View

ఇంటిలిజెంట్ గా సినిమా తీసారని అనుకుంటారు - సి.కళ్యాణ్

Wednesday,January31st,2018, 01:30 PM

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి జంటగా సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి. పతాకంపై సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్‌ నిర్మించిన చిత్రం 'ఇంటిలిజెంట్‌'. రీసెంట్‌గా విడుదలైన ఈ చిత్రం టీజర్‌కి, పాటలకి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. 'ఖైది నంబర్‌ 150' చిత్రం తర్వాత సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహించిన చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని వున్నాయి. అలాగే సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి. బేనర్‌లో సి.కళ్యాణ్‌ నిర్మించిన 'జై సింహా' చిత్రం ఈ సంక్రాంతికి రిలీజై సూపర్‌హిట్‌ చిత్రంగా నిలిచింది. సో.. వీరిద్దరి సక్సెస్‌ఫుల్‌ కాంబినేషన్‌లో వస్తోన్న 'ఇంటిలిజెంట్‌' అందరి అంచనాలకు తగ్గట్లుగా రూపొందిందని ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 9న రిలీజ్‌ కాబోతున్న సందర్భంగా నిర్మాత సి.కళ్యాణ్‌ 'ఇంటిలిజెంట్‌' చిత్ర విశేషాలను తెలిపారు.


టీజర్‌కి, సాంగ్స్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌!!
చిత్ర నిర్మాత సి.కళ్యాణ్‌ మాట్లాడుతూ - ''జనవరి 12న పొంగల్‌కి సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌లో నిర్మించిన మా 'జై సింహా' చిత్రాన్ని సూపర్‌హిట్‌ చేసి మా బేనర్‌కి 2018లో గొప్ప శుభారంభాన్ని ఇచ్చారు ప్రేక్షకులు. మాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు. అలాగే 'ఇంటిలిజెంట్‌' సినిమా ప్రారంభం రోజునే ఫిబ్రవరి 9న రిలీజ్‌ అని చెప్పటం జరిగింది. అనుకున్నట్లుగానే ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం. రీసెంట్‌గా మా నటసింహ బాలయ్యబాబు టీజర్‌ని రిలీజ్‌ చేశారు. టీజర్‌కి అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. అలాగే మా యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ పాటల్ని లాంచ్‌ చేశారు. అన్ని పాటలకి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వచ్చింది. మా చిత్రం టీజర్‌ని, సాంగ్స్‌ని ఆదరిస్తున్న బాలయ్యబాబు అభిమానులకు, ప్రభాస్‌ అభిమానులకు, సాయిధరమ్‌ తేజ్‌ అభిమానులకు ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు.


ఫిబ్రవరి 4న రాజమండ్రిలో 'ఇంటిలిజెంట్‌' ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌!!
'ఇంటిలిజెంట్‌' చిత్రం ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ని ఫిబ్రవరి 4న రాజమండ్రి ఆర్ట్స్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌ వై జంక్షన్‌లో భారీ ఎత్తున జరుపుతున్నాం. ఈ ఫంక్షన్‌కి అందరి అభిమానులు విచ్చేసి సక్సెస్‌ చెయ్యాలని కోరుకుంటున్నాను. 'ఛలో' ప్రీ రిలీజ్‌ వేడుకలో మెగాస్టార్‌ చిరంజీవిగారు 'ఇంటిలిజెంట్‌' టైటిల్‌ చాలా బాగుంది అని వున్నంత సేపు మా సినిమా గురించే మాట్లాడారు ఆయన. చిరంజీవిగారంటే మా వినాయక్‌కి చాలా ఇష్టం. 'ఖైది నంబర్‌ 150' చిత్రం తర్వాత పెద్ద హీరోలతో కాకుండా సాయిధరమ్‌ తేజ్‌తో సినిమా చేద్దాం అని నాతో చెప్పగానే ఓకే అని చెప్పాను. డబ్బుల కోసం ఏది పడితే అది చేసి క్యాష్‌ చేసుకునే అలవాటు వినాయక్‌కి లేదు. ఏ సినిమా చేసినా ఇష్టంతో, ప్రేమతో చేస్తాడు. కథ విషయంలో తను ఫుల్‌ శాటిస్‌ఫై అయ్యాకే సినిమా స్టార్ట్‌ చేస్తాడు. చాలా ఇంటిలిజెంట్‌గా ఈ చిత్రాన్ని తీశాడు. అభిమానుల అంచనాలకు మించి వుంటుంది. అలాగే సాయిధరమ్‌ తేజ్‌ కెరీర్‌ గ్రాఫ్‌లో గొప్పగా చెప్పుకునే విధంగా ఈ చిత్రం నిలుస్తుంది. పాటలు, ఫైట్స్‌ విజువల్‌గా అద్భుతంగా వుంటాయి. సినిమా ఎప్పుడు స్టార్ట్‌ అయ్యిందో ఎప్పుడు ఎండ్‌ అయ్యిందో కూడా తెలీకుండా మైమరచిపోయే విధంగా ఈ చిత్రం వుంటుంది. 'ఇంటిలిజెంట్‌'గా సినిమా తీశారని ప్రేక్షకులు ఫీలయ్యేవిధంగా వుంటుంది. 'జై సింహా' మంచి ఫీల్‌ వున్న సినిమా. ఈమధ్యకాలంలో అలాంటి సినిమా రాలేదు. మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు చాలామంది. అశ్వనీదత్‌గారు వారి ఫ్యామిలీతో కలిసి సెకండ్‌ టైమ్‌ చూశానని ఫోన్‌ చేసి చెప్పారు. 2018 జనవరి 12 అనేది నా లైఫ్‌లో మర్చిపోలేని, మరపురానిది. 'జై సింహా' సెంటిమెంట్‌ సినిమా ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్‌తో అందర్నీ అలరిస్తుంది. ఈ చిత్రంలో తేజ్‌ డ్యాన్స్‌లు ఇరగదీశాడు. అంతకు ముందు తేజ్‌ చిత్రాల్లో అన్నింటికంటే ఈ చిత్రంలో డ్యాన్స్‌ మూవ్‌మెంట్స్‌ బాగా చేశాడు. చిరంజీవిగారు బిగినింగ్‌లో ఎలా చేశారో తేజు అలా చేశాడని అన్పించింది. చాలా కష్టపడి కసితో చేశాడు. ఫ్యాన్స్‌ అందరూ బాగా ఎంజాయ్‌ చేస్తారు. థమన్‌ చాలా మంచి పాటలు ఇచ్చాడు. మొత్తం నాలుగు పాటలున్నాయి. వినాయక్‌ చాలా బాగా చిత్రీకరించారు. ఈ చిత్రంలోని 'కళామందిర్‌' అనే పాటని భాస్కరభట్ల అద్భుతంగా రాశారు. ఈ పాటని జనవరి 31న కళామందిర్‌ షోరూమ్‌లో లాంచ్‌ చేస్తున్నాం. దీంతో అన్ని పాటలు రిలీజ్‌ అయ్యాయి. అలాగే మహోన్నతమైన వ్యక్తి ఇళయరాజాగారు, సీతారామశాస్త్రిగారి చేతుల మీదుగా 'చమక్‌ చమక్‌' వీడియో సాంగ్‌ని భారీగా లాంచ్‌ చేస్తున్నాం. అది ఎప్పుడు అనేది చెప్తాను.


