View

బాబాయ్ టైటిల్ ని పాడుచేయను - తొలిప్రేమ ఫ్రీ రిలీజ్ వేడుకలో వరుణ్ తేజ్

Sunday,February04th,2018, 01:18 PM

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ క‌థానాయ‌కుడిగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి ప‌తాకంపై నిర్మితమైన చిత్రం 'తొలిప్రేమ‌'. రాశి ఖ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. యువ ద‌ర్శకుడు వెంకీ అట్లూరి ద‌ర్శ‌కుడు. బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ నిర్మాత‌. ఈ సినిమాను ఫిబ్ర‌వ‌రి 10న విడుద‌ల చేస్తున్నారు.
ఈ సంద‌ర్భంగా భీమ‌వ‌రంలో ఎస్‌.ఆర్‌.కె.ఆర్‌.కాలేజ్‌లో ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ జ‌రిట‌గింది. ఈ కార్య‌క్ర‌మంలో దిల్‌రాజు, బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌, ఎమ్మెల్యే రాధాకృష్ణ‌, హీరో వ‌రుణ్ తేజ్‌, రాశీ ఖ‌న్నా, ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి, హైప‌ర్ ఆది, డిస్ట్రిబ్యూట‌ర్ ఎల్‌.వి.ఆర్‌, త‌ణుకు డి.ఎస్‌.పి. ఎస్‌.ఆర్‌.కె.ఆర్‌.కాలేజ్ ప్రిన్సిపాల్ పార్థ‌సార‌థి త‌దిత‌రులు పాల్గొన్నారు.


ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ - క‌థ‌ను రాసింది, రిలీజ్ చేసేది దిల్‌రాజుగారైతే, సినిమాను నిర్మించింది మాత్రం బివిఎస్ఎన్‌.ప్ర‌సాద్‌గారు. జీవితం ఓ స‌ర్కిల్ అని వినే ఉంటాం. నా జీవితంలో అలాగే జ‌రుగుతోంది. తొలిప్రేమ సినిమాను చేసిన‌ప్పుడు, చూసిన‌ప్పుడు ప్రేక్ష‌కుల‌కు ఓ ఫ్రెష్ నెస్ ఎలా క‌లిగిందో.. అలాంటి ఫ్రెష్‌నెస్‌తోనే ఈ సినిమాను మేం చేశాం. ఈ సినిమా టైటిల్ పెట్టిన‌ప్పుడు కాస్త భ‌య‌ప‌డ్డాం. వ‌రుణ్` టైటిల్ అయితే పెడుతున్నాం.. ప‌రావాలేదు క‌దా... అన్నాడు. ఆ సినిమాతో నేను పోలిక పెట్ట‌ను కానీ.. గౌర‌వాన్ని కాపాడుతాన‌ని మాట ఇస్తున్నాను. సినిమా అంటే టీం ఎఫ‌ర్ట్ అని ఎందుకంటారో నాకు ఇప్పుడు అర్థ‌మ‌వుతుంది. ప్రేక్ష‌కుల‌కు సినిమా బాగా న‌చ్చుతుంది అన్నారు.


బివిఎస్ఎన్‌.ప్ర‌సాద్ మాట్లాడుతూ - 33 సంవ‌త్స‌రాల క్రితం మెగాస్టార్‌తో సినిమా తీయాల‌ని త‌ణుకు నుండి మ‌ద్రాస్ వెళ్లాను. త‌ర్వాత బ‌న్నితో ఆర్య 2, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌తో మ‌గ‌ధీర‌, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో అత్తారింటికి దారేది సినిమాలు చేసే అవ‌కాశం ద‌క్కింది. ఇప్పుడు మా మెగా ప్రిన్స్ వ‌రుణ్‌తేజ్‌తో తొలిప్రేమ సినిమా చేశాం. గ్యారంటీగా సినిమా పెద్ద హిట్ అవుతుంది అన్నారు.


