filmybuzz
filmybuzz

View

జువ్వ ఫస్ట్ లుక్, టీజర్ ని రిలీజ్ చేసిన చిరు!

Saturday,January13th,2018, 11:01 AM

రంజిత్, పాల‌క్ ల‌ల్వానీ జంటగా 'దిక్కులు చూడ‌కు రామయ్య‌' ఫేమ్ త్రికోటి పేట ద‌ర్శ‌క‌త్వంలో రూపొంతోన్నచిత్రం 'జువ్వ‌'. ఎస్.వి. ర‌మ‌ణ స‌మ‌ర్ప‌ణ‌లో సొమ్మి ఫిలింస్ పై డా. భ‌ర‌త్ సోమి నిర్మిస్తోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టీజర్ ను శనివారం ఉదయం మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు.


అనంతరం చిరంజీవి మాట్లాడుతూ - "అందరికి హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ రోజు 'జువ్వ' ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల చేయడం హ్యాపీగా ఉంది. హీరో రంజిత్, ప్రొడ్యూసర్ భరత్ అన్నదమ్ములు. వీళ్ల నాన్నగారితో నాకు మంచి పరిచయం ఉంది. స్వతహాగా భరత్ డాక్టర్. సాధారణంగా యాక్టర్ కాబోయి డాక్టర్ అయ్యామనే మాటలు వింటుంటాం. కానీ, తమ్ముడి కోసం డాక్టర్ భరత్ ప్రొడ్యూసర్ అయ్యాడు. ఆ విధంగా అన్నదమ్ముల అనుబంధానికి ప్రతీకగా ఈ సినిమా నిలబడింది. టీజర్ లో రంజిత్ డైనమిక్ గా, హుషారుగా కనిపించాడు. క్యారెక్టర్ పరంగా పక్కా మాస్ అని అర్థమవుతోంది. హీరోయిన్ పాలక్ లల్వానీ రొమాంటిక్ గా, అందంగా కనిపించింది. రాజమౌళి శిష్యుడు త్రికోటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను వీళ్లిద్దరి కోసం తప్పకుండా చూస్తా. 'దిక్కులు చూడకు రామయ్య' తర్వాత దర్శకుడు త్రికోటి మరో హిట్ అందుకోవాలని కోరుకుంటున్నా'' అన్నారు.


హీరో రంజిత్ మాట్లాడుతూ - "చిరంజీవిగారి నటన అంటే నాకెంతో ఇష్టం. హి ఈజ్ మై రోల్ మోడల్ అండ్ ఇన్స్పిరేషన్. ఆయనతో ఒక్క ఫోటో దిగితే చాలు అనుకునేవాడిని. ఈరోజు నేను హీరోగా పరిచయం అవుతున్న సినిమా టీజర్ ను సార్ విడుదల చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఐ లవ్ చిరంజీవి. నేను ఎపుడైనా లోన్లీగా ఫీల్ అయినప్పుడు యుట్యూబ్ లో చిరంజీవిగారి పాటలే చూస్తా'' అన్నారు.


దర్శకుడు త్రికోటి మాట్లాడుతూ - "చిరంజీవిగారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగడం సంతోషంగా ఉంది. ప్రేమకథతో రూపొందిన సినిమా ఇది. చిన్న చిన్న థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి" అన్నారు.


ప్రొడ్యూసర్ భరత్ మాట్లాడుతూ - "ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ విడుదల చేసిన చిరంజీవిగారికి థాంక్స్. 2017లో మా సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ నెలాఖరున ఆడియోని, ఫిబ్రవరిలో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు.


ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రాఫర్ సురేష్ పాల్గొన్నారు.


పోసాని కృష్ణ ముర‌ళి, అలీ, స‌ప్త‌గిరి, ముర‌ళీ శ‌ర్మ‌, ర‌ఘుబాబు, ప్ర‌భాక‌ర్, విజయ్ చంద‌ర్, ఆనంద్, ఐనాక్స్ వెంక‌ట్, పింగ్ పాంగ్ సూర్య‌, జ‌బ‌ర్ధ‌స్త్ శ్రీను, షేకింగ్ షేషు, సారిక రామ‌చంద్ర‌రావు, ఏడిద శ్రీరాం, మోహ‌న్ రావు, హిమ‌జా, మునిరాజు, ల‌త‌, తుల‌సి, ప్ర‌స‌న్న కుమార్, ప్ర‌భాష్ శ్రీను, రాజేష్‌, భ‌ద్ర‌మ్, సురేఖా వాణి, స‌నా, దువ్వాసి మోహ‌న్ , ప్ర‌జ్వాల్, ఆయుష్, ఎస్తార్ అనీల్, విష్ణు ప్రియ‌, ప‌ద్మ‌జా, ఫ‌రీద్, క‌బీర్, అజ‌ర్, నాగు త‌దిత‌రులు న‌టిస్తుల్లా ఈ చిత్రానికి క‌థ, మాట‌లు: ఎమ్. ర‌త్నం, సాహిత్యం: అనంత శ్రీరాం, వ‌శిష్టి, కొరియోగ్ర‌ఫీ: గ‌ణేష్, జానీ, ఎడిటింగ్: కోట‌గిరి వెంకటేశ్వ‌ర‌రావు, త‌మ్మిరాజు, యాక్ష‌న్: వెంక‌ట్, నందు, ఆర్ట్: రామ్ అర‌స‌విల్లి, సినిమాటోగ్ర‌ఫీ: సురేష్‌, సంగీతం: ఎమ్.ఎమ్. కీర‌వాణి, నిర్మాత : డా. భ‌ర‌త్ సోమి, స్ర్కీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: త్రికోటి పేట‌.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Aadi Starrer Nuvve Theatrical Trailer

Devadasi Motion Poster

Pratikshanam 1min Trailer

Read More !