'ఇంటిలిజెంట్‌'ని ఎంత ప్రేమగా తీశాడో అర్థమయ్యింది!!
వినాయక్‌ డైరెక్షన్‌లో ఫస్ట్‌టైమ్‌ సినిమా తీశాను. మేమిద్దరం డైరెక్టర్‌, ప్రొడ్యూసర్‌లా కాకుండా అన్నాదమ్ముల్లా కలిసి మెలిసి వుంటాం. మా ఇద్దరి గొప్ప జర్నీ ఈ సినిమా. నిర్మాతగా ఎప్పుడూ టెన్షన్‌ పడకుండా డైరెక్టర్‌కి కావాల్సింది ఇస్తూ ఆడుతూ పాడుతూ ఎంజాయ్‌గా షూటింగ్‌ చేశాం. అలాగే మా హీరో, ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్‌ ప్రతి ఒక్కరూ సహకరించారు. సినిమా చూశాను. ఎంత ప్రేమగా, అద్భుతంగా తీశాడో వినయ్‌ అని అర్థం అయ్యింది. ప్రతి ఫైట్‌, ప్రతి సాంగ్‌ని చాలా రిచ్‌గా తీశాం. ఈ సినిమా యాక్షన్‌ సీన్స్‌ కోసం సెట్స్‌ కూడా వేశాం. అన్నీ చాలా గ్రాండియర్‌గా వుంటాయి.


అన్ని సినిమాలు బాగా ఆడాలి!!
నాకు సాయిధరమ్‌ తేజ్‌ కంటే వరుణ్‌తో చాలా అటాచ్‌మెంట్‌ ఎక్కువ. అందుకే 'లోఫర్‌' చిత్రాన్ని చాలా కలర్‌ఫుల్‌గా, భారీగా తీశాం. 'ఇంటిలిజెంట్‌' సినిమాకి వరుణ్‌ 'తొలిప్రేమ'కి ఎలాంటి పోటీకాదు. అలాగే అన్నయ్య మోహన్‌బాబుగారు చాలా కష్టపడి 'గాయత్రి' సినిమా చేశారు. ఆ చిత్రం కూడా బాగా ఆడి మరిన్ని డబ్బులు రావాలని కోరుకుంటున్నా. వాళ్ళ ఫ్యామిలీ నుండే నేను ఇండస్ట్రీకి వచ్చాను.'గాయత్రి' చాలా పవర్‌ఫుల్‌ టైటిల్‌. ఆ గాయత్రి దేవి ఆశీస్సులతో సినిమా మంచి సక్సెస్‌ అవ్వాలి. అన్ని సినిమాలు బాగా ఆడాలి. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది. థియేటర్స్‌కి ఆడియన్స్‌ మరింత మంది వస్తారు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా నా కెరీర్‌ స్టార్ట్‌ అయ్యింది. మా గురువుగారుర దాసరిగారి దయవల్ల నేను ఇంతవాణ్ణి అయ్యాను. నా డైరెక్షన్‌లో సుమన్‌, జయసుధ, సుహాసిని కాంబినేషన్‌లో ప్లాన్‌ చేశాం. అనుకోని సంఘటనల వల్ల ఆ సినిమా క్యాన్సిల్‌ అయ్యింది. దాంతో నిర్మాతగా మారాను. అప్పట్నుంచీ ఇప్పటిదాకా 69 సినిమాలు చేశాను. 'ఇంటిలిజెంట్‌' 70వ సినిమా.


