filmybuzz

View

సప్తగిరి ఎల్ ఎల్ బి 3వ పాటను విడుదల చేసిన నాని!

Wednesday,November29th,2017, 10:08 AM

'సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌' చిత్రం సూపర్‌హిట్‌ అయి సప్తగిరికి హీరోగా మంచి క్రేజ్‌ని తీసుకొచ్చింది. ద్వితీయ చిత్రంగా సాయి సెల్యులాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్స్‌ ప్రై.లి. పతాకంపై ప్రముఖ వైద్య నిపుణులు డా. రవికిరణ్‌ నిర్మిస్తున్న చిత్రం 'సప్తగిరి ఎల్‌.ఎల్‌.బి'. హిందీలో సూపర్‌డూపర్‌ హిట్‌గా నిలిచిన 'జాలీ ఎల్‌.ఎల్‌.బి' చిత్రం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దర్శకత్వ శాఖలో అపార అనుభవం కలిగిన చరణ్‌ లక్కాకుల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన 'సప్తగిరి ఎల్‌.ఎల్‌.బి' చిత్రం టీజర్‌కి, రెండు పాటలకి సూపర్బ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ఈ చిత్రంలోని మూడవ పాటని ఇటీవల నేచురల్‌ స్టార్‌ నాని విడుదల చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ చిత్రం డిసెంబర్‌ 7న వరల్డ్‌వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.


నేచురల్‌ స్టార్‌ నాని మాట్లాడుతూ - ''సప్తగిరి ఎల్‌.పల్‌.బి' చిత్రంలోని 3వ పాటని లాంచ్‌ చేయడం చాలా ఆనందంగా వుంది. సప్తగిరి అంటే నాకు చాలా ఇష్టం. ఇద్దరం 'మజ్ను' చిత్రంలో కలిసి నటించాం. అతని కామెడీ ట్రాక్‌ టైమింగ్‌ అంటే నాకు చాలా ఇష్టం. 'ప్రేమకథా చిత్రమ్‌' చూసి చాలా ఎంజాయ్‌ చేశాను. 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌' మంచి హిట్‌ అయ్యింది. అలాగే ఈ చిత్రం కూడా సూపర్‌హిట్‌ కావాలని కోరుకుంటున్నాను. 'సప్తగిరి ఎల్‌.ఎల్‌.బి' పాటలు చూశాను. పాటలన్నీ చాలా గ్రాండ్‌గా, కలర్‌ఫుల్‌గా వున్నాయి. పెద్ద హీరోల సినిమా సాంగ్స్‌ చూసిన ఫీలింగ్‌ కలిగింది. టీజర్‌ చూశాక కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో కలర్‌ఫుల్‌గా ఎంటర్‌టైన్‌మెంట్‌ వుంటుందని నమ్ముతున్నాను. నేను కూడా ఆడియన్స్‌ మధ్య ఈ సినిమా చూస్తాను. 'జాలీ ఎల్‌.ఎల్‌.బి' నా ఫేవరేట్‌ సినిమా. అందులో కోర్టు డ్రామా ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో వుంటుంది. ఈ సినిమా సప్తగిరి చేశాడు. కాబట్టి ఒరిజినల్‌గా కంటే ఇంకా ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్‌ వుంటుంది. సప్తగిరి ఫన్‌ నెక్స్‌ట్‌ లెవెల్‌లో వుంటుందని ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నాను. ఈ టీమ్‌ అందరికీ పెద్ద సక్సెస్‌ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను'' అన్నారు.


హీరో సప్తగిరి మాట్లాడుతూ - ''సప్తగిరి ఎల్‌.ఎల్‌.బి' చిత్రంలోని రెండు పాటలు ఆల్‌రెడీ రిలీజ్‌ అయ్యాయి. మూడవ పాటని మంచి మనసున్న హీరో మా నానిగారు రిలీజ్‌ చేయడం చాలా హ్యాపీగా వుంది. టీజర్‌కి బ్రహ్మాండమైన రెస్పాన్స్‌ వస్తోంది. త్వరలో థియేట్రికల్‌ ట్రైలర్‌ని కూడా లాంచ్‌ చేస్తాం. నానిగారు వరుస విజయాలు సాధిస్తున్నారు. ఆయన పాజిటివ్‌ వైబ్రేషన్స్‌ మాకు కావాలి. నానిగారు మరిన్ని మంచి విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను'' అన్నారు.


దర్శకుడు చరణ్‌ లక్కాకుల మాట్లాడుతూ - '''నానిగారి 'భీమిలి కబడ్జీ జట్టు'కి వర్క్‌ చేశాను. అప్పట్నుంచీ ఆయనతో ట్రావెల్‌ అవుతున్నాను. ఎప్పుడు కలిసినా చాలా ఫ్రీగా మాట్లాడతారు. ఏం చేస్తున్నావ్‌? త్వరగా మంచి సినిమా చెయ్యి అని చెప్పేవారు. అలాంటి నానిగారు మా థర్డ్‌ సాంగ్‌ని లాంచ్‌ చేయడం చాలా హ్యాపీగా వుంది'' అన్నారు.


నిర్మాత డా. రవికిరణ్‌ మాట్లాడుతూ - ''అష్టాచెమ్మా' నుండి నానిగారికి ఫ్యాన్‌ని. తన నేచురల్‌ పెర్‌ఫార్మెన్స్‌తో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశారు. ఆయన ఇంకా మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. 'సప్తగిరి ఎల్‌.ఎల్‌.బి'లోని మూడవ పాటని నాని లాంచ్‌ చేయడం చాలా హ్యాపీగా వుంది. ఇది మా సినిమాకి ఎంతో ప్లస్‌ అవుతుంది. సినిమా అంతా కంప్లీట్‌ అయ్యింది. త్వరలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని గ్రాండ్‌గా జరిపి సినిమాని వరల్డ్‌వైడ్‌గా డిసెంబర్‌ 7న రిలీజ్‌ చేస్తాం'' అన్నారు.


డిసెంబర్‌ 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న ఈ చిత్రంలో కామెడీ కింగ్‌ సప్తగిరి సరసన కశిష్‌ వోరా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: పరుచూరి బ్రదర్స్‌, సంగీతం: విజయ్‌ బుల్గానిన్‌, కో-డైరెక్టర్‌: రాజశేఖర్‌రెడ్డి పులిచెర్ల, ఫొటోగ్రఫీ: సారంగం ఎస్‌.ఆర్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఆర్ట్‌: అర్జున్‌, పాటలు: చంద్రబోస్‌, కందికొండ, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: భిక్షపతి తుమ్మల, నిర్మాత: డా. రవికిరణ్‌, దర్శకత్వం: చరణ్‌ లక్కాకుల.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Read More !