View

ఆపరేషన్ 2019 టీజర్ లాంఛ్ విశేషాలు!

Saturday,January27th,2018, 02:04 PM

శ్రీకాంత్‌, య‌జ్ఞశెట్టి హీరో హీరోయిన్లుగా అలివేల‌మ్మ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై క‌ర‌ణం బాబ్జి ద‌ర్శ‌కత్వంలో అలివేలు నిర్మిస్తున్న చిత్రం 'ఆప‌రేష‌న్ 2019'. 'బి వేర్ ఆఫ్ ప‌బ్లిక్‌' అనేది ట్యాగ్ లైన్‌. ఈ చిత్రం టీజ‌ర్ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా శుక్ర‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది.


ఈ కార్య‌క్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు టీజ‌ర్ లాంచ్ చేసిన అనంత‌రం మాట్లాడుతూ - శ్రీకాంత్ నాకు త‌మ్ముడుగా సింహగ‌ర్జ‌న‌ లో న‌టించాడు. ఆ త‌ర్వాత నాన్న‌కు పెళ్లి చిత్రంలో కొడుకుగా న‌టించాడు. త‌ను మంచి న‌టుడే కాదు. మంచి మ‌న‌సున్న వ్య‌క్తి కూడా. గ‌తంలో చేసిన ఆప‌రేష‌న్ దుర్యోధ‌న చిత్రం త‌న‌కు మంచి పేరు తెచ్చింది. ఇప్పుడు చేస్తోన్న ఆప‌రేష‌న్ 2019 టీజ‌ర్ కూడా చాలా బాగుంది. బివేర్ ఆఫ్ ప‌బ్లిక్ ఈ సినిమా క్యాప్ష‌న్ చూసిన త‌ర్వాత నాకు ఓ విష‌యం గుర్తొస్తుంది. అదేమిటంటే... నేను కాకినాడ నుంచి మొద‌ట లోక్ స‌భ స‌భ్యుడిగా పోటీ చేసి మంచి మెజారిటీతో గెలిచాను. ఆ త‌ర్వాత మా సొంతూరైన‌ న‌ర్సాపురం నుంచి పోటీ చేసి మ‌ళ్లీ మెజారిటీతో గెలిచాను. అక్క‌డ నేను చేసిన మంచి ప‌నుల గురించి ప్ర‌జ‌లు ఇప్ప‌టికీ చెప్పుకుంటుంటారు. కానీ ఆ త‌ర్వాత రాజకీయాల్లోకి వ్యాపార‌వేత్త‌లు ప్ర‌వేశించి ఓట్లు కొన‌డం ప్రారంభించారు. ప‌బ్లిక్ కి కూడా డ‌బ్బుపై ఆశ పెరిగింది. కాబ‌ట్టి ప‌బ్లిక్ తో జాగ్ర‌త్త‌గా ఉండాలి. వారిని మార్చే విధంగా సినిమాలు రావాలి. ఈ సినిమా టీజ‌ర్ చూస్తోంటే ద‌ర్శ‌కుడు ఒక మంచి కాన్సెప్ట్ తో సినిమా తీసిన‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమా ప‌బ్లిక్ ని ఎడ్యుకేట్ చేసే విధంగా ఉండ‌బోతుంద‌ని అర్థ‌మవుతోంది. ఆప‌రేష‌న్ దుర్యోధ‌న చిత్రంలా శ్రీకాంత్ కు ఈ సినిమా మంచి పేరు తేవాల‌నీ, టీమ్ అంద‌రికీ మంచి పేరు రావాల‌ని కోరుకుంటున్నాఅన్నారు.


న‌టుడు శివ‌కృష్ణ మాట్లాడుతూ - శ్రీకాంత్ ఎంత మంచి న‌టుడో అంద‌రికీ తెలిసిందే. ఇందులో నాకు కూడా మంచి క్యార‌క్ట‌ర్ ఇచ్చారు ద‌ర్శ‌కులు. చాలా క్లారిటీ ఉన్న ద‌ర్శ‌కుడు. టీజ‌ర్లో క‌న్విక్ష‌న్ ఉంది. చాలా డిఫ‌రెంట్ గా ఉంది అన్నారు.


నాగినీడు మాట్లాడుతూ - బివేర్ ఆఫ్ ప‌బ్లిక్ అనే క్యాప్ష‌న్ చూస్తూనే సినిమా ఎలా ఉండ‌బోతుందో తెలుస్తోంది. ప‌బ్లిక్ కి ఉప‌యోగ‌ప‌డే చిత్ర‌మిద‌ని అన్నారు.


నటి దీక్షాపంత్ మాట్లాడుతూ - ఒక మంచి మెసేజ్ ఉన్న ఫిలింలో నేను కూడా పార్ట్ అవ‌డం చాలా హ్యాపీ. అవ‌కాశం క‌ల్పించిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు ధ‌న్య‌వాదాలు అన్నారు.


న‌టి హ‌రితేజ మాట్లాడుతూ - శ్రీకాంత్ గారితో న‌టిస్తూ చాలా నేర్చుకున్నాను. ఎంత ఎదిగినా ఒదిగుండే వ్య‌క్తిత్వం వారిది. ఈ సినిమాలో నేనొక డిఫ‌రెంట్ క్యార‌క్ట‌ర్ చేశాను. నాకు మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంద‌న్నారు.


కృష్ణం రాజు స‌తీమ‌ణి శ్యామ‌లాదేవి మాట్లాడుతూ - మా నాన్న‌కు పెళ్లి చిత్రంలో న‌టించిన ద‌గ్గ‌ర నుంచి శ్రీకాంత్ ని మా అబ్బాయిలాగే చూస్తాం. మంచి న‌టుడు. మ‌ర్యాద తెలిసిన వ్య‌క్తి. ఈ సినిమా పెద్ద స‌క్సెస్ సాధించాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాఅన్నారు.


నిర్మాత అలివేలు మాట్లాడుతూ - డైర‌క్ట‌ర్ బాబ్జి గారు మంచి క‌థ‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. శ్రీకాంత్ గారు ఎంతో స‌హ‌క‌రించ‌డంతో సినిమాను అనుకున్న విధంగా చేయ‌గ‌లుగుతున్నాం. టీజ‌ర్ ఆవిష్క‌ర‌ణ‌కు రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి దంప‌తులు వ‌చ్చి మ‌మ్మ‌ల్ని ఆశీర్వ‌దించ‌డం చాలా ఆనందంగా ఉంద‌న్నారు.


ద‌ర్శ‌కుడు క‌రణం బాబ్జి మాట్లాడుతూ - శ్రీకాంత్ గారితో గ‌తంలో మెంట‌ల్ పోలీస్‌ చిత్రాన్ని డైర‌క్ట్ చేశాను. ఆ సినిమా టైటిల్ వివాదం కావ‌డం, రిలీజ్ ప్రాబ్ల‌మ్ అవ‌డంతో మేము అనుకున్న పేరు రాలేదు. మ‌రోసారి శ్రీకాంత్ కాంబినేష‌న్ లో ఆప‌రేష‌న్ 2019 చిత్రాన్ని డైర‌క్ట్ చేస్తున్నా. న‌న్ను న‌మ్మి మా నిర్మాత‌లు ఏ విష‌యంలో రాజీ ప‌డ‌కుండా సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ గారు కూడా అన్ని విధాలుగా స‌హ‌క‌రిస్తున్నారు. ఈ నెల 29 నుంచి ఫిబ్ర‌వ‌రి 6 వ‌ర‌కు చేయ‌బోయే షెడ్యూల్ తో షూటింగ్ మొత్తం పూర్త‌వుతుంది . శ్రీకాంత్ గారితో పాటు ఇందులో మ‌రో ఇద్ద‌రు యంగ్ స్ట‌ర్స్ న‌టించారు. త్వ‌ర‌లో వారెవ‌ర‌న్న‌ది ప్ర‌క‌టిస్తాం అన్నారు.


శ్రీకాంత్ మాట్లాడుతూ - సింహ గ‌ర్జ‌న‌, మా నాన్న‌కు పెళ్లి చిత్రాల్లో కృష్ణంరాజు గారితో క‌లిసి న‌టించ‌న ద‌గ్గ‌ర నుంచి వారితో నాకు మంచి అనుబంధం ఏర్ప‌డింది. 'ఆప‌రేష‌న్ 2019' టీజ‌ర్ వారి చేతుల మీదుగా విడుద‌ల కావ‌డం చాలా సంతోషం. గ‌తంలో క‌రణం బాబ్జీ ద‌ర్శ‌క‌త్వంలో మెంట‌ల్ పోలీస్ చేశాను. కానీ టైటిల్ కాంట్ర‌వ‌ర్సీ, రిలీజ్ ప్రాబ్ల‌మ్ వ‌ల్ల ఆ సినిమాకు అనుకున్నంత పేరు రాలేదు. ఈసారి కాంట్ర‌వ‌ర్సీ లేకుండా మంచి కంటెంట్ తో సినిమా చేద్దాం అన్నాను. ఈ స్టోరీ చెప్పాడు. ఇందులో కాంట్ర‌వ‌ర్సీ ఉన్నా కంటెంట్ బావుంది. క‌చ్చితంగా అంద‌రికీ న‌చ్చుతుంద‌న్న న‌మ్మ‌కం ఉంది.మా నిర్మాత‌లు ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా సినిమా నిర్మిస్తున్నారు. ష‌కీల్ ఆరు అద్భుత‌మైన పాట‌లిచ్చారు అన్నారు.


కోట శ్రీనివాస‌రావు, పోసాని కృష్ణ ముర‌ళి, శివ‌కృష్ణ‌, జీవా, నెక్కంటి వంశీ, వినీత్ కుమార్‌, దిల్ ర‌మేష్‌, తోట‌ప‌ల్లి మ‌ధు, ర‌మేష్ రాజ్‌, నాగినీడు, వేణుగోపాల్, టార్జాన్, నారాయ‌ణ‌రావు, ఫిష్ వెంక‌ట్, సుహాషిని, దీక్షా పంత్, హ‌రితేజ‌, హేమ‌, అపూర్వ‌, శివ‌పార్వ‌తి, జెన్నీ, రాగిణి త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్ః జె.కే.మూర్తి; ఎడిట‌ర్ఃఉద్ద‌వ్‌; పాట‌లుః రామ‌జోగ‌య్య‌శాస్ర్తి, బాష‌శ్రీ; స‌ంగీతంః ష‌కీల్‌; సినిమాటోగ్ర‌ఫీః వెంక‌ట్ ప్ర‌సాద్; నిర్మాతః అలివేలు; స్టోరి-స్ర్కీన్ ప్లే-డైలాగ్స్-డైర‌క్ష‌న్ః క‌ర‌ణం బాబ్జి.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ నిర్మిస్తున్న 'సైరా' నరసింహారెడ్డి ..

Read More !

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

Gossips

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !