View

కథకు సూట్ అయ్యే టైటిల్ 'శబ్ధం' - నారా రోహిత్

Sunday,March18th,2018, 07:31 AM

యువ కథానాయకుడు నారా రోహిత్ ప్రధాన పాత్రలో పి.బి.మంజునాధ్ దర్శకత్వంలో శ్రీవైష్ణవి క్రియేషన్స్ పతాకంపై నారాయణరావు అట్లూరి నిర్మాణ సారధ్యంలో రూపొందనున్న "శబ్ధం" చిత్ర ప్రారంభోత్సవం నేడు (మార్చి 18) తెలుగువారికి అత్యంత ప్రీతిపాత్రము మరియు కొత్త సంవత్సరమైన ఉగాది పర్వదినాన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అంగరంగ వైభవంగా జరిగింది. "హిజ్ సైలెన్స్ ఈజ్ హిజ్ వెపన్" అనే ఆసక్తికరమైన ట్యాగ్ లైన్ తో రూపొందుతున్న ఈ చిత్రం ప్రారంభోత్సవ వేడుక పలువురు రాజకీయ మరియు సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది.


చిత్ర కథానాయకుడు నారా రోహిత్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైస్ మినిస్టర్ ప్రత్తిపాటి పుల్లారావు క్లాప్ కొట్టగా.. పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దర్శకుడు పి.బి.మంజునాధ్ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం మినిస్టర్ ప్రత్తిపాటి పుల్లారావు-ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్ లు కలిసి దర్శకుడు పి.బి.మంజునాధ్ కు స్క్రిప్ట్ ను అందించారు.


ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు నారా రోహిత్ మాట్లాడుతూ - "అమరావతిలో నా చిత్ర ప్రారంభోత్సవం జరగడం చాలా ఆనందంగా ఉంది. అందర్నీ ఎంటర్ టైన్ చేయడం కోసం మా టీం అందరం తప్పకుండా కష్టపడతాము. పెదనాన్నగారు ఎంతగానో డెవలప్ చేస్తున్న ఈ ప్రాంతంలోనే నా సినిమా ఆడియో విడుదల వేడుక కూడా నిర్వహిస్తాం. ఇక్కడికి విచ్చేసిన అతిధులకు, అభిమానులకు నా ధన్యవాదాలు మరియు ఉగాది శుభాకాంక్షలు. కథకి సరిగ్గా సూట్ అయ్యే టైటిల్ "శబ్ధం" అన్నారు.


చిత్ర నిర్మాత నారాయణరావు అట్లూరి మాట్లాడుతూ - "నారా రోహిత్ గారితో "శబ్ధం" చిత్రాన్ని నిర్మించడం చాలా ఆనందంగా ఉంది. అమరావతి నగరమున ఈ చిత్ర ప్రారంభోత్సవం జరుపుకోవడం సంతోషం. సినిమా తప్పకుండా అందర్నీ అలరించే విధంగా ఉంటుంది" అన్నారు.


చిత్ర దర్శకుడు పి.బి.మంజునాధ్ మాట్లాడుతూ - "నా మొదటి సినిమా "లేడీస్ అండ్ జెంటిల్మన్"కి నంది అవార్డ్ అందించి దర్శకుడిగా నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేసిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారికి ముందుగా నా కృతజ్ణతలు తెలియజేసుకుంటున్నాను. వైష్ణవి క్రియేషన్స్ లో వస్తున్న ఫస్ట్ మూవీ. కథను నమ్మి ఫస్ట్ నేరేషన్ లోనే కథను ఒకే చేసిన మా హీరో నారా రోహిత్ గారికి ప్రత్యేక కృతజ్ణతలు. రిచర్డ్ ప్రసాద్ గారి సినిమాటోగ్రఫీ సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్ గా నిలుస్తుంది. ఏప్రిల్ చివరివారం నుంచి వైజాగ్, కాకినాడ, హైద్రాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. నాకీ అవకాశాన్నిచ్చిన నా నిర్మాత నారాయణరావుగారికి ధన్యవాదాలు" అన్నారు.


ముఖ్య అతిధిగా విచ్చేసిన మినిస్టర్ ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ - "అమరావతిలో ముహూర్తపు సన్నవేశం చిత్రీకరణ జరుపుకొన్న నారా రోహిత్ 18వ చిత్రమైన "శబ్ధం" సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నాను. ఈ వేడుకకు నారా లోకేష్ గారు కూడా హాజరు కావాల్సి ఉండగా, హైద్రాబాద్ లో మీటింగ్ కారణంగా రాలేకపోయారు. చిత్ర నిర్మాతకు, దర్శకుడికి, సంగీత దర్శకుడికి ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలని... ఇదే విధంగా అమరావతిలో మరిన్ని సినిమా వేడుకలు జరగాలని కోరుకొంటున్నాను" అన్నారు.


ఈ చిత్రానికి కథ-మాటలు: వంశీ రాజేష్, ప్రొడక్షన్స్ డిజైనర్: రవిందర్, పి.ఆర్.ఓ: వంశిశేఖర్, సంగీతం: వికాస్ కురిమెళ్ళ, ఎడిటర్: నవీన్ నూలి, సినిమాటోగ్రఫీఎల్ రిచర్డ్ ప్రసాద్, సమర్పణ: డా. సౌజన్య అట్లూరి, బ్యానర్: శ్రీ వైష్ణవీ క్రియేషన్స్, నిర్మాత: నారాయణ రావు, అట్లూరి, దర్శకత్వం: పిబి మంజునాథ్.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ నిర్మిస్తున్న 'సైరా' నరసింహారెడ్డి ..

Read More !

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసి ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Moodu Puvvulu AAru Kaayalu Teaser

#U Movie Theatrical Trailer

Read More !