve Theatrical Trailer

Read More !