filmybuzz

View

షూటింగ్ పూర్తి చేసుకున్న 'సమ్మోహనం'

Tuesday,April24th,2018, 09:27 AM

కొత్త అనే ప‌దాన్ని రోజూ విన్నా కొత్త‌గానే ఉంటుంది. ప్రేమ అనే ప‌దం కూడా అలాంటిదే. త‌ర‌త‌రాలుగా, యుగ‌యుగాలుగా మాన‌వాళికి ప్రేమ‌తో ప‌రిచ‌యం ఉంది. అలాంటి అపురూప‌మైన‌, అనూహ్య‌మైన సంఘ‌ట‌న‌ల‌తో కొత్త త‌రం ప్రేమ క‌థ‌తో రూపొందుతోన్న చిత్రం `స‌మ్మోహ‌నం`. షూటింగ్ పూర్త‌యింది. సుధీర్‌బాబు హీరోగా మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీదేవి మూవీస్ ప‌తాకంపై శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ నిర్మిస్తున్న చిత్రం `స‌మ్మోహ‌నం`. బాలీవుడ్ భామ అదితీరావు హైదరీ ఇందులో నాయిక‌గా న‌టించారు. శ్రీదేవి మూవీస్ ప్రొడ‌క్ష‌న్ నెంబ‌ర్ 10గా తెర‌కెక్కిన `స‌మ్మోహ‌నం` జూన్ 15న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.


నిర్మాత శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ మాట్లాడుతూ - మా `స‌మ్మోహ‌నం` షూటింగ్ ని సుముహూర్తంలో ప్రారంభించాం. నిరాటంకంగా, నిర్విఘ్నంగా , శ‌ర‌వేగంగా, అంతే నాణ్య‌త‌గా చిత్రీక‌ర‌ణ పూర్తిచేశాం. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు మొద‌లుపెట్టాం. త్వరలో టీజ‌ర్‌ను విడుద‌ల చేస్తాం. జూన్ 15న చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాం. పాట‌లు శ్రోత‌ల‌ను మెప్పిస్తాయి. అత్యుత్త‌మ సాంకేతిక విలువ‌ల‌తో తెర‌కెక్కించిన చిత్రం త‌ప్ప‌క ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంద‌నే న‌మ్మ‌కం ఉంది అని చెప్పారు. ]
ద‌ర్శ‌కుడు మోహనకృష్ణ ఇంద్రగంటి మాట్లాడుతూ - మంచి క‌థ‌, క‌థ‌నానికి చ‌క్క‌టి నిద‌ర్శ‌నం ఈ చిత్రం. రొమాన్స్, హాస్యం స‌మ్మిళిత‌మైన `స‌మ్మోహ‌నం` షూటింగ్ పూర్తి చేసుకుంది. చిల్డ్ర‌న్స్ బుక్స్ ఇల్ల‌స్ట్రేట‌ర్‌గా హీరో క‌నిపిస్తారు. అనూహ్య‌మైన క‌థాంశంతో, ఆద్యంతం వినోదాత్మ‌కంగా న‌డిచే క‌థ‌తో చిత్రాన్ని తెర‌కెక్కించాం. నిర్మాణ విలువ‌లు మెప్పిస్తాయి. వివేక్ సాగ‌ర్ అందించిన సంగీతం వీనుల విందుగా ఉంటుంది. పి.జి.విందా ఫొటోగ్ర‌ఫీ చిత్రానికి హైలైట్ అవుతుంది. జూన్‌లో తొల‌క‌రి జ‌ల్లులు ప‌డే వేళ మా సినిమా కూడా ప్రేక్ష‌కుల మ‌న‌స్సుల‌ను రంజింప‌జేయ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది అని చెప్పారు.


న‌టీన‌టులు:
సుధీర్‌బాబు, అదితిరావు హైద‌రి, డా. వి. కె. న‌రేశ్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, పవిత్ర లోకేష్ , నందు, కేదార్ శంక‌ర్‌, కాదంబ‌రి కిర‌ణ్‌, హ‌రితేజ‌, రాహుల్ రామ‌కృష్ణ‌, శిశిర్‌శ‌ర్మ,అభయ్ ,హర్షిణి త‌దిత‌రులు.


సాంకేతిక నిపుణులు:
ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్స్: పి. ర‌షీద్ అహ్మ‌ద్ ఖాన్‌, కె. రామాంజ‌నేయులు, కో డైర‌క్ట‌ర్‌: కోట సురేశ్ కుమార్‌, ఫైట్స్ :రామకృష్ణ , ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: య‌స్ . ర‌వీంద‌ర్‌, ఎడిట‌ర్‌: మార్తాండ్‌.కె.వెంక‌టేశ్‌; డైర‌క్ట‌ర్ ఆఫ్ పొటోగ్ర‌ఫీ: పి.జి.విందా, సంగీతం: వివేక్ సాగ‌ర్‌, సాహిత్యం : సిరివెన్నెల సీతారామ శాస్త్రి , రామజోగయ్య శాస్త్రి ,నిర్మాత‌: శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్‌, ర‌చ‌న‌- ద‌ర్శ‌క‌త్వం: మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Read More !