వినాయక్‌తో మరో సినిమా వుంటుంది!!
కథలో పూర్తిగా ఇన్‌వాల్వ్‌ అవుతాను. అయితే నా సలహాలు డైరెక్టర్‌కి చెప్తాను తప్ప పూర్తిగా ఒత్తిడి చేయను. మా గురువుగారు, రైటర్‌ సత్యమూర్తిగారి ప్రభావం నాపై ఎక్కువ వుంది. డైరెక్షన్‌లో ఇన్‌వాల్వ్‌ కాకుండా నిర్మాతగా నా వంతు బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తాను. అందర్నీ ఆలోచింపజేసే విధంగా ఓ కొత్త డైరెక్టర్‌తో 'భారతి' అనే సినిమా ప్లాన్‌ చేస్తున్నాను. అలాగే రానా హీరోగా శివ డైరెక్షన్‌లో నిర్మించే '1945' సినిమా ఆల్‌మోస్ట్‌ షూటింగ్‌ కంప్లీట్‌ అయ్యింది. పది రోజుల వర్క్‌ మాత్రమే బేలెన్స్‌ వుంది. ఇది పీరియాడికల్‌ మూవీ. బ్యూటిఫుల్‌ లవ్‌స్టోరి. ఆ రోజుల్లో లవ్‌స్టోరి ఎంత క్లారిటీతో వుండేదో చూపిస్తున్నాం. రానా చాలా గొప్పగా చేశాడు. త్వరలో ఆ సినిమా రిలీజ్‌ చేస్తాం. నెక్స్‌ట్‌ ఇమీడియెట్‌గా వినాయక్‌గారితో సినిమా వుంటుంది.


రామానాయుడుగారు స్ఫూర్తి!!
నిర్మాతగా నాకు రామానాయుడుగారు స్ఫూర్తి. ఆయన ఇన్‌స్పిరేషన్‌తో ఇప్పటివరకు 70 సినిమాలు చేశాను. ఇదే ఎనర్జీతో ఓపికతో వంద సినిమాలు కంప్లీట్‌ చేస్తాను. నిర్మాతగా ఎంత బిజీగా వున్నా యస్‌యస్‌ఎస్‌ఐ ప్రెసిడెంట్‌గా నా బాధ్యతలు నేను నిర్వర్తిస్తున్నాను. మార్చి 1న థియేటర్స్‌ బంద్‌ పిలుపు కొరకు నార్త్‌, సౌత్‌వారితో గట్టిగా మీటింగ్స్‌ జరుగుతున్నాయి. నిర్మాతల్ని, డిస్ట్రిబ్యూటర్స్‌ని దోచుకుంటున్నారు. అలా చేస్తే చివరకు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్‌ నక్సలైట్స్‌గా మారే అవకాశం వుంది. అలా జరగకూడదని మార్చి 1న బంద్‌ ప్రకటించి తగు చర్యలు తీసుకోబోతున్నాం. అందరికీ ఇండస్ట్రీలో మేలు జరిగేలా న్యాయం చేస్తాం'' అన్నారు.


సాయిధరమ్‌తేజ్‌, లావణ్య త్రిపాఠి, నాజర్‌, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, ఆకుల శివ, కాశీ విశ్వనాథ్‌, ఆశిష్‌ విద్యార్థి, షాయాజీ షిండే, రాహుల్‌దేవ్‌, దేవ్‌గిల్‌, వినీత్‌కుమార్‌, జె.పి. ప థ్వీ, రుబాబు, కాదంబరి కిరణ్‌, విద్యుల్లేఖా రామన్‌, సప్తగిరి, తాగుబోతు రమేష్‌, భద్రం, నల్ల వేణు, రాహుల్‌ రామకృష్ణ, వెంకీ మంకీ, రాజేశ్వరి నాయర్‌, సంధ్యా జనక్‌, ఫిష్‌ వెంకట్‌, శ్రీహర్ష, శివమ్‌ మల్హోత్రా, రవిరామ్‌ తేజ, తేజారెడ్డి నటిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు: శివ ఆకుల, సినిమాటోగ్రఫీ: ఎస్‌.వి. విశ్వేశ్వర్‌, సంగీతం: థమన్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఆర్ట్‌: బ్రహ్మ కడలి, ఫైట్స్‌: వెంకట్‌, డాన్స్‌: శేఖర్‌, జాని, సహనిర్మాతలు: సి.వి.రావు, నాగరాజ పత్సా, నిర్మాత: సి.కళ్యాణ్‌, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్‌.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

Gossips

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !