View

ఆకాష్ పూరి 'మోహబూబా' రెండో పాట విడుదల!

Monday,April23rd,2018, 03:40 PM

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ తన తనయుడు ఆకాష్‌ పూరిని హీరోగా పరిచయం చేస్తూ పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌ పతాకంపై నేహాశెట్టి హీరోయిన్‌గా శ్రీమతి లావణ్య సమర్పణలో పూరి కనెక్ట్స్‌ నిర్మించిన చిత్రం 'మెహబూబా'. 1971లో జరిగిన ఇండో-పాక్‌ యుద్ధ నేపథ్యంలో జరిగే లవ్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు. మే 11న సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా సోమ‌వారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో...


విష్ణురాజు మాట్లాడుతూ - ఇందులో నేను, ఆకాశ్‌, నేహా కానీ.. అంద‌రూ చేసిన క్యారెక్ట‌ర్స్ చూస్తే వీరు త‌ప్ప మ‌రెవ‌రూ చేయ‌లేర‌నిపిస్తుంది. నాకు అవ‌కాశం ఇచ్చినందుకు థాంక్స్‌. 200 ప‌ర్సెంట్ ఎఫ‌ర్ట్ పెట్టి ప‌నిచేశాను అన్నారు.


ఎడిట‌ర్ జునైద్ సిద్ధిఖీ మాట్లాడుతూ - నేను సినిమా చూసిన‌ప్పుడంతా.. ఆకాశ్ న‌ట‌న న‌న్ను హాంట్ చేసింది. సందీప్ చౌతాగారు అద్భుత‌మైన సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్‌తో సినిమాను 500 రెట్లు పెంచారు అన్నారు.


నేహాశెట్టి మాట్లాడుతూ - హీరోయిన్‌గా అవ‌కాశం ఇచ్చిన పూరిగారికి, ఛార్మిగారికి, మంచి సంగీతం అందించిన సందీప్ చౌతాగారికి, ఎడిటింగ్ వ‌ర్క్ చేసిన జునైద్‌గారికి థాంక్స్‌. ఇప్ప‌టికే విడుద‌లైన రెండు సాంగ్స్‌కి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. సినిమా కూడా అంద‌రికీ న‌చ్చ‌తుంద‌ని న‌మ్మ‌తున్నాను అన్నారు.


ఆకాశ్ పూరి మాట్లాడుతూ - క‌థ విన్న‌ప్పుడు, షూటింగ్‌కి వెళుతున్న‌ప్పుడు చాలా కాన్ఫిడెంట్‌గా ఉండేవాడిని. సందీప్ చౌతాగారు పంపిన వ‌యోలిన్ ట్యూన్ విన‌గానే మా న‌మ్మ‌కం వంద‌రెట్లు పెరిగాయి. ఇంత మంచి సంగీతాన్ని అందించిన సందీప్‌గారికి, ట్యూన్స్‌కు త‌గిన‌ట్లు లిరిక్స్ ఇచ్చిన భాస్క‌ర‌భ‌ట్ల‌గారికి థాంక్స్‌. సినిమా మే 11న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. మా నాన్న ఇంత మంచి క‌థ‌ను ఏ హీరోతో అయినా చేయ‌వ‌చ్చు. కానీ నాతో చేయ‌డం ఆనందంగా ఉంది. త‌ప్ప‌కుండా నాన్న‌కు క‌మ్‌బ్యాక్ మూవీ అవుతుంది. ఏ ఫ్యాన్ బేస్‌లేని ఇర‌వైయేళ్ల కుర్రాడినైన నాతో నాన్న క‌మ్‌బ్యాక్ కావ‌డం నాకు గ‌ర్వంగా ఉంది. ప్రేక్ష‌కులు మా ప్ర‌య‌త్నాన్ని ఎంక‌రేజ్ చేయాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.


ఛార్మి మాట్లాడుతూ - మాట ట్రైల‌ర్ చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఆ రెస్పాన్స్ చూసి యూనిట్‌కు ఎంతో ఉత్సాహ‌మేసింది. మా టీమ్‌కు స‌పోర్ట్ చేసిన అంద‌రికీ థాంక్స్‌. రెండు సాంగ్స్ రిలీజ్ చేశాం. ఈ పాట‌ల‌కు కూడా చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. పూరిగారు, ఆయ‌న సైనికులైన మేం ప‌డ్డ క‌ష్టంతో సినిమా అవుట్‌పుట్ బాగా వ‌చ్చింది. స్క్రీన్‌ప్లే డిఫ‌రెంట్‌గా ఉంటుంది. క్లైమాక్స్ ప్రేక్ష‌కుల‌ను థ్రిల్ చేస్తుంది. సినిమాటోగ్రాఫ‌ర్ విష్ణుశ‌ర్మ‌గారు, ఎడిట‌ర్ జునైద్‌గారి క‌ష్టం తెర‌పై క‌న‌ప‌డుతుంది. ప్రస్తుతం రీ రికార్డింగ్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఇన్‌టెన్స్ ల‌వ్‌స్టోరీ. మ్యూజిక్ ప్ర‌ధాన భూమిక పోషించింది. సందీప్‌గారి సంగీతానికి భాస్క‌రభ‌ట్ల‌గారు అద్భుత‌మైన సాహిత్యాన్ని అందించారు. ఆకాశ్ పూరి, నేహా శెట్టి అద్భుతంగా న‌టించారు. -7 డిగ్రీల చ‌లిలో కూడా చ‌క్క‌గా న‌టించారు. పూరిగారు ఎలాంటి స‌న్నివేశాన్నైనా చాలా ఈజీగా చేస్తే.. ఆకాశ్ ఎంత క‌ష్ట‌మైన స‌న్నివేశాన్నైనా న‌వ్వుతూ చేశారు. టీం అంతా మ‌న‌సు పెట్టి చేసిన సినిమా. మే 11న సినిమా విడుద‌ల కానుంది అన్నారు.


