filmybuzz

View

సత్య గ్యాంగ్... లవ్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ - నిర్మాత మహేశ్ ఖన్నా

Tuesday,April03rd,2018, 02:54 AM

సాత్విక్‌ ఈశ్వర్‌ను హీరోగా పరిచయం చేస్తూ సిద్ధయోగి క్రియేషన్స్‌ పతాకంపై కర్నూలుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ నాయకులు మహేశ్‌ ఖన్నా నిర్మిస్తున్న చిత్రం 'సత్య గ్యాంగ్‌'. ఈ చిత్రానికి ప్రభాస్‌ దర్శకత్వంతోపాటు సంగీతం అందించగా, మహేశ్‌ఖన్నా దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. ఈ చిత్రం ఏప్రిల్‌ 6న విడుదల కానుంది.


ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మహేశ్‌ చిత్ర విశేషాలను తెలియజేస్తూ - ''ఏప్రిల్‌ 6న సత్యగాంగ్‌ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. నేను ఎన్నో సినిమాల్లో నటించాను. సినిమా తియ్యడం మాత్రం మొదటిసారి. కమర్షియల్‌ పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో కాకుండా ప్రజలకు ఉపయోగపడేలా సినిమా తియ్యడం జరిగింది. జనరల్‌గా సినిమాల వల్ల ఎంతో మంది ఇన్‌స్పైర్‌ అవుతారు. సినిమాలో మనం ఇచ్చే కన్‌క్లుజన్‌ బాగుండాలనే ఉద్దేశంతో ఈ సినిమా తీశాం. ఈ సినిమా ద్వారా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రేక్షకులే కాదు భారతదేశంలోని యువత మొత్తం ఏవిధంగా ఉండాలి, ఒకవేళ పొరపాటు చేస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుందనేది చెప్పడం జరిగింది. జనరల్‌గా ప్రతి తల్లి కూతురితో అన్ని విషయాలు క్లోజ్‌గా మాట్లాడుతుంది. అదే తండ్రి విషయానికి వస్తే తనకు బాధ వున్నా, కోపం వున్నా అన్నీ మనసులోనే దాచుకుంటాడు. పిల్లల్ని అందరూ ప్రేమగా పెంచుతారు. పిల్లలు ఎలాంటి తప్పులు చేస్తున్నారనేది తెలియనంతగా తమ ప్రేమను పంచుతారు. వాళ్ళు తప్పులు చేస్తే పరిణామం ఎలా ఉంటుంది. తర్వాతి తరానికి ఇది ఏవిధంగా ఎఫెక్ట్‌ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్‌. ఒకరు తప్పు చేస్తే దానికి కుటుంబం మొత్తం బాధ పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ చిత్రం ద్వారా ఎవరైనా తప్పు చేస్తే పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ ఐడెంటిఫై చేస్తుంది. ఉదాహరణకు ఒక అబ్బాయి, అమ్మాయి తప్పు చేస్తే ప్రతి విషయాన్ని పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ ఐడెంటిఫై చెయ్యలేదు. కొన్ని ట్రేస్‌ ఔట్‌ అవుతాయి, కొన్ని కావు. ఆఖరికి కోర్టుకు కూడా అన్నింటినీ ఆపడం సాధ్యం కాదు. ఆడది అర్థరాత్రి ఒంటరిగా తిరగగలిగినప్పుడే మనకు స్వాతంత్య్రం వచ్చినట్టు అని గాంధీగారు చెప్పారు. ఈ చిత్రం ద్వారా భవిష్యత్తులో మగ పిల్లవాడైనా సరై అర్థరాత్రి ఒంటరిగా తిరగడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చెప్పడం జరిగింది. ఏదైనా తప్పు చెయ్యాలంటే భయపడే పరిస్థితి వస్తుంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే నలుగురు అనాథ కుర్రాళ్ళు ఉంటారు. వారి వల్ల ఒక క్రైమ్‌ జరుగుతుంది. దానివల్ల వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు అనేది సినిమా. మధ్యలో గ్యాంగ్‌ వార్స్‌ ఉంటాయి, లవ్‌ ట్రాక్‌ ఉంటుంది. భవిష్యత్తులో అనాధలు ఉండకూడదు అనేది కూడా చెప్తున్నాం. ఈ చిత్రానికి కథ, మాటలు నేనే రాశాను. అలాగే దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేస్తున్నాను. ఈ కథకి ఇన్‌స్పిరేషన్‌ ఉంది. నాకు ఒనేరో అనే స్కూల్‌ ఉంది. మా స్కూల్‌లో ఒక స్టూడెంట్‌కి 10 నుంచి 20 వేలు మాత్రమే ఫీజు తీసుకుంటున్నాం. నాకు ఉన్న అనుభంలో నేను చూసిందేమిటంటే ఈరోజుల్లో పిల్లల మీద తల్లిదండ్రులు చాలా ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారు. వాళ్ళని టేబుల్‌ స్పూన్స్‌లా తయారు చేస్తున్నారు. బయటికి వెళ్ళకూడదు, బయటకెళ్లి ఆడుకోకూడదు అనేది ఉంటుంది. అలా కాకుండా ఆడుతూ పాడుతూ పెరగాలన్నది మా కాన్సెప్ట్‌. మట్టిలో ఆడుకుంటే పిల్లలకు రెసిస్టెన్స్‌ పవర్‌ పెరుగుతుంది. నేను స్కూల్‌ పెట్టిన కొత్తలో ఐదారేళ్ళ క్రితం ఉదయం ప్రేయర్‌లోనే ఐదారుగురు కుర్రాళ్ళు పడిపోయేవాళ్లు. కాస్త ఎండని కూడా తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. తర్వాత పిల్లలతో బయట గేమ్స్‌ ఆడించిన తర్వాత మిట్ట మధ్యాహ్నం దాదాపు 3 వేల అడుగులు ఉన్న కొండని ఎక్కగలిగారు. వారిలో రెసిస్టెన్స్‌ పెరిగింది. ఇక తల్లీ, తండ్రి లేని పిల్లలకు ఆ లోటు వారికి జీవితాంతం గుర్తుండిపోతుంది. అలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు అనిపిస్తుంది. వాళ్ళకి న్యాయం చెయ్యాలనే ఉద్దేశంతో ఈ సినిమా చెయ్యడం జరిగింది. చదువనేది జీవితంలో ఒక భాగం మాత్రమే. చదువే జీవితం కాదు. ఈ సినిమాకి కథే మెయిన్‌ హీరో. మా పెద్దబ్బాయి మైనింగ్‌ ఇంజనీర్‌, రెండో అబ్బాయి ఈ సినిమా స్టార్ట్‌ చేసే టైమ్‌కి ఇంటర్‌ సెకండియర్‌. ఈ సినిమా ఓపెనింగ్‌ టైమ్‌లో చాలా మంది పెద్దవారికి అబ్బాయికి బ్లెస్సింగ్స్‌ ఇచ్చారు. నేను వాడికి ఒకటే చెప్పాను నువ్వు ఇంటర్‌ ఫెయిల్‌ అయినా ఫర్వాలేదు. డాన్స్‌పైన, యాక్టింగ్‌పైన కాన్‌సన్‌ట్రేట్‌ చెయ్యమని చెప్పాను. అయితే ఎగ్జామ్స్‌కి వారం ముందు వాడిని వదిలాం. ఫస్ట్‌ క్లాస్‌లో పాస్‌ అయ్యాడు. డిగ్రీ ఇక్కడే జాయిన్‌ చేశాం. ఈ సినిమాలో డాన్సులు బాగా చేశాడు. తప్పకుండా సినిమా మీ అందరికీ నచ్చుతుంది. ఈ సినిమాలో సుమన్‌గారు, సుహాసినిగారు, బాహుబలి ప్రభాకర్‌, షఫీ, వినోద్‌, రాజేందర్‌, దిల్‌ రమేష్‌ ముఖ్యపాత్రలు చేశారు. నేను కూడా ఒక క్యారెక్టర్‌లో నటించాను. దైవసంకల్పం వల్లే ఈ సినిమా స్టార్ట్‌ చేశాం. ఈ సినిమాని 150 థియేటర్లలో రిలీజ్‌ చెయ్యాలనుకుంటున్నాం'' అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోననే ఆసక్తి అందరిలో ఉంది. ప్రిన్స్ మహే ..

Read More !

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుంటో ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. స ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

Gossips

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Read More !