View

నాకు సిగ్గు అనిపించింది.. అందుకే రంగస్థలం చేసాను - సుకుమార్

Thursday,March15th,2018, 01:54 PM

మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ , సమంత హీరో హీరోయిన్లుగా సుకుమార్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌, యలమంచిలి రవిశంకర్‌; సి.వి.ఎం(మోహన్‌) నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం 'రంగస్థలం'. ఈ సినిమా మార్చి 30న విడుదలవుతుంది. మార్చి 18న ప్రీ రిలీజ్‌ వేడుకను నిర్వహించబోతున్నారు. సినిమాకు సంబంధించిన ఆడియో మార్కెట్లోకి విడుదలైంది.


ఈ సందర్భంగా.నవీన్‌ ఎర్నేని మాట్లాడుతూ - '''రంగస్థలం' సినిమాకు సంబంధించిన ఆడియో జ్యూక్‌ బాక్స్‌ మార్కెట్లోకి విడుదలైంది. ఆల్‌రెడీ విడుదలైన మూడు పాటలకు చాలా మంచి స్పందన వచ్చింది. ఈ నెల 18న వైజాగ్‌ ఆర్‌.కె.బీచ్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను కండెక్ట్‌ చేస్తున్నాం. ఈ ఈవెంట్‌ను చాలా గ్రాండ్‌గా నిర్వహిస్తున్నాం. వైజాగ్‌ కమీషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ యోగానంద్‌, మున్సిపల్‌ కమీషనర్‌ నారాయణగారి సహకారంతో భారీ ఎత్తున ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ను నిర్వహిస్తున్నాం. సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ అంతా కంఫర్ట్‌బుల్‌గా జరుగుతుంది. యు.ఎస్‌కు కూడా ముందుగానే ప్రింట్‌ను పంపేస్తున్నాం. ప్రీ రిలీజ్‌కు ముఖ్య అతిథిగా చిరంజీవిగారు రానున్నారు. అభిమానులను ఓపెన్‌ వెల్‌కమ్‌ చెబుతున్నాం'' అన్నారు.


సుకుమార్‌ మాట్లాడుతూ - ''ఈరోజు మార్కెట్లోకి 'రంగస్థలం' ఆడియో నేరుగా విడుదలైంది. సినిమాలో ఇప్పటికే 'ఎంత సక్కగున్నావే... ', 'రంగ రంగ రంగస్థలానా..', 'రంగమ్మ మంగమ్మ' అనే మూడు సాంగ్స్‌ విడుదలైయాయి. మరో రెండు సాంగ్స్‌ను జ్యూక్‌ బాక్స్‌లో వినండి. అందులో 'జిగేల్‌ రాణి ఐటెమ్‌ సాంగ్‌ ', 'ఆగట్టుకుంటావా? ఈ గట్టుకుంటావా? అనే సాంగ్స్‌ను ఎంజాయ్‌ చేయవచ్చు. అలాగే సినిమాలో సర్‌ప్రైజ్‌ సాంగ్‌ను చూడొచ్చు. ఆ సాంగ్‌ను చంద్రబోస్‌గారు పాడారు. సినిమాను మార్చి 30న విడుదల చేస్తున్నాం. 1980 బ్యాక్‌డ్రాప్‌లో సినిమా సాగుతుంది. తప్పకుండా అందరికీ నచ్చుతుంది. ఆ కాలం నుండి వచ్చిన వ్యక్తులను సినిమా అలరిస్తుంది. మిస్‌ అయిన జనరేషన్‌ను ఈ జనరేరషన్‌లో చూడొచ్చు. మంచి టెక్నీషియన్స్‌ దొరకడం వల్ల నా వర్క్‌ సులభమైంది. ముఖ్యంగా ఆర్ట్‌ డైరెక్టర్‌ రామకృష్ణ, మోనికగారు 1980 బ్యాక్‌డ్రాప్‌లో సెట్‌ను చక్కగా చేశారు. నేను పెద్దగా కష్టపడలేదు. తను చాలా అందంగా సెట్‌ వేశాడు. నేను ఆసెట్‌ చూసి ఆశ్చర్యపోయాను. దేవిశ్రీప్రసాద్‌, చంద్రబోస్‌గారు మంచి క్రియేటివ్‌ పర్సన్స్‌. చంద్ర‌బోస్‌గారు ప్రతి సాంగ్‌ను 10-15 నిమిషాల్లో రాసిచ్చేశారు. పాట రాసిన తర్వాతే ట్యూన్స్‌ కంపోజ్‌ చేశారు. సినిమాలో ఆరు పాటలకు ఇదే పద్ధతిని ఫాలో అయ్యాం. నేను 25-28 సంవత్సరాలు పల్లెటూర్లోనే పెరగడంతో మంచి అనుబంధం ఏర్పడింది. ఈ సినిమా చేయడం వల్ల నా అనుబంధాన్ని మళ్లీ వెతుక్కున్నట్లు అయ్యింది. నేను డైరెక్ట్ చేసిన `నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో` సినిమాలు యు.ఎస్‌లో చక్కగా వసూళ్లను రాబట్టాయి. నేను అక్కడకు వెళ్లినప్పుడు ఓకాయన 'మీరు ఆర్బన్‌ బ్యాక్‌డ్రాప్‌ సినిమాలు చక్కగా చేశారు. మన సంస్కృతిలో సినిమాలు ఎప్పుడు చేస్తారు' అని అడిగారు. నాకే సిగ్గు అనిపించింది. ఇలాంటి సినిమా చేయాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాను. ఇప్పటికీ కుదిరింది. సినిమాలో రంగమ్మ మంగమ్మ పాటలో ఉపయోగించిన గొల్లబామ అనే పదం ఓ కీటకానికి సంబంధించింది. ఎవరినీ ఎదో అనాలని చేయలేదు. నేను తొలి సినిమాలోఐటెమ్‌ సాంగ్‌ పెట్టినప్పుడు అది పెద్ద సక్సెస్‌ అయ్యింది. అక్కడ నుండి ఐటెమ్‌సాంగ్స్‌ కంపల్సరీగా పెట్టాల్సి వస్తుంది. నవీన్‌గారికి కూడా ఐటెమ్‌ సాంగ్స్‌ అంటే ఇష్టం. ఆయనకు ఈ సినిమాలో ఐటెమ్‌ సాంగ్‌ వినిపించాను. నిర్మాతలకు నచ్చడంతో.. ఐటెమ్‌ సాంగ్‌ను పెట్టాను'' అన్నారు.


ఆర్ట్‌ డైరెక్టర్‌ రామకృష్ణ మాట్లాడుతూ - ''నాకు 'రంగస్థలం' సినిమా చేసే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు.. నాకు సహకారం అందించిన రామ్‌చరణ్‌కు థాంక్స్‌. రేపు సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు థ్రిల్‌ అవుతారు. నేను సిటీలోనే పుట్టి పెరగడం వల్ల నాకు విలేజ్‌ కల్చర్‌ తెలియదు. అయినా నేను రీసెర్చ్‌ చేసి సెట్‌ వేశాను. నా కెరీర్‌లో ఇదొక బెస్ట్‌ మూవీగా నిలిచిపోతుంది'' అన్నారు.


చంద్రబోస్‌ మాట్లాడుతూ ''మంచి సాహిత్యానికి, మంచి సంగీతం కుదిరింది. మంచి సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్‌. దాదాపు అందరూ పల్లెటూర్ల నుండి వచ్చారు కాబట్టి వారికి పాటలు బాగా కనెక్ట్‌ అయ్యాయి. పాటలు చాలా బావున్నాయని అందరూ అప్రిసియేట్‌ చేస్తున్నారు'' అన్నారు.


రామ్‌ చ‌ర‌ణ్‌, స‌మంత‌, జ‌గ‌ప‌తిబాబు, ప్ర‌కాష్ రాజ్‌, సీనియ‌ర్ న‌రేష్‌, ఆది పినిశెట్టి, అన‌సూయ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్ర‌సాద్‌, సినిమాటోగ్ర‌ఫీ: ర‌త్న‌వేలు, ఎడిటింగ్‌: న‌వీన్ నూలి, సాహిత్యం: చ‌ంద్ర‌బోస్‌, ఆర్ట్‌: రామ‌కృష్ణ‌, ఫైట్స్‌: రామ్‌ల‌క్ష్మ‌ణ్‌, నిర్మాత‌లు: న‌వీన్ ఎర్నేని, వై.ర‌విశంక‌ర్‌, మోహ‌న్‌(సి.వి.ఎం), ద‌ర్శ‌క‌త్వం: సుకుమార్‌.