దిల్‌రాజు మాట్లాడుతూ - భీమ‌వరం ఊర్లో ఏముందో తెలియ‌దు కానీ ఇక్క‌డ నుండి త్రివిక్ర‌మ్‌, సునీల్ వంటివారు ప‌క్క‌నున్న పాల‌కొల్లు నుండి చిరంజీవిగారు, కృష్ణంరాజుగారు, ప్ర‌భాస్ వంటి ఎంద‌రో తెలుగు సినిమాలోకి వ‌చ్చారు. తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి ఓ పిల్ల‌ర్‌లా ఇక్క‌డి నుండి వ‌చ్చిన‌ వారున్నారు. ఇక్క‌డ నీటిలోనే ఏదోఉంది. సినిమాకు కావాల్సిన క‌ళ ఇక్క‌డ ఉంది. అదే మిమ్మ‌ల్ని, మ‌మ్మ‌ల్ని ఇక్క‌డి వ‌ర‌కు తీసుకొచ్చింది. అప్పుడు 1998 తొలిప్రేమకు నేనే డిస్ట్రిబ్యూట‌ర్‌ని, 2018 తొలిప్రేమ‌కు నేనే డిస్ట్రిబ్యూట‌ర్‌ని. ఆ తొలిప్రేమ యూత్ ఫిలిం ఎలా అయ్యిందో.. ఈ సినిమా కూడా 100 ప‌ర్సంట్ అలాంటి యూత్‌ఫిలిం అయ్యింది. రెండేళ్ల కిత్రం వెంకీ నాకు చెప్పిన క‌థ ఇది. బ్యూటీఫుల్ ల‌వ్‌స్టోరీ. వ‌రుణ్‌కు ఫిదా త‌ర్వాత ఈ సినిమా రావ‌డం ప్ల‌స్ అవుతుంది. ఫిదా సినిమా రిలీజ్ అయిన తొలి ఆట నుండి అద్భుతం అని ఎలా అన్నారో.. ఇప్పుడు అలాగే అంటారు. వ‌న్ ఆఫ్ ది బెస్ట్ ల‌వ్‌స్టోరీ. వ‌రుణ్‌, రాశీ ఖన్నా మ‌ధ్య బ్యూటీఫుల్ కెమిస్ట్రీ కుదిరింది. ఫిబ్ర‌వ‌రి 10న తెలుగు రాష్ట్రాల్లో విడుద‌ల‌వుతుంది. అయితే ఒక‌రోజు ముందుగానే ఈ సినిమా అమెరికాలో రిలీజ్ అవుతుంది. మెగాఫ్యాన్స్‌కి మంచి పండుగ‌లాంటి సినిమా అన్నారు.


వ‌రుణ్ తేజ్ మాట్లాడుతూ - మా సినిమాకు ప‌నిచేసిన దర్శ‌కుడు వెంకీ తొలి చిత్ర‌మే అయినా ఎంతో కన్విక్ష‌న్‌తో చేశాడు. త‌ను భ‌విష్య‌త్‌లో పెద్ద ద‌ర్శ‌కుడ‌వుతాడు. ఇక ఈ సినిమా అంద‌రి కంటే ఎక్కువ‌గా న‌మ్మింది నిర్మాత దిల్‌రాజుగారే. ఈ సినిమాకు ఓ స‌పోర్ట్‌గా నిలిచారు. ఇక బాపినీడు, ప్ర‌సాద్‌గారు సినిమాను అద్భుతంగా నిర్మించారు. సినిమాటోగ్ర‌ఫీ జార్జ్ విలియ‌మ్స్ ప్ర‌తి సీన్‌ను ఎంతో అందంగా చూపించారు. తొలి ప్రేమ అన్న టైటిల్‌తో 20 సంవ‌త్స‌రాలు త‌ర్వాత నేను అదే టైటిల్‌తో చేస్తున్న సినిమా ఇది. ఆ సినిమాకు ఇది రీమేకో, కాపీయో కాదు. క‌థకు త‌గ్గ టైటిల్ అనిపించే పెట్టాం. బాబాయ్ టైటిల్‌ను పాడు చేస్తాన‌ని ఎవ‌రూ అనుకోవ‌ద్దు. ఫిబ్ర‌వ‌రి 10న సినిమా విడుద‌ల‌వుతుంది. మా ఫ్యామిలీ నుండి తేజు సినిమా ఫిబ్ర‌వ‌రి 9న, నా సినిమా ఫిబ్ర‌వ‌రి 10న విడుద‌ల‌వుతుంది. మా మ‌ధ్య కాంపీటీష‌న్ ఏదీ లేదు. ఇద్ద‌రం చిన్న‌ప్ప‌ట్నుంచి క‌లిసే పెరిగాం. నా సినిమా ఎంత పెద్ద స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నానో, తేజు సినిమా కూడా అంతే స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Aadi Starrer Nuvve Theatrical Trailer

Read More !