పూరి జ‌గ‌న్నాథ్ మాట్లాడుతూ - చాలా రోజుల త‌ర్వాత జెన్యూన్‌గా ఓ సినిమా చేశాన‌నే ఫీలింగ్ క‌లిగింది. స్క్రిప్ట్ చేసే క్ర‌మంలో క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌ను యాడ్ చేయాల‌ని చాలా సినిమాల‌కు అనుకుంటాను. కానీ జెన్యూన్‌గా అలాంటి ఆలోచ‌న‌లు లేకుండా చేసిన సినిమా మెహ‌బూబా. ఇక హీరో ఆకాశ్ గురించి చెప్పాలి(న‌వ్వుతూ...) ...ఆకాశ్ చిన్న‌ప్ప‌ట్నుంచి మా ఇంట్లోనే ఉండేవాడు. నాలుగైదేళ్ళ‌కు నా క‌ళ్ల ముందు నిల‌బ‌డి చిరంజీవిగారు, బాల‌కృష్ణ‌గారు.. ఇలా హీరోల డైలాగ్స్ చెప్పి ఓ వేషం అని అడిగేవాడు. వీడి టార్చ‌ర్ త‌ట్టుకోలేక చిరుత‌లో వేషం ఇచ్చాను. త‌ర్వాత పోకిరిలో న‌టించాడు. ఆ స‌మ‌యంలో మ‌హేశ్‌, ప‌దేళ్ల కుర్రాడు(ఆకాశ్‌)పై ఓ క‌థ‌ను రాసుకున్నాడు. ఈ క‌థ చెబితే మ‌హేశ్ తంతాడు అని చెప్పాను. అప్పుడు .. నువ్వు హీరో కావ‌డానికి ప‌దేళ్ల స‌మ‌యం ప‌ట్టొచ్చు. ఆ స‌మ‌యానికి నేను నీతో సినిమా చేసే స్థితిలో ఉండొచ్చు , లేక‌పోవ‌చ్చు. కాబ‌ట్టి నీ ప్ర‌య‌త్నాలు నువ్వు చేసుకో అని నేను త‌న‌కి చెప్పాను. అప్ప‌టి నుండి ఇంటికి ఎవ‌రు వ‌చ్చినా కాక ప‌ట్టుకునేవాడు. టైమ్ బావుంది. నేనే సినిమా చేశాను. దిల్‌రాజుగారు సినిమా చూసి నీ కెరీర్‌లో బెస్ట్ ఫిలిం భ‌య్యా అన్నారు. దిల్‌రాజుగారు సినిమాను రిలీజ్ చేస్తున్నాడ‌న‌గానే చాలా మంది నాకు ఫోన్ చేసి అప్రిసియేట్ చేశారు. సందీప్ చౌతాతో నేను చేసిన మూడో సినిమా. అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చాడు. నా త‌మ్మ‌డు భాస్క‌ర‌భ‌ట్ల ఏదో ప‌గ‌బ‌ట్టిన‌ట్లు పాట‌లు రాశాడు. త‌న‌కు థాంక్స్‌. విష్ణుశ‌ర్మ‌, జునైద్‌, అనిల్, జానీ, స‌తీశ్ ఇలా సినిమాకు ప‌నిచేసిన అంద‌రూ మ‌న‌సు పెట్టి ప‌నిచేశారు. ఛార్మికి స్పెష‌ల్ థాంక్స్‌. త‌ను మ‌గాళ్ల కంటే ఎక్కువ‌గా ప‌నిచేస్తుంది. అందుకే త‌నంటే నాకు ఇష్టం. ఉత్తేజ్ స‌హ‌కారంతో ఆకాశ్‌, నేహాశెట్టి ఏ సీన్ ఎలా చేయాలో ముందుగానే నేర్చుకుని చేసేవారు. ఉత్తేజ్‌కి కూడా థాంక్స్‌. మే 11న సినిమా విడుద‌ల‌వుతుంది. వ‌చ్చే ప‌దేళ్ల‌లో వీడు కంటే మంచి సినిమాలు నేను చేస్తాను. ఇట్స్ మై ఛాలెంజ్‌ అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోననే ఆసక్తి అందరిలో ఉంది. ప్రిన్స్ మహే ..

Read More !

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుంటో ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. స ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

Gossips

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Read More !