Grand pre-release function for Rangasthalam in Vizag on 18th March; Megastar Chiranjeevi to grace as chief guest


The count down to the release of one of the most awaited movie of the year, Rangasthalam, has begun. In a grand statement, the producers of the film Naveen Yerneni, Y Ravi Shankar and CV Mohan have announced a massive pre-release function to be organised in the beach city of Visakhapatnam on March 18.


The film, which will release on March 30 stars Ram Charan and Samantha as the leads and is a directorial venture of Sukumar. The audio of the film, the music of which is composed by Devi Sri Prasad, is already out in the market and has opened to quite a good response.


Speaking about the same, producer Naveen shares, “The audio jukebox of the film that was released into the market has received a great response. Earlier, three songs from the film were released and the positivity began at that juncture. To add to all the positivity, we have planned an elaborate event before the release of the film on March 30, at Vizag. It will be held at the landmark venue RK Beach on 18th. We are being able to do this only due to the support of Visakhapatnam’s Commisioner of Police Yoganand and Municipal Commissioner Narayana. We are presently working on the film’s post-production and everything is going on at a happy pace. In fact, we are quite happy with how the film has turned out. We’d be sending the prints to the US too, quite in advance. The pre-release event will have Chiranjeevi garu as the chief guest and we welcome all the fans to be a part of the celebration.”


Director Sukumar says, “The songs of Rangasthalam were released today. So far, Ranga Rangasthalana, Entha Sakkagunnave and Rangamma Mangamma were released and appreciated. I request you to listen to the rest in the jukebox. Jigel Rani is an item song, and Aa Gattukuntava Ee Gattukuntava is a wonderful song. The film will have a surprise song you’ll witness while watching the film. It has been sung by Chandrabose garu. The film that releases on March 30 is based in the 1980s backdrop and will be a film everyone will love. It will definitely be a nostalgic trip for people of those times. Finding good technicians made my work easy. Especially art directors Ramakrishna and Monik brought the period of 1980s to life. I didn’t work hard in that regard because they took care of it all. Devi Sri Prasad and Chandrabose came together to create some wonderful music for the film with their music and lyrics. Till the age of around 25 I had grown up in a rural atmosphere and I have a bond with it. This film was like going back to the roots. My films Nenokkadine and Nannaku Prematho were received really well in the US. When I went there, a man told me that I make good films in the urban setup but added that he wondered when I’d make a film rooted in our values. I felt ashamed and that’s how this happened. I wanted to do a film like this from long, but it is only now that things worked out. The word Gollabhama in Rangamma Mangamma song was only contextual and there was no intention to hurt the sentiments of anyone. My first film had an item song and it was a grand success. Ever since, it has become mandatory to have a special song in my film. The producers loved the tune of the song and we decided to make the most of it.”


Art director Ramakrishna says, “I am really thankful to the entire team of Rangasthalam for giving me the opportunity to work in the film. The audience will be thrilled to see the film. Having been brought up in the city, I never knew the village culture. Yet, I researched and tried to bring a village to life. This film will remain the best in my career.”


Lyricist Chandrabose shares, “Good lyrics got the company of good music. I thank the producers and director for this opportunity. Since almost everyone on the team has a background in a village, they connected well with the songs. I am happy with the appreciation for the music.”


Cast: Ram Charan, Samantha, Aadi Pinisetty, Prakash Raj, Jagapathi Babu, Senior Naresh, Pujita Ponnada and others.
Music: Devi Sri Prasad
DOP: Ratnavelu
Editing: Naveen Nuli
Lyrics: Chandrabose
Art: Ramakrishna
Fights: Ram-Lakshman
Producers: Naveen Yerneni, Y. Ravi Shankar, CV Mohan
Director: Sukumar



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ నిర్మిస్తున్న 'సైరా' నరసింహారెడ్డి ..

Read More !

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసి ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Moodu Puvvulu AAru Kaayalu Teaser

#U Movie Theatrical Trailer

Read More !