filmybuzz
filmybuzz

View

7గురు అభ్యాగులకు 'మనం సైతం' ఆర్ధిక సహాయం!

Sunday,February04th,2018, 01:52 PM

ప్రముఖ నటుడు కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థ మనం సైతం దిగ్విజయంగా తన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తోంది. సంస్థ కార్యక్రమాల గురించి తెలుసుకున్న ఎంతో మంది నిస్సహాయులు మనం సైతం చెంతకు చేరుతున్నారు. అలా వచ్చిన వారికి సహాయం చేస్తూ మనం సైతం సంస్థ తన సేవా దృక్పథాన్ని చాటుకుంటోంది. శనివారం ఏడుగురు అభాగ్యులకు మనం సైతం ఆర్థిక సహాయం అందించింది.


హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సహజనటి జయసుధ, హాస్య నటుడు డాక్టర్ బ్రహ్మానందం, దర్శకులు హరీష్ శంకర్, కథానాయకుడు సుధీర్ బాబు, కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమలో వివిధ విభాగాల్లో పనిచేస్తూ అనారోగ్యం పాలై అండ కోసం ఎదురుచూస్తున్న ఏడుగురికి చెక్ లను అందజేశారు.


అనంతరం మనం సైతం నిర్వాహకులు కాదంబరి కిరణ్ మాట్లాడుతూ... ఒక్కరితో మొదలైన మనం సైతం ఇవాళ లక్ష మందికి పైగా సభ్యులతో బలోపేతమవుతోంది. సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే చేయి అందించే మనసున్న వాళ్లు ఎందరో ఉంటారు. జీవితంలో మనల్ని భగవంతుడు తన చేత్తో అభివృద్ధిలోకి తీసుకెళ్తున్నప్పుడు...మనం మరో చేయి చాస్తే...ఆ అండతో కొన్ని వేల లక్షల మంది ఆసరా పొందుతారు. ఈ విషయాన్ని నమ్మాను కాబట్టి మనం సైతం సంస్థను భుజాలకు ఎత్తుకున్నాను. మనం సైతం కార్యక్రమాలు చూసి చిరంజీవి, పవన్ కళ్యాణ్, కొరటాల శివ, పూరీ జగన్నాథ్, టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్, మనం సైతం సభ్యుడు బందరు బాబీ సతీమణి కవిత ఇలా ఎందరో స్పందించారు. ఆర్థిక సహాయం అందించి మనం సైతం వెంట తామూ ఉన్నామనే భరోసా కలిగించారు. యూకే నుంచి రామ్ నామనగిరి అనే వ్యక్తి ఫోన్ చేసి మీ అక్కౌంట్ కు లక్షా యాభై వేల రూపాయలు పంపించాను. ఎవరికైనా సహాయం చేయండి అన్నారు. ఆయనెవరో నాకు తెలియదు. యూట్యూబ్ లో మా సంస్థ కార్యక్రమాలు చూసి స్పందించాడు. అలా వంద రూపాయల నుంచి లక్షల రూపాయల వరకు సహాయం చేస్తున్న దాతలున్నారు. వాళ్లందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అన్నారు.


సహజ నటి జయసుధ మాట్లాడుతూ... ఛారిటీ కార్యక్రమాలు చేయడం అంత సులువైన విషయం కాదు. ఎంతో పట్టుదల, ఓపిక ఉండాలి. నేనూ గతంలో ఓ స్వచ్ఛంద సంస్థను ప్రారంభించాను. కానీ కొనసాగించలేక పోయాను. మనం సైతం కు ఓ మంచి బృందం ఉంది. వీళ్లంతా కలిసి కట్టుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. నా దృష్టిలో సేవ చాలా కష్టం కానీ...సేవను మించిన తృప్తి ఉండదు. నా సహకారం మనం సైతంకు ఎప్పుడూ ఉంటుంది అన్నారు.


హాస్య నటుడు డాక్టర్ బ్రహ్మానందం మాట్లాడుతూ... నేను సేవా కార్యక్రమాలకు దూరంగా ఉంటానని చాలామంది అనుకుంటారు. కానీ నా జీవితంలో ఎంతో మందికి సహాయం చేశాను. అది ఎవరికీ తెలియదు. కాదంబరి కిరణ్ నాకు 30 ఏళ్లుగా తెలుసు. నా తొలి చిత్రంలో నాతో కలిసి కాదంబరి నటించారు. ఎప్పుడూ ఏదో వ్యాపకంలో ఉండటం కాదంబరికి అలవాటు. దేవుడు కొంతమందిని ఎంచుకుని వాళ్ల ద్వారా సేవా కార్యక్రమాలు చేయిస్తాడు. అలా కాదంబరిని ఎన్నుకుని మనం సైతం కార్యక్రమాన్ని ప్రారంభించాడు. నింగీ నేలా ఉన్నంతకాలం మనం సైతం వెంట నడుస్తాను అన్నారు.


దర్శకులు హరీష్ శంకర్ మాట్లాడుతూ... ఏ జీవికైనా దెబ్బ తగిలితే బాధ పడుతుంది. మనిషి కూడా తనకు కష్టమొస్తే బాధపడతాడు. కానీ ఎదుటివారి కష్టానికి బాధపడేవారే నిజమైన మనిషి. ఇప్పుడు లక్ష మందికి చేరిన ఈ సంస్థ కోటి, పదికోట్ల సభ్యులకు చేరాలి. నేను ఎంత సహాయం చేస్తాను అని చెప్పను ఏ సహాయం కావాలన్నా మనస్ఫూర్తిగా అందిస్తాను అన్నారు.


కథానాయకుడు సుధీర్ బాబు మాట్లాడుతూ... నేనూ కాదంబరి గారు కలిసి ప్రస్తుతం ఓ సినిమాలో నటిస్తున్నాం. ఆయనను చూసిన ప్రతిసారీ ఓ తేజస్సు కనిపిస్తుంది. మనసులో స్వచ్ఛంగా ఉన్న వాళ్లకే అలాంటి తేజస్సు ఉంటుంది. వాళ్లు మంచి నటులు కూడా అవుతారు. మనస్సే నటుడి అభినయంలో ప్రతిబింబిస్తుందని నేను నమ్ముతాను. మనం సైతంలో ఇప్పటి నుంచి నేనూ భాగమే అని చెబుతున్నాను అన్నారు.


ఈ కార్యక్రమంలో మనం సైతం సభ్యులు బందరు బాబీ, సురేష్, వేణు, గాయని విజయలక్ష్మి, కవిత తదితరులు పాల్గొన్నారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసి ..

Read More !

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ..

Read More !

Gossips

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Moodu Puvvulu AAru Kaayalu Teaser

#U Movie Theatrical Trailer

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

Read More !