filmybuzz
filmybuzz

View

అన్నపూర్ణ వడ్డించబోతున్న సంక్రాంతి పొంగళి 'రంగులరాట్నం'

Saturday,January13th,2018, 06:00 AM

2017లో 'రారండోయ్ వేడుక చూద్దాం', 'హలో' వంటి హిట్‌ చిత్రాలను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్‌. తాజాగా రాజ్‌తరుణ్‌ హీరోగా, చిత్ర శుక్లా హీరోయిన్‌గా తెర‌కెక్కించిన చిత్రం రంగుల‌రాట్నం. శ్రీరంజనిని దర్శకురాలిగా పరిచయం చేస్తున్నారు. చేస్తూ జనవరి 14న సంక్రాంతి కానుకగా రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున శుక్ర‌వారం హైద‌రాబాద్‌లో విలేక‌రుల‌తో మాట్లాడారు.


నాగార్జున మాట్లాడుతూ - అంద‌రికీ హ్యాపీ న్యూ ఇయ‌ర్‌. సంక్రాంతి శుభాకాంక్ష‌లు. `రంగుల రాట్నం` చిత్రాన్ని మా అన్న‌పూర్ణ వాళ్లు వ‌డ్డించే సంక్రాంతి పొంగ‌ళి అని మేం అనుకుంటున్నాం. నేను సినిమా చూశాను. మా సినిమా ఇది. బొబ్బ‌ట్టులాగా ఉంటుంది. చాలా తీపిగా, చాలా బావుంటుంది. ఒక రియ‌ల్ ఫిల్మ్ ఇది. రియ‌ల్ అంశాల‌తో తీసిన సినిమా. త‌ల్లీకొడుకుల మ‌ధ్య ఎమోష‌న్స్, ఒక కుర్రాడికి, అత‌నికి కాబోయే భార్య‌కు మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాల‌ను చూస్తుంటే నా క‌ళ్ల ముందే పాత్ర‌ల‌న్నీ క‌దులుతున్న‌ట్టు అనిపించింది. ల‌క్కీగా నాకు సంక్రాంతికి డేట్ దొరికింది. సినిమాను నెల రోజుల క్రిత‌మే రెడీ చేసి పెట్టాం. సంక్రాంతికి ల‌క్కీగా డేట్ దొరికేస‌రికి ఫ్రీజ్ చేశాం. ఫ్యామిలీస్ అంద‌రూ క‌లిసి చూడ‌ద‌గ్గ సినిమా. న‌వ్వుకుంటూ, అప్పుడ‌ప్పుడూ కొంచెం కంట‌త‌డి పెడుతూ ప్రేక్ష‌కులు చూస్తారు. నాకు ఈ సినిమా క‌థ ఏడాది క్రితం చెప్పారు. ఏడాదిలో ఇంకో వంద క‌థ‌లు వినుంటాను. అప్పుడు విని బావుంది ఈ క‌థ అని మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ సుప్రియ‌కి చెప్పాను. చేయొచ్చు అని గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాను. అయితే ఆ త‌ర్వాత క‌థ‌ని మ‌ర్చిపోయాను. రీసెంట్‌గా సినిమాను ప్రేక్ష‌కుడిగానే చూశాను. నాకు చాలా బాగా న‌చ్చింది. ప్రెసెంట్ స‌ర్‌ప్రైజ్‌లాగా అనిపించింది. లెంగ్త్ లు కాస్త ఎక్కువైతే త‌గ్గించ‌మ‌ని చెప్పాను. అంత‌వ‌ర‌కే నేను ఇందులో పాల్గొన్న‌ది. ఏదేమైనా మా సంస్థ‌కు చాలా మంచి పేరు వ‌స్తుంది. ఎవ‌రు ఏం చేసినా క్రెడిట్ నాకే ద‌క్కుతుంది కాబ‌ట్టి నాకు చాలా హ్యాపీ. శ్రీరంజ‌నికి ద‌ర్శ‌కురాలిగా తొలి చిత్ర‌మిది. ఎలా నెరేట్ చేసిందో అప్పుడు గుర్తులేదు. కానీ సినిమాను ఎక్స్ పీరియ‌న్స్ గ‌ల డైర‌క్ట‌ర్‌గా బాగా తెర‌కెక్కించింది. ఎమోష‌న్స్ను.. మ‌ద‌ర్ ఎమోష‌న్స్, అమ్మాయి ఎమోష‌న్స్ ని ఓ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూపించింది. మేం రాజ్‌త‌రుణ్‌తో `ఉయ్యాల జంపాల` చేశాం. త‌ను నేచుర‌ల్ యాక్టర్‌. చాలా బాగా చేస్తాడు. ఒక సీన్‌లో త‌ల్లిని ప్రేమించే అబ్బాయిలాగా బిత్త‌ర‌చూపుల‌తో చేశాడు. నాకు ర‌క‌ర‌కాల విష‌యాలు గుర్తొచ్చాయి. అత‌ని యాస ఇంట్ర‌స్టింగ్‌గా ఉంటుంది. మా నాయిక చిత్ర సినిమాలోనూ చాలా అందంగా ఉంది. సినిమాలో అంద‌రూ రియ‌ల్‌గా ఉన్నారు. అదే నాకు చాలా బాగా న‌చ్చింది. అందరికీ ఆల్ ది బెస్ట్. ప్రియ‌ద‌ర్శి చాలా బాగా చేశాడు. త‌ను ఈ సినిమాకు పెద్ద హైలైట్ అవుతాడు. నేచుర‌ల్ టైమింగ్‌, నేచుర‌ల్ కామెడీ ఉన్న సినిమా ఇది. సితార‌గారు త‌ల్లి పాత్ర‌లో చాలా బాగా చేశారు. సితార‌కు, రాజ్‌త‌రుణ్‌కి మధ్య ఉన్న త‌ల్లీ కొడుకుల రిలేష‌న్ షిప్ చాలా బాగా పండింది. ఆమె చాలా చ‌క్క‌గా డ‌బ్బింగ్ కూడా చెప్పారు. ఆమె ఎక్స్ ప్రెష‌న్స్ కి డ‌బ్బింగ్ చాలా బాగా కుదిరింది. ఈ సంక్రాంతికి స్వీట్ ల‌వ్లీ ఫిల్మ్ అవుతుంది. `రంగుల‌రాట్నం`లాగా చ‌క్క‌గా, హాయిగా చూడొచ్చు అని చెప్పారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Read More !