View

మాస్ ఎలిమెంట్స్ తో ఎనర్జిటిక్ గా 'ఇంటిలిజెంట్'

Wednesday,January24th,2018, 10:38 AM

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం 'ఇంటిలిజెంట్‌'. ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 9న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో..


సి.క‌ల్యాణ్ మాట్లాడుతూ - ఈ సినిమాను ఫిబ్ర‌వ‌రి 9న విడుద‌ల చేస్తున్నాం. మా సినిమా దేనికీ పోటీ కాదు. సంక్రాంతికి బాల‌య్య సినిమా `జై సింహా`తో హిట్ కొట్టాం. ఫిబ్ర‌వ‌రిలో ఈ సినిమా వ‌స్తుంది. మాస్‌, ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఉంటుంది. ఫ్యామిలీల‌కు కూడా న‌చ్చ‌తుంది. నేను గ‌ర్వంగా చెప్పుకునే సినిమా అవుతుంది. నిన్న‌నే నాకు ద‌ర్శ‌కుడు ఈ సినిమాను చూపించారు. చాలా బాగా న‌చ్చింది. యువ‌త‌కు, వినాయ‌క్ ఫ్యాన్స్ కి నచ్చే సినిమా అవుతుంది. రిపీట్ ఆడియ‌న్స్ ఎక్కువ‌గా వ‌స్తారు. డ్యాన్సులు, మూవ్‌మెంట్స్ చాలా బాగా చేశాడు తేజ్‌. 2018 మా సీకే ఎంట‌ర్‌టైన్‌మెంట్ అవుతుంది. వినాయ‌క్‌గారి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, మాస్ ఎలిమెంట్స్‌తో ఎన‌ర్జిటిక్‌గా ఉండే సినిమా ఇది. ఇంట‌లిజెంట్‌గా వ‌స్తున్నాం. ఇంట‌లిజెంట్‌గా కొడ‌తాం అని చెప్పారు.


స‌ప్త‌గిరి మాట్లాడుతూ - వినాయ‌క్‌గారు నాకు మంచి కేర‌క్ట‌ర్ ఇచ్చారు. మిగిలిన ద‌ర్శ‌కుల సినిమాలు చేసేట‌ప్పుడు కాలేజీకి వెళ్లిన‌ట్టు ఉంటుంది. కానీ వినాయ‌క్‌గారి సినిమాల షూటింగ్ అయితే ఎగ్జామ్‌లాగా రెండు గంట‌లే ఉంటుంది. మ‌న ప‌ని పూర్త‌యిన త‌ర్వాత అక్క‌డ మ‌నం ఉండ‌టానికి ఆయ‌న ఒప్పుకోరు. వెళ్లి వేరే సినిమాలు చేసుకోమంటారు. న‌టుడిగా ప్ర‌తి శుక్ర‌వారం క‌నిపించ‌మ‌ని చాలా మంది అడుగుతున్నారు. మంచి పాత్ర‌లు వ‌స్తే చేయ‌డానికి నేను సిద్ధంగా ఉన్నాను. త‌ప్ప‌కుండా న‌వ్విస్తాను అని అన్నారు.


వినాయ‌క్ మాట్లాడుతూ - సి.క‌ల్యాణ్‌గారి సంస్థ‌లో సినిమా చేయ‌మ‌ని మా నాన్న‌గారు ఎప్పుడూ చెప్పేవారు. నాకు ఆయ‌న సంస్థ‌లో ప‌నిచేయ‌డం చాలా ఆనందంగా ఉంది. మా నాన్న‌గారి కోరిక నెర‌వేరింది. ఆయ‌న నిర్మాత‌గా అనిపించ‌లేదు. మా అన్న‌య్య‌లాగా అనిపించారు. సెట్లో ఇద్ద‌రం అన్న‌ద‌మ్ములం ఉన్న‌ట్టు అనిపించింది. `కృష్ణ‌` సినిమాలాగా ఇందులోనూ అన్ని అంశాలు ఉంటాయి. తేజ్ చాలా బాగా చేశాడు. త‌ను ఎంత ఎదిగినా అన్న‌య్య‌లాగా ఇలాగే ఉండాలి. `కొండ‌వీటిదొంగ‌`లోని చ‌మ‌క్కు చ‌మ‌క్కు పాట‌ను ఇందులో రీమిక్స్ చేశాం. తేజ్ వేసిన స్టెప్పులు చూస్తే చాలా ఆశ్చ‌ర‌ర్యంగా అనిపించింది. శివ ఆకుల మంచి క‌థ ఇచ్చారు. మా కాంబినేష‌న్‌లో హిట్ సినిమా అవుతుంది. లావ‌ణ్య మా చిత్రంలో గ్లామ‌ర్‌గా అనిపిస్తుంది. కెమెరామేన్‌, త‌మ‌న్ సంగీతం సినిమాకు హైలైట్‌ అని అన్నారు.


సాయిధ‌ర‌మ్‌తేజ్ మాట్లాడుతూ - సినిమా ఎప్పుడు మొద‌లుపెట్టామో, ఎప్పుడు అయిపోయిందో తెలియ‌లేదు. అనుక‌న‌న టైమ్‌కి పూర్తి చేశాం. ఖైదీ నెంబ‌ర్ 150 అయిన త‌ర్వాత వినాయ‌క్‌గారు నాతో సినిమా చేయ‌డం చాలా ఆనందంగా ఉంది. మంచి పాత్ర కుదిరింది. డ‌బ్బింగ్‌లో కొన్ని సీన్లు చేసి షాక్ అయ్యాను. నేనేనా చేసింది అని అనిపించింది. నాతో పాటు వ‌స్తున్న వ‌రుణ్ సినిమా కూడా హిట్ కావాలి అని చెప్పారు.


లావ‌ణ్య త్రిపాఠి మాట్లాడుతూ - సినిమా మొద‌లుపెట్ట‌డానికి ముందు చాలా భ‌య‌మేసింది. కానీ సెట్స్ లో చాలా స‌ర‌దాగా చేశాను అని చెప్పారు.


శివ ఆకుల మాట్లాడుతూ - కృష్ణ‌, ల‌క్ష్మీ, నాయ‌క్ ని మించి హిట్ అవుతుంది. సి.క‌ల్యాణ్‌గారు న‌న్ను నాలుగేళ్లుగా ఎంక‌రేజ్ చేస్తున్నారు. మా మామ వినాయ‌క్ నాకు అన్నీ. తేజ్ చాలా క‌ష్ట‌ప‌డే మ‌న‌స్త‌త్వం ఉన్న‌వాడు. డైర‌క్ట‌ర్ మీద న‌మ్మ‌కంతో మోనిట‌ర్ కూడా చూడ‌కుండా సినిమా చేశారు అని చెప్పారు.


సాయిధరమ్‌తేజ్‌, లావణ్య త్రిపాఠి, నాజర్‌, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, ఆకుల శివ, కాశీ విశ్వనాథ్‌, ఆశిష్‌ విద్యార్థి, షాయాజీ షిండే, రాహుల్‌దేవ్‌, దేవ్‌గిల్‌, వినీత్‌కుమార్‌, జె.పి. ప థ్వీ, రుబాబు, కాదంబరి కిరణ్‌, విద్యుల్లేఖా రామన్‌, సప్తగిరి, తాగుబోతు రమేష్‌, భద్రం, నల్ల వేణు, రాహుల్‌ రామకృష్ణ, వెంకీ మంకీ, రాజేశ్వరి నాయర్‌, సంధ్యా జనక్‌, ఫిష్‌ వెంకట్‌, శ్రీహర్ష, శివమ్‌ మల్హోత్రా, రవిరామ్‌ తేజ, తేజారెడ్డి నటిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు: శివ ఆకుల, సినిమాటోగ్రఫీ: ఎస్‌.వి. విశ్వేశ్వర్‌, సంగీతం: థమన్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఆర్ట్‌: బ్రహ్మ కడలి, ఫైట్స్‌: వెంకట్‌, డాన్స్‌: శేఖర్‌, జాని, సహనిర్మాతలు: సి.వి.రావు, నాగరాజ పత్సా, నిర్మాత: సి.కళ్యాణ్‌, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్‌.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ నిర్మిస్తున్న 'సైరా' నరసింహారెడ్డి ..

Read More !

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

Gossips

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !