View

నెల్లూరి పెద్దారెడ్డి ఆడియో లాంఛ్ విశేషాలు!

Saturday,January27th,2018, 02:20 PM

సిద్ధి విఘ్నేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దర్శకులు వీజే రెడ్డి రూపొందిస్తున్న చిత్రం నెల్లూరి పెద్దారెడ్డి. సీహెచ్ రఘునాథ రెడ్డి నిర్మాత. సతీష్ రెడ్డి, మౌర్యాని, ముంతాజ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రభాస్ శీను, అంబటి శీను, సమ్మెట గాంధీ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. గురురాజ్ సంగీతాన్ని అందించిన నెల్లూరి పెద్దారెడ్డి ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో జరిగింది.


ఈ కార్యక్రమానికి సీనియర్ దర్శకులు సాగర్, రేలంగి నరసింహారావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

 

ఆడియో బిగ్ సీడీని ఆవిష్కరించిన అనంతరం దర్శకులు వీజే రెడ్డి మాట్లాడుతూ - పల్లె వాతావరణంలో ఆహ్లాదకరమైన కథా కథనాలతో నెల్లూరి పెద్దారెడ్డి చిత్రం సాగుతుంటుంది. నెల్లూరు నుంచి ఖమ్మం జిల్లా సీతారాంపురం అనే గ్రామానికి వలస వచ్చిన పెద్దారెడ్డి అనే వ్యక్తి కథ ఇది. అలా అతన్ని అంతా నెల్లూరి పెద్దారెడ్డి అని పిలుస్తుంటారు. ఆ గ్రామంలోని వాళ్లంతా నెల్లూరి పెద్దారెడ్డిని గౌరవిస్తుంటారు. నలుగురికి మంచి చేసే పెద్దారెడ్డి ఓ యువతి కుటుంబానికి ఆశ్రయమిస్తాడు. ఈ క్రమంలో అతనికి అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి. వాటి పర్యవసానంగా కథ ఎలాంటి మలుపులు తిరిగింది అనేది ఆసక్తికరంగా చూపిస్తున్నాం. కథలో కొన్ని సన్నివేశాలు విషాధంగా సాగుతుంటాయి. వాటిని సమతూకం చేసేందుకు జబర్దస్త్ శాంతి స్వరూప్ లాంటి నటులతో చింతామణి నాటక రిహార్సల్స్ సన్నివేశాలు రూపొందించాం. ఈ ఎపిసోడ్ అంతా ప్రేక్షకులను బాగా నవ్విస్తుంటుంది. ఇలా అన్ని రకాల భావోద్వేగాలతో నెల్లూరి పెద్దారెడ్డి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. పాటల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. గురురాజ్ సంగీతం, డాక్టర్ కమలాకర కామేశ్వరరావు సాహిత్యం చక్కగా కుదిరాయి. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలూ పూర్తి కావొస్తున్నాయి. రెండు మూడు రోజుల్లో ఫస్ట్ కాపీ సిద్ధమవుతుంది. సెన్సార్ పూర్తవగానే ప్రేక్షకుల ముందుకు చిత్రాన్ని తీసుకొస్తాం. ఫిబ్రవరిలో నెల్లూరి పెద్దారెడ్డి చిత్రాన్ని విడుదల చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాం అన్నారు.


కథానాయకుడు సతీష్ రెడ్డి మాట్లాడుతూ - నెల్లూరి పెద్దారెడ్డి అనే పాత్ర పేరు ప్రేక్షకులు వినే ఉంటారు. ఆ పెద్దారెడ్డి నవ్విస్తే....ఈ నెల్లూరి పెద్దారెడ్డి మీకు మర్చిపోలేని అనుభూతిని అందిస్తాడు. ఇంత గొప్ప పాత్రను నాకు ఇచ్చిన దర్శకులు వీజే రెడ్డి గారికి కృతజ్ఞతలు. ప్రణాళిక ప్రకారం కేవలం 28 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేశాం. నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా పూర్తవుతున్నాయి. త్వరలోనే మీ ముందుకొస్తాం. మంచి చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం అన్నారు.


దర్శకులు సాగర్ మాట్లాడుతూ - నెల్లూరి పెద్దారెడ్డి గురించి సినిమా తెలుసుకున్న తర్వాత మంచి అవగాహనతో ఈ సినిమా రూపొందించారని అర్థమవుతోంది. ఇవాళ్టి దర్శక నిర్మాతలకు కావాల్సింది అదే. ఏ కథ చెబుతున్నాం, దాన్ని ఎలా తెరకెక్కిస్తున్నాం అనేది కావాలి. దర్శకుడు వీజే రెడ్డి పూర్తి సన్నద్ధతతో ఈ చిత్రాన్ని రూపొందించారని తెలుస్తోంది. మంచి చిత్రం చేయడం కోసం ఆర్నెళ్లు, ఏడాది అయినా వేచి చూడండి కానీ...ఏదొకటి చేసేద్దాం అనుకోవద్దు. అలాంటి సినిమాలు తెరకెక్కించడం వల్ల ఎవరికీ లాభముండదు. ఈ చిత్ర యూనిట్ అందిరకీ నా ఆశీస్సులు ఉంటాయి అన్నారు.


దర్శకులు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ - మేము సినిమాలు చేసేప్పుడు ప్రారంభోత్సవం మాత్రమే మాకు తెలుసు. చిత్రీకరణ సమయంలోనే పంపిణీదారులు సినిమా తీసుకునేవారు. ఇవాళ అలాంటి పరిస్థితి లేదు. ప్రతి దశలో సినిమా ఖర్చు నిర్మాతే భరించాల్సి వస్తోంది. నెల్లూరి పెద్దారెడ్డి చిత్రాన్ని నెల రోజుల్లోనే చిత్రీకరించడం గొప్ప విషయం. నేను నెలరోజుల్లో రూపొందించిన సినిమాలెన్నో శత దినోత్సవాలు జరుపుకున్నాయి. ఎంత బాగా కథను చెప్పామనేది ప్రేక్షకులకు కావాల్సింది. ఆ వినోదాన్ని నెల్లూరి పెద్దారెడ్డి అందిస్తుందని నమ్ముతున్నాను అన్నారు.


నెల్లూరి పెద్దారెడ్డి చిత్రానికి మాటలు - సంజీవ్ మేగోటి, సినిమాటోగ్రఫీ - బాలసుబ్రహ్మణి, ఎడిటింగ్ - మేనగ శీను, సంగీతం - గురురాజ్, డాన్స్ - గోరా మాస్టర్.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ నిర్మిస్తున్న 'సైరా' నరసింహారెడ్డి ..

Read More !

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసి ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Moodu Puvvulu AAru Kaayalu Teaser

#U Movie Theatrical Trailer

